ఇండిగో సీఈఓ రాజీనామా | IndiGo CEO Pieter Elbers Resigns | Sakshi
Sakshi News home page

IndiGo CEO: ఇండిగో సీఈఓ రాజీనామా

Mar 10 2026 7:14 PM | Updated on Mar 10 2026 7:59 PM

IndiGo CEO Pieter Elbers Resigns

భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్.. తన పదవీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే నోటీసు పీరియడ్‌ను మినహాయించాలని అభ్యర్థించారు. ఈ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా వెల్లడించబడింది.

ఇండిగో తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా బాధ్యతలు స్వీకరిస్తూ.. సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

2025 డిసెంబరులో కొత్త నియమాలను అమలు చేయడంలో ఎదురైన సమస్యల వల్ల భారీ ఆపరేషనల్ సంక్షోభం ఏర్పడింది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు 2,500 పైగా విమానాలు రద్దు కావడం, 1,900 పైగా విమానాలు ఆలస్యం కావడం వల్ల 3 లక్షలకి పైగా ప్రయాణికులు ప్రభావితులు అయ్యారు. DGCA ఈ ఘటనపై రూ. 22.20 కోట్ల రికార్డు జరిమానా విధించింది. అంతే కాకుండా ఎల్బర్స్‌కు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement