ఒక్కసారిగా రూ.60 వేలు.. పెరిగిన విండ్సర్ ఈవీ ధర! | MG Windsor EV Prices Revised In India, Check New Variant Wise Rates After July 2026 Hike, More Details Inside | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా రూ.60 వేలు.. పెరిగిన విండ్సర్ ఈవీ ధర!

Jul 5 2026 5:59 PM | Updated on Jul 5 2026 6:28 PM

MG Windsor EV Prices Increased By Up To Rs 60000

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఎంజీ ఇండియా (MG India) తన విండ్సర్ ఈవీ (Windsor EV) ధరలను పెంచింది. జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల కియా, టయోటా వంటి ఇతర వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్ల ధరలను పెంచిన నేపథ్యంలో ఎంజీ కూడా ఇదే బాటలో నడిచింది.

ఎంజీ విండ్సర్ ఈవీ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఎక్స్‌సైట్ బేస్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.60,000 పెంపు జరిగింది. దీంతో దీని ధర రూ.14.10 లక్షల నుంచి రూ.14.70 లక్షలకు చేరింది. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.46,900 పెరిగి రూ.16 లక్షలకు చేరగా, ఎసెన్స్ వేరియంట్ కూడా అదే మొత్తంతో పెరిగి రూ.17 లక్షలకు చేరింది.

ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ ధర రూ.52,000 పెరిగి రూ.17.90 లక్షలకు చేరుకుంది. టాప్ వేరియంట్ అయిన ఎసెన్స్ ప్రో ధర రూ.40,000 పెరిగి రూ.19 లక్షలుగా నిర్ణయించారు. మొత్తం మీద వేరియంట్‌లను బట్టి ధరల పెంపు 2.15 శాతం నుంచి 4.26 శాతం వరకు పెరిగిందని స్పష్టమవుతోంది. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement