ఇంటి పొదుపును ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుస్తాం: అంబానీ | Jio BlackRock Can Turn Indias Savings Into Investments Mukesh Ambani | Sakshi
Sakshi News home page

Jio BlackRock: పనికిరాని సేవింగ్స్‌.. ఇక పైసా వసూల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు!

Feb 4 2026 5:54 PM | Updated on Feb 4 2026 7:10 PM

Jio BlackRock Can Turn Indias Savings Into Investments Mukesh Ambani

భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న దీర్ఘకాలిక పొదుపు సంస్కృతి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు ఉత్పాదక సంపద సృష్టిగా పూర్తిగా మారలేదన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. గృహ పొదుపులను పెట్టుబడుల వైపు మళ్లించడంలో జియో–బ్లాక్‌రాక్ కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్‌రాక్ ఫైర్‌సైడ్ చాట్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్‌తో సంభాషిస్తూ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు గత ఐదు నుంచి ఆరు దశాబ్దాలుగా క్రమంగా పొదుపు చేస్తున్నప్పటికీ, ఆ మూలధనం ఎక్కువగా దీర్ఘకాలిక రాబడులు అందించే విధంగా ఉపయోగించబడలేదని ఆయన తెలిపారు. రాబోయే 20-30 ఏళ్లలో భారతదేశం 25 నుండి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని, ఈ కాలం దేశంలోని యువ తరానికి అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. 

పొదుపుదారులను పెట్టుబడిదారులుగా మారుస్తూ, పనికిరాని పొదుపును ఆదాయం తీసుకొచ్చే ఆస్తులుగా మార్చే మార్గాలను అందించడంలో జియో–బ్లాక్‌రాక్‌కు పెద్ద అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. “భారతీయులను కేవలం పొదుపు చేయడానికే కాదు, ఆ పొదుపులను సంపాదనగా మార్చుకునే ఎంపికలు అందించడమే మా లక్ష్యం” అని అంబానీ చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్లాక్‌రాక్ మధ్య ఉన్న భాగస్వామ్య తత్వాన్ని కూడా అంబానీ ప్రస్తావించారు. మూలధన కేటాయింపునకు సంబంధించిన విస్తృత దృష్టికోణంపై లారీ ఫింక్‌తో జరిగిన చర్చను గుర్తు చేస్తూ, “బ్లాక్‌రాక్ లక్ష్యం కేవలం స్వల్పకాలిక లాభాలు లేదా పెట్టుబడిదారులకు రాబడులు ఇవ్వడం మాత్రమే కాదు. ఆ మూలధనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడితేనే ఆ లక్ష్యం పూర్తైనట్టుగా భావిస్తారు. అదే తత్వం రిలయన్స్‌లో కూడా ఉంది” అని అంబానీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement