ఏయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు | SFI Vs ABVP, Tension At Andhra University, ABVP Protests Over Alleged Attacks And Police Intervene | Sakshi
Sakshi News home page

ఏయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

Feb 20 2026 1:52 PM | Updated on Feb 20 2026 2:01 PM

Sfi Vs Abvp: Tension At Andhra University

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ఏబీవీపీ ప్రయత్నించగా.. ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అంటూ ఏబీవీపీ నిరసనకు దిగింది. ఇంతవరకు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ వారిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నిచింది. ఏయూలో ఏబీవీపీ శాఖ కొనసాగుతుంది. ఏబీవీపీని ఎవరు అడ్డుకోలేరని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు నేతలు అన్నారు.

 ఎస్ఎఫ్ఐ  నేతలు.. వీసీకి ఫిర్యాదు చేశారు. ఏయూలో బయట వ్యక్తుల ప్రమేయం ఎక్కువైందని.. ఏబీవీపీ విద్యార్థుల పేరుతో బయట వ్యక్తులు ఏయూలోకి ప్రవేశిస్తున్నారన్నారు. వారిని కట్టడి చేయాలంటూ వీసీకి ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఫిర్యాదు చేశారు. ఏయూలో భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement