breaking news
rampa
-
పవిత్ర ప్రాంగణంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు.. భక్తుల ఆగ్రహం
పోలవరం: రంపచోడవరం మండలం రంప శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చారిత్రక ప్రాధాన్యత కల్గిన ఆలయ ప్రాంగణంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, ఆమె భర్త మఠం భాస్కర్ సహకారంతో ఈ కార్యాక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాట్లను ఎమ్మెల్యే భర్త పర్యవేక్షించారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, యువత ఆనందం కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాట చేసినట్ల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతారణాన్ని కాపాడటాన్ని పక్కకు పెట్టేసి ఇలా రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. -
కొడుకును కత్తితో నరికి చంపిన తండ్రి
మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని చావడీకోట పంచాయతీ పరిధిలోని బంధ గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి, కొడుకుల మధ్య జరిగిన వివాదం కొడుకు ప్రాణాలను బలికొంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఆవేశంలో తండ్రి కొడుకుని కత్తితో నరికి హతమార్చడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బంధ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు పల్లాల వీరపురెడ్డి (25), పల్లాల పెంటా రెడ్డి మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య త్రీవమైన వాగ్వివాదం జరిగింది. గొడవ త్రీవ స్థాయికి చేరడంతో ఆగ్రహించిన పల్లాల పెంటా రెడ్డి ఇంట్లో ఉన్న కత్తితో పల్లాల వీరపు రెడ్డి చాతీపై రెండు సార్లు నరికాడు. దీంతో వీరపు రెడ్డి అక్కడిక్కకడే మృతి చెందాడు. శనివారం విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్డం కోసం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తులసీరామ్ చెప్పారు.


