కొడుకును కత్తితో నరికి చంపిన తండ్రి | father murder son | Sakshi
Sakshi News home page

కొడుకును కత్తితో నరికి చంపిన తండ్రి

Jun 10 2017 11:33 PM | Updated on Jul 30 2018 8:37 PM

కొడుకును కత్తితో నరికి చంపిన తండ్రి - Sakshi

కొడుకును కత్తితో నరికి చంపిన తండ్రి

మండలంలోని చావడీకోట పంచాయతీ పరిధిలోని బంధ గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి, కొడుకుల మధ్య జరిగిన వివాదం కొడుకు ప్రాణాలను బలికొంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఆవేశంలో తండ్రి కొడుకుని కత్తితో నరికి హతమార్చడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బంధ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు పల్లాల వీరపురెడ్డి (25), పల్లాల పెంటా రెడ్డి మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా తరుచూ గొ

మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని చావడీకోట పంచాయతీ పరిధిలోని బంధ గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి, కొడుకుల మధ్య జరిగిన వివాదం కొడుకు ప్రాణాలను బలికొంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఆవేశంలో తండ్రి కొడుకుని కత్తితో నరికి హతమార్చడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బంధ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు పల్లాల వీరపురెడ్డి (25), పల్లాల పెంటా రెడ్డి మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో  కొంత కాలంగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య త్రీవమైన వాగ్వివాదం జరిగింది. గొడవ త్రీవ స్థాయికి చేరడంతో ఆగ్రహించిన పల్లాల పెంటా రెడ్డి ఇంట్లో ఉన్న కత్తితో పల్లాల వీరపు రెడ్డి చాతీపై రెండు సార్లు నరికాడు. దీంతో వీరపు రెడ్డి అక్కడిక్కకడే మృతి చెందాడు. శనివారం విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్డం కోసం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తులసీరామ్‌ చెప్పారు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement