మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 388.19 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 78,154.25 వద్ద.. నిఫ్టీ 112.10 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 24,471.70 వద్ద నిలిచాయి.
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్, లాయిడ్స్ మెటల్స్ & ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


