గ్లోబల్ స్కిల్లింగ్ అండ్ లెర్నింగ్ విభాగంలో సర్వీసులు అందిస్తున్న అప్‌గ్రాడ్ (upGrad) హైదరాబాద్‌లో రెండు కొత్త లెర్నింగ్ సపోర్ట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. దీని ద్వారా ‘ఫిజిటల్’(ఫిజికల్ + డిజిటల్) లెర్నింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ పెరుగుతున్న టెక్నాలజీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చేందుకు ఉపయోగపడుతందని కంపెనీ తెలిపింది.
అప్‌గ్రాడ్ ఇప్పటికే పుణె, కోల్‌కతా, ఇండోర్, భోపాల్, బెంగళూరు వంటి నగరాల్లో 11 ఆపరేషనల్ కేంద్రాలను స్థాపించినట్లు చెప్పింది. హైదరాబాద్ ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌లో కీలక ప్రాంతమని పేర్కొంది. కంపెనీ తన విస్తరణ రోడ్‌మ్యాప్‌లో భాగంగా మార్చి 2026 నాటికి ఈ నెట్‌వర్క్‌ను 40 కేంద్రాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో అత్యుత్తమ హైబ్రిడ్ లెర్నింగ్‌ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.
ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా సైన్స్‌లో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌తో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్‌గ్రాడ్ కొత్త కేంద్రాలు నగరంలోని గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించాలని నిర్ణయించింది. కంపెసీ సీఓఓ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు శ్రామిక శక్తిలోకి ప్రవేశించినప్పటికీ యాజమాన్యాలు ఆశించే నైపుణ్యాలకు, సాంప్రదాయ సంస్థలు అందించే వాటికి మధ్య అంతరం విస్తృతంగా ఉంది. దాన్ని పూడ్చేందుకు మా కేంద్రాలు ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు.
ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ


