రీచార్జ్‌ షాక్‌.. నాలుగు ప్రీపెయిడ్‌ ప్లాన్లు తొలగింపు | Airtel Recharge Shock 4 Prepaid Plans Discontinued | Sakshi
Sakshi News home page

రీచార్జ్‌ షాక్‌.. నాలుగు ప్రీపెయిడ్‌ ప్లాన్లు తొలగింపు

Aug 12 2026 5:44 PM | Updated on Aug 12 2026 6:27 PM

Airtel Recharge Shock 4 Prepaid Plans Discontinued

ప్రీపెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు భారతి ఎయిర్‌టెల్‌ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరల వద్ద ఉన్న నాలుగు ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్లను కంపెనీ తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయా ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు ఇకపై అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్యాక్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా రూ.299 ప్లాన్‌ తొలగింపు వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించే ఈ ప్లాన్‌కు బదులుగా ఇప్పుడు రూ.349 ప్యాక్‌ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఇతర సాధారణ ప్రయోజనాలు లభిస్తాయి. అంటే గతంలో రూ.299 చెల్లించిన వినియోగదారుడు ఇప్పుడు అదే తరహా నెలవారీ రీచార్జ్‌ కోసం కనీసం రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సుమారు 16.7 శాతం పెరుగుదలకు సమానం.

మధ్యస్థ ధరల విభాగంలోనూ ఎయిర్‌టెల్‌ కొన్ని ఎంపికలను తగ్గించింది. రూ.579, రూ.619, రూ.649 ప్యాక్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆయా ధరల వద్ద రీచార్జ్‌ చేసుకునే అవకాశం కస్టమర్లకు తగ్గింది. తాజా నివేదికల ప్రకారం, కొన్ని సర్కిళ్లలో మరికొన్ని ప్లాన్లలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతి వినియోగదారుడి ఎయిర్‌టెల్‌ నంబర్‌, సర్కిల్‌ను బట్టి ప్రస్తుతం కనిపించే ప్లాన్లు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

ఈ పరిణామాన్ని సాధారణ టారిఫ్‌ పెంపుగా కాకుండా, ఎంపిక చేసిన ధరల విభాగాల్లో ప్లాన్లను పునర్వ్యవస్థీకరించే చర్యగా చూడవచ్చు. చౌకైన ప్యాక్‌లను తొలగించి తదుపరి ధరల ప్లాన్‌ల వైపు కస్టమర్లను మళ్లించడం ద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం కంపెనీ వ్యూహంలో భాగమై ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement