వరంగల్, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరులో ప్రారంభం
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయా లుక్కాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు కొత్త షోరూమ్‌లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 12న వరంగల్‌లో రెండో షోరూమ్‌ను, 13వ తేదీన విజయనగరం, శ్రీకాకుళంలో, 14న గుంటూరులో రెండో షోరూమ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వేగవంతమైన విస్తరణ చేపడుతున్నట్టు పేర్కొంది.
కొత్తగా ప్రారంభించే ప్రతీ షోరూమ్ ఆధునిక ఇంటీరియర్, విశాలమైన విస్తీర్ణం, అత్యుత్తమ సౌకర్యాలతో వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభూమతిని ఇచ్చేలా రూపొందించినట్టు తెలిపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆభరణాల తయారీ చార్జీలపై 40 శాతం ఫ్లాట్ తగ్గింపు ఆఫర్‌ను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 29 వరకే అందుబాటులో ఉంటుంది. మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూమ్‌లను ప్రారంభించడం ద్వారా తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటున్నట్టు జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయ్ అలుక్కాస్ తెలిపారు.


