కొన్ని ఉద్యోగ ఆఫర్లు పిచ్చెక్కించేలా ఉంటాయి. ఆఫర్‌ని అంగికరించొచ్చా? వద్దా? అనే సందేహంలోకి నెట్టేస్తాయి. దాని వెనుక కాస్త ఇబ్బందుల తోపాటు, మన ప్రియమైన వాళ్లను వదిలి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. పోనీ రిస్క్ చేద్దామన్నా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? మన అనుకున్న వాళ్లే మనకు దూరమైపోతారా అనే బెంగ, గుబులు మొదలై.. నానా హైరానా పడుతుంటాం. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఈ శాస్త్రవేత్త. ఏ నిర్ణయం పాలుపోక నెటిజన్ల సలహా తీసుకుందామనే ఉద్దేశ్యంతో తన కథను షేర్ చేసుకున్నాడు ఈ పరిశోధకుడు.
ఆ వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్‌లో తాను పర్యావరణ పరిశోధనలో పనిచేస్తున్నానని, తన కంపెనీ మెక్‌ముర్డో స్టేషన్‌లో ఆరు నెలల పరిశోధన కోసం అంటార్కిటికాకు వెళ్లాలనుకుంటున్నారా అని అడిగింది. ఆరు నెలల పరిశోధన కోసం ఏకంగా రూ. 1.3 కోట్లు చెల్లిస్తానని బంపరాఫర్ ఇచ్చింది. పైగా అంత మొత్తం రిటైర్మెంట్ టైంకి ఆహారం, గృహనిర్మాణం, విమానాలు, గేర్ పనులు అన్ని కవర్ అయిపోతాయి.
కాబట్టి ఆ ఆఫర్ నాకెంతో నచ్చింది. అందులోనూ అంటార్కిటికాలో ఉండటం అంటే ఖర్చులు లేకుండా హాయిగా జీవించొచ్చు. మూడేళ్లు తన స్నేహితురాలితో కలిసి ఉన్నా, కానీ ఇప్పుడు సడెన్‌గా తనను వదిలి వెళ్లడం అన్న ఆలోచనే చాలా కష్టంగా ఉంది. ఇదేమి థ్రిల్లింగ్ ఫీల్‌లా అనిపించేది కూడా కాదని చెబుతున్నాడు. ఒకవేళ తాను ఆ ఆఫర్‌ని అంగీకరించినా.. కూడా ఆమె తనకు మద్దతిస్తుందని, కానీ అంతకాలం ఆమెకు దూరంగా ఉండటం అంటేనే మనసుకు చాలా కష్టంగా ఉందని వాపోయాడు. అదీగాక తన ప్రస్తుత ఆదాయ నికర విలువ రూ. 1.62 కోట్లు అని, ఆరు నెలల ఒప్పందం కారణంగా త్వరితగతిన రిటైర్మెంట్ తీసుకుని హాయిగా బతికేయొచ్చని చెబుతున్నాడు ఈ శాస్త్రవేత్త.
అంతేగాదు జీతం మొత్తం కూడా నేరుగా బ్యాంకులోనే కంపెనీ చెల్లిస్తుంది కాబట్టి..ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఏకంగా ఆరు నెలలు ఒంటరిగా సైన్సు పరిశోధనలతో గడపాలి. సైన్సే లోకంగా గడిపాను గానీ..ఇలా ఒంటిరిగా అంకితమయ్యే అవకాశం కల్పిస్తుందని కలలో కూడా అనుకోలేదని చెబుతున్నాడు. అయితే ఈ ఆరు నెలల కాలం తన వ్యక్తిగత జీవితంపై తన రిలేషన్స్‌పై గట్టి ప్రభావం చూపి మళ్లీ ఒంటిరిగా మార్చేస్తుందేమోనని భయంగా ఉంది.
అందువల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేది కాస్త చెప్పండి అంటూ తన బాధనంతా రాసుకొచ్చాడు ఈ పరిశోధకుడు పోస్ట్‌లో. అయితే నెటిజన్లు చాలామంది ఆ ఆఫర్‌ని ధైర్యంగా అంగీకరించండి, మీ స్నేహితురాలు పూర్తిగా మద్దతిస్తుందన్న నమ్మకం ఉంటే బేషుగ్గా నిర్ణయం తీసుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు.
పైగా పదవీవిరమణ సమయానికి ఇద్దరూ హాయిగా గడపొచ్చు. అలాగే జస్ట్ ఆరు నెలల కాలం పెద్ద ఎక్కువ సమయం ఎడబాటు కూడా కాదు. కాకపోతే గడ్డకట్టే ఆ అంటార్కిటిక్‌లో జీవన స్థితి ఎలా ఉంటుంది, తట్టుకోగలనా లేదా అనేదాని గురించి కూలంకషంగా తెలుసుకుని ముందుకు సాగండి ఆల్‌ద బెస్ట్ అని చెబుతూ పోస్టులు పెట్టారు.
(చదవండి: Adarsh Hiremath: డ్రాపౌట్ టు బిలియనీర్)


