డ్రాపౌట్‌ టు బిలియనీర్‌ | youngest self-made billionaires. Meet Adarsh Hiremath | Sakshi
Sakshi News home page

Adarsh Hiremath: డ్రాపౌట్‌ టు బిలియనీర్‌

Dec 12 2025 11:07 AM | Updated on Dec 12 2025 11:07 AM

youngest self-made billionaires. Meet Adarsh Hiremath

సెల్ఫ్‌–మేడ్‌ బిలియనీర్‌ల సక్సెస్‌ స్టోరీలు ఎంతో ఆసక్తిగా వినేవాడు ఆదర్శ్‌ హిరేమర్‌. ‘మెర్కోర్‌’ స్టార్టప్‌తో తాను కూడా సెల్ఫ్‌– మేడ్‌ బిలియనీర్‌ల జాబితాలో చిన్న వయసులోనే  చేరిపోయాడు. ఇది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమఫలం. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏఐ మోడల్‌ ట్రైనింగ్‌ స్టార్టప్‌ ‘మెర్కోర్‌’తో విశిష్ఠ విజయాన్ని సాధించాడు 22 సంవత్సరాల ఆదర్శ్‌...

ట్రెండన్‌ ఫుడీ, సూర్య మిదా (ఇద్దరి వయసు 22 ఏళ్లు)తో కలిసి ఏఐ మోడల్‌ ట్రైనింగ్‌ స్టార్టప్‌ ‘మెర్కోర్‌’ ప్రారంభించాడు ఆదర్శ్‌. ఈ స్టార్టప్‌ ఇటీవల పది బిలియన్‌ డాలర్‌ల విజయాన్ని అందుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ‘టెక్‌ టైటాన్‌’ మార్క్‌ జుకర్‌బర్గ్‌ రెండు దశాబ్దాల రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది. 

సిలికాన్‌వ్యాలీలోని బే ఏరియాకు చెందిన ఈ ముగ్గురు స్నేహితులు ఒక స్కూల్‌లో జరిగిన డిబేట్‌ సందర్భంగా మొదటిసారిగా కలుసుకున్నారు. బెల్లార్మైన్‌ కాలేజిలో చదువుకునే రోజుల్లో ప్రతిష్ఠాత్మకమైన థీల్‌ ఫెలోషిప్‌ అందుకున్నారు. ఆ తరువాత కాలేజికి గుడ్‌బై చెప్పారు.

స్టార్టప్‌ ప్రారంభించారు..
డాటా లేబులింగ్, ఏఐ మోడలింగ్‌ ట్రైనింగ్‌కు సంబంధించి తక్కువ టైమ్‌లోనే ఈ స్టార్టప్‌ మంచి పేరు తెచ్చుకుంది. డాక్టర్లు, లాయర్లు, కన్సల్టెంట్స్, బ్యాంకర్‌ల రూపంలో కంపెనీలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ వార్షిక రికరింగ్‌ రెవెన్యూ(ఏఆర్‌ఆర్‌) 500 మిలియన్‌ డాలర్లు.

‘ఇది నిజమేనా అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఈ స్టార్టప్‌ లేకపోతే కాలేజీలోనే చదువుతూ ఉండేవాడిని’ నవ్వుతూ అంటాడు ఆదర్శ్‌. కాలేజీ రోజుల్లో క్రమశిక్షణ, కొత్త విషయాలపై ఆసక్తితో ఉండేవాడు ఆదర్శ్‌. ఆ రెండూ తనకు స్టార్టప్‌ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. పని బాగా నచ్చితే పనిలాగా అనిపించదు. ఆదర్శ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. కంపెనీ ప్రారంభించిన తరువాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కూడా పని గురించే ఆలోచిస్తుంటాడు!

‘మెర్కోర్‌’ స్టార్టప్‌ సూపర్‌ సక్సెస్‌కు కారణం ఏమిటి?
ఆదర్శ్‌ మాటల్లో చె΄్పాలంటే.. ‘ఏఐ ల్యాబ్‌లు, కస్టమర్‌లు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయం అది. ఆ సమయంలోనే మేము మెర్కోర్‌తో ఏఐ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. కొద్ది కాలంలోనే వారు ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయం మేము కావడం సంతోషంగా ఉంది’ అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ ఆదర్శ్‌కు మన దేశంతో బలమైన భావోద్వేగ బంధం ఉంది. అతడి తల్లిదండ్రులు కర్నాటకకు చెందిన వారు..‘ఇండియాలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు’ అంటాడు ఆదర్శ్‌. 

సైజబుల్‌ ఆపరేషన్స్, ప్రొడక్ట్స్, ప్రతిభావంతులైన ఇంజినీరింగ్‌ టీమ్‌తో గ్లోబల్‌ ఏఐ టాలెంట్‌లో తనదైన పేరు తెచ్చుకుంది మెర్కోర్‌. ‘ఏఐ రెవల్యూషన్‌ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి’ అనే విమర్శతో ఆదర్శ్‌ ఏకీభవించడు. ‘ఏఐ ద్వారా సరికొత్త లేబర్‌ మార్కెట్‌ ఏర్పడుతుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏఐతో ఎలాంటి భయం అవసరం లేదు. ప్రతి సాంకేతిక విప్లవం మనిషి జీవితాన్ని మెరుగుపరిచింది’ అంటాడు ఆదర్శ్‌.

నెక్స్ట్‌ ఏమిటి!
కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నా చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆసక్తి నాకు స్టార్టప్‌ ప్రయాణంలో ఉపయోగపడింది. ఇప్పుడు అసలు సిసలు సవాలు ఏమిటంటే నెక్ట్స్‌ ఏమిటి? అనేది. ప్రజలు ఇప్పుడు దీని గురించే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందుకే మా ప్రాధాన్యత జాబితాలో....‘నెక్ట్స్‌ ఏమిటీ?’ అనేది కూడా ఉంటుంది.
– ఆదర్శ్‌ 

(చదవండి: ఇండిగో...ఇదిగో! నో డిలేస్, నో డైవర్షన్స్‌...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement