సాయంత్రానికే మారిన బంగారం ధరలు.. | Gold and Silver rates on evening 26th February 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

సాయంత్రానికే మారిన బంగారం ధరలు..

Feb 26 2026 5:53 PM | Updated on Feb 26 2026 6:02 PM

Gold and Silver rates on evening 26th February 2026 in Telugu states

దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి ఇంకాస్త దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.200 తగ్గి రూ.1,48,200 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.800 క్షీణించి రూ.1,47,600 లకు దిగివచ్చింది.

అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.210 తగ్గి రూ.1,61,680 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.870 కరిగి రూ. 1,61,020 లకు క్షీణించింది.

ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,95,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement