Maruti Fronx
-
జపాన్‌లో అదరగొట్టిన మేడ్ ఇన్ ఇండియా కారు
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ విదేశీ మార్కట్లకు కూడా ఎగుమతి అవుతోంది. ఇందులో జపాన్ కూడా ఉంది. ఇటీవల 'జపాన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (JNCAP) క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన 'ఫ్రాంక్స్' 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.సుజుకి ఫ్రాంక్స్ అసెస్మెంట్లో 84 శాతం స్కోర్‌ను కలిగి ఉంది. మొత్తం 193.8 పాయింట్లలో 163.75 పాయింట్లను పొందగలిగింది. అంతేకాకుండా, ప్రివెంటివ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లో 85.8 పాయింట్లకు గానూ 79.42 పాయింట్లను సాధించగా.. కొలిషన్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్ 100 పాయింట్లలో 76.33 పాయింట్లను సొంతం చేసుకుంది.ఆఫ్సెట్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్‌లో, సుజుకి ఫ్రాంక్స్ 24 పాయింట్లకు 21.08 పాయింట్లు సాధించింది. ఫుల్-ర్యాప్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్, సైడ్ కొలిషన్ టెస్ట్ మరియు పాదచారుల లెగ్ ప్రొటెక్షన్ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లలో కూడా ఈ కారు లెవల్ 5/5 సాధించింది.జపాన్‌లో విక్రయించే సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్ నుంచి ఎగుమతి అయినప్పటికీ.. ఇది భారతీయ వెర్షన్ మాదిరిగా కాకుండా.. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ సిస్టమ్ వంటి మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ అందిస్తాయి. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!
మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, స్కోడా & నిస్సాన్ వంటి ప్రధాన వాహన తయారీదారులు భారతీయ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో స్కోడా కైలాక్, అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ, కియా సిరోస్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ వంటివి ఉన్నాయి.స్కోడా కైలాక్స్కోడా కంపెనీ 2025 మార్చిలో కైలాక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది MQB A0 IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారువుతోంది. కాబట్టి కుషాక్లోని చాలా ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో 1.0 లీ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూహ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ మోడల్ 2025 మధ్య నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది చూడటానికి సాధారణ వెన్యూ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే మెకానికల్ అప్డేట్స్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.కియా సిరోస్కియా కంపెనీ సిరోస్ కారును 2025 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్యలో ఉంటూ.. సోనెట్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్‌రూఫ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్లిఫ్ట్ఇప్పటికే రెండు లక్షల అమ్మకాలను సాధించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. 2025 మధ్య నాటికి ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పొందనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పనితీరు దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. -
కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (FRONX) ఎస్యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్లు, మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్‌గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.ఫ్రాంక్స్ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్సీఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్ మార్కెట్లుగా నిలిచాయి.