రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 2399 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
This Independence Day, give yourself the freedom from frequent recharges.
Get 412 days of BSNL connectivity with one recharge, including 47 extra days beyond a year.
Recharge smart via #BReX 👉 https://t.co/SpaVXw85OI#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife… pic.twitter.com/qGtt7WkKxS— BSNL India (@BSNLCorporate) August 13, 2026


