వచ్చే మూడేళ్లలో తమ మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాహనాల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు 8 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే పండుగల సీజన్‌లో సరికొత్త ఆడి క్యూ3తో మొదలుపెట్టి 2027 నాటికి మొత్తం మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
2027లో నెక్ట్స్ జనరేషన్ ఆడి ఏ5, ఫ్లాగ్‌షిప్ ఆడి క్యూ9ని అందుబాటులోకి తేనున్నట్లు ధిల్లాన్ పేర్కొన్నారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెడుతూ వచ్చే ఏడాది ఆఖరు నాటికి రిటైల్ నెట్‌వర్క్‌ని 25 శాతం పైగా విస్తరించనున్నట్లు వివరించారు. షోరూమ్‌ల సంఖ్యను 40కి పెంచుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్íÙప్‌లను తమ ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్టునకు కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు.


