యాక్టివాకు ఫుల్ డిమాండ్.. ఒక్క రాష్ట్రంలోనే 50 లక్షల సేల్స్! | Honda Activa Achieves 5 Million Unit Sales In Maharashtra | Sakshi
Sakshi News home page

యాక్టివాకు ఫుల్ డిమాండ్.. ఒక్క రాష్ట్రంలోనే 50 లక్షల సేల్స్!

Feb 26 2026 7:56 PM | Updated on Feb 26 2026 8:01 PM

Honda Activa Achieves 5 Million Unit Sales In Maharashtra

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా కంపెనీకి చెందిన యాక్టివాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా మంచి అమ్మకాలు పొందిన ఈ టూవీలర్.. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే 50 లక్షల సేల్స్ సాధించింది.

హోండా యాక్టివా స్కూటర్ 25 సంవత్సరాల్లో 50 లక్షల (ఒక్క మహారాష్ట్రలో మాత్రమే) అమ్మకాలను సాధించింది. కంపెనీ ప్రకారం.. పూణే, ముంబై, థానే, నాగ్‌పూర్ & నవీ ముంబై వంటి ప్రధాన నగరాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ స్కూటర్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

హోండా యాక్టివా
మార్కెట్లో హోండా యాక్టివా రెండు మోడల్స్‌లో లభిస్తోంది. ఒకటి యాక్టివా 6జీ (110సీసీ), యాక్టివా 125 (125సీసీ). యాక్టివా 6జీ ధర సుమారు రూ.81,000 నుంచి రూ. 95,500 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. యాక్టివా 125 ధరలు రూ.91000 నుంచి రూ.96000 (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది.

యాక్టివా 6జీ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.8 పీఎస్ పవర్, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. యాక్టివా 125 మోడల్ 123.92 సీసీ ఇంజిన్ ద్వారా 9.5 పీఎస్ పవర్, 11.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement