గంటల వ్యవధిలోనే.. బంగారం ధరల్లో భారీ మార్పు! | Gold Rate Today India Check Latest 22K and 24K Rates | Sakshi
Sakshi News home page

బంగారం ధరలకు బ్రేక్.. గంటల వ్యవధిలోనే భారీ మార్పు!

Aug 13 2026 8:34 PM | Updated on Aug 13 2026 9:25 PM

Gold Rate Today India Check Latest 22K and 24K Rates

భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (గురువారం) ఉదయం రూ.1,55,130 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, సాయంత్రానికి రూ.1,53,600 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు తారుమారైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో గురువారం (13 ఆగస్టు) రూ.1,55,130 (24 క్యారెట్స్) రూ.1,42,200 (22 క్యారెట్స్) వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.153600, రూ.140800 వద్దకు చేరింది. అంటే ధరలు వరుసగా రూ.1530, రూ.1400 తగ్గాయన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.

ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా సాయంత్రానికి, ఉదయానికి రేట్లలో చాలా తేడా కనిపించింది. ఉదయం 1,42,350 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,950 వద్దకు చేరగా.. 24 క్యారెట్ల రేటు 1,55,280 రూపాయల నుంచి 1,53,750 రూపాయల వద్దకు చేరింది.

చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,42,200 వద్ద, 24 క్యారెట్ల ధర రూ.1,55,130 వద్దనే ఉన్నాయి. వెండి రేటు మాత్రం రూ.2.60 లక్షలు (కేజీ ధర) వద్ద ఉంది.

బంగారం ధరలు1
1/3

బంగారం ధరలు2
2/3

బంగారం ధరలు3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement