పసిడి తగ్గేదేలే.. | Gold prices surge by Rs 1200 at Rs 157200 per 10 grams | Sakshi
Sakshi News home page

పసిడి తగ్గేదేలే..

Aug 12 2026 12:06 AM | Updated on Aug 12 2026 12:06 AM

Gold prices surge by Rs 1200 at Rs 157200 per 10 grams

రూ. 1,57,200కి అప్‌ 

న్యూఢిల్లీ: ఆయిల్‌ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్‌పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్‌ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి.

 ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో  99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్‌ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement