ఐఆర్‌ఎఫ్‌సీ వాటా ఆఫర్‌.. స్పందించని ఇన్వెస్టర్స్‌ | how Investors Arent Excited About IRFC | Sakshi
Sakshi News home page

ఐఆర్‌ఎఫ్‌సీ వాటా ఆఫర్‌.. స్పందించని ఇన్వెస్టర్స్‌

Feb 26 2026 7:34 AM | Updated on Feb 26 2026 8:37 AM

how Investors Arent Excited About IRFC

పీఎస్‌యూ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ)లో ప్రభుత్వం ఆఫర్‌ చేసిన 2 శాతం వాటా విక్రయానికి సరైన స్పందన లభించలేదు. ఆఫర్‌లో భాగంగా ప్రభుత్వం సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేసిన 23.52 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా..  22.34 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్స్‌ దాఖలయ్యాయి. వెరసి 94.98 శాతం స్పందన నమోదైంది. సంస్థాగత ఇన్వెస్టర్లు షేరుకి రూ. 104.12 సంకేత ధరలో బిడ్స్‌ వేశారు. వీటి విలువ రూ. 2,326 కోట్లుకాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లకు గురువారం విండో ఓపెన్‌ కానుంది.

కాగా.. ప్రభుత్వం 2 శాతం వాటాకు సమానమైన 26.13 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అధిక డిమాండ్‌ కనిపిస్తే మరో 2 శాతం వాటాను సైతం విక్రయించేందుకు(గ్రీన్‌ షూ ఆప్షన్‌) అవకాశముంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 104 ఫ్లోర్‌ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 86.36 శాతం వాటా ఉంది.

ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement