ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారు?.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం | Driver Subramaniam Case: Supreme Court Angry On Ap Police | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారు?.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Feb 20 2026 12:11 PM | Updated on Feb 20 2026 12:25 PM

Driver Subramaniam Case: Supreme Court Angry On Ap Police

ఢిల్లీ: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం , పోలీసులు కుమ్మక్కై దర్యాప్తును సాగదీస్తున్నారన్న సుప్రీంకోర్టు.. కేసును సాగదీస్తున్న పోలీసులను సస్పెండ్ చేశారా ? మీ డీజీపీ ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు  ప్రశ్నించింది. మీకు చేతకాకుంటే చెప్పండి కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ కోర్టు మండిపడింది

నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ అనంత బాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది?. దర్యాప్తులో పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించాన్న ధర్మాసనం.. కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ పొడిగించింది.

Advertisement
 
Advertisement
Advertisement