ఏడు నిమిషాల్లో అమ్ముడైపోయిన మహీంద్రా కారు | Mahindra BE 6 Batman Edition Sold Out in 7 Minutes | Sakshi
Sakshi News home page

ఏడు నిమిషాల్లో అమ్ముడైపోయిన మహీంద్రా కారు

Mar 10 2026 9:35 PM | Updated on Mar 10 2026 9:37 PM

Mahindra BE 6 Batman Edition Sold Out in 7 Minutes

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కోసం మరోమారు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం 7 నిమిషాల్లో అన్ని కార్లు అమ్ముడైపోయాయి. డెలివరీలు ఏప్రిల్ 10 మొదలవుతాయి.

మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో 999 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అన్ని కార్లు 7 నిమిషాల్లో అమ్ముడైపోయాయి. అంటే మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ధర రూ. 28.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధర లాంచ్ చేసిన సమయంలో ప్రకటించిన ధర కంటే రూ. 70వేలు ఎక్కువ. ధర పెంచినప్పటికీ.. డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.

మహీంద్రా బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో.. ఒకే ఫుల్ ఛార్జ్‌పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్‌లో నంబర్ ఉన్న బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్‌కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్‌తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్‌లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement