ఆర్‌బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్! | RBI Orders Banks to Remove Hidden Charges and Misleading App Tricks | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్!

Feb 26 2026 5:43 PM | Updated on Feb 26 2026 6:24 PM

RBI Orders Banks to Remove Hidden Charges and Misleading App Tricks

భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని నిర్మూలించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటనలు జారీ చేసింది.

సాధారణంగా కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు ఉపయోగిస్తున్నప్పుడు.. చివరి దశలో కొన్ని అదనపు ఛార్జీలు కనిపిస్తుంటాయి. అవసరం లేని సేవలను కొనుగోలు చేయమని పదేపదే వచ్చే కొన్ని సూచనలు కూడా కనిపిస్తుంటాయి. స్పష్టంగా అర్థం కాని కొన్ని విషయాలు వినియోగదారులను కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇలాంటి మోసపూరిత రూపకల్పనలను డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. వీటిని నిర్మూలించడానికి ఆర్‌బీఐ కీలక చర్యలు చేపట్టింది.

2026 సంవత్సరానికి సంబంధించిన 'రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్ 2026' అనే ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి, బ్యాంకులు తమ వెబ్‌సైట్లు & మొబైల్ యాప్‌లలో ఉన్న అన్ని డార్క్ ప్యాటర్న్స్‌ను 2026 జూలై నాటికి తొలగించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ ఆర్థిక ఉత్పత్తులను ప్రచారం చేసే విధానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కస్టమర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. ఏదైనా కొత్త సేవను అందించే ముందు వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అంటే.. కస్టమర్‌లకు పూర్తి సమాచారం ఇచ్చి, వారి అంగీకారం పొందిన తరువాత మాత్రమే అలాంటివి తెలియజేయాల్సి ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ ప్రకటన వల్ల.. వినియోగదారులకు చాలా లాభాలున్నాయి. ముందుగా వారు చెల్లించాల్సిన ఛార్జీలు, తీసుకునే సేవల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. బ్యాంకులపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. పారదర్శకత & బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరుస్తాయి.

ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement