హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్! | Honda Cars Offer Discounts Of Up To Rs 2.15 Lakh In July 2026, Check Out Model Wise Offers Inside | Sakshi
Sakshi News home page

హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్!

Jul 5 2026 3:00 PM | Updated on Jul 5 2026 5:08 PM

Honda Cars Offer Discounts of Up to Rs 2 15 Lakh in July 2026

జూలై 2026 నెలలో హోండా కార్స్ ఇండియా.. ఎంపిక చేసిన కొన్ని కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను, ప్రయోజనాలను ప్రకటించింది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్‌చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్ కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

హోండా ఎలివేట్ కారుపై కంపెనీ గరిష్టంగా రూ.2.15 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 40,000 వరకు నగదు తగ్గింపు, రూ. 30,000 వరకు ఎక్స్‌చేంజ్ ప్రయోజనం, కార్పొరేట్ ఆఫర్లు, లాయల్టీ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా హోండా ఎలివేట్ ధరలు రూ. 11.60 లక్షల నుంచి రూ. 16.16 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఇది దేశీయ విఫణిలో హ్యుందాయ్ క్రెటా , కియా సెల్టోస్ , టాటా సియెర్రా, మారుతి విక్టోరిస్, మారుతి గ్రాండ్ విటారా, రెనాల్ట్ డస్టర్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

సెడాన్ల విభాగంలో కొత్త హోండా అమేజ్ కొనుగోలుపై రూ. 67,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. హోండా అమేజ్ సెకండ్ జనరేషన్ మోడల్ మీద రూ. 58,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కొనుగోలుపైన ఎలాంటి తగ్గింపులు లేదు. ఎందుకంటే ఈ కారు ఇటీవలే షోరూమ్‌లలోకి వచ్చింది.

Note: కంపెనీ అందించే డిస్కౌంట్స్ లేదా ప్రయోజనాలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మీరు కొనే కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది అనే వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్షిప్ సందర్శించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement