ఒకే మోడల్.. దేశం దాటిన 2 లక్షల కార్లు! | Maruti Suzuki Fronx Becomes Fastest SUV To Hit 2 Lakh Exports | Sakshi
Sakshi News home page

ఒకే మోడల్.. దేశం దాటిన 2 లక్షల కార్లు!

Aug 19 2026 6:41 PM | Updated on Aug 19 2026 6:52 PM

Maruti Suzuki Fronx Becomes Fastest SUV To Hit 2 Lakh Exports

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంక్స్.. 38 నెలల లోపే 2 లక్షల ఎగుమతులను దాటిందని మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. జూన్ 2023లో ఎగుమతులను ప్రారంభమైనప్పటి నుంచి.. జపాన్‌తో సహా దాదాపు 90 దేశాలకు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ చేరుకుంది.

25 నెలల లోపే ఫ్రాంక్స్ తన మొదటి లక్ష ఎగుమతులను సాధించింది. ఆ తర్వాత సుమారు 13 నెలల్లో రెండవ లక్షను ఎగుమతి చేసింది. దీన్నిబట్టి చూస్తే.. మేడ్-ఇన్-ఇండియా మోడల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందనే విషయం స్పష్టమవుతుంది.

గుజరాత్‌లోని మారుతి సుజుకి హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారైన ఫ్రాంక్స్, కంపెనీ ఎగుమతుల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి.. ఇది భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే ప్యాసింజర్ వాహనంగా నిలిచింది.

మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి అయిన మూడు ప్యాసింజర్ వాహనాలు తమ పోర్ట్‌ఫోలియోకు చెందినవేనని ఆ కంపెనీ చెబుతోంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది. దీనిని కంపెనీ భారతదేశంలోని నెక్సా అవుట్‌లెట్ల ద్వారా విక్రయిస్తోంది. ఇది 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మాన్యువల్, ఆటోమాటిక్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement