అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి | Rich Dad Poor Dad Robert Kiyosaki Featuring in Money Disrupted documentary | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి

Feb 26 2026 4:24 PM | Updated on Feb 26 2026 5:14 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Featuring in Money Disrupted documentary

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ద్రవ్యోల్బణం, బిట్‌కాయిన్ భవిష్యత్తు వంటి అంశాలపై లోతైన విశ్లేషణతో రూపొందిన డాక్యుమెంటరీ ‘మనీ డిస్‌రప్టెడ్‌’ (Money Disrupted) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ డాక్యుమెంటరీని ఫ్రూషన్ ప్రొడక్షన్స్ తరఫున క్రిస్టఫర్ డాడ్జ్ నిర్మించారు. ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) ఈ డాక్యుమెంటరీని తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రోత్సహించడంతో ఇది మరింత ప్రచారం పొందింది. దీంట్లో ఆయన మాట్లాడినదానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్‌ను జోడిస్తూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో కియోసాకి పోస్ట్‌ చేశారు.

చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మార్పును ప్రపంచం ఎదుర్కొంటోందని వీడియోలో చెప్పుకొచ్చిన రాబర్ట్‌ కియోసాకి.. దీన్ని తాను ముందే ఊహించానన్నారు. అందుకే ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ పుస్తకాన్ని రచించానన్నారు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయి​ందన్నారు. ఇంకా ఆయన ఏమేమి మాట్లాడారన్నది పూర్తి డాక్యుమెంటరీ విడుదలయ్యాక తెలుస్తుంది.  

ఫెడరల్ రిజర్వ్ నుంచి బిట్‌కాయిన్ వరకూ...
డాక్యుమెంటరీలో ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ (Federal Reserve) స్థాపన తర్వాతి ఆర్థిక పరిణామాలు, 1971లో గోల్డ్ స్టాండర్డ్ ముగింపు, పెరుగుతున్న జాతీయ అప్పులు, ద్రవ్యోల్బణ ప్రభావాలను విశ్లేషించారు.

నిపుణుల అభిప్రాయాలతో పాటు, సంప్రదాయ ఫియాట్ కరెన్సీ వ్యవస్థపై విమర్శాత్మక దృష్టికోణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్లాక్‌చెయిన్ సాంకేతికత, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారవచ్చని చిత్ర బృందం సూచిస్తోంది.

ప్రముఖుల అభిప్రాయాలు
ఈ డాక్యుమెంటరీలో మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాన్‌ పాల్‌, ఆర్థిక విశ్లేషకులు లినెట్ జాంగ్, ఆండి షెక్ట్‌మన్ తదితరులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ద్రవ్య విధానాలపై వీరి విమర్శలు, “సౌండ్ మనీ” అవసరంపై వారి వాదనలు ఈ డాక్యుమెంటరీకి వైవిధ్యాన్ని తీసుకురానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement