సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు తీసుకోనున్న చంద్రబాబు సర్కారు
నోటిఫై చేసిన ఆర్‌బీఐ
ఈ నెలలో అప్పు చేయడం ఇది మూడోసారి
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,100 కోట్లు అప్పు తీసుకోనుంది. 16 సంవత్సరాల కాల వ్యవధితో రూ.1,600 కోట్లు, 21 సంవత్సరాల కాల వ్యవధితో రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.
ఈ నెల 3వ తేదీనే చంద్రబాబు సర్కారు రూ.3,300 కోట్లు అప్పు చేసింది. అలాగే, ఈ నెల 17న మరో రూ.500 కోట్లు అప్పు చేసింది. మళ్లీ వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిపి ఈ నెలలోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్ పరిధిలో రూ.6,900 కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది.


