
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ విదేశీ మార్కట్లకు కూడా ఎగుమతి అవుతోంది. ఇందులో జపాన్ కూడా ఉంది. ఇటీవల 'జపాన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (JNCAP) క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన 'ఫ్రాంక్స్' 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.
సుజుకి ఫ్రాంక్స్ అసెస్‌మెంట్‌లో 84 శాతం స్కోర్‌ను కలిగి ఉంది. మొత్తం 193.8 పాయింట్లలో 163.75 పాయింట్లను పొందగలిగింది. అంతేకాకుండా, ప్రివెంటివ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లో 85.8 పాయింట్లకు గానూ 79.42 పాయింట్లను సాధించగా.. కొలిషన్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్ 100 పాయింట్లలో 76.33 పాయింట్లను సొంతం చేసుకుంది.
ఆఫ్‌సెట్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్‌లో, సుజుకి ఫ్రాంక్స్ 24 పాయింట్లకు 21.08 పాయింట్లు సాధించింది. ఫుల్-ర్యాప్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్, సైడ్ కొలిషన్ టెస్ట్ మరియు పాదచారుల లెగ్ ప్రొటెక్షన్ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లలో కూడా ఈ కారు లెవల్ 5/5 సాధించింది.
జపాన్‌లో విక్రయించే సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్ నుంచి ఎగుమతి అయినప్పటికీ.. ఇది భారతీయ వెర్షన్ మాదిరిగా కాకుండా.. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ సిస్టమ్ వంటి మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ అందిస్తాయి.