2026 జనవరి 11న రాజ్‌కోట్‌లో నిర్వహించిన 'వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్'లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్వీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో.. రిలయన్స్ గుజరాత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచిందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో గుజరాత్‌లో సంస్థ రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మరో ఐదేళ్లలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది గుజరాత్ పాలనపై, నాయకత్వంపై, అభివృద్ధి సామర్థ్యంపై రిలయన్స్‌కు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ భారీ పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాల కోసమే కాకుండా.. గుజరాత్ ప్రజలు & భారతీయుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అంబానీ వివరించారు. పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ & గ్రీన్ మెటీరియల్స్‌లో భారతదేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేయడం రిలయన్స్ అన్నారు.
Address by RIL CMD Shri Mukesh D. Ambani at the Vibrant Gujarat Regional Conferences - Kutch & Saurashtra Region pic.twitter.com/21DsQ6Ueuy
— Reliance Industries Limited (@RIL_Updates) January 11, 2026


