సోషల్‌ మీడియాలో మోదీ దూకుడు.. సాటెవ్వరు.. | 30 million and rising: PM Modi sets global benchmark of subscribers on YouTube | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో మోదీ దూకుడు.. సాటెవ్వరు..

Mar 3 2026 1:28 PM | Updated on Mar 3 2026 1:40 PM

30 million and rising: PM Modi sets global benchmark of subscribers on YouTube

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడు యూట్యూబ్‌లో మోదీ మరో ఘనత సాధించారు. 30 మిలియన్ల (3 కోట్ల) సబ్‌స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నేతగా మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచంలో ఏ నేతకూ ఇంతమంది సబ్‌స్క్రైబర్లు లేరు. 

ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (6.58 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ) ఉన్నారు. అయితే, బొల్సొనారోకు ఉన్న ఫాలోవర్లు మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగింట ఒకవంతు మాత్రమే.

అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్లు ఏడు రెట్లు. ఇక భారత్‌లోని నేతల విషయానికి వస్తే కూడా ఫాలోవర్ల విషయంలో మోదీదే ఆధిపత్యం. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కంటే మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడురెట్లు ఎక్కువ. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ కంటే మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్లు నాలుగేసి రెట్ల చొప్పున అధికం.

మోదీకి యూట్యూబ్‌లో 30 మిలియన్ల (3 కోట్ల) సబ్‌స్క్రైబర్లతో పాటు ఇతర సోషల్‌ మీడియా వేదికల్లోనూ భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్రపంచ నేతగా ఆయన నిలిచారు.

మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో 2014లో జాయిన్‌ అయ్యారు. డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఉన్న ఫాలోవర్ల కంటే మోదీకి రెట్టింపు మంది ఫాలోవర్లు‌ ఉన్నారు. ట్రంప్‌నకు ఇన్‌స్టాలో 43.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండొనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 15 మిలియన్లు, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులాకు 14.4 మిలియన్లు, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌కు 11.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత్‌లో మోదీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. యోగికి ఇన్‌స్టాలో 16.1 మిలియన్ల మంది, రాహుల్‌ గాంధీకి 12.6 మిలియన‍్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement