క్యూ1 లాభం క్షీణత
రూ. 859 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ పీవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 79 శాతం క్షీణించి రూ. 859 కోట్లకు పరిమితమైంది. సరఫరా చైన్ సమస్యలకుతోడు కమోడిటీల ధరల పెరుగుదల లాభాలను దెబ్బతీసింది.
గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 4,003 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 9% పుంజుకుని రూ. 95,799 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 87,677 కోట్ల టర్నోవర్ అందుకుంది. జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) వాహన టోకు (హోల్‌సేల్) అమ్మకాలు 9% నీరసించాయి. ఇందుకు తాత్కాలిక సరఫరా సమస్యలు, పశ్చిమాసియా సంక్షోభం తదితర అంశాలు ప్రభావం చూపాయి. దేశీ బిజినెస్ ఆదాయంలో 65 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.
టాటా మోటార్స్ పీవీ షేరు 2% లాభపడి రూ.350 వద్ద ముగిసింది.


