ఇద్దరు ప్రధానులతో ఇండియన్ బైక్ | PM Narendra Modi Israeli PM Netanyahu Check Out RE Goan Classic 350 At Jerusalem Tech Exhibition | Sakshi
Sakshi News home page

ఇద్దరు ప్రధానులతో ఇండియన్ బైక్

Feb 26 2026 3:54 PM | Updated on Feb 26 2026 4:12 PM

PM Narendra Modi Israeli PM Netanyahu Check Out RE Goan Classic 350 At Jerusalem Tech Exhibition

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్‌లో అత్యాధునిక ఆవిష్కరణలను హైలైట్ చేసే ఒక టెక్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఇది మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా నిదర్శనం.

ఈ టెక్ ప్రదర్శనలో.. వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల పరిష్కారాలు, బయోటెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, శక్తి వనరులు & అంతరిక్ష వ్యవస్థలు వంటి అనేక కీలక రంగాల్లో ముందంజలో ఉన్న కంపెనీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ సమస్యలకు సుస్థిర పరిష్కారాలను కనుగొనే దిశగా ఇరు దేశాలు చేస్తున్న సంయుక్త కృషిని ఈ ప్రదర్శన ప్రతిబింబించింది.

ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జి ప్రయత్నాలకు టెక్ ఎగ్జిబిషన్‌ ఒక నిదర్శనం. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం & ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల నాయకులు కలిసి పని చేయడానికి మార్గదర్శం అవుతుంది.వేదిక కల్పించబడుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం.

ఈ ప్రదర్శన సందర్భంలో..  మోదీ చాలామంది పరిశోధకులు, కంపెనీల సీఈఓలు & స్టార్టప్ వ్యవస్థాపకులతో నేరుగా మాట్లాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగాల గురించి చర్చించారు. ఇజ్రాయెల్ ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం మరోసారి స్పష్టమైంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350
ఈ కార్యక్రమంలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350' మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బైక్‌ను మోదీ & నెతన్యాహు కలిసి పరిశీలించడం ఒక ముఖ్యమైన సందర్భంగా మారింది. ఇది భారత తయారీ శక్తిని & అంతర్జాతీయ మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ప్రాధాన్యతను సూచించింది. ఇజ్రాయెల్‌లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మంచి ఆదరణ ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350లో 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20.2 బిహెచ్‌పీ పవర్ 27 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5గేర్‌ల గేర్‌బాక్స్‌తో వస్తుంది. 2026 మోడల్‌లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి సరికొత్త సౌకర్యాలు చేర్చబడ్డాయి. అదనంగా, యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!

డిజైన్ పరంగా ఈ బైక్ చాలా ప్రత్యేకంగా ఉంది. బాబర్ శైలి ఆకృతి, ఫ్లోటింగ్ సీటు, ఎత్తైన హ్యాండిల్‌బార్, తెల్లటి సైడ్‌వాల్ టైర్లు వంటివి కలిగి ఉండటం వల్ల గోవన్ క్లాసిక్ 350 చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా రైడర్ల మనసును గెలుచుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement