ఫారెక్స్‌ ఆల్‌టైమ్‌ హై.. బంగారం 128.46 బిలియన్‌ డాలర్లు | India's Forex Reserves Hit All Time High Gold Reserves Rise To | Sakshi
Sakshi News home page

ఫారెక్స్‌ ఆల్‌టైమ్‌ హై.. బంగారం 128.46 బిలియన్‌ డాలర్లు

Feb 22 2026 9:54 AM | Updated on Feb 22 2026 10:50 AM

India's Forex Reserves Hit All Time High Gold Reserves Rise To

ముంబై: విదేశీ మారకం నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో 8.66 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 725.72 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. అంతుకుముందు ఫిబ్రవరి6తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 6.71 బిలియన్‌ డాలర్ల మేర తగ్గి 717.06 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో నమోదైన 723.77 బిలియన్‌ డాలర్లు పూర్వపు గరిష్ట స్థాయిగా ఉంది.  

  •     ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో కరెన్సీ ఆస్తులు (విదేశీ మారకం నిల్వల్లో అధిక భాగం) నికరంగా 3.55 బిలియన్‌ డాలర్లు పెరిగి 573.60 బిలియన్‌ డాలర్లకు చేరాయి. డాలర్లతోపాటు, యూరో, పౌండ్, యెన్‌ రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి.

  •     బంగారం రూపంలో మారకం నిల్వలు 4.99 బిలియన్‌ డాలర్ల  మేర పెరిగి 128.46 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

  •     స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 103 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement