కారు కొనడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు తీరనిక కల అని చెప్పొచ్చు. డేర్ చేసి కొత మొత్తం కట్టి ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొన్నా..ఆ డబ్బులన్నీ నెల నెల కట్టగలనా అనే భయం వెంటాడేస్తుంటుంది. అందుకే అంత మెంటల్ టెన్షన్ ఎందుకని..కారు కొనాలనే ఆలోచనే విరమించుకుంటా. కానీ ఈ వ్యక్తి ఆ సంశయాత్మక ధోరణి నుంచి బయటపడండని అంటున్నాడు. ముఖ్యంగా పిల్లలు ఉంటే మరో ఆలోచన చేయకుండా ధైర్యంగా కారు కొనాలనే నిర్ణయానికి రావడం మంచిదని సూచిస్తున్నాడు కూడా. ఎందుకలా అంటున్నాడంటే..
ప్రస్తుతం బయట కాలుష్యం ఏ రేంజ్‌లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కాలుష్యం కోరల నుంచి తన బిడ్డ ఊపిరితిత్తుల పాడవ్వకుండా తాను కొన్న కారు ఎలా రక్షించింది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. అతడు రెడ్డిట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. భారీ వాహనాలు, లారీ, ట్రక్కుల వెనుక ఉంటే ఏ రేంజ్‌లో పొగ దుమ్ము ఆవిరిస్తుందో చెప్పక్కర్లేదు. అలాంటప్పడు మనకు కారు చాలా సురక్షితం అని చెబుతున్నాడు.
తాను గతవారమై రూ. 10 లక్షలు ఖరీదు చేసే మారుతి ఫ్రాంక్స్ కారుని రూ. 3లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి, రూ. 7లక్షల లోన్‌పై తీసుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట అనవసరంగా లక్షలు చెల్లించి మరి ఇఎమ్‌ఐలో కారు కొన్నాని చాలా బాధపడ్డాడట. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు పన్వేల్ నాసిక్ మీదుగా తన ఏడాది కూతురు, భార్యతో కలిసి కారులో వెళ్తున్నప్పుడూ తన అభిప్రాయం మారిందట. తాను తీసుకున్న నిర్ణయమే సరైనది అనిపించిందట. తాను ఆ జర్నీలో కొన్ని డీజిల్ ట్రక్కుల మధ్య ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడట. అక్కడ దట్టమైన పొగ, దుమ్ము, కారు అద్దాలపై ఆవరించి అసలు బయట ఏమి కనిపించలేదట. కారు లోపల ఏసి ఆన్ అయ్యి ఉంది కాబట్టి తమకు అంత చికాకుగా అనిపించలేదట.
ఒకవేళ్ల కారు కొనకపోయి ఉంటే ఈ ట్రాఫిక్‌లో బైక్ తన కుటుంబమంతా ఉండేది. అస్సలు ఆ కాలుష్య ఏడాది వయసున్న తన చిన్నారి ఊపరితిత్తులను ఎంతగా ప్రభావితం చేసేది అన్న ఆలోచన భయాందోళనకు తోను చేసిందట. దేవుడి దయవల్ల సరైన నిర్ణయం తీసుకునే కారుకొన్న లేదంటే అమ్మో ఈ భయానక కాలుష్యానికి మొత్తం కుటుంబమే అనారోగ్యం పాలయ్యేది అని రాసుకొచ్చాడు. అందుకే చెబుతున్నా..కారు కొనాలా వద్ద అన్న మీమాంసలో ఉన్న తమ లాంటి పేరెంట్స్ అంతా ప్రస్తుత కాలుష్య దృష్ట్యా డేరింగ్ నిర్ణయం తీసుకోండి.
త్వరితగతిన కారు కొనండి అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాదు కారు అనేది లగ్గరీ కాదని మన పిల్లల పాలిట మొబైల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పేర్కొన్నారు. అలాగే ఖర్చు అని కాకుండా రక్షణను పరిగణలోకి తీసుకుని ధైర్యంగా కార కొనండని పిలుపునిచ్చాడు తన పోస్ట్‌లో. అయితే నెటిజన్లు అతని సూచనకు మద్దతివ్వడమే కాకుండా కారు రక్షణ, భద్రతా కూడా అది విస్మరించారు మీరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: వయసులో ఫిట్..పరుగులో హిట్..!)


