పవిత్ర ప్రాంగణంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు.. భక్తుల ఆగ్రహం | Recording Dances In Sacred Temple Premises During Shivratri Celebrations Spark Devotees Outrage | Sakshi
Sakshi News home page

పవిత్ర ప్రాంగణంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు.. భక్తుల ఆగ్రహం

Feb 20 2026 3:21 PM | Updated on Feb 20 2026 3:32 PM

Recording Dances in Sacred Temple Premises Spark Devotees Outrage

పోలవరం:  రంపచోడవరం మండలం రంప శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చారిత్రక ప్రాధాన్యత కల్గిన ఆలయ ప్రాంగణంలో రికార్డింగ్‌  డ్యాన్స్‌లు నిర్వహించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, ఆమె భర్త మఠం భాస్కర్‌ సహకారంతో ఈ కార్యాక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాట్లను ఎమ్మెల్యే భర్త పర్యవేక్షించారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, యువత ఆనందం కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాట చేసినట్ల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతారణాన్ని కాపాడటాన్ని పక్కకు పెట్టేసి ఇలా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement