జియో బ్లాక్‌రాక్‌: 8 నెలల్లో 10 లక్షల ఇన్వెస్టర్లు | Jio BlackRock Reaches 1 Million Investors in Just 8 Months | Sakshi
Sakshi News home page

జియో బ్లాక్‌రాక్‌: 8 నెలల్లో 10 లక్షల ఇన్వెస్టర్లు

Jan 22 2026 10:58 AM | Updated on Jan 22 2026 11:19 AM

Jio BlackRock Reaches 1 Million Investors in Just 8 Months

జియో బ్లాక్‌రాక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) ఈ ఏడాది మేలో సేవలు ప్రారంభించగా, 10 లక్షల మంది ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో 18 శాతం తొలిసారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారని సంస్థ ఎండీ, సీఈవో సిద్‌ స్వామినాథన్‌ వెల్లడించారు. ముఖ్యంగా 40 శాతం ఇన్వెస్టర్లు టాప్‌–30 పట్టణాలకు వెలుపలి ప్రాంతాల నుంచి ఉన్నట్టు చెప్పారు.

పరిశ్రమ సగటు 28 శాతం కంటే ఎంతో ఎక్కువని పేర్కొన్నారు. టెక్నాలజీ అనుసరణ, ఇన్వెస్టర్లలో అవగాహనపై దృష్టి సారించడం మార్కెట్‌ విస్తరణకు దోహదం చేస్తున్నట్టు తెలిపారు. జియో బ్లాక్‌రాక్‌ ఏంఎసీ నిర్వహణలోని పెట్టుబడులు రూ.13,700 కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. ఇందులో ఈక్విటీ ఆస్తులు 30 శాతంగా ఉన్నట్టు తెలిపారు. స్పెషలైజ్డ్‌ ఇన్వస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌), ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) ఆవిష్కరణతోపాటు, అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలను గిఫ్ట్‌సిటీ ద్వారా అందించనున్నట్టు చెప్పారు.

సిఫ్‌ ప్రారంభానికి వీలుగా సెబీ నుంచి ఇటీవలే నిరభ్యంతర పత్రం అందుకున్నట్టు తెలిపారు. ఈ సంస్థ నుంచి జియోబ్లాక్‌రాక్‌ సెక్టార్‌ రొటేషన్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో ఈ నెల 27న ప్రారంభం కానుండడం గమనార్హం. రంగాల వారీ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల్లో మార్పులు చేస్తూ, అధిక రాబడులను ఇచ్చే విధంగా ఇది పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement