విశాఖపట్నం : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) విశాఖలో సందడి చేశారు. ఇనార్బిట్ మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఏఏఏ సినిమాస్’ను ఆయన ఆదివారం ప్రారంభించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ : విశాఖలో మల్టీప్లెక్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
ప్రస్తుతం ముంబైలో నూతన చిత్రం షూటింగ్‌లో ఉన్నానని, ఈ ఈవెంట్ కోసం సెలవు తీసుకుని వచ్చినట్లు తెలిపారు.
అల్లు అర్జున్‌ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది.
అభిమానులను వేదికపైకి పిలిచి ఫొటోలు దిగిన ఆయన, తిరిగి వెళ్తూ దారిపొడవునా అందరికీ అభివాదం చేశారు.


