ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి చైర్మన్‌ నోటీసులు జారీ | AP Legislative Council Chairman Issues Notices to Defected MLCs | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి చైర్మన్‌ నోటీసులు జారీ

Feb 20 2026 4:34 PM | Updated on Feb 20 2026 5:05 PM

AP Legislative Council Chairman Issues Notices to Defected MLCs

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు నోటీసులు జారీ చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్యాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

 ప్రలోభాలకు లోనై ఫిరాయించారనే వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు నేపధ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్‌ నోటీసులు జారీ చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పద్మ శ్రీ, సునీతలకు నోటీసులు జారీ అయ్యాయి.

వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, కానీ రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. దీనిపై మండలి చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయగా, వారికి తాజాగా నోటీసులు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement