హైదరాబాద్​లో ట్రంప్ టవర్స్! | Trump Towers is coming to Hyderabad; Know The Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్​లో ట్రంప్ టవర్స్!

Aug 11 2026 5:46 PM | Updated on Aug 11 2026 6:18 PM

Trump Towers is coming to Hyderabad; Know The Details

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఈ మార్కెట్‌లోకి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ కలిసి కోకాపేటలో 'ట్రంప్ టవర్స్ హైదరాబాద్' పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

గోల్డెన్ మైల్ రోడ్డులో 4 ఎకరాల్లో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్ రానుంది. అక్టోబర్‌లో దీన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఎరిక్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్‌లో రెండు భారీ టవర్లు ఉండనున్నాయి. ఒక్కో టవర్ 65 అంతస్తుల ఎత్తులో, దాదాపు 800 అడుగుల ఎత్తు వరకు నిర్మించనున్నారు. ఈ రెండు టవర్లను 28వ అంతస్తులో ఒక స్కై బ్రిడ్జ్‌తో కలుపుతారు. ఆ బ్రిడ్జ్‌పైనే ప్రత్యేకంగా ట్రంప్ క్లబ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 450కి పైగా ఇళ్లు ఉండబోతున్నాయి. 3.5 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే ఇళ్లతో పాటు పెంట్‌హౌస్‌లు కూడా ఉంటాయి.

ధరలు ఇలా..
ఇళ్ల ధరలు సుమారు రూ.5 కోట్ల నుంచి ప్రారంభమై, పెంట్‌హౌస్ ధర ఏకంగా రూ.18 కోట్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.1,800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే.. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రూ.3,500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రైబెకా  డెవలపర్స్ అంచనా వేస్తోంది.

పెంట్‌హౌస్‌లకు ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే.. మొత్తం ఎనిమిది పెంట్‌హౌస్‌లు ఉండగా, ఒక కుటుంబం ఏకంగా రెండు పూర్తి ఫ్లోర్లను కొనుగోలు చేయడంతో నాలుగు పెంట్‌హౌస్‌లు అందులోనే వెళ్లిపోయాయని కంపెనీ తెలిపింది. ఆ తర్వాత మరో నాలుగు పెంట్‌హౌస్‌లను కూడా ఏర్పాటు చేశామని, అవి కూడా అమ్ముడయ్యాయని ట్రైబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement