breaking news
Indian Railway
-
రైల్వే వ్యవస్థను మోదీ సమూలంగా మార్చేశారు
అహ్మదాబాద్: దేశంలో రైల్వే వ్యవస్థను ప్రధాని మోదీ సమూలంగా మార్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో తొలి ఎల్ఎన్జీ రైలును అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రూ.1,500 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత సభలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప ఇంకేమీ జరగలేదు. గత 12 ఏళ్లలో మోదీపై 4 అణాల అవినీతి ఆరోపణలు కూడా ఎవరూ చేయలేకపోయారు. మోదీ పాలనలో రైల్వేశాఖ ముఖచిత్రం మారింది. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, వేగవంతమైన రైలు వ్యవస్థ, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన స్టేషన్ల వచ్చాయి. హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో నాలుగు దేశాల సరసన భారత్‌కు స్థానం కల్పించారు’’ అని కొనియాడారు. ‘‘మోదీ హయాంలో 11,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని 4–ట్రాక్ నెట్‌వర్క్‌గా మారుస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. రైళ్లలో 97 శాతం బయో టాయిలెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 87 శాతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మన దేశంలోనే తయారయ్యాయి’’ అని చెప్పారు. -
మల్కాజిగిరి - కామారెడ్డి మధ్య రైల్వే ‘కవచ్ 4.0’
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ అమలులో తెలంగాణ మరో ఘనతను సాధించింది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మల్కాజిగిరి - కామారెడ్డి సెక్షన్ పరిధిలో 108 రూట్ కిలోమీటర్ల మేర అత్యాధునిక ‘కవచ్ 4.0’ వెర్షన్‌ను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించడానికి ఇది ఎంతగానో దోహదపడనుంది.కవచ్ 4.0 ప్రత్యేకతలుఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ అయిన కవచ్‌లో 4.0 వెర్షన్ అత్యంత ప్రామాణికమైనది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా చాలా పనులు నిర్వహించవచ్చు.సిగ్నల్ దాటితే స్వయంచాలక బ్రేకులు: లోకో పైలట్ పొరపాటున సిగ్నల్ దాటి ముందుకు వెళ్తే కవచ్ వ్యవస్థ తక్షణమే స్పందించి రైలును ఆటోమేటిక్‌గా ఆపుతుంది.ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వస్తే: ఎదురెదురుగా లేదా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రమాదకరంగా సమీపిస్తున్నప్పుడు ఘర్షణను నివారించడానికి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.వాతావరణ ప్రతికూలతల్లోనూ స్పష్టత: దట్టమైన పొగమంచు, వర్షం లేదా ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోయినా లోకో పైలట్ క్యాబిన్ డిస్ప్లే యూనిట్ ద్వారా సిగ్నల్ సమాచారం స్పష్టంగా తెలుస్తుంది.వేగ పరిమితి నియంత్రణ: వంతెనలు, మలుపుల వద్ద నిబంధనల కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంటే ఈ సిస్టమ్ స్వయంచాలకంగా వేగాన్ని వేగ పరిమితికి తగ్గిస్తుంది.A new boost to rail safety! KAVACH 4.0 now covers 108 Route Kilometres between Malkajgiri and Kamareddi rail section in Telangana enabling safer and seamless train operations across the region.#KAVACH4.0 #RailInfra4Telangana pic.twitter.com/C3JP6FLuid— Ministry of Railways (@RailMinIndia) September 23, 2026మల్కాజిగిరి - కామారెడ్డి మార్గంలో ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర తెలంగాణ పరిధిలోని రైలు రవాణా భద్రత గణనీయంగా పెరుగుతుంది. అధునాతన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు, టవర్ల ద్వారా నిరంతర రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌తో ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మిగిలిన ప్రధాన మార్గాల్లోనూ కవచ్ 4.0ను విస్తరించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే.. -
రైలు ఆలస్యమైతే పరిహారం ఇవ్వాల్సిందే!
రైలు సర్వీసుల్లో నాణ్యతా లోపంతో ప్రయాణికులకు తీవ్ర అవాంతరాలు కలిగిస్తే భారతీయ రైల్వే భారీ పరిహారం చెల్లించక తప్పదని జార్ఖండ్‌లోని జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. నిర్ణీత సమయం కంటే దాదాపు 9 గంటలు ఆలస్యంగా నడిచినందుకు గాను బాధితుడికి రూ.35,000 పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఈ ఉత్తర్వులను అత్యంత కీలకమైన మైలురాయిగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.సంఘటన పూర్వాపరాలుబాధితుడు సంజయ్ కుమార్ 2024 సెప్టెంబర్ 23న టాటానగర్ నుంచి సంబల్పూర్ వెళ్లేందుకు ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరికి స్లీపర్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:18 గంటలకు ప్రారంభం కావాల్సిన రైలు తీవ్ర జాప్యంతో బయలుదేరి ఏకంగా 8 గంటల 48 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. దీనివల్ల తనకు తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రూ.4.5 లక్షల పరిహారం కోరుతూ సంజయ్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.రైల్వే వాదన తిరస్కరణఈ పిటిషన్‌పై రైల్వే శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ అంశం రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుందని, కమిషన్‌కు విచారించే పరిధి లేదని వాదించింది. అయితే, సుప్రీంకోర్టు గత తీర్పును ఉటంకిస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ చీఫ్ సునీల్ కుమార్ సింగ్, సభ్యులు ప్రదీప్ కుమార్ మిశ్రా, సంజు షాహీలతో కూడిన ధర్మాసనం రైల్వే వాదనను తోసిపుచ్చింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కీలక ప్రామాణికంప్రయాణికుల సమయం అత్యంత విలువైందని, రైలు ఆలస్యానికి తగిన సహేతుక కారణాలను, అది తమ నియంత్రణలో లేని పరిస్థితుల వల్లనే జరిగిందని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత రైల్వేదేనని కమిషన్ పేర్కొంది. సేవా లోపాన్ని నిరూపించడంలో రైల్వే విఫలమైందని స్పష్టం చేస్తూ బాధితుడికి మానసిక వేదనకు గాను రూ.30,000 పరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.5,000 కలిపి మొత్తం రూ.35,000ను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గడువు దాటితే 12 శాతం వార్షిక వడ్డీ వర్తిస్తుందని హెచ్చరించింది. ఈ తీర్పు సమయపాలన పాటించని రవాణా సంస్థలకు గట్టి హెచ్చరిక అని, సామాన్య ప్రయాణికులకు తమ హక్కుల పట్ల ధైర్యాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనాలా? ఆగాలా?.. ఈరోజు కొత్త రేట్లు ఇవే.. -
దేశంలోనే తొలి స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు
భారత రైల్వే సరుకు రవాణా విభాగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా శివలాఖా నుంచి మిఠాపూర్ మధ్య నడిచే దేశంలోనే మొదటి ‘స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. సాధారణ వ్యాగన్లలో ఉప్పును రవాణా చేసే సమయంలో తేమను పీల్చుకోవడం, వ్యాగన్లు త్వరగా తుప్పు పట్టడం, సరుకు కంటే వ్యాగన్ బరువే ఎక్కువగా ఉండటం వంటి ప్రధాన సమస్యలను ఈ కొత్త సాంకేతికత పరిష్కరిస్తుంది.తుప్పు పట్టని డిజైన్ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్, గాలిలోని తేమ కలిసి సాధారణ ఇనుము లేదా ఉక్కు వ్యాగన్లను వేగంగా తుప్పు పట్టేలా చేస్తాయి. అందుకే ఈ కొత్త కంటెయినర్లను అధిక నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. సాధారణ వ్యాగన్లు కొన్ని సంవత్సరాల్లోనే పాడైపోగా స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణం వల్ల వ్యాగన్ల జీవితకాలం భారీగా పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గిపోతుంది.బరువు సమతుల్యతఉప్పు బరువుగా ఉండటం వల్ల పాత మోడల్ వ్యాగన్లలో వ్యాగన్ సొంత బరువు (టేర్ వెయిట్) కంటే మోసే సరుకు నిష్పత్తి సమర్థవంతంగా ఉండేది కాదు. తేలికైన, బలమైన స్టెయిన్లెస్ స్టీల్‌ను ఉపయోగించడం ద్వారా కంటెయినర్ బరువు తగ్గి, ఎక్కువ పరిమాణంలో ఉప్పును లోడ్ చేసే వెసులుబాటు లభించింది.వినూత్న లోడింగ్ - అన్లోడ్ విధానంకంటెయినర్ పైభాగం నుంచి నేరుగా ఉప్పును నింపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్లోడింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కంటెయినర్‌ను పక్కకు వంచే (టిల్ట్) సదుపాయం ఉంది. దీనివల్ల మానవ శ్రమ లేకుండా వేగంగా సరుకును ఖాళీ చేయవచ్చు.తేమ నిరోధకతరవాణా సమయంలో ఉప్పు వాతావరణంలోని తేమను పీల్చుకుని గడ్డకట్టడం లేదా తడిసిపోవడం జరుగుతుంది. ఈ సీల్డ్ కంటెయినర్ల వల్ల వర్షం లేదా గాలిలోని తేమ లోపలికి చేరకుండా ఉప్పు దాని సహజ స్థితిలోనే ఉంటుంది.सॉल्ट को देश के कोने-कोने तक ले जाने के लिए बनाया गया स्पेशल कंटेनर!#RailInfra4Gujarat#FreightFriendlyRailways pic.twitter.com/QBuIqeWFvd— Ministry of Railways (@RailMinIndia) September 16, 2026మౌలిక వసతుల విస్తరణఈ సందర్భంగా గుజరాత్‌లోని భీమాసర్, దేవిలియా, చండీసార్, శివలాఖాలలో పూర్తయిన నాలుగు కార్గో టెర్మినల్స్‌ను కేంద్రమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు, మెహసానాలోని లించ్ వద్ద నూతన గతిశక్తి కార్గో టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. 2021లో తీసుకొచ్చిన గతిశక్తి విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 కార్గో టెర్మినళ్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, కొత్తగా ప్రారంభించిన గోపాల్పూర్ రైల్వే స్టేషన్ సేవలతో అహ్మదాబాద్-భుజ్ మార్గంలో నడిచే రైళ్లకు గాంధీధామ్ వద్ద ఇంజిన్ రివర్సల్ చేయాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా కానుందని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
ఐఆర్సీటీసీలో రైలు టికెట్ బుక్ చేసిన చాట్‌జీపీటీ
కృత్రిమ మేధ సాంకేతికత డిజిటల్ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో చెప్పడానికి ఇదో తాజా ఉదాహరణ. నిత్యం లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ ప్రక్రియను ‘చాట్‌జీపీటీ అస్ట్రా’ అనే ఏఐ అసిస్టెంట్ అత్యంత సులభంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.కంటెంట్ క్రియేటర్ మంథన్ జేత్వానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జేత్వానీ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ముంబై నుంచి రాజ్‌కోట్‌కు సెప్టెంబర్ 20న, రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య ఏసీ క్లాస్‌లో ఇద్దరు ప్రయాణికులకు టికెట్లు వెతకాలని చాట్‌జీపీటీ అస్ట్రాను కోరారు.ఆశ్చర్యకరంగా, ఆ ఏఐ అసిస్టెంట్ మానవ ప్రమేయం లేకుండానే బ్రౌజర్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి ప్రవేశించింది. స్టేషన్ల పేర్లు, ప్రయాణ తేదీ, సమయం, క్లాస్ వివరాలను నమోదు చేసి రైళ్లను వెతికింది. మొదట వెయిటింగ్ లిస్ట్ కనిపించడంతో మరుసటి రోజుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రయాణికుల వివరాలను కూడా పూర్తి చేసి ఆఖరి పేమెంట్ పేజీ వరకు ప్రక్రియను తీసుకెళ్లింది. వినియోగదారుడు కేవలం డబ్బులు చెల్లించడం మాత్రమే మిగిలింది. ఈ వీడియోపై స్వయంగా చాట్‌జీపీటీ స్పందిస్తూ ‘అస్ట్రా లా విస్టా.. హ్యాపీ జర్నీ మంథన్’ అని కామెంట్ చేయడం విశేషం.సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. సాధారణ బుకింగ్స్‌లో ఏఐ ఏజెంట్లు విజయం సాధిస్తున్నప్పటికీ నిమిషాల వ్యవధిలో ముగిసే ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్స్, సైట్ క్యాప్చా భద్రతా ప్రాసెస్‌లలో ఇవి ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయనేది వేచి చూడాలి. నెటిజన్లు కూడా ‘దీపావళి పండుగ సమయాల్లో బిహార్ టికెట్లు బుక్ చేసి చూపిస్తే నమ్ముతాం’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, భవిష్యత్తులో రోజువారీ డిజిటల్ పనులను, సంక్లిష్టమైన ఆన్లైన్ లావాదేవీలను ఏఐ స్వయంప్రతిపత్తితో ఎలా సులభంగా నిర్వహించగలదో ఈ ప్రయోగం స్పష్టం చేస్తోంది. View this post on Instagram A post shared by Manthan Jethwani (@manthanjethwani)ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. ధరల పతనం -
IRCTC రైల్వే టికెట్ బుకింగ్‌కి ఏమైంది? యూజర్ల గగ్గోలు
రైలు టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ (IRCTC) ప్లాట్‌ఫామ్ శుక్రవారం ఉదయం తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లోనూ టికెట్ బుకింగ్ సమయంలో పదేపదే ఎర్రర్లు రావడం, పేజీలు నెమ్మదిగా లోడ్ కావడం, బుకింగ్ ప్రక్రియ మధ్యలోనే విఫలం కావడం వంటి సమస్యలను పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో వెల్లడించారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల సమయంలో బుకింగ్ రద్దీ పెరిగినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా కనిపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.టికెట్ బుకింగ్ ప్రారంభించిన తర్వాత ‘Unable to Process Request’ అనే సందేశం కనిపించిందని పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. మరికొందరికి వెబ్సైట్ చాలా సేపు లోడ్ అవుతూనే ఉండగా.. చివరకు టికెట్ బుక్ చేసే సమయానికి సీట్లు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపారు.కొంతమంది ప్రయాణికులు ఉదయం 8 గంటల నుంచే ప్రయత్నించినప్పటికీ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయామని పేర్కొన్నారు. మరికొందరు వెబ్సైట్లో ‘System Overload’ తరహా సందేశాలు కనిపించాయని తెలిపారు. దీంతో అత్యంత కీలకమైన ప్రారంభ నిమిషాల్లోనే టికెట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.పండుగ సీజన్ రద్దీ ప్రభావమేనా?తాజా ఇబ్బందులకు అధిక ట్రాఫిక్ ఒక కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం చేకూర్చేలా భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS) సెప్టెంబర్ 7న సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆ ఒక్క రోజే 22,26,786 టికెట్లు బుక్ అయ్యాయి. గత రికార్డు 2025 ఆగస్టు 19న నమోదైన 20,45,272 టికెట్లు కాగా.. తాజా సంఖ్య దానికంటే దాదాపు 9 శాతం అధికం. తొలిసారిగా ఒక రోజులో బుకింగ్స్ 22 లక్షల మార్కును దాటాయి.పండుగల సీజన్ సమీపిస్తుండటంతో సుదూర ప్రయాణాలకు రిజర్వేషన్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం పీక్ బుకింగ్ సమయాల్లో భారీ సంఖ్యలో ఏకకాలిక అభ్యర్థనలు రావడం సాంకేతిక ఒత్తిడికి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే తాజా అంతరాయానికి ఇదే కారణమని ఐఆర్సీటీసీ అధికారికంగా ధ్రువీకరించలేదు.కొత్త వెబ్సైట్ వచ్చినా సమస్యలు తప్పలేదా?ఇటీవలే ఐఆర్సీటీసీ తన టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను ఆధునీకరించే ప్రక్రియను ప్రారంభించింది. జూలై 15న కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అనవసరమైన క్యాప్చాలు, పాప్అప్లు తగ్గించడం, అన్ని తరగతుల సీట్ల లభ్యతను ఒకే చోట చూపించడం, బుకింగ్‌లో దశలను తగ్గించడం, తరచూ ప్రయాణించే వారికి ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే అవకాశం వంటి మార్పులను ఇందులో తీసుకొచ్చారు.ఐఆర్సీటీసీ వెబ్సైట్ రోజుకు సగటున సుమారు 14.5 లక్షల టికెట్లను నిర్వహిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో పాత పాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్ (PRE)ను కూడా ఆధునీకరిస్తున్నట్లు పేర్కొంది. కొత్త వెబ్‌సైట్‌ను ఈ కొత్త రిజర్వేషన్ ఇంజిన్‌తో అనుసంధానించడం ద్వారా పనితీరు, సామర్థ్యం మెరుగుపడుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.ఇదీ చదవండి: UPI కొత్త ఫీచర్లు.. ఫోన్ డేటా లేకున్నా పేమెంట్!అయితే తాజా బుకింగ్ అంతరాయాల నేపథ్యంలో కొత్త ఇంటర్ఫేస్ మాత్రమే సరిపోదని, అధిక ట్రాఫిక్‌ను తట్టుకునే బ్యాక్ఎండ్ సామర్థ్యం కూడా కీలకమని ప్రయాణికుల అనుభవాలు సూచిస్తున్నాయి.పూర్తి స్థాయి డౌన్ అయిందా?వెబ్సైట్, యాప్, టికెట్ బుకింగ్ సేవలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్లు ఆన్లైన్ ఫిర్యాదుల వేదిక ‘డౌన్‌డిటెక్టర్’లోనూ కనిపించింది.పెరుగుతున్న బుకింగ్ డిమాండ్‌ను ఐఆర్సీటీసీ వ్యవస్థ ఎంత సమర్థంగా నిర్వహించగలదన్నదే ప్రస్తుతం ప్రధాన ప్రశ్న. పండుగల సీజన్లో రిజర్వేషన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సాంకేతిక మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచడం ప్రయాణికులకు కీలకం.Though overhauled , still unresponsive. Same issue persists. Trying to book ticket since 8:00 am@irctc @RailwayNorthern @AshwiniVaishnaw pic.twitter.com/XiZXRBZIMV— AKHILESH YADAV (@akhileshyadav29) September 11, 2026@AshwiniVaishnaw @RailMinIndia @IRCTCofficial What is happening on the IRCTC website is extremely frustrating. Despite trying to book tickets, repeated “Unable to Process Request” errors are appearing, while tickets seem to #IRCTC #Railways #TrainTicket #Tatkal #IndianRailways pic.twitter.com/5fJe4v7AY8— ankit raj (@aaankit448) September 11, 2026 -
హైడ్రోజన్ రైలు.. కొత్త వేగానికి కసరత్తు
భారత రైల్వేలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన హైడ్రోజన్ ఆధారిత రైలును త్వరలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో నడుస్తుండగా.. ఇప్పటికే 120 కి.మీ వేగంతో హైస్పీడ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ వెల్లడించారు.ఇండోర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 120 కి.మీ వేగంతో ట్రయల్స్ పూర్తయిన నేపథ్యంలో, ఇక 110 కి.మీ వేగాన్ని ఆపరేషనల్ స్పీడ్‌గా తీసుకురావడంపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. కొత్త హైడ్రోజన్ రైలును ఏయే మార్గాల్లో నడపాలనే అంశంపై సంబంధిత వర్గాలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతిక అంశాలతో పాటు హైడ్రోజన్ ఇంధన సరఫరా మౌలిక వసతులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.భారత్ తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గత జూలై 17న హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ప్రారంభించారు. ఈ రైలు 89 కిలోమీటర్ల జింద్–సోనిపట్ మార్గంలో నడుస్తోంది. సాధారణ ఎలక్ట్రిక్ రైళ్లు ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్ల నుంచి శక్తిని పొందుతాయి. హైడ్రోజన్ రైలులో మాత్రం హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య ద్వారా రైలులోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.వందే భారత్ స్లీపర్పైనా కీలక అప్డేట్వందే భారత్ స్లీపర్ రైళ్ల విషయంలోనూ రైల్వే కీలక విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ హౌరా–కామాఖ్య (గువాహటి) మార్గంలో నడుస్తోంది. మరో నాలుగు రైళ్లు తయారై ఉండగా, వాటిని త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సతీష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది మరో 11 వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా పీపీపీ విధానంలో 200 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ జరుగుతోందని, ఒక్కో రైలును పూర్తి చేయడానికి సుమారు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఇక 2028లో ఉజ్జయినిలో జరిగే సింహస్థ మహోత్సవం 100 నుంచి 125 ప్రత్యేక రైళ్లను నడిపే ప్రణాళిక ఉందని తెలిపారు. అదే సమయంలో రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచేందుకు సీసీటీవీ వ్యవస్థలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించే పనులు జరుగుతున్నాయి. రైళ్లలో ఎలుకల సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రస్తుత మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టినట్లు రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారు. -
రైల్వే కొత్త రూల్.. ఇక రూ.1,000 ఫైన్!
దేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో ఎక్కువ మందికి ఏదైనా అసౌకర్యం ఉందంటే అది అపరిశుభ్రతే. ఈ దురవస్థను కాస్తయినా తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైళ్లలో చెత్త వేయడం, ఉమ్మడం వంటి పనులు చేసేవారిని కట్టడి చేసేందుకు పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే వారికి విధించే జరిమానాను ఏకంగా రెట్టింపు చేసింది. ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.500గా ఉన్న జరిమానాను రూ.1,000కు పెంచుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.కొత్త నిబంధనల ప్రకారం రైల్వే ప్రాంగణాలు, ప్లాట్‌ఫారాలు లేదా రైలు బోగీల్లో నిర్దేశిత ప్రదేశాలు మినహా ఎక్కడపడితే అక్కడ చెత్తను విసరడం, పడేయడం లేదా వదిలిపెట్టడం నిషేధం. ఇలాంటి ఉల్లంఘనలకు రూ.1,000 జరిమానా విధించవచ్చు. కేవలం చెత్త వేయడమే కాదు.. రైల్వే ప్రాంగణాల్లో పరిశుభ్రతకు భంగం కలిగించే మరికొన్ని చర్యలపైనా నిబంధనలు వర్తిస్తాయి.చెత్త వేయడమే కాదు.. వీటిపైనా నిఘానిబంధనల ప్రకారం.. రైల్వే ప్రాంగణాల్లో అనుమతించిన సదుపాయాలు మినహా వంట చేయడం, స్నానం చేయడం, ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, మలవిసర్జన, జంతువులు లేదా పక్షులకు ఆహారం వేయడం వంటి చర్యలు కూడా నిషేధం. అలాగే వాహనాలు, పాత్రలు, లేదా ఇతర వస్తువులను కడగడం, బట్టలు ఉతకడం, రైల్వే ప్రాంగణంలో వస్తువులను నిల్వ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే.అదేవిధంగా, రైల్వే అధికారుల అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, రైలు బోగీలు లేదా రైల్వే ఆస్తులపై రాయడం, గీయడం, వాటిని ధ్వంసం చేయడం కూడా చర్యలకు దారితీయవచ్చు. 2012లో రూపొందించిన ఈ నిబంధనల్లో గతంలో గరిష్ఠ జరిమానా రూ.500గా ఉండేది. తాజా సవరణతో ఆ మొత్తాన్ని రూ.1,000కు పెంచారు.ఫైన్ కట్టకపోతే ఏం జరుగుతుంది?కొత్త నిబంధనల్లో మరో కీలక అంశం ఉంది. విధించిన రూ.1,000 జరిమానాను చెల్లించకపోతే, సంబంధిత వ్యక్తిని అధికార పరిధి ఉన్న కోర్టు ముందు హాజరుపరచవచ్చు. అక్కడ రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.జరిమానా ఎవరు వసూలు చేస్తారు?నిబంధనల ప్రకారం స్టేషన్ మాస్టర్ లేదా స్టేషన్ మేనేజర్, కమర్షియల్ విభాగానికి చెందిన టికెట్ కలెక్టర్ స్థాయి లేదా అంతకంటే పైస్థాయి అధికారులు, ఆపరేటింగ్ విభాగంలో సమాన హోదా కలిగిన అధికారులు, అలాగే రైల్వే పరిపాలన ప్రత్యేకంగా అధికారం ఇచ్చిన ఇతర అధికారులు జరిమానా వసూలు చేయవచ్చు.ఇదీ చదవండి: రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్ -
ఇదేందిరా సామీ.. కుర్చీ కోసం రైలు ఆపిన గార్డు!
గోరఖ్‌పూర్: బోగీలో తాను కూర్చునేందుకు కుర్చీ లేదనే నెపంతో రైలు గార్డు ఒక సూపర్‌ఫాస్ట్ రైలును ఏకంగా 38 నిమిషాల పాటు స్టేషన్లోనే నిలిచిపోయేనా చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి లలిత్‌గ్రామ్ వెళ్తున్న వైశాలి ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో ఈ వివాదం తలెత్తింది. రైలు గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న రామాశిష్ దాస్, తన కేబిన్‌లో కూర్చోవడానికి సరైన కుర్చీ సదుపాయం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.తనకు సరైన సీటు ఏర్పాటు చేసేంత వరకు రైలుకు పచ్చజెండా ఊపేది లేదని, ముందుకు తీసుకెళ్లబోనని ఆయన మొండికేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గార్డుతో చర్చలు జరిపారు. రైలు ప్రయాణ మార్గంలోని తదుపరి ముఖ్య స్టేషన్ అయిన డియోరియాలో కూర్చోవడానికి తగిన సీటింగ్ ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో గార్డు శాంతించి రైలు కదలడానికి అనుమతించారు. ఈ తతంగానికి 38 నిమిషాల సమయం పట్టడంతో వైశాలి ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటన రైల్వే వర్గాల్లో కలకలం రేపింది.ఇది కూడా చదవండి: విజయ్ ఓ వర్గానికే సీఎం?.. నిలదీసిన బీజేపీ -
తత్కాల్ టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే కన్ఫర్మ్ సీటు!
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేకపోయినా రైలు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను ప్రయాణికులు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే అవకాశం భారతీయ రైల్వే కల్పిస్తోంది. ఐఆర్సీటీసీలోని ‘Charts Vacancy’ ఫీచర్ ద్వారా ఈ సీట్ల వివరాలను తెలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సీటును బుక్ చేసుకుంటే నేరుగా కన్ఫర్మ్ టికెట్ జారీ అవుతుంది.చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీ సీట్లురైలు బయలుదేరే ముందు తొలి రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేసినప్పుడు కొన్ని సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా రైలు బయలుదేరడానికి సుమారు నాలుగు గంటల ముందు తొలి చార్ట్ తయారవుతుంది. ఆ తర్వాత కూడా ఖాళీగా ఉన్న సీట్లను ‘కరెంట్ బుకింగ్’ ద్వారా ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. రైలు, మార్గాన్ని బట్టి బుకింగ్ సమయం మారవచ్చు.కరెంట్ బుకింగ్‌లో లభించే టికెట్లు వెయిట్‌లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్లు కావు. ఖాళీ సీటు అందుబాటులో ఉంటే బుక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ టికెట్ (CNF) జారీ అవుతుంది. దీంతో తత్కాల్ టికెట్ దొరకని ప్రయాణికులకు ఇది మరో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.తత్కాల్ ఛార్జీలు ఉండవుకరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకునే ప్రయాణికులు అదనంగా తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ సర్‌ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సాధారణ రిజర్వేషన్ ఛార్జీలే వర్తిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఖాళీ సీట్లను ఆకర్షణీయంగా బుక్ చేసుకునేలా డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండొచ్చు. డిస్కౌంట్ వర్తింపు రైలు, సీటు, బుకింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.రీఫండ్ విషయంలో జాగ్రత్తకరెంట్ బుకింగ్ టికెట్లను బుక్ చేసుకునే ముందు ప్రయాణ ప్రణాళికను ఖరారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ టికెట్లను రద్దు చేసినప్పుడు సాధారణంగా రీఫండ్ నిబంధనలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి చివరి నిమిషంలో సీటు దొరికిందని తొందరపడి బుక్ చేసుకునే ముందు క్యాన్సిలేషన్ నిబంధనలను పరిశీలించాలి.ఐఆర్సీటీసీలో ఖాళీ సీట్లు ఎలా చూడాలి?ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి రైలు బుకింగ్ విభాగంలో ‘Charts/Vacancy’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం రైలు నంబర్, ప్రయాణ తేదీ వంటి వివరాలను నమోదు చేస్తే చార్ట్ సిద్ధమైన తర్వాత అందుబాటులో ఉన్న కోచ్‌లు, బెర్త్‌ల వివరాలను చూడవచ్చు. ఖాళీ సీటు కనిపిస్తే, నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు.ఇంటర్మీడియట్ స్టేషన్లో ప్రయాణికుడు దిగిపోయిన తర్వాత ఖాళీ అయిన బెర్త్‌లు కూడా తదుపరి స్టేషన్ల నుంచి ప్రయాణించే వారికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి ఖాళీ సీట్ల కోసం ప్రయాణికులు రైలులో టీటీఈని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు చార్ట్ వేకెన్సీ ద్వారా అందుబాటులో ఉన్న వివరాలను ఆన్లైన్లోనే చూసుకునే అవకాశం ఉంది.అందువల్ల తత్కాల్ బుకింగ్‌లో టికెట్ దొరకని ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు ‘Charts/Vacancy’ను ఒకసారి పరిశీలిస్తే, అదృష్టం కలిసొస్తే నేరుగా కన్ఫర్మ్ సీటును పొందే అవకాశం ఉంటుంది. -
రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రోజూ కనిపించే తోపులాటలు, దళారుల ఆధిపత్యానికి తెరదించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 1, 2026 నుంచి తత్కాల్ టికెట్ల జారీ విధానంలో విప్లవాత్మకమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెడుతున్నారు. ప్రాథమికంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే (కోటా డివిజన్) పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేకపోయినప్పటికీ క్యూలైన్లలో నిలబడే పద్ధతి పూర్తిగా మారనుంది.టోకెన్ల కేటాయింపు వేళలు ఇవే..కొత్త నిబంధనల ప్రకారం కౌంటర్ వద్ద నేరుగా గుమిగూడేందుకు అనుమతించరు. ముందుగా టోకెన్లు పొందిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఏసీ తరగతుల వారికి ఉదయం 8:30-9:00 గంటల మధ్య టోకెన్లు పంపిణీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు గరిష్ఠంగా 10 టోకెన్లు మాత్రమే ఇస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 10:00 గంటలు). నాన్-ఏసీ తరగతులకు ఉదయం 9:30-10:00 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు 15 టోకెన్లు కేటాయిస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 11:00 గంటలు)కేటగిరీ ఏ, బీ ప్రాధాన్యతలుదళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రయాణికులను రెండు వర్గాలుగా విభజించారు. కేటగిరీ ఏ..(తొలి ప్రాధాన్యం) తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ వర్గంలోకి వస్తారు. వీరు తమ అసలు గుర్తింపు కార్డుతో పాటు కుటుంబ సంబంధాన్ని రుజువు చేసే ఐడీ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి. కేటగిరీ ‘బీ’ కింద ఇతర ప్రయాణికులకు ఇస్తారు. ‘ఏ’ కేటగిరీ ప్రయాణికుల బుకింగ్ పూర్తయిన తర్వాతే వీరికి అవకాశం కల్పిస్తారు. వీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.పారదర్శకత, భద్రతకే ప్రాధాన్యంజారీ చేసిన టోకెన్లపై ప్రయాణికుడి పేరు, వివరాలు స్పష్టంగా ముద్రిస్తారు. ఇవి ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. టోకెన్ ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరంతరం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా హాల్లో వేచి ఉండవచ్చు. అటు ఆన్లైన్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులకు ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి. సాధారణ ప్రయాణికులకు తత్కాల్ రిజర్వేషన్ సులభతరం చేయడం, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ కీలక మార్పులు చేపట్టింది.ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు -
Viral Video: వీడి భక్తి తగలెయ్యా... AC కోచ్ లో అగరుబత్తి.. దీపం..!
-
విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్!
భారతీయ రైల్వే రవాణా వ్యవస్థలో వందేభారత్ రైలు సుదూర రాత్రి ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పగటిపూట నడిచే చైర్ కార్ వెర్షన్లతో ఆదరణ పొందిన వందేభారత్ సిరీస్ రైళ్లను అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలో ‘వందేభారత్ స్లీపర్’ పేరుతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎస్సీఆర్ పరిధిలో దీన్ని ముందుగా విజయవాడ డివిజన్లో ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ మీదుగా ఈ అత్యాధునిక స్లీపర్ సర్వీసును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా బెంగళూరు మార్గంలో ఈ రైలును నడిపే ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ ఈ ఏడాది జనవరిలోనే హౌరా-కామాఖ్య మధ్య ప్రారంభమైంది. సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు.విమాన తరహా ప్రయాణ అనుభూతివందేభారత్ స్లీపర్ రైళ్లను విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతికత, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో డిజైన్ చేశారు. మొత్తం 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ఒకేసారి సుమారు 823 మంది ప్రయాణించేలా సీటింగ్/బెర్త్ అమరిక ఉంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల డిజైన్ వేగం ఉన్నప్పటికీ ప్రస్తుత ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా 160 కి.మీ/గం ఆపరేషనల్ వేగంతో ప్రయాణిస్తుంది. సెల్ఫ్-ప్రొపెల్డ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) సాంకేతికత వల్ల వేగవంతమైన ఆక్సిలరేషన్ సాధ్యమవుతుంది.ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ బెర్త్‌లు, శబ్ద కాలుష్యం లేకుండా ఉండే సౌండ్ ప్రూఫ్ క్యాబిన్లు, సాఫ్ట్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి బెర్త్ వద్ద ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీ, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్తిస్థాయి స్వదేశీ ప్రమాద నిరోధక వ్యవస్థ ‘కవచ్’, నిరంతర సీసీటీవీ నిఘా, ఏఐ ఆధారిత కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడే టాక్-బ్యాక్ బటన్లు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత కోసం బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ వాటర్ ట్యాప్‌లు అమర్చారు.రవాణా రంగంలో సరికొత్త అధ్యాయంసాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్యాసింజర్ సేఫ్టీకి ఇవి ప్రాధాన్యత ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార, ఐటీ, రవాణా అవసరాలకు విజయవాడ కీలక కేంద్రంగా ఉన్నందున ఈ స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి రావడం ఇక్కడి ప్రయాణికులకు ఊరటనివ్వనుంది. త్వరలోనే అధికారిక టైమ్‌టేబుల్, ప్రారంభ తేదీ వివరాలను రైల్వే బోర్డు ప్రకటించనుంది.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
హైడ్రోజన్ రైలుకు స్పందన కరువు!?
భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ఈ రైలును ప్రారంభించారు. 10 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది.అత్యాధునిక సౌకర్యాలు, కేవలం రూ.5 నుంచి రూ.25 మధ్యే టికెట్ ఛార్జీలు ఉన్నప్పటికీ ప్రారంభ రోజుల్లో ప్రయాణికుల స్పందన ఆశించిన స్థాయిలో కనిపించలేదు. తొలి రోజు జింద్ నుంచి బయలుదేరిన రైలులో సాధారణ ప్రయాణికులు సుమారు 20 మంది మాత్రమే ప్రయాణించగా, రెండో రోజూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి.ఎందుకు తక్కువ మంది ప్రయాణిస్తున్నారు?రైల్వే వర్గాల అంచనా ప్రకారం, జింద్–సోనిపట్ మార్గంలో ఇప్పటికే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయాల కొరత లేదు. కొత్త హైడ్రోజన్ రైలు గురించి ఇంకా చాలామందికి పూర్తి అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. ప్రచారం పెరిగి, ప్రజల్లో విశ్వాసం ఏర్పడిన తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?సాంప్రదాయ డీజిల్ ఇంజిన్‌కు బదులుగా ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మోటార్లను నడుపుతుంది. ఈ ప్రక్రియలో పొగ లేదా కార్బన్ ఉద్గారాలు వెలువడవు. ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడంతో ఇది పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.ప్రత్యేకతలు ఇవే..🔹 10 కోచ్‌లతో సుమారు 2,600 మంది ప్రయాణికుల సామర్థ్యం.🔹 మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లు.🔹 డిజిటల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు.🔹 పబ్లిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ.🔹 హైడ్రోజన్ లీకేజ్, మంటలు, ఉష్ణోగ్రతలను గుర్తించే బహుళ భద్రతా వ్యవస్థలు.🔹 జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ మౌలిక సదుపాయాలు.🔹 గరిష్ఠ డిజైన్ వేగం గంటకు 110 కి.మీ.( ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 75 కి.మీ. వేగంతో నడుస్తోంది)హైడ్రోజన్ ఆధారిత రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. భవిష్యత్తులో పూర్తిగా విద్యుదీకరణ సాధ్యం కాని మార్గాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి రైళ్ల వినియోగాన్ని విస్తరించే దిశగా భారతీయ రైల్వేలు ఈ ప్రాజెక్టును పైలట్‌గా ఉపయోగించనున్నాయి. -
ఛీ.. ఇదేందయ్యా ఇది.. మరి ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా
-
IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు
దేశంలో కోట్లాది మంది రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టికెట్ బుకింగ్ వెబ్సైట్ నేడు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గత వెబ్సైట్లో ఎదుర్కొన్న సాంకేతిక ఇబ్బందులు, తత్కాల్ సమయంలో సర్వర్ నిలిచిపోవడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతికతతో, క్లీన్ డిజైన్‌తో ఈ ప్లాట్‌ఫారమ్‌ను తీర్చిదిద్దారు.సామర్థ్యంలో రికార్డు స్థాయి వృద్ధిఈ నూతన పోర్టల్ ప్రధాన బలం దాని బుకింగ్, ప్రాసెసింగ్ సామర్థ్యం. పాత వెబ్సైట్లో నిమిషానికి కేవలం 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ద్వారా నిమిషానికి ఏకంగా 1.5 లక్షలకు పైగా టికెట్లను ఎలాంటి అంతరాయం లేకుండా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల వివరాల ఎంక్వైరీ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి రికార్డు స్థాయిలో 40 లక్షలకు పెరిగింది. ఇది తత్కాల్ బుకింగ్ సమయంలో సర్వర్ క్రాష్ అయ్యే అవకాశాలను పూర్తిగా నివారిస్తుంది.ప్రయాణికులను ఆకట్టుకునే ఫీచర్లుసాధారణ సమయాల్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు చికాకు కలిగించే క్యాప్చా వెరిఫికేషన్‌ను తొలగించారు. దీనివల్ల తత్కాల్ బుకింగ్ కూడా మరింత వేగంగా ముగుస్తుంది.విమాన ప్రయాణాల తరహాలోనే వివిధ తేదీల్లో ఉండే టికెట్ ధరలను సులభంగా పోల్చి చూసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను అందుబాటులోకి తెచ్చారు.ప్రయాణికులు అన్ని తరగతుల సీట్ల లభ్యతను వేర్వేరుగా కాకుండా ఒకే స్క్రీన్‌పై చూసి నిర్ణయం తీసుకోవచ్చు.కింగ్ సమయంలోనే ప్రయాణికులు తమకు నచ్చిన సీటు లేదా బెర్త్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.దివ్యాంగులు, విద్యార్థులకు ఒకే వేదికదివ్యాంగులు, విద్యార్థులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే రోగులకు అందించే ప్రత్యేక రాయితీలు, సేవలను వేర్వేరు పోర్టల్స్ ద్వారా కాకుండా ఈ సరికొత్త వెబ్సైట్లో ఒకే ప్లాట్‌ఫారమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దేశంలోని అందరు ప్యాసింజర్లకు ఉపయోగపడేలా ఈ పోర్టల్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐఆర్సీటీసీ-ఐపే, యూపీఐ సాంకేతికతను మరింత పటిష్టం చేశారు.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు!
పెళ్లి వేడుకలకు, ఆధ్యాత్మిక యాత్రలకు, కార్పొరేట్ టూర్లు లేదా పెద్ద కుటుంబాలతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఇండియన్ రైల్వే ఒక ప్రత్యేకమైన సౌకర్యం అందిస్తోంది. ఫుల్ టారిఫ్ రేట్ (FTR) స్కీమ్ ద్వారా ప్రయాణికులు ఒక రైల్వే కోచ్‌ను లేదా అవసరమైతే పూర్తి రైలునే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువమందితో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఈ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే.. జర్నీ చేయాల్సిన తేదీకంటే ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ సేవను.. ప్రయోగాత్మకంగా వెస్ట్రన్ రైల్వే పరిధిలో ప్రారంభమయ్యే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. బుకింగ్‌ను IRCTC FTR పోర్టల్ ద్వారా లేదా ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్‌లోని చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ (CBS) లేదా స్టేషన్ మాస్టర్‌కు దరఖాస్తు చేసి చేయవచ్చు.ఆన్లైన్లో బుక్ చేయాలంటే.. ముందుగా ప్రయాణ వివరాలు, మార్గం, బుకింగ్ రకం వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు వస్తాయి. ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసిన రోజుతో కలిపి ఆరు రోజుల్లోగా చెల్లించాలి. నిర్ణీత గడువులో చెల్లించకపోతే దరఖాస్తు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఆఫ్‌లైన్ బుకింగ్ కోసం ముందుగా.. స్టేషన్ మాస్టర్ లేదా చీఫ్ బుకింగ్ సూపర్వైజర్కు లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. అధికారులు వివరాలను నమోదు చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ తరువాత యూటీఎస్ కౌంటర్లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ఎఫ్టీఆర్ నెంబర్ జారీ చేసి బుకింగ్‌ను పూర్తి చేస్తారు.ఈ స్కీమ్ కింద ఒక టూర్ ప్రోగ్రామ్‌కు సాధారణ రైలులో గరిష్టంగా 10 కోచ్‌ల వరకు రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా స్పెషల్ ట్రైన్ బుక్ చేయాలనుకుంటే గరిష్టంగా 24 కోచ్‌ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రెండు సీటింగ్ కమ్ లగేజ్ కోచ్‌లు కూడా ఉంటాయి.రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే.. ఒక కోచ్‌ను ఏడు రోజుల వరకు బుక్ చేయడానికి రూ.50,000 చెల్లించాలి. ప్రయాణం ఏడు రోజుల కంటే ఎక్కువ ఉంటే అదనంగా ప్రతి కోచ్‌కు రోజుకు రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి రైలును బుక్ చేయాలంటే కనీస రిజిస్ట్రేషన్ మొత్తం రూ.9 లక్షలు. ఇది కనీసం 18 కోచ్‌ల ఆధారంగా లెక్కిస్తారు. 18 కంటే ఎక్కువ కోచ్‌లు ఉంటే ప్రతి అదనపు కోచ్‌కు రూ.50,000 చెల్లించాలి.ఒకవేళ ప్రయాణికుడు లేదా రైల్వే శాఖ బుకింగ్‌ను రద్దు చేసినా, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. చీఫ్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయం ద్వారా రీఫండ్ ప్రక్రియ జరుగుతుంది. -
కొత్త రూపంలో IRCTC వెబ్సైట్!
ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వచ్చే సమస్యలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పుడు భారతీయ రైల్వే.. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను పూర్తిగా కొత్త రూపంలోకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో వెబ్సైట్ నెమ్మదించడం, సర్వర్ సమస్యలు రావడం, టికెట్ బుక్ అయ్యేలోపు సీట్లు అయిపోవడం వంటి సమస్యలను చాలామంది ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు భారతీయ రైల్వే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను కొత్తగా మారుస్తోంది.జులై 15 నుంచి కొత్త వెర్షన్కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ 2026 జూలై 15 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వేగంగా టికెట్ బుక్ చేసుకోవడం, సులభమైన నావిగేషన్, మెరుగైన పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌పై ప్రయాణికుల నుంచి లెక్కకుమించిన ఫిర్యాదులు అందాయి. అందులో ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఒకేసారి లక్షలాది మంది ప్రయత్నించడం వల్ల వెబ్సైట్ స్లో అవ్వడం, పేజీలు లోడ్ కాకపోవడం, ఎక్కువసార్లు క్యాప్చా అడగడం, సెషన్ టైమ్ అవుట్ కావడం వనవి ఉన్నాయి. కొత్త వెబ్సైట్ ఈ సమస్యలకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం.మొబైల్ యాప్‌లో కూడా..కొత్త వెబ్‌సైట్‌ను ఐఆర్సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త ఫీచర్లను ఇందులో చేర్చారు. బీటా వెర్షన్‌ను టెస్ట్ చేసే సమయంలో వినియోగదారుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.కొత్త ఐఆర్సీటీసీ ఫీచర్లు రైల్‌వన్ మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. అంటే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఏదైనా ప్రయాణికులకు ఒకే విధమైన అనుభవం లభిస్తుంది. వెబ్సైట్ మార్పులతో పాటు భారతీయ రైల్వే తన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను కూడా అప్డేట్ చేస్తోంది. దాదాపు 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థ స్థానంలో అధిక ట్రాఫిక్‌ను నిర్వహించగల కొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకురానున్నారు.🚨 The Ministry of Railways is launching a new version of the IRCTC website. 1. Ticket booking capacity increased from 32,000 to 1.5 lakh+ tickets per minute.2. PNR & train enquiry capacity increased from 4 lakh to 40 lakh+ enquiries per minute.3. Faster page loading and… pic.twitter.com/Ah2VbS3RK1— Indian Tech & Infra (@IndianTechGuide) July 13, 2026 -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. అలాంటి టికెట్ చెల్లదు!
డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్లను ఉపయోగించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. రైల్ వన్ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసిన అన్రిజర్వ్డ్ టికెట్లను.. టికెట్ తనిఖీ సమయంలో తప్పనిసరిగా అదే యాప్‌లో ఒరిజినల్ రూపంలో చూపించాలని వెల్లడించింది.టికెట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్, ఫొటో, పీడీఎఫ్ కాపీ లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన కాపీలు చెల్లుబాటు కావని రైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇండియన్ రైల్వే ఈ సూచనలు చేయడానికి కారణం ఇటీవల కోర్బా-విశాఖపట్నం లింక్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకున్న ఘటనే. కోర్బా నుంచి రాయ్‌పూర్‌కు ప్రయాణిస్తున్న ఓ మహిళ తన టికెట్‌ను వాట్సాప్‌లో వచ్చిన స్క్రీన్‌షాట్ రూపంలో టికెట్ తనిఖీ అధికారికి చూపించారు. అయితే ఆ టికెట్‌ను ఆమె సోదరుడు రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసి, స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపినట్లు తెలిసింది. అయితే.. విచారణలో టికెట్ రైలు బయలుదేరిన తర్వాత బుక్ చేసినట్లు, అలాగే అది ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో లేకపోవడంతో అధికారులు దానిని చెల్లని టికెట్‌గా ప్రకటించి నిబంధనల ప్రకారం జరిమానా విధించారు.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్ చెల్లుబాటు కావాలంటే, దానిని బుక్ చేసిన అదే మొబైల్ ఫోన్లో, అదే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లోని రైల్ వన్ యాప్‌లో అందుబాటులో ఉండాలి. ఇతరులకు పంపిన కాపీలు లేదా స్క్రీన్షాట్లు ప్రయాణానికి పనికిరావు.అంతే కాకుండా.. అన్రిజర్వ్డ్ డిజిటల్ టికెట్‌ను రైలు బయలుదేరే ముందే బుక్ చేయాలని రైల్వేలు స్పష్టం చేశాయి. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత తీసుకున్న టికెట్, యాప్‌లో కనిపించినా కూడా చెల్లదని పేర్కొన్నాయి. కాబట్టి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన మొబైల్ ఫోన్‌ను ప్రయాణ సమయంలో తమ వెంట ఉంచుకోవాలని, ఫోన్లో తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. -
ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!
టికెట్ లేకుండా లేదా చెల్లుబాటు కాని టికెట్‌తో ప్రయాణించే ప్రయాణికులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇండియన్ రైల్వే సిద్ధమైంది. జన్ విశ్వాస్ చట్టం ప్రకారం కొత్త రూల్స్ జులై 1నుంచి అమల్లోకి రానున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్‌తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.అంతేకాకుండా.. టికెట్లో పేర్కొన్న కోచ్ లేదా క్లాస్ కాకుండా ఇతర కోచ్‌లో ప్రయాణిస్తే కూడా జరిమానా విధించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనరల్ టికెట్‌తో స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లో ప్రయాణించడం, లేదా అనుమతించిన దూరం (దిగాల్సిన స్టేషన్) కంటే ఎక్కువ ప్రయాణించడం వంటి వాటిపై కూడా అదనపు చార్జీలు విధిస్తారు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇతరుల టికెట్‌ను ఉపయోగించి ప్రయాణించడం కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇలా ప్రయాణిస్తే.. టికెట్ రద్దు చేయడమే కాకుండా, రూ.500 జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ ప్రయాణికుడు ఈ జరిమానాలు చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే అధికారులు కోర్టులో కేసు వేయవచ్చు. అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలు వసూలు చేయడం జరుగుతుంది.ఇదీ చదవండి: అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే వంటి విభాగాలు సోషల్ మీడియా, ఇతర ప్రకటనల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. సరైన టికెట్‌తో మాత్రమే ప్రయాణించాలని, రైల్వే నియమాలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నాయి. -
ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. సందడిగా ఉండే రైల్వే స్టేషన్లు, ప్రకృతి అందాలను చూపించే మార్గాలు, ప్రయాణంలో కలిసే కొత్త వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో లేదా రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో కనిపించే కొన్ని రైల్వే పదాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ పదాల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభంగా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.ఆర్ఏసీ (RAC)RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ స్టేటస్ ఉన్న ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ లభించదు. కానీ రైలులో ప్రయాణించవచ్చు. అయితే.. ఒక సీటును ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళా ఇతర ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకుంటే, అలాంటి సందర్భంలో ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటానికి బదులుగా ఆర్ఏసీ మంచి ఎంపికగా భావిస్తారు.జీఎన్డబ్ల్యుఎల్ (GNWL)GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే వెయిటింగ్ లిస్ట్ రకం. ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.టీక్యూడబ్ల్యుఎల్ (TQWL)TQWL అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్. తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసినప్పుడు సీటు దొరకకపోతే ఈ స్టేటస్ వస్తుంది. తత్కాల్ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో, TQWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు GNWL కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణం ప్రారంభమయ్యే వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అయితే మీ డబ్బు రీఫండ్ అవుతుంది.యూటీఎస్ (UTS)UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాల కోసం ఉపయోగించే టికెట్ విధానం. సాధారణంగా చిన్న దూర ప్రయాణాలు లేదా రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. UTS టికెట్లను కౌంటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రద్దీ సమయాల్లో ఈ కోచ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.ఈ-క్యాటరింగ్ఈ-క్యాటరింగ్ అనేది ప్రయాణికులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి, ప్రయాణ సమయంలో దానిని తమ సీటు వద్దకే తెప్పించుకునేందుకు వీలు కల్పించే ఒక సర్వీస్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివిధ రెస్టారెంట్ల నుంచి భోజనాన్ని సెలక్ట్ చేసుకుని, రైలు ప్రయాణ సమయంలో స్టేషన్ వద్ద మీరున్న చోటుకే డెలివరీ పొందవచ్చు. లాంగ్ జర్నీ సమయంలో తాజా, రుచికరమైన ఆహారం (ప్రాంతీయ వంటకాలు) రుచి చూడవచ్చు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుLHB అంటే లింకే హోఫ్మాన్ బుష్. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రైల్వే కోచ్‌లు. పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి. ప్రయాణ సమయంలో తక్కువ కుదుపులు ఉండటం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రధానంగా LHB కోచ్‌లను ఉపయోగిస్తున్నారు.వికల్ప్ పథకంవికల్ప్ పథకం అనేది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించే ప్రత్యేక సదుపాయం. మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అధిక రద్దీ ఉన్న రోజుల్లో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.భారతీయ రైల్వేలో ఉపయోగించే ఈ ముఖ్యమైన పదాల అర్థం తెలుసుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. RAC, GNWL, TQWL వంటి స్టేటస్‌ల అర్థం తెలిసి ఉంటే మీ టికెట్ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే UTS, E-Catering, LHB కోచ్‌లు, వికల్ప్ పథకం వంటి సదుపాయాల గురించి అవగాహన ఉండటం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతి రైలు ప్రయాణికుడు ఈ పదాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ.. -
రైలు ఆలస్యమైతే.. ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్!
రైలు ప్రయాణాలు ఆలస్యమైతే ప్రయాణికులకు అసహనం కలుగుతుంది. గంటల తరబడి స్టేషన్లో వేచి ఉండడం, అనౌన్స్మెంట్లు వినడం, టైమ్ చూసుకుంటూ ఆందోళన చెందడం చాలా మందికి సాధారణ అనుభవమే. ఇలాంటి పరిస్థితుల్లో భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు ఊరట కలిగించే ఒక సదుపాయాన్ని అందిస్తోంది.నియమాల ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు నిర్ణీత సమయానికి.. రెండు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచిత భోజనం అందించడం జరుగుతుంది. ఉదయం అయితే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్, సాయంత్రం లేదా రాత్రి అయితే డిన్నర్ అందిస్తారు.ఫుడ్ మెనూ ప్రకారం..టీ / కాఫీ➤టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు➤మిల్క్ క్రీమర్, షుగర్ లేదా షుగర్-ఫ్రీ సాచెట్లుబ్రేక్ఫాస్ట్ / సాయంత్రం స్నాక్స్➤4 బ్రెడ్ స్లైసులు (వైట్ లేదా బ్రౌన్)➤బటర్➤ఫ్రూట్ జ్యూస్ లేదా డ్రింక్➤టీ లేదా కాఫీలంచ్ / డిన్నర్➤అన్నం + పప్పు (దాల్)➤రాజ్మా లేదా చోలే➤పచ్చడి ప్యాకెట్➤లేదా 7 పూరీలు + మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ➤ఉప్పు, మిరియాల ప్యాకెట్లు కూడా ఉంటాయిఇది ప్రయాణికులు కొంత సౌకర్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా.. రైలు మూడు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ రీఫండ్ ప్రక్రియను కూడా ఆన్లైన్ బుకింగ్ చేసిన అదే ప్లాట్ఫార్మ్ ద్వారా సులభంగా పొందవచ్చు.దీర్ఘకాలిక ఆలస్యాల సమయంలో వెయిటింగ్ హాల్స్‌ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని స్టేషన్లలో ఫుడ్ కౌంటర్లు కూడా ఎక్కువ సమయం వరకు తెరిచి ఉంటాయి, తద్వారా ప్రయాణికులకు అవసరమైన ఆహారం అందుబాటులో ఉంటుంది. -
రైల్లో న్యూస్ పేపర్ పరచుకుని పడుకున్నా: సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ భారతీయ రైల్వేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వందేభారత్ రైల్లో ప్రయాణించిన ఆయన ఇండియన్ రైల్వేస్ అభివృద్ధిని ప్రశంసించారు. ఇంత నాణ్యమైన ప్రయాణాన్ని అందిస్తున్నందుకు భారతీయ రైల్వేకు ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ఆహారం అద్భుతమైన సిబ్బంది సేవలు ఉన్నాయని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గతంలో తాను టికెట్ బుక్ చేసుకోవడానికే ఇబ్బందులు పడేవాడినని సోనూ సూద్ వెల్లడించారు. నాగ్‌పూర్ నుంచి ముంబయి వెళ్లేటప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. తాను న్యూస్ పేపర్ కింద పరచుకుని రైళ్లలో ప్రయాణించిన రోజులు కూడా ఉన్నాయని సోనూసూద్ అన్నారు. భారతీయుల ప్రయాణంలో క్వాలిటీ చూసి గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైల్వేశాఖను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ మాటలతో రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. अभिनेता Sonu Sood ने Vande Bharat Express में यात्रा का अपना अनुभव साझा करते हुए ट्रेन की आधुनिक सुविधाओं, स्वच्छता और आरामदायक सफर की सराहना की। 🚆A heartfelt thanks to @SonuSood for sharing this experience and highlighting the positive changes #SonuSood #IndianRailways pic.twitter.com/x24QbaFki6— BHARAT SAMVAD (@Bhaaratsamvad) June 13, 2026 -
కారును ట్రైన్లో ఎలా పంపాలంటే..?
ఉద్యోగం, చదువులు లేదా ఇతరత్రా కారణాల వల్ల కొత్త నగరానికి మారాల్సి వచ్చినప్పుడు, చాలామందికి ఎదురయ్యే సమస్య కారును తరలించడం. చిన్న దూరాలకు అయితే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు, కానీ.. వందలు లేదా వేల కిలోమీటర్లు స్వయంగా డ్రైవ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇండియన్ రైల్వే కార్ పార్సిల్ సేవను ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేస్ తమ పార్సిల్ సేవల ద్వారా వాహనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. దీనికోసం వాహన యజమానులు తాము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో.. సమీప రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయంలో బుక్ చేయాలి. ఆ తరువాత ప్రత్యేక క్యారియర్ బోగీలో కారును లోడ్ చేసి గమ్యస్థానానికి పంపిస్తారు. కారును పంపే వ్యక్తి అదే రైలులో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 1,400 కిలోమీటర్లకు పైబడిన దూరాలకు ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కారును రైలులో పంపించాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు, చిరునామాకు సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలి. అలాగే రైల్వే పార్సిల్ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి.బుకింగ్ ప్రక్రియలో మొదట.. వాహన లోడింగ్, అన్లోడింగ్ సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్లను గుర్తించాలి. ఆ తరువాత అవసరమైన పత్రాలతో పార్సిల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. అధికారులు వాహనాన్ని పరిశీలించి, దాని బరువు, పరిమాణం, ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత కారును ప్రత్యేక బోగీలో భద్రంగా తరలిస్తారు.రవాణా ఖర్చులు అనేవి వాహనం రకం, ప్రయాణ దూరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వరకు ఒక చిన్న కారును తరలించడానికి సుమారు రూ.8,000 నుంచి రూ.13,000 వరకు ఖర్చవుతుంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు ఈ ఖర్చు రూ.13,000 నుంచి రూ.19,000 వరకు ఉండవచ్చు. ఖచ్చితమైన ఛార్జీలను సంబంధిత రైల్వే పార్సిల్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు.కారును అప్పగించే ముందు దానిని శుభ్రపరచడం, వివిధ కోణాల్లో ఫోటోలు తీసుకోవడం, వ్యక్తిగత వస్తువులను తొలగించడం, ఇంధన స్థాయిని తక్కువగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనితో పాటు అలారం సిస్టంను కూడా నిలిపివేయడం మంచిదని చెబుతారు. మొత్తం మీద దూర ప్రాంతాలకు కారును తరలించడానికి రైల్వే కార్ పార్సిల్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టమవుతోంది. -
ఐఆర్సీటీసీ.. మూడు కోట్ల అకౌంట్లు క్లోజ్!
రైల్వే ప్రయాణికులకు మరింత పారదర్శకమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మెగా ఆపరేషన్‌కు తెరలేపింది. ఒకవైపు కన్ఫర్మ్డ్ టిక్కెట్ల కోసం సామాన్య ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న టికెటింగ్ మాఫియాకు చెక్ పెడుతూ, మరోవైపు రైళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను నిలిపివేయడంతో పాటు రైల్వే వంటశాలల్లో నాణ్యతను పర్యవేక్షించడానికి ఏఐ కెమెరాలను తీసుకొచ్చింది.టికెట్ దందాపై చర్యలుసాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకకుండా బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ముఠాలు, దళారీల ఆట కట్టించేందుకు ఐఆర్సీటీసీ డిజిటల్ నిఘాను తీవ్రం చేసింది. ఇందులో భాగంగా తీసుకున్న కీలక చర్యలు చేపట్టింది.డిజిటల్ గుర్తింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3 కోట్లకు పైగా అనుమానాస్పద వినియోగదారుల ఖాతాలను ఐఆర్సీటీసీ బ్లాక్ చేసింది.వీటితో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో ఆరు కోట్ల ఐడీల ప్రామాణికతను తనిఖీ చేయడానికి వాటిని కఠినమైన ధ్రువీకరణ పరిధిలో ఉంచింది.గత ఏడాది కాలంలో అక్రమ బుకింగులకు కారణమవుతున్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు.నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించి 501 అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి.800 కిచెన్లలో ఏఐ కెమెరాలురైలు ప్రయాణంలో లభించే భోజనంపై తరచూ వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా బేస్ కిచెన్లలో (వంటశాలలు) పరిశుభ్రత, కార్యాచరణ లోపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు 2,394 ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలను మోహరించింది.తొమ్మిది రకాల ఉల్లంఘనలను పట్టేసే టెక్నాలజీఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ వంటశాలల్లో జరిగే 9 రకాల ప్రధాన ఉల్లంఘనలను ఇట్టే పసిగడుతుంది. వంట చేసేవారు తలకు క్యాప్ పెట్టుకోకపోవడం, చేతి తొడుగులు (గ్లౌజెస్) ధరించకపోవడం, వంటగదిని సరిగ్గా తుడవకపోవడం వంటి లోపాలతో పాటు వంటశాలల్లో ఎలుకలు, ఈగలు, బొద్దింకల కదలికలను కూడా ఈ కెమెరాలు క్షణాల్లో గుర్తిస్తాయి.టూ-అవర్స్ డెడ్‌లైన్.. వార్ రూమ్ పర్యవేక్షణఈ సాంకేతికత ఎంతటి చిన్న వస్తువునైనా, లోపాన్నైనా సులభంగా గుర్తించగలదని ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘వంటశాలల్లో పరిశుభ్రత లోపిస్తే ఏఐ కెమెరాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) హెచ్చరికలను జారీ చేస్తాయి. ఈ అలర్ట్ నేరుగా సంబంధిత కిచెన్ మేనేజర్‌కు వెళ్తుంది. ఐఆర్సీటీసీ ప్రత్యేక వార్ రూమ్ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలర్ట్ వచ్చిన రెండు గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వార్ రూమ్ పర్యవేక్షణ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం వంటశాలల్లో హెడ్ క్యాప్‌లు ధరించకపోవడం అనేదే అత్యంత ప్రాథమిక, ప్రధాన ఉల్లంఘనగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్‌కు ఫుల్ క్రేజ్! -
రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి?
భారతీయ రైల్వే సాంకేతిక విప్లవంలో మరో అడుగు ముందుకేస్తూ ఇటీవల విడుదల చేసిన సూపర్ యాప్ ‘రైల్‌వన్’ ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు సాధారణ రిజర్వేషన్లకు ఒక యాప్, జనరల్ (అన్రిజర్వ్డ్) టికెట్లకు మరో యాప్, ఫిర్యాదులకు వేరొక యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) రూపొందించిన ఈ రైల్‌వన్ యాప్.. అసలు గతంలో ఉన్న ఐఆర్సీటీసీ యాప్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? రైల్వే శాఖ దీన్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చింది? అనే పూర్తి వివరాలపై విశ్లేషణ.అసలు రైల్‌వన్ యాప్‌ను రైల్వే శాఖ ఎందుకు తీసుకొచ్చింది?గతంలో రైల్వే సేవలు వేర్వేరు డిజిటల్ విభాగాల కింద విడిపోయి ఉండేవి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధిగమించడానికి మంత్రిత్వ శాఖ ఈ సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది.రిజర్వేషన్ల కోసం IRCTC Rail Connect, జనరల్ టికెట్ల కోసం UTS, ఫిర్యాదుల కోసం Rail Madad ఇలా ఫోన్ నిండా యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్ స్పేస్‌ను ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ప్రయాణికుడు ఒక్కసారి బయోమెట్రిక్ లేదా mPIN తో లాగిన్ అయితే చాలు అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు.రైల్వే వ్యవస్థ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా నిమిషానికి లక్షలాది బుకింగ్స్, ఎంక్వైరీలను తట్టుకునేలా అత్యంత వేగవంతమైన, యాడ్‌ఫ్రీ ఇంటర్ఫేస్ను అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు.ఐఆర్సీటీసీ.. రైల్‌వన్ మధ్య ప్రధాన తేడాలుచాలా మంది ప్రయాణికులు ఈ రెండు యాప్‌లు ఒకటే అని భావిస్తుంటారు. కానీ వీటి పనితీరు, సేవల పరిధిలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.ఫీచర్ఐఆర్సీటీసీ (రైల్ కనెక్ట్)రైల్ వన్నిర్వహణఐఆర్సీటీసీ ప్రభుత్వ అనుబంధ కార్పొరేట్ సంస్థ).క్రిస్ (రైల్వే శాఖ పరిధిలోని ఐటీ విభాగం).టికెట్ల లభ్యతప్రధానంగా రిజర్వ్డ్ రైలు టికెట్లు (కన్ఫర్మ్డ్, తత్కాల్) మాత్రమే.రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్‌ఫారమ్ టికెట్లు అన్నీ లభిస్తాయి.రిజర్వేషన్ ప్రక్రియఐఆర్సీటీసీ సొంత గేట్‌వే, లాగిన్ ద్వారా బుకింగ్ జరుగుతుంది.ఐఆర్సీటీసీ అథరైజ్డ్ పార్ట్నర్లుగా ఉంటూనే దాని సర్వర్‌ను అనుసంధానించి వేగంగా బుక్ చేస్తుంది.లైవ్ ట్రాకింగ్, రూట్లుకొంత పరిమితంగా ఉంటుంది లేదా వేరే థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాలి.లైవ్ రన్నింగ్ స్టేటస్, కోచ్ పొజిషన్, స్టేషన్ క్యూఆర్ కోడ్స్ ఇన్-బిల్ట్‌గా ఉంటాయి.రైల్ మదద్ఈ యాప్‌లో ఫిర్యాదుల వ్యవస్థ నేరుగా సమగ్రంగా ఉండదు.యాప్‌లోనే ఇన్-బిల్ట్‌గా ఫిర్యాదులు చేయడం, వాటి స్టేటస్ ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.యూజర్ అనుభవంయాప్లో యాడ్స్ ఎక్కువగా రావడం వల్ల కొన్నిసార్లు పేజీ లోడింగ్ నెమ్మదిస్తుంది.యాప్ ఫ్రీ ఇంటర్ఫేస్, బయోమెట్రిక్ లాగిన్ చాలా వేగంగా పనిచేస్తుంది.రైల్‌వన్ యాప్‌లోని టాప్ ఫీచర్లుపేపర్లెస్ అన్రిజర్వ్డ్ టికెటింగ్: రైల్వే స్టేషన్ల్లో ఉండే RailOne QR Codeలను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్లు పొందవచ్చు. అన్రిజర్వ్డ్, నప్లాట్ఫారమ్ టికెట్లపై కొన్ని సందర్భాల్లో ప్రమోషనల్ డిస్కౌంట్లు (ఉదాహరణకు 3% వరకు) కూడా లభిస్తాయి.ఫుడ్ ఆర్డర్: ప్రయాణంలో ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ వెరిఫైడ్ పార్ట్నర్ వెండర్స్ నుంచి నేరుగా మీ సీటుకే భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు.ఆర్-వాలెట్: ఆధార్ అనుసంధానిత డిజిటల్ వాలెట్ ద్వారా అత్యంత సురక్షితంగా క్షణాల వ్యవధిలో పేమెంట్లు పూర్తి చేయవచ్చు.మల్టీ ల్యాంగ్వేజీ: ఇంగ్లీష్‌తో పాటు తెలుగు సహా 10కి పైగా ప్రాంతీయ భాషల్లో ఈ యాప్‌ను వాడుకునే సదుపాయం ఉంది.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం!
ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు ఇచ్చినా.. వారికి కేటాయించిన బెర్త్‌లు అందించకపోవడం, ఇండియన్ రైల్వే సేవల లోపమే అని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. భోజ్‌పూర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ నుంచి బీహార్‌లోని ఆరా వరకు వెళ్లాల్సిన నలుగురు ప్రయాణికులు.. ఎల్టీటీ పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వీరు రైలెక్కిన తరువాత తమకు కేటాయించిన బెర్త్‌లపై రైల్వే సిబ్బంది ఉండటం గమనించారు. తమకు కేటాయించిన సీట్లను ఖాళీ చేయాలని కోరినా.. ఎవరూ స్పందించలేదు. దీంతో వారు తమ గమ్యస్థానం వచ్చేవరకు నిలబడే ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ..తాము సీట్లను రిజర్వ్ చేసుకున్నప్పటికీ.. నిలబడే ప్రయాణం చేయడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నారు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించడానికంటే ముందు.. రైల్వే హెల్ప్‌లైన్, రైల్వే సేవా, రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేశారు. తమకు ఎస్ఎమ్ఎస్ ద్వారా కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ, ప్రయాణ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.బక్సర్ స్టేషన్ వద్ద వచ్చిన టికెట్ ఎగ్జామినర్ (TTE) వద్ద కూడా సమస్యను వివరించారు. అయితే.. రైలులో భారీ రద్దీ ఉందని, ఎలాగోలా మేనేజ్ చేసుకోండని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ వ్యవహారం రైల్వే ప్రయాణికుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించిందని కోర్టు అభిప్రాయపడింది.ఇక రైల్వే శాఖ మాత్రం.. ఈ వివాదం శాంతి భద్రతలకు సంబంధించినదని, ఇది ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) పరిధిలోకి వస్తుందని వాదించింది. తమవైపు నుంచి ఎలాంటి సేవల లోపం జరగలేదని, ఫిర్యాదుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అయితే.. కోర్టు ప్రయాణికులు సమర్పించిన టికెట్లు, ఫిర్యాదు రికార్డులు, మెసేజ్‌లు, ఫోటోలను పరిశీలించిన తరువాత రైల్వే శాఖ సేవలలో స్పష్టమైన లోపం ఉందని తేల్చింది. ప్రయాణికులకు కన్ఫర్మ్ చేసిన బెర్త్‌లు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది.రూ.20,000 పరిహారందీంతో నార్త్ సెంట్రల్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కలిసి ప్రయాణికులకు టికెట్ మొత్తానికి (రూ.1,876.80) 8 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా రూ.20,000 పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం 60 రోజుల్లో చెల్లించకపోతే, 10 శాతం వడ్డీతో చట్టపరమైన చర్యల ద్వారా వసూలు చేసుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పును చాలామంది ప్రశంసించారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వే శాఖ బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. కాబట్టి ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైతే.. సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి, పరిష్కారం పొందవచ్చు.ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్! -
కాజీపేట @200 ఇంటర్సిటీ రైళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఇక్కడ రైళ్ల తయారీ ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా రాబోయే ఐదేళ్లలో కాజీపేట యూనిట్ నుంచి 200 ఇంటర్సిటీ రైళ్లను ఉత్పత్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ యూనిట్ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపై కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఉన్నతాధికారులతో కలిసి గురువారం సమీక్షించారు. కాజీపేట యూనిట్లో ప్రధానంగా ఇంటర్సిటీ రైళ్ల తయారీపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను విస్తరించడంలో భాగంగా రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది.300 కిలోమీటర్లలోపు ప్రయాణాలకే.. కొత్తగా తయారయ్యే ఈ రైళ్లను ప్రధానంగా 300 కిలోమీటర్ల లోపు ఉన్న నగరాలు, పట్టణాలను కలుపుతూ షటిల్ సర్వీసులలా నడపనున్నారు. తక్కువ దూర ప్రయాణాలకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, దైనందిన ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రైళ్లకు ఎక్కువ స్టాప్‌లు ఇవ్వనున్నారు.20 కోచ్‌లు.. హైటెక్ వసతులు.. ఒక్కో రైలులో 20 కోచ్‌లు ఉంటాయి. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో వీటిని డిజైన్ చేస్తున్నారు. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్ సదుపాయాలతోపాటు ప్రతి కోచ్‌కు రెండు మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు కుదుపులు లేని సాఫీ ప్రయాణాన్ని అందించేందుకు ఆధునిక కప్లర్లు, బోగీలను ఈ రైళ్లలో వినియోగిస్తున్నారు.గంటకు 130 కి.మీ. వేగం.. పర్యావరణ హితం.. ఈ ఇంటర్సిటీ రైళ్లు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిలో అత్యాధునిక రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రయాణంలో బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు పంపుతారు. దీనివల్ల ఇంధనం ఆదా అవడంతోపాటు, కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. సామాన్యులకు చౌకైన, పరిశుభ్రమైన ప్రయాణాన్ని అందించడం ద్వారా రోడ్డు రవాణా మీదున్న ట్రాఫిక్ భారాన్ని రైల్వే నెట్వర్క్పైకి మళ్లించాలన్నది రైల్వేశాఖ ప్రధాన ఉద్దేశం. -
బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
-
కేంద్రం సంచలన నిర్ణయం.. రైల్వేలో ఉద్యోగాల కోత
సాక్షి, అమరావతి: ప్రైవేటు కంపెనీలకే పరిమితమైన ఉద్యోగాల కోత.. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలకూ పాకింది. తాజాగా రైల్వేశాఖలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30వేల పోస్టులను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2026, ఏప్రిల్ 1 నాటికి మంజూరైన పోస్టుల్లో 30వేల పోస్టులను రద్దు చేయాలని రైల్వే శాఖ అన్ని జోన్ల జనరల్ మేనేజర్(జీఎం)లను తాజాగా ఆదేశించింది.రద్దు చేసిన పోస్టుల్లో ప్రస్తుతం ఖాళీగా, ఉద్యోగులు ఉన్న పోస్టులూ ఉన్నాయి. రద్దు చేసిన పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తారు. ఆ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలోకి వస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండు వేల పోస్టులను తగ్గించొచ్చని రైల్వే శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దయ్యే పోస్టుల్లో ఎక్కువ క్లరికల్ విభాగం, మెయింటెనెన్స్ విభాగం పోస్టులు ఉన్నాయి. ఇక నుంచి ఏటా 2%నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే దిశగా పోస్టులు రద్దు చేయాలని గతేడాది రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 2 శాతం చొప్పున పోస్టులు రద్దు చేయాలని ప్రణాళిక రూపొందించింది. రైల్వే శాఖలో మంజూరైన పోస్టుల్లో దేశవ్యాప్తంగా 3.5లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఏటా 2 శాతం పోస్టుల చొప్పున రద్దు చేస్తారు. కొత్త పోస్టులు మంజూరు చేయరు. మొదటి దశలో క్లరికల్, నిర్వహణ విభాగాల పోస్టులనే రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.ఉద్యోగాల కోత ప్రణాళికలో భద్రతా విభాగం పోస్టులను చేర్చలేదు. కాగా రైల్వే శాఖ నిర్ణయాన్ని రైల్వే ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నిర్వహణ విభాగంలో పోస్టుల రద్దుతో రైల్వే సేవలు మందగిస్తాయని, ప్రయాణికులకు అసౌకర్యంతోపాటు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం బాగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నాయి. -
ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ
న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులు సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులకు ఆమోదం తెలిపింది. 2026 ఏప్రిల్ 15 నుంచి 2026 జులై 15 వరకు మొత్తం 908 వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణయించారు. ఇవి 18,262 ట్రిప్స్ నడుస్తాయి. వాటిలో 660 రైళ్లను ఇప్పటికే నోటిఫై చేశారు. ఇవి 11,294 ట్రిప్స్ కు సంబంధించినవి. దీని వల్ల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, మీ జర్నీ ప్లాన్‌ను రూపొందించడం సులభమవుతుంది. సెలవులు, పండుగలు, పీక్ ట్రావెల్ సమయాల్లో ఇటువంటి ప్రత్యేక సర్వీసులు ఎంతో కీలకంగా మారతాయి. వేసవి ప్రత్యేక రైళ్ల నిర్వహణ భారతీయ రైల్వేల అన్ని ప్రధాన జోన్లలో జరుగుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే 124 రైళ్లు (1,184 ట్రిప్స్)కు ఆమోదం తెలిపి, 76 రైళ్లు (324 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్రన్ రైల్వే 106 రైళ్లు (2,078 ట్రిప్స్) ఆమోదం తెలిపి 92 రైళ్లు (1,667 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (2,245 ట్రిప్స్) ఆమోదం తెలిపి 62 రైళ్లు (1,878 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్తర్న్ రైల్వే 76 రైళ్లు (2,090 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (1,535 ట్రిప్స్) నోటిఫై చేసింది.సెంట్రల్ రైల్వే 74 రైళ్లు (3,082 ట్రిప్స్) ఆమోదం తెలిపి 70 రైళ్లు (2,238 ట్రిప్స్) నోటిఫై చేసింది.సదర్న్ రైల్వే 72 రైళ్లు (558 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (133 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ సెంట్రల్ రైల్వే 64 రైళ్లు (2,711 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (1,060 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ సెంట్రల్ రైల్వే 54 రైళ్లు (1,163 ట్రిప్స్) ఆమోదం తెలిపి 46 రైళ్లు (688 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఈస్ట్రన్ రైల్వే 52 రైళ్లు (814 ట్రిప్స్) ఆమోదం తెలిపి 34 రైళ్లు (477 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ కోస్ట్ రైల్వే 28 రైళ్లు (410 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (88 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్ సెంట్రల్ రైల్వే 28 రైళ్లు (408 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (192 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్రన్ రైల్వే 24 రైళ్లు (392 ట్రిప్స్) ఆమోదం తెలిపి 10 రైళ్లు (276 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఫ్రంట్ియర్ రైల్వే 24 రైళ్లు (220 ట్రిప్స్) ఆమోదం తెలిపి 20 రైళ్లు (141 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్రన్ రైల్వే 20 రైళ్లు (276 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (250 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 10 రైళ్లు (122 ట్రిప్స్) ఆమోదం తెలిపి 8 రైళ్లు (70 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (509 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (277 ట్రిప్స్) నోటిఫై చేసింది.వేసవి ప్రత్యేక రైళ్ల వల్ల పీక్ సీజన్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ తగ్గే అవకాశం ఉంది. అదనపు బెర్తులు లభించడంతో ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అధిక డిమాండ్ ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి. -
IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వే ఒక కీలక మార్పు ప్రవేశపెట్టింది. చివరి నిమిషంలో ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు మార్చుకోవచ్చు. గతంలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు కలిగేవి.బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడంలో IRCTC కొంత స్వేచ్ఛ కల్పించింది. ముఖ్యంగా ట్రాఫిక్, ఆలస్యం వంటి కారణాల వల్ల ఎంపిక చేసుకున్న స్టేషన్‌కు సమయానికి చేరుకోలేని పరిస్థితుల్లో ఈ సదుపాయం సహాయపడుతుంది. ఈ సదుపాయం ప్రధానంగా IRCTC ద్వారా బుక్ చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ఒకసారి స్టేషన్ మార్చిన తర్వాత, తప్పనిసరిగా కొత్తగా ఎంచుకున్న స్టేషన్ నుంచే రైలులో ఎక్కాలి.ఈ సౌకర్యాన్ని ఉపయోగించేటప్పుడు.. కొత్తగా ఎంపిక చేసిన స్టేషన్ నుంచి కూడా రైలును మిస్ అయితే, టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం అవసరం. ఈ విషయాన్ని వినియోగదారులు తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం' -
ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే!
ఇండియన్ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 8,500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సాధారణంగా.. ఈ స్టేషన్లలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం చేస్తారు. అయితే.. ఒక రైల్వే స్టేషన్ మాత్రం.. అక్కడికి వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్ట్, వీసా అవసరం. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇది నిజం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ సమీపంలో 'అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్'.. భారతదేశంలో చివరి రైల్వే స్టేషన్‌గా పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ స్టేషన్ ద్వారా పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్తారు. అందువల్ల.. ఈ స్టేషన్లో ప్రవేశించాలంటే భారతీయ పౌరులు కూడా తప్పనిసరిగా పాకిస్తాన్ వీసా కలిగి ఉండాలి.ఇక్కడ రూల్స్ అన్నీ కూడా చాలా కఠినంగా అమలు చేస్తారు. ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ స్టేషన్లోకి ప్రవేశిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫారిన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించినవారికి జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేషన్‌ను సందర్శించాలనుకునే వారు ముందుగానే అన్ని అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!ఈ స్టేషన్ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుంది. ఇది భారతదేశం, పాకిస్తాన్ మధ్య ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అయితే, కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ రైలు కొన్ని సందర్భాల్లో నిలిపివేయడం కూడా జరిగింది. అటారి స్టేషన్లో భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి. ఇక్కడ కూలీలు కూడా ఉండరు. కాబట్టి ప్రయాణికులు తమ లగేజ్ తామే మోసుకోవాల్సి ఉంటుంది. అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ చిన్నదే అయినప్పటికీ.. మంచి సౌకర్యాలతో ఉంటుంది. -
88 శాతం : ఐఆర్సీటీసీలో ఆన్లైన్ బుకింగ్ జోరు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీ (IRCTC)లో ఆన్లైన్ టికెట్ల బుకింగ్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు, ఆన్లైన్ రైలు టిక్కెట్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగాయని, మొత్తం రిజర్వ్డ్ బుకింగ్‌లలో 88 శాతం, అంటే 48.25 కోట్లకు పైగా టిక్కెట్లు డిజిటల్‌గా బుక్ అయ్యాయని ప్రభుత్వం బుధవారం తెలిపింది.లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ, ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ బుకింగ్‌ల వైపు మొగ్గు పెరుగుతోందన్నారు. తద్వారా రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడంతోపాటు, ప్రయాణ సమయం, ఖర్చులను ఆదా చేయడం ద్వారా ప్రయాణికులకు టిక్కెటింగ్ సులభతరం మైందన్నారు.ఐఆర్సీటీసీ అందిస్తున్న ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం భారతీయ రైల్వేల అత్యంత ప్రయాణీకుల స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ఆన్లైన్ టిక్కెటింగ్ కోసం ఐఆర్సీటీసీ గణనీయమైన ఖర్చు చేస్తోందనీ, టిక్కెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, ఉన్నతీకరణ విస్తరణకు అయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి, ఐఆర్సిటిసి చాలా నామ మాత్రపు రుసుమును వసూలు చేస్తుందని మంత్రి తెలిపారు.ప్రస్తుతం అత్యధిక టిక్కెట్లు డిజిటల్‌గా బుక్ అవుతుండటంతో, ఆన్లైన్ వ్యవస్థ భారతీయ రైల్వే చేపట్టిన అత్యంత ప్రయాణీకుల-స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటిగా మారిందని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి,దుర్వినియోగాన్ని నివారించడానికి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 3 करोड़ से ज्यादा फेक अकाउंट IRCTC से हटाए गए हैं। आज जेनुइन पैसेंजर्स को कंफर्म टिकट मिलने लगा है: माननीय रेल मंत्री @AshwiniVaishnaw जी pic.twitter.com/FhaP5rAwGm— Ministry of Railways (@RailMinIndia) March 25, 2026 > ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు మంత్రి వివరణలోని మరికొన్ని విశేషాలుఆధార్ ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు.గత ఏడాదిల జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నకిలీ ఖాతాల వాడకాన్ని పరిమితం చేయడానికి,నిజమైన ప్రయాణీకులకు టిక్కెట్లు లభించే అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడింది.2025 సంవత్సరంలో, 3.04 కోట్ల వినియోగదారుల ఖాతాలులను రద్దు చేయగా, 2.94 కోట్ల వినియోగదారుల ఖాతాలు పునఃధృవీకరణ ఎంపికతో తాత్కాలికంగా నిలిపివేశారు. (టెలిగ్రామ్‌లో ఎర, క్రిప్టోలో చెల్లింపులు, కట్ చేస్తే!)అయితే గత ఏడాది జనవరి నుంచి ఈ ఫిబ్రవరి 28 మధ్య కాలంలో, 1,80,474 వినియోగదారుల ఖాతాలు తిరిగి యాక్టివ్ చేశారు. సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి ఐఆర్సీటీసీ తన సాంకేతిక వ్యవస్థలను కూడా బలోపేతం చేసింది. దీని యాంటీ-బాట్ టెక్నాలజీ సుమారు 64 శాతం హానికరమైన ట్రాఫిక్‌ను నిరోధించగలదు, తద్వారా నిజమైన వినియోగదారులకు బుకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి 28, 2026 నాటికి 13,023 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లు అరికట్టామని వైష్ణవ్ వివరించారు. సమగ్ర డేటా విశ్లేషణ ద్వారా బుకింగ్ సరళిని ,వినియోగదారుల రిజిస్ట్రేషన్లను పరిశీలించి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి నిరంతర పర్యవేక్షణ భవిష్యత్తుల కూడా కొనసాగుతుందన్నారు. -
రైలు రంగుల్లో ‘ప్రాణ రక్షణ’.. ఇది తెలిస్తే జ్ఞానం రెండింతలు!
భారతీయ రైల్వే నడిపే రైళ్లు కేవలం పట్టాలపై పరిగెత్తే ఇనుప బోగీలు మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన ఇంజనీరింగ్ మాయాజాలం. మనం స్టేషన్లో నిలుచున్నప్పుడు రకరకాల రంగుల రైళ్లను చూస్తుంటాం. చాలామంది ఇవి కేవలం అందం కోసం వేసిన రంగులని అనుకుంటారు. కానీ ఆ రంగుల వెనుక రైల్వే శాఖ దాచిన రహస్యాలు, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కీలక సమాచారం తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రతి రంగు ఒక ప్రత్యేక సందేశాన్ని ఇస్తుంది.నీలి రంగు: సామాన్యుడి సవారీదశాబ్దాలుగా మన కళ్లముందు కదలాడుతున్న నీలి రంగు భోగీలను 'ఐసీఎఫ్’ (ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లు అంటారు. ఇవి పూర్తిగా ఇనుముతో తయారవుతాయి. అందుకే ఇవి బరువు ఎక్కువ, వేగం తక్కువ (గంటకు గరిష్టంగా 110 కి.మీ). ఈ కోచ్‌లలో పాత తరం ‘ఎయిర్ బ్రేక్’ వ్యవస్థ ఉంటుంది. భద్రత పరంగా ఇవి పర్వాలేదనిపించినా, ప్రమాదం జరిగినప్పుడు ఈ భోగీలు ఒకదానిపైకి మరొకటి ఎక్కిపోయే ప్రమాదం ఉంది. అందుకే రైల్వే శాఖ వీటిని మెల్లగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది.ఎరుపు రంగు: వేగానికి మారుపేరు రాజధాని, శతాబ్ది తదితర హై-స్పీడ్ రైళ్లలో కనిపించే ఎరుపు లేదా మెరూన్ రంగు భోగీలు ‘ఎల్‌హెచ్‌బీ’ (లింకే హాఫ్మన్ బుష్) రకానికి చెందినవి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారవుతాయి. అందుకే బరువు తక్కువగా ఉండి గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లగలవు. వీటిలో ‘యాంటీ టెలిస్కోపిక్’ సాంకేతికత ఉంటుంది. అంటే ప్రమాదం జరిగినా భోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కవు, దీనివల్ల ప్రాణనష్టం చాలా వరకు తగ్గుతుంది. అందుకే ఎరుపు రంగు రైలు అంటే అది అత్యంత సురక్షితమైనదని అర్థం.తెలుపు రంగు: విమాన స్థాయి సౌకర్యాలువందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లలో మెరిసిపోయే తెలుపు రంగు కోచ్‌లు భారతీయ రైల్వే వేగవంతమైన ప్రగతికి చిహ్నాలు. వీటిని ‘ట్రైన్ సెట్స్’ అని పిలుస్తారు. వీటికి విడిగా ఇంజిన్ ఉండదు. ప్రతి ప్రత్యామ్నాయ కోచ్‌లోనూ మోటార్లు ఉంటాయి. ఇవి అత్యంత ఆధునికమైనవి, స్వయంచాలక తలుపులు, జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థతో విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయి.రంగును అనుసరించి వేగం?ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! రంగు అనేది ఆ కోచ్ ఏ మెటీరియల్‌తో తయారైందో, అందులో ఎలాంటి బ్రేకింగ్ సిస్టమ్ ఉందో మాత్రమే చెబుతుంది. కానీ రైలు వేగం అనేది ఆ మార్గంలోని పట్టాల సామర్థ్యం (Track Capacity),సిగ్నలింగ్ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, ఎరుపు, తెలుపు రంగు భోగీలు ఉన్న రైళ్లు సాంకేతికంగా ఎక్కువ వేగంతో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని మనం గుర్తించవచ్చు.ప్రయాణికులు ఏం గమనించాలి?మనం ప్రయాణించే రైలు రంగును బట్టి అది ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో ముందే ఊహించవచ్చు. నీలి రంగు కంటే ఎరుపు రంగు కోచ్‌లలో కుదుపులు తక్కువగా ఉంటాయి. తెలుపు రంగు రైళ్లు అత్యంత వేగంగా గమ్యాన్ని చేరుస్తాయి. గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు, మనం ప్రయాణించే రైలు వెనుక ఉన్న ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కూడా ముఖ్యమే.ఇది కూడా చదవండి: ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం -
ఐఆర్ఎఫ్సీ వాటా ఆఫర్.. స్పందించని ఇన్వెస్టర్స్
పీఎస్‌యూ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ)లో ప్రభుత్వం ఆఫర్ చేసిన 2 శాతం వాటా విక్రయానికి సరైన స్పందన లభించలేదు. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన 23.52 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా.. 22.34 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 94.98 శాతం స్పందన నమోదైంది. సంస్థాగత ఇన్వెస్టర్లు షేరుకి రూ. 104.12 సంకేత ధరలో బిడ్స్ వేశారు. వీటి విలువ రూ. 2,326 కోట్లుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు గురువారం విండో ఓపెన్ కానుంది.కాగా.. ప్రభుత్వం 2 శాతం వాటాకు సమానమైన 26.13 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అధిక డిమాండ్ కనిపిస్తే మరో 2 శాతం వాటాను సైతం విక్రయించేందుకు(గ్రీన్ షూ ఆప్షన్) అవకాశముంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 104 ఫ్లోర్ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 86.36 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్ -
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?
రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి అతిపెద్ద సమస్య టికెట్ కర్ఫర్మ్. పండుగలు, సెలవుల్లో ట్రైన్ టికెట్ కర్ఫర్మ్ అవ్వడం అనేది చాలా కష్టం. తత్కాల్ టికెట్లు సైతం కొన్నిసార్లు కష్టమైపోతాయి. అయితే ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా ఒకటి ఉంటుందని బహుశా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. దీనిని బుక్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?, ఎవరికి కేటాయిస్తారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా.. అనేది అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రిజర్వేషన్ విధానం. ఇది సాధారణ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే ఈ కోటా ద్వారా టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది.భారతీయ రైల్వే.. ప్రతిరోజూ అనేక మంది ప్రయాణికుల నుంచి అత్యవసర ప్రయాణ అభ్యర్థనలు స్వీకరిస్తుంది. అలాంటి సందర్భాల్లో.. ముఖ్యమైన వ్యక్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం కొన్ని సీట్లు ముందుగానే కేటాయిస్తుంది. ఈ సీట్లనే ఎమర్జెన్సీ కోటా అంటారు. ఇది ప్రతి రైలులో, ప్రతి క్లాస్‌లో ఉండకపోవచ్చు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని రైళ్లు, కొన్ని తరగతుల్లో మాత్రమే పరిమితంగా ఉంటుంది.రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ కోటా ప్రధానంగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ (HOR) హోల్డర్ల కోసం ఏర్పాటు చేశారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు, వారి అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ఈ కోటా ఉపయోగిస్తారు.ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా.. రైల్వే శాఖ ఇతర అత్యవసర అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో కుటుంబంలో మరణం, తీవ్రమైన అనారోగ్యం, ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిన పరిస్థితులు మొదలైనవి ఉన్నాయి. అంటే వీరికి కూడా ఎమర్జెన్సీ కోటా కింద సీటు అందిస్తారన్నమాట.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. భారతీయ రైల్వేకు ప్రతిరోజూ అనేక స్థాయిల నుంచి అనేక అభ్యర్థనలు వస్తుంటాయి. ఇందులో ఏ అభ్యర్థనకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాధాన్యతను 'వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్' అనే నియమావళి ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే.. పదవి, హోదా, అధికార స్థాయి ఆధారంగా ప్రాధాన్యత క్రమం ఉంటుంది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ కోటా సీట్లు ముందుగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ హోల్డర్లు & పార్లమెంట్ సభ్యుల స్వంత ప్రయాణానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా వారి హోదా ప్రకారం ఉన్న సీనియారిటీ క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లు ఇతర అభ్యర్థనలను పరిశీలించి.. ప్రయాణికుల అధికారిక హోదా, ప్రయాణ అత్యవసరత వంటి అంశాలను బట్టి కేటాయిస్తారు.ఎమర్జెన్సీ కోటా సెల్స్.. అనేవి జోనల్ & డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో, అలాగే కొన్ని ముఖ్యమైన నాన్ హెడ్‌క్వార్టర్ స్టేషన్లలో ఉంటాయి. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, రైల్వే బోర్డు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు కేవలం రాతపూర్వకంగా వచ్చిన అధికారిక అభ్యర్థనల ఆధారంగానే మంజూరు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టం చేసింది. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న, ముఖ్యమైన బాధ్యతలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సౌకర్యం.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
బడ్జెట్ 2026: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?
త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్-19 సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.ఆరేళ్ల నిరీక్షణకు తెర పడనుందా?రైల్వే రాయితీల పునరుద్ధరణపై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది.గతంలో ఉన్న రాయితీ వివరాలు..పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 40 శాతం రాయితీ.మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 50 శాతం రాయితీ.వర్తించే తరగతులు: స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి దాదాపు అన్ని క్లాసుల్లో ఈ సదుపాయం ఉండేది.రాయితీ నిలిపివేతకు కారణాలేంటి?మార్చి 2020లో కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో రైల్వే ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు ఈ రాయితీలను రద్దు చేశారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీల వల్ల భారతీయ రైల్వేపై ఏటా రూ.1,600 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని, రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడినప్పటికీ ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రాయితీలను పునప్రారంభించలేదు.బడ్జెట్ 2026పై ఆశలుప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్లు మళ్లీ పాత పద్ధతిలోనే వయసు ధ్రువీకరణ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా కౌంటర్లలో రాయితీ టికెట్లు పొందవచ్చు.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే.. -
పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని
-
వందే భారత్ స్లీపర్‌కు ఫుల్ డిమాండ్..
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. కామాఖ్య –హౌరా మధ్య గురువారం నుంచి పరుగులు తీయయనున్న వందే భారత్ స్లీపర్ రైలు తొలి కమర్షియల్ జర్నీకి సంబంధించి టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. సోమవారం(జనవరి 19) ఉదయం 8:00 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవ్వగా.. కేవలం 24 గంటల లోపే అన్ని తరగతుల టిక్కెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ సెమీ హై-స్పీడ్ ట్రైన్‌ను 17 జనవరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రపంచ స్థాయి ఇంటీరియర్స్, సెన్సార్ ఆధారిత లైటింగ్, మెరుగైన బెర్తులు, ఆధునిక బయో-టాయిలెట్లు ఉన్నాయి. అంతేకాకుండా హౌరా, కామఖ్య మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు దాదాపు 3 గంటల సమయం ఆదా చేస్తుంది. ఈ కారణాలతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి కనీస ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కామాఖ్య నుంచి హౌరా మధ్య ప్రయాణానికి ఫస్ట్ ఏసీలో రూ.3,855, సెకెండ్ ఏసీలో రూ.3,145, థర్డ్ ఏసీలో రూ.2,435 ఖర్చు అవుతోంది.నో వెయిటింగ్ లిస్ట్!సాధారణ రైళ్లలో లాగా ఇందులో ఆర్ఎసీ(RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉండవు. కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. దీనివల్ల రైలు లోపల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. -
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు ఖరారు
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెలలోనే పట్టాలెక్కనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అస్సాంలోని గువాహతి (కామాఖ్య) మధ్య ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన టికెట్ ధరలు, రిజర్వేషన్ నిబంధనలను రైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించింది.జనవరి 17న ప్రారంభంరైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్, టెస్టింగ్, భద్రతా సర్టిఫికేషన్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయి. జనవరి 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సాధారణ ప్రయాణికులకు జనవరి 18 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు రైల్వే బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో కేవలం ‘కన్ఫర్మ్’ అయిన టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. సాధారణ రైళ్లలో ఉండే ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఇందులో ఉండదు. అంటే, రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత సీటు కేటాయించబడని వారికి ప్రయాణించే అవకాశం ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ARP) మొదటి రోజు నుంచే అన్ని బెర్తులు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.టికెట్ ధరలు, కనీస ఛార్జీరైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన సర్క్యులర్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరు ప్రాతిపదికన నిర్ణయించారు.కనీస ఛార్జీ: ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.3 ఏసీ కిలోమీటరుకు రూ.2.4 (కనీస ధర రూ.960)2 ఏసీ: కిలోమీటరుకు రూ.3.1 (కనీస ధర రూ.1,240)1 ఏసీ: కిలోమీటరుకు రూ.3.8 (కనీస ధర రూ.1,520)హౌరా-గువాహతి మార్గంలో పూర్తి ప్రయాణానికి 3 ఏసీకి సుమారుగా రూ.2,300, 2 ఏసీకి రూ.3,000, ఫస్ట్ ఏసీకి రూ.3,600 (కేటరింగ్ ఛార్జీలతో కలిపి) ఉండొచ్చని అంచనా. వీటికి అదనంగా జీఎస్టీ ఛార్జీలు ఉండే అవకాశం ఉందని గమనించాలి.రిజర్వేషన్ కోటాలుఈ రైలులో అన్ని రకాల కోటాలు వర్తించవు. కేవలం కింద పేర్కొన్న ముఖ్యమైన విభాగాలకు మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది.1. మహిళలు2. దివ్యాంగులు3. సీనియర్ సిటిజన్లు4. డ్యూటీ పాస్ కోటా (రైల్వే సిబ్బంది కోసం). మిగిలిన ఇతర ప్రత్యేక కోటాలకు ఈ రైలులో చోటు లేదు.ఈ రైలు ప్రత్యేకతలుమొత్తం 16 కోచ్‌లతో (11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ) నడవనున్న ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్స్, విమాన స్థాయి సౌకర్యాలతో ఈ వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని భారీతీయ రైల్వే తెలిపింది.ఇదీ చదవండి: ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు -
ఇండియన్ రైల్వే.. టికెట్ ఛార్జీలు పెరిగాయ్.. ఎంతంటే?
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గమనిక. నేటి నుంచి పెరిగిన కొత్త ట్రైన్ టికెట్ ధరలు అమల్లోకి వచ్చాయి. రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా.. సాధారణ తరగతి ప్రయాణికులకు 215 కి.మీ. దూరం వరకు ఎలాంటి పెంపు ఉండదు. అయితే 216 కి.మీ (కిలోమీటర్) దూరం దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్‌కు ఒక పైసా అదనంగా వసూలు చేస్తోంది. రైల్వే అధికారులు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అన్ని ఏసీ తరగతులలో ప్రతి కిలోమీటర్‌కు రెండు పైసలు పెంపు అమలు చేశారు. ఈ పెంపుతో ఈ ఏడాదిలో రెండో సారి ట్రైన్ టికెట్ ధరలను పెంచినట్లైంది. తొలిసారి ఈ ఏడాది జులైలో రైల్వే టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం, సబర్బన్ సేవలు, సీజన్ టికెట్లకు ఎలాంటి మార్పులు లేవు. సాధారణ నాన్-ఏసీ (నాన్-సబర్బన్) సేవల్లో రెండో తరగతి, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లలో ధరలు దశలవారీగా పెంచింది. సెకండ్ క్లాస్ సాధారణ టికెట్లలో 215 కి.మీ. వరకు ఎలాంటి పెంపు లేదు. 216 కి.మీ. నుండి 750 కి.మీ. వరకు ప్రయాణానికి రూ.5 పెంపు ఉంటుంది. 751–1250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.10, 1251–1750 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.15, 1751–2250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.20 పెంపు అమలు చేసింది. స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సాధారణ టికెట్లలో ప్రతి కి.మీ.కు 1 పైసా చెల్లించాల్సి ఉంది. ఇది నాన్-సబర్బన్ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ, ఏసీ తరగతులన్నింటిలో ప్రతి కి.మీ.కు 2 పైసా పెంపు ఉంది. ఉదాహరణకు, 500 కి.మీ. ప్రయాణం చేసే ప్రయాణికుడు నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో సుమారు రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రాజధాని, శతాబ్దీ, దురంతో, వందే భారత్, హంసఫర్, అమృత భారత్, మహామనా, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్దీ, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ వంటి ప్రధాన రైళ్లలో కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఏసీ ఎంఈఎంయూ/డీఈఎంయూ సేవలు మాత్రం మినహాయింపు పొందాయి. సవరించిన ధరలు డిసెంబర్ 26, 2025 నుండి బుక్ చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు బుక్ చేసిన టికెట్లకు అదనపు ఛార్జీలు ఉండవు -
రైల్వే వాలెట్ నుంచి నగదు విత్‌డ్రా కుదరదు
భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యంత వేగంగా టికెట్ బుకింగ్ సేవలను అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఐఆర్సీటీసీ (IRCTC) ఈ-వాలెట్’ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. వాలెట్లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వెనక్కి తీసుకోవడం (Withdrawal) సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విధానం వెనుక ఉన్న కారణాలు, దీనివల్ల రైల్వేకు చేకూరే ప్రయోజనాలను చూద్దాం.లోక్‌సభలో మంత్రి వివరణలోక్సభలో ఒక సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కింది అంశాలను వెల్లడించారు.ఐఆర్సీటీసీ వాలెట్లో ఉన్న డబ్బును కేవలం రైలు టికెట్ల బుకింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవాలి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ నిబంధనల ప్రకారం.. ఈ తరహా క్లోజ్డ్ వాలెట్ల నుంచి నగదును విత్‌డ్రా చేయడానికి వీల్లేదు.ఒకవేళ వినియోగదారుడు తన ఐఆర్సీటీసీ వాలెట్ ఖాతాను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకుంటే మాత్రమే అందులోని నగదును వారి సోర్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు.విత్‌డ్రాకు అనుమతించకపోవడానికి కారణాలుఐఆర్సీటీసీ వాలెట్ అనేది ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్. అంటే ఏ సంస్థ అయితే వాలెట్ సేవలను అందిస్తుందో ఆ సంస్థ సర్వీసులను మాత్రమే ఆ నగదును వాడాలి. దీన్ని నగదుగా మారిస్తే అది బ్యాంకింగ్ కార్యకలాపాల కిందకు వస్తుంది. దానికి వేరే రకమైన నిబంధనలు ఉంటాయి.నగదు విత్‌డ్రా సౌకర్యం ఉంటే దీన్ని కొందరు నగదు బదిలీకి లేదా ఇతర మనీ లాండరింగ్ అవసరాలకు వాడే అవకాశం ఉంటుంది. కేవలం ప్రయాణికుల అవసరాల కోసమే పరిమితం చేశారు.నిత్యం వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఐఆర్సీటీసీలో ప్రతి చిన్న మొత్తాన్ని వెనక్కి పంపడం వల్ల అకౌంటింగ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది.రైల్వేకు కలిగే ప్రయోజనాలులక్షలాది మంది ప్రయాణికులు వాలెట్లో ఉంచే సొమ్ము రైల్వే వద్ద ముందే జమ అవుతుంది. ఈ ‘ఫ్లోట్ మనీ’ ద్వారా రైల్వేకు వడ్డీ రూపంలో లేదా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో అదనపు ప్రయోజనం కలుగుతుంది.ప్రయాణికులు బ్యాంక్ కార్డులు లేదా యూపీఐ వాడితే రైల్వే కొంత సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వాలెట్ వాడకం వల్ల ఈ లావాదేవీ ఖర్చులు తగ్గుతాయి.తత్కాల్ సమయాల్లో పేమెంట్ గేట్వేలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాలెట్ లావాదేవీలు అంతర్గతంగా జరుగుతాయి కాబట్టి, సర్వర్‌పై భారం తగ్గి బుకింగ్ వేగం పెరుగుతుంది.ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలుఐఆర్సీటీసీ వాలెట్ వాడటం వల్ల ప్రయాణికులకు ప్రధానంగా సమయం ఆదా అవుతుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు పేమెంట్ గేట్‌వే రిడైరెక్షన్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ వాలెట్ ద్వారా కేవలం సెకన్లలోనే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎంతో కీలకం. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో తత్కాల్ టికెట్లు దొరికే అవకాశం పెరుగుతుంది. వీటన్నింటికీ మించి ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా లేదా వెయిటింగ్ లిస్ట్ కారణంగా బుకింగ్ కాకపోయినా దానికి సంబంధించిన రీఫండ్ సొమ్ము వెంటనే వాలెట్‌కు చేరుతుంది. సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్లలా దీని కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.ప్రతికూలతలుమరోవైపు ఈ వాలెట్ విధానంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాలెట్లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి బ్యాంక్ ఖాతాకు విత్‌డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో ప్రయాణ ప్రణాళికలు లేనప్పుడు ఆ డబ్బు వ్యాలెట్‌లోనే నిలిచిపోతుంది. దీనివల్ల అవసరానికి ఆ నగదును వాడుకోలేరు. అలాగే ఈ డబ్బు వినియోగానికి పరిమితులు ఉంటాయి. దీన్ని కేవలం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో టికెట్లు కొనడానికి తప్ప ఇతర వ్యక్తిగత అవసరాలకు లేదా ఇతర వెబ్సైట్లలో వాడలేం. ఒకవేళ వాలెట్లోని డబ్బును తిరిగి పొందాలంటే వినియోగదారుడు తన ఐఆర్సీటీసీ వాలెట్ ఖాతాను శాశ్వతంగా మూసివేయాల్సి ఉంటుంది. నగదు కోసం ఖాతాను రద్దు చేసుకోవాల్సి రావడం ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే.. -
‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు
చెన్నై: భారతీయ రైల్వేలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించే లక్ష్యంతో భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే నెట్వర్క్ అంతటా వివిధ అవసరాలను తీర్చేందుకు తాత్కాలికంగా 5,058 మంది మాజీ సైనికులను (Ex-Servicemen) పాయింట్స్మెన్లుగా నియమించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ఈ మాజీ సైనికులు విధులు నిర్వహిస్తారు. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి.ఈ తాత్కాలిక నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ల ద్వారా సాధారణ అభ్యర్థులను నియమించే వరకు ఆపరేషనల్ అవసరాలను తీర్చడానికి ఉపకరిస్తాయి. మాజీ సైనికుల సంక్షేమ బోర్డుల ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని రైల్వే బోర్డు ఆదేశించింది. వీరి ప్రారంభ ఒప్పందం 2026 డిసెంబర్ 31వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఖాళీలను బట్టి పొడిగింపు అవకాశం ఉంటుంది. పాయింట్స్‌మ్యాన్ పాత్ర చాలా కీలకం. ఇందులో ట్రాక్ స్విచ్‌లు, సిగ్నల్ల మాన్యువల్ ఆపరేషన్, రైళ్లను సురక్షితంగా నడిపించడం, షంటింగ్, ప్రమాద రహిత రైలు కదలికకు స్టేషన్ మాస్టర్‌కు సహాయం చేయడం తదితర బాధ్యతలు ఉంటాయి.అయితే మాజీ సైనికులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు ఎన్. కన్నయ్య మాట్లాడుతూ కీలకమైన భద్రతా-సంబంధిత పాత్రలలో కాంట్రాక్టు సిబ్బందిని నియమించడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయన్నారు. స్వల్పకాలిక కాంట్రాక్టులపై నూతన సిబ్బందిని భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి అనుమతిస్తే భద్రతకు ముప్పువాటిల్లుతుందన్నారు. ఈ పోస్టులలో చేరేవారికి దీర్ఘకాలిక జవాబుదారీతనం లేదా బాధ్యత ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు పాయింట్స్మెన్లకు సూచించిన శిక్షణ పొందుతారు. కాంట్రాక్టు వేతనం అందుకుంటారు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే వారిని ఫీల్డ్‌లో పోస్ట్ చేస్తారు. శిక్షణలో ఉత్తీర్ణులుకాని లేదా అనర్హులుగా తేలిన వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోరు. అయితే వారికి వారి శిక్షణ కాలానికి ఒప్పంద నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.గతంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ నియామకాలు భద్రతాపరమైన ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. 2024, అక్టోబర్ 11న దక్షిణ రైల్వేలోని కవరపేటై స్టేషన్లో జరిగిన రైలు ప్రమాద విచారణలో రైల్వే భద్రతా కమిషనర్ (సీఎస్ఆర్) చేసిన సూచనలను గుర్తుచేస్తున్నాయి. నాటి ఘటనను సీఆర్ఎస్ విధ్వంసంగా వర్గీకరిస్తూ, భద్రతా పరంగా కీలకప్రాంతాలలో కాంట్రాక్టు సిబ్బందిని మోహరించే పద్ధతిని సమీక్షించాలని, దీర్ఘకాలికంగా ఈ సంఖ్యను సున్నాకి తగ్గించాలని రైల్వే బోర్డుకు స్పష్టంగా సిఫార్సు చేసింది.కాగా సిబ్బంది కొరతను తక్షణమే తీర్చేందుకు రైల్వే బోర్డు తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం, ఒకవైపు మాజీ సైనికులకు ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు కార్మిక సంఘాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఈ నిర్ణయంతో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వేలు గతంలోనూ రిటైర్డ్ సిబ్బందిని తిరిగి నియమించుకోవడం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాయి. -
రైల్వేకు ఐఆర్సీటీసీ కాసుల వర్షం.. ఎలాగంటే..
భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలను రైల్వే తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయితే, ఈ అతిపెద్ద రైల్వే వ్యవస్థకు ఆర్థికంగా వెన్నెముకగా నిలుస్తున్న సంస్థ ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). కేవలం టిక్కెట్ల అమ్మకాలతోనే కాకుండా, మరెన్నో వినూత్న మార్గాల్లో భారతీయ రైల్వేకు లాభాల పంట పండిస్తున్న ఐఆర్సీటీసీ వ్యాపార నమూనాను ఏంటో తెలుసుకుందాం.ఆన్లైన్ టిక్కెటింగ్ఐఆర్సీటీసీకి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి రైల్వే టిక్కెట్ బుకింగ్. ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసినప్పుడు ప్రయాణికుల నుంచి నామమాత్రపు సర్వీస్ ఛార్జ్‌ను వసూలు చేస్తుంది (ఉదాహరణకు, నాన్-ఏసీ టిక్కెట్లపై రూ.15, ఏసీ టిక్కెట్లపై రూ.30). పేమెంట్ గేట్వేలను ఉపయోగించినందుకు వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు కూడా ఆదాయంగా మారుతుంది. అత్యవసర బుకింగ్ అయిన తత్కాల్ ద్వారా కూడా ఐఆర్సీటీసీ మంచి మొత్తాన్ని ఆర్జిస్తుంది.క్యాటరింగ్ సేవలురైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆహార సరఫరా, క్యాటరింగ్ సేవల నిర్వహణను ఐఆర్సీటీసీ పర్యవేక్షిస్తుంది. ఈ విభాగం ఆదాయంలో ముఖ్యమైన వాటాను కలిగి ఉంది. ప్రీమియం రైళ్లు (రాజధాని, శతాబ్ది వంటివి), ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని తయారుచేయడానికి దేశవ్యాప్తంగా ఐఆర్సీటీసీ ఆధునిక బేస్ కిచెన్లను నిర్వహిస్తోంది. రైల్వే స్టేషన్లలో ఫుడ్ ప్లాజాలు, స్టాళ్లను నిర్వహించడం ద్వారా లేదా వాటిని ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది.టూరిజం సేవలుభారతదేశ వారసత్వం, ఆధ్యాత్మిక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేస్తూ ఐఆర్సీటీసీ టూరిజం సేవలను అందిస్తుంది. ‘భారత్ గౌరవ్’ వంటి ప్రత్యేక టూరిజం రైళ్లను నడుపుతోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన, బస్సు టూర్ ప్యాకేజీలను అందించి లాభాలను ఆర్జిస్తోంది. రైల్వే స్టేషన్లలో ఉన్న విశ్రాంతి గృహాలు, హోటళ్లను లీజుకిచ్చి వాటి నిర్వహణ ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది.రైల్ నీర్రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్యాకేజ్డ్ తాగునీరు అవసరం చాలా ఎక్కువ. ఐఆర్సీటీసీ సొంత బ్రాండ్‌గా ‘రైల్ నీర్’ను తయారుచేసి విక్రయిస్తుంది. రైల్వే ఆవరణలో రైల్ నీర్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ విభాగం నుంచి స్థిరమైన, గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ప్రైవేట్ బ్రాండ్స్ కంటే తక్కువ ధరకు నీటిని అందించడం ద్వారా సంస్థకు లాభం వస్తుంది.ఇతర మార్గాలుపై నాలుగు ప్రధాన మార్గాలు కాకుండా ఐఆర్సీటీసీకి మరికొన్ని అనుబంధ ఆదాయ వనరులు ఉన్నాయి. రైల్వే టిక్కెట్ల వెనుక, వెబ్సైట్లో, ఈ-టికెట్‌పై, రైళ్ల అంతటా ప్రకటనలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదిస్తుంది. పార్శిల్ సేవలు, లాజిస్టిక్స్ సేవలను అందిస్తోంది. వివిధ ఆన్లైన్ లావాదేవీల ద్వారా లభించే పేమెంట్ గేట్‌వే కమీషన్ ఆదాయం ఉంది.భారతీయ రైల్వేకు ఐఆర్సీటీసీ కీలకంరైల్వే శాఖకు ఐఆర్సీటీసీ ఒక స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందిస్తుంది. ఏటా డివిడెండ్ రూపంలో భారతీయ రైల్వేకు పెద్ద మొత్తంలో నిధులను సమకూరుస్తుంది. ఐఆర్సీటీసీ ద్వారా వచ్చే లాభాలను భారతీయ రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, కొత్త రైళ్ల కొనుగోలు, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష! -
లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో
రైలు ప్రయాణంలో గర్భిణీలు, సీనియర్ సిటిజన్లు ఉన్నపుడు వారికి లోయర్ బెర్త్ కావాలని ఆశపడతాం. కానీ లోయర్ బెర్త్ దొరుకుతుందా అనేది నమ్మకం ఉండదు. లోయర్ బార్త్ రాక, మిడిల్, అప్పర్ బెర్త్ ఎక్కలేక, పక్క వాళ్లని రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్లకి నిజంగా ఇది చాలా సమస్య.అయితే లోయర్ బెర్త్ కావాలంటే సీనియర్ సిటిజన్లు ఈ తప్పు చేయకండి అంటూ టికెట్ ఎగ్జామినర్ (TTE) చెప్పిన చిట్కా ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.సీనియర్ సిటిజన్ కోటా కింద సీట్ల కేటాయింపునకు సంబంధించి ఈ వైరల్ వీడియో ప్రశంసలందుకుంటోంది.తమకు లోయర్ బెర్త్ రాలేదంటూ కొందరు ప్రయాణికులు సీనియర్ సిటిజన్లు టికెట్ చెకింగ్‌కు వచ్చిన టీటీఈకి చెప్పుకున్నారు. అపుడు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ తప్పు చేయకండి అంటూ ఆయన ఏం చెప్పారంటే.."మీరు సీనియర్ సిటిజన్ కోటాను పొందాలనుకుంటే, అదీ లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి. అప్పుడు బుక్ చేసిన ఇద్దరికీ లోయర్ బెర్త్ వస్తుంది, లేదా ఇద్దరిలో ఒకరికైనా లోయర్ బెర్త్ వస్తుంది. అలా కాకుండా ఒకే టికెట్లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చుకుంటే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయి అంటూ టీటీసీ అసలు రహస్యాన్ని చెప్పారు. అయితే ఇంకో సమస్య ఏంటంటే.. ఇలా నలుగురు ఇలా బుక్ చేసుకున్నపుడు నలుగురికి ఒకే చోట, లేదా ఒకే కోచ్‌లో సీట్లు వస్తాయనే గ్యారంటీ లేదు. Important and useful train ticket booking hack... if you are senior citizenKudos to this TTE for calmly explaining this, He deserves a raise @RailwaySeva @AshwiniVaishnaw pic.twitter.com/l5VJwATRKR— Woke Eminent (@WokePandemic) November 10, 2025 ఆగస్టు ప్రారంభంలో ఇలాంటి ప్రశ్నకు ప్రతిస్పందనగా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. "లోయర్ బెర్త్/సీనియర్ సిటిజన్ కోటా బెర్త్‌లు 60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులకు, 45 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది. ఒంటరిగా లేదా ఇద్దరు ప్రయాణికులతో (పేర్కొన్న ప్రమాణాల ప్రకారం) ఒకే టికెట్‌పై ప్రయాణించే టప్పుడు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నా, లేదా ఒకరు సినీయర్ సిటిజన్ కాని వ్యక్తి ఉన్నా కోటా వర్తించదని IRCTC పేర్కొంది.లోయర్ బెర్త్‌లు స్వయంచాలకంగా సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు, లభ్యతకు లోబడి కేటాయించబడతాయి. ప్రతి రైలు కోచ్‌లో, స్లీపర్ క్లాస్‌లో ఆరు నుండి ఏడు లోయర్ బెర్తులు, AC 3-టైర్లో నాలుగు నుండి ఐదు, AC 2-టైర్లో మూడు నుండి నాలుగు సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలుగర్భిణీ స్త్రీలకు రిజర్వ్ చేయబడతాయి.అదనంగా, అన్ని జోనల్ రైల్వేలలోని సబర్బన్ సెక్షన్లలోని మొదటి ,చివరి సెకండ్-క్లాస్ జనరల్ కంపార్ట్మెంట్లలో కనీసం ఏడు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేయబడతాయి.బుకింగ్ సమయంలో వయస్సు రుజువు అవసరం లేనప్పటికీ, ప్రయాణీకులు ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే వయస్సు గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఎందుకంటే చెకింగ్ ఆఫీసర్లు వచ్చినపుడు, వాటిని చూపించాల్సి ఉంటుంది. -
ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు
భారతీయ రైల్వే ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్నప్పటికీ, 2019లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రవేశపెట్టి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే ఈ రైలు ఆరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ రైలును పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తుంది.మొదటి ప్రైవేట్ రైలుదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్.న్యూఢిల్లీ నుంచి లఖ్‌నవూ వరకు ఈ రైలు నడుస్తుంది.ఈ సర్వీసును అక్టోబర్ 4, 2019న ప్రారంభించారు.ఈ సర్వీసు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయినప్పటికీ, అదే మార్గంలో నడుస్తున్న రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర ప్రీమియం సేవల కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.న్యూఢిల్లీ - లఖ్‌నవూ మధ్య టిక్కెట్ ఛార్జీల పోలికరైలు సర్వీసుతరగతిటికెట్ ధర (రూ.)IRCTC తేజస్ ఎక్స్‌ప్రెస్‌ఏసీ చైర్ కార్రూ. 1,679IRCTC తేజస్ ఎక్స్‌ప్రెస్‌ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,457శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ఏసీ చైర్ కార్రూ. 1,255శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 1,955వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ఏసీ చైర్ కార్రూ. 1,255వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,415రాజధాని ఎక్స్‌ప్రెస్‌ఏసీ థర్డ్ టైర్ (3A)రూ. 1,590రాజధాని ఎక్స్‌ప్రెస్‌ఏసీ సెకండ్ టైర్ (2A)రూ. 2,105రాజధాని ఎక్స్‌ప్రెస్‌ఏసీ ఫస్ట్ క్లాస్ (1A)రూ. 2,630 తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలుతేజస్ ఎక్స్‌ప్రెస్ అనేది ఆధునిక సదుపాయాలతో కూడిన సెమీ హై స్పీడ్ రైలు. ఈ కోచ్‌లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే రైలు పట్టాలకు సంబంధించిన అడ్డంకుల కారణంగా ఈ కోచ్‌లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. స్టీల్ బ్రేక్ డిస్క్, సింటెర్డ్ ప్యాడ్లు, ఎలక్ట్రో-న్యూమాటిక్ అసిస్ట్ బ్రేక్ సిస్టమ్ ఇందులో ఉంది.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు! -
రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!
దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా సాధనాలు రైళ్లు. సరళమైనవి, సౌకర్యవంతమైనవి, దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.ఇండియన్ రైల్వే విస్తృత నెట్వర్క్, క్లిష్ట కార్యకలాపాలతోపాటు అనేక విశిష్ట చిహ్నాలు, గుర్తులతో ప్రయాణికులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ప్రముఖ గుర్తుల్లో ఒకటి, ప్రతి రైలు చివరి కోచ్‌పై ఉండే బోల్డ్ ‘ఎక్స్’ (X) గుర్తు. మొదటిసారి చూసినప్పుడు ఇది కేవలం డిజైన్ లేదా సాధారణ గుర్తుగా అనిపించవచ్చు. అయితే, ఈ గుర్తు రైలు భద్రత, కార్యకలాపాల సమర్థతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వాస్తవ అర్థం, ఉపయోగాన్ని తెలుసుకోవడం ట్రాక్ నిర్వహణ, రైలు ఆపరేషన్లకు ఎంతో అవసరం.రైలు పూర్తిగా దాటిందని నిర్ధారణచివరి కోచ్‌పై ఉన్న "X" గుర్తు ప్రధానంగా రైలు పూర్తిగా స్టేషన్ గుండా దాటిందని రైల్వే సిబ్బందికి తెలియజేస్తుంది. ఇది ఒక దృశ్య సూచనగా పని చేస్తూ, అన్ని కోచ్‌లు పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో లేదా దృష్టి మందగించే వాతావరణంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. కేవలం సిగ్నళ్లపై ఆధారపడటం చాలనిపించినా ఈ "X" మార్కింగ్ అదనపు భద్రతా పొరగా నిలుస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపుకొన్నిసార్లు అరుదైన సంఘటనల్లో, ఒక కోచ్ రైలు నుండి వేరు కావచ్చు. అలాంటి సందర్భంలో, రైలు చివరి కోచ్‌పై "X" గుర్తు కనపడకపోతే, అది తక్షణమే ఒక హెచ్చరికగా మారుతుంది. దీనివల్ల రైల్వే అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రమాదాలను నివారించడంలో, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను పరిరక్షించడంలో కీలకంగా ఉంటుంది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. QR కోడ్ ద్వారా..
-
Train Ticket: రైల్వే శాఖ కొత్త రిజర్వేషన్ విధానం
రైలు ప్రయాణికులకు అలర్ట్. ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ కొత్త నిబంధన అమల్లోకి తెస్తుంది. న్యూఢిల్లీ: జనరల్ టిక్కెట్ల రిజర్వేషన్‌కు బుక్కింగ్స్ మొదలైన మొదటి 15 నిమిషాలను ఆధార్ ధ్రువీకరణ ఉన్న యూజర్లను మాత్రమే అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. రైలు ఏదైనా బుక్కింగ్స్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రిజర్వేషన్ చేయించుకునే టిక్కెట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే అధీకృత ఏజెంట్లు టిక్కెట్లు రిజర్వేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.‘ఉదాహరణకు ఒక రైలు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు బయలుదేరనుంది. ఆ రైలుకు రిజర్వేషన్లు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే, మొదటి 15 నిమిషాలు ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారికే రిజర్వేషన్ చేసుకునే అవకాశముంటుంది’అని వివరించింది. ఇప్పటి వరకు తత్కాల్ (Tatkal) రిజర్వేషన్లకు మాత్రమే ఈ నిబంధన ఉండేది.రిజర్వేషన్ విధానం ప్రయోజనాలు సాధారణ వినియోగదారునికి కూడా అందేందుకు, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ సోమవారం ఒక సర్క్యులర్‌లో వివరించింది. కౌంటర్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ఏజెంట్లకు ప్రస్తుతమున్న మొదటి 10 నిమిషాల నియంత్రణ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. చదవండి: జేఈఈ లేకుండానే.. ఐఐటీలో సీటు! -
రైల్వే ట్రాక్‌పై సోలార్ ఎనర్జీ తయారీ!
దేశంలోనే తొలిసారిగా రైల్వే ట్రాక్‌పై సోలార్ ప్యానెళ్లతో ప్రయోగాలు ప్రారంభించింది భారతీయ రైల్వే. వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లను అమర్చారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ‘హరిత, సుస్థిర రైలు రవాణా’ చర్యగా అభివర్ణించింది.సంప్రదాయానికి భిన్నంగా..సాధారణంగా సోలార్ ఎనర్జీకి భారీగా భూసేకరణ అవసరం అవుతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు భూమి ఎంతో అవసరం. భూసేకరణ దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్‌లకు పెద్ద అడ్డంకి. దీన్ని పరిష్కరించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. సంప్రదాయానికి భిన్నంగా రైల్వేపట్టాలకు మధ్యలో ఉన్న భూమిని ప్యానెళ్ల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. దేశంలో చాలా కిలోమీటర్లు విస్తరించిన ఈ రైల్వే పట్టాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఇది విజయవంతం అయితే క్రమంగా ఈ వ్యవస్థను ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది.నిర్వహణ సులువుఈ ప్రాజెక్ట్‌లో నిర్వహణను సులభతరం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమస్య వస్తే వాటిని త్వరగా తొలగించి తిరిగి ఇన్స్టాల్ చేసే విధంగా ప్యానెల్స్‌ను అమర్చారు. దీని ద్వారా తనిఖీలు, మరమ్మతులు లేదా అత్యవసరాల కోసం రైల్వే కార్మికులు ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలవుతుంది. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు, దుమ్ము పేరుకుపోవడం, వర్షం.. వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.భవిష్యత్తులో రైల్వే స్వావలంబనఇందులో 28 హైస్ట్రెంత్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి మొత్తంగా 15 కిలోవాట్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలవు. భారతీయ రైల్వే వ్యవస్థ 1.2 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇలాంటి వ్యవస్థ రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా రైల్వే విద్యుత్ వాడకంలో స్వావలంబన సాధిస్తుందని నమ్ముతున్నారు.ఇదీ చదవండి: యూఎస్‌లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది? -
రైలు ప్రయాణికులకు కీలక అప్డేట్
ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి ఎంతబడితే అంత బ్యాగేజీ తీసుకెళ్లడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఎందుకంటే పరిమిత స్థాయిలోనే బ్యాగేజీని అనుమతించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. విమానాశ్రయాలలో మాదిరిగానే, ఇప్పుడు ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీని తూకం వేయనున్నట్టు ప్రకటించింది. నిర్దేశించిన పరిమితికి మించి ఎక్కువ లగేజీ ఉంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. కాబట్టి ప్రయాణికులు రైలు ఎక్కేముందే తమ బ్యాగేజీ ఎంతుందో ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సి ఉంటుంది.ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రిజర్వేషన్ టికెట్‌తో దూర ప్రయాణాలు చేసే వారు అధికంగా బ్యాగేజీ తీసుకెళుతుంటారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వలస కూలీలు కూడా ఎక్కువ సామాన్లతో రైలు ఎక్కుతుంటారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి బ్యాగేజీని పరిమితం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎయిర్‌పోర్టుల్లో మాదిరిగా రైల్వేస్టేషన్లలోనూ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్లతో లగేజీ (Luggage) తూకం వేసేందుకు ఏర్పాట్లు చేసింది.బరువుతో పాటు సైజు కూడా..బ్యాగేజీ బరువు మాత్రమే కాకుండా పరిమాణాన్ని కూడా తనిఖీ చేస్తామని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. బ్యాగేజీ చాలా పెద్దదిగా ఉండి, కోచ్ లోపల అదనపు స్థలాన్ని ఆక్రమించేట్టు ఉంటే.. ప్రయాణికుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంటే బ్యాగేజీ బరువు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ సైజు పెద్దగా ఉంటే మాత్రం ఫైన్ (Fine) తప్పదు. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రయాగ్‌రాజ్ నార్త్ సెంట్రల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ హిమాన్షు శుక్లా మీడియాతో చెప్పారు.ఫస్ట్ అక్కడ నుంచే..ప్రయాగ్‌రాజ్ డివిజన్లోని కీలక స్టేషన్ల నుంచి ఈ విధానాన్ని ప్రారంభించాలని నార్త్ సెంట్రల్ రైల్వే (North Central Railway) నిర్ణయించింది. వీటిలో ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, సుబేదార్‌గంజ్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్, తుండ్లా, అలీఘర్ జంక్షన్, గోవింద్‌పురి, ఎటావా స్టేషన్లు ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్లాట్ఫామ్లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులు తమ బ్యాగుల బరువు చూసుకోవాలి. బ్యాగేజీ బరువు తక్కువగా ఉన్నా పరిమాణం(సైజు) పెద్దగా ఉంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.గరిష్టంగా 70 కిలోలు..రిజర్వేషన్ టికెట్ల ఆధారంగా బ్యాగేజీ పరిమితిని రైల్వే శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా 70 కిలోల సామానుతో మాత్రమే రైలులో ప్రయాణించగలరు. కనిష్టంగా 35 కిలోల వరకు అనుమతిస్తారు. ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లొచ్చు. సెకండ్ ఏసీ 50 కిలోలు, థర్డ్ ఏసీ- స్లీపర్ క్లాస్ 40 కిలోలు.. జనరల్/సెకండ్ సిట్టింగ్ ప్యాసింజర్లకు 35 కిలోలు వరకు బ్యాగేజీ అనుమతిస్తారు. పరిమితి కంటే 10 కిలోల వరకు ఎక్కువ తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. దీనికి మించి లగేజీ ఉన్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ.అధికారులు ఏమంటున్నారు?రైళ్లల్లో ప్రయాణించేవారిలో చాలా మంది అధిక సామాను తీసుకెళుతుంటారు. దీనివల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు భద్రతకు విఘాతం కలుగుతుంది. ప్రయాణికులకు పటిష్ట భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేందుకు లగేజీని నియంత్రించాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవుల్లో రద్దీని మెరుగ్గా నియంత్రించడానికి ఈ చర్య దోహదపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. ఇక నుంచి ట్రైన్ జర్నీ (Train Journey) చేసేవారందరూ బ్యాగేజీ బరువును చెక్ చేసుకోవాల్సిందే.చదవండి: రైలు టికెట్లు ఈజీగా బుక్ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్ వచ్చేస్తోంది -
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్
పండుగ సీజన్ మొదలైపోయింది. పట్టణాల్లో ఉండేవారంతా.. సొంతూళ్లకు వెళ్ళడానికి సన్నద్ధమైపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేస్ తన 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' కింద రిటర్న్ ఛార్జీలపై 20 తగ్గింపును ప్రవేశపెట్టింది. పండుగల సమయంలో రద్దీని నివారించడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించినట్లు రైల్వే మంత్రి 'అశ్విని వైష్ణవ్' పేర్కొన్నారు. వెళ్ళడానికి, తిరిగి రావడానికి ఒకేసారి టికెట్స్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ.. టికెట్ బుకింగ్స్ వివరాలుభారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద ఆగస్టు 14 నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే వెళ్లేందుకు టికెట్ 2025 అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, తిరిగి రావడానికి టికెట్ 2025 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి. వెళ్లేందుకు, తిరిగి రావడానికి బుక్ చేసుకునే టికెట్లలో పేరు, ఇతర వివరాలు ఒకేలా ఉండాలి. అప్పుడే 20 శాతం తగ్గింపు లభిస్తుంది.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..రౌండ్ ట్రిప్ ప్యాకేజీ కింద ఒకే మోడ్‌ను (ఆన్లైన్ లేదా కౌంటర్ బుకింగ్) ఉపయోగించి.. వెళ్ళడానికి, తిరిగి రావడానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఛార్జీల వాపసు ఉండదు. అంతే కాకుండా డిస్కౌంట్ జర్నీ కూపన్స్, వోచర్ బుకింగ్స్ మొదలైన రాయితీలపైన టికెట్స్ బుక్ చేసుకోలేరు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
మహాలయ పక్ష ప్రత్యేక రైలు
హైదరాబాద్: మహాలయ పక్షం సందర్భంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైలు యాత్రను ప్రారంభిస్తోంది. భారత్ గౌరవ్ ట్రైన్లలో భాగంగా ‘మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర’ పేరుతో ప్రత్యేక రైలును నడపబోతోంది. ఈ రైలు వివరాలను రైల్వే అధికారులు హైదరాబాద్‌లో జూలై 29న ప్రకటించనున్నారు.మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర రైలు ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించవచ్చు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిధ్పూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారనాసి, గయా క్షేత్రాలు ఉన్నాయి. మహాలయ పక్ష కాలంలో ఈ క్షేత్రాలను దర్శించి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తే స్వర్గగతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. -
రైల్లో సీసీటీవీలు
న్యూఢిల్లీ: రైళ్లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు దర్శనమివ్వనున్నాయి. భారతీయ రైల్వేస్ పరిధిలో ఉన్న మొత్తం 74 వేల ప్యాసింజర్ బోగీలు, 15 వేల సరుకు రవాణా లోకోస్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు రైల్వేశాఖ ఆదివారం ప్రకటించింది. ఉత్తర రైల్వే విభాగంలో కొన్ని ప్రయాణికుల బోగీలు, లోకోల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వల్ల సత్ఫలితాలు వచ్చాయని, త్వరలో అన్ని బోగీల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు శనివారం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫలితాలను సమీక్షించి, అన్ని బోగీల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వేశాఖ తెలిపింది.ప్రయాణికులకు భద్రతబోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ‘సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుంది. బోగీల్లో దోపిడీలకు పాల్పడే దొంగలు, వ్యవస్థీకృత ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రయాణికుల ప్రైవసీకి ఇబ్బంది కలగ కుండా సీసీ కెమెరాలను బోగీల ద్వారాల వద్దనే ఏర్పాటు చేస్తాం’అని తెలిపారు. ఒక్కో బోగీలో 4 కెమెరాలుప్రయాణికుల రైళ్లలో ఒక్కో బోగీలో నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. బోగీకి ఉండే రెండు ద్వారాల్లో ఒక్కో ద్వారం వద్ద రెండు చొప్పున డోమ్ టైప్ అత్యాధునిక కెమెరాలు అమర్చుతారు. లోకోమోటివ్‌లలో 6 సీసీ కెమెరాలు ఉంటాయి. ముందు, వెనుక భాగాల్లో ఒక్కోటి, కార్కు రెండు వైపులు రెండు డోమ్ టైప్ కెమెరాలు ఉంటాయి. వీటికి అదనంగా రెండు డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్ కెమెరాలు కూడా ఏర్పాటుచేస్తారు. ఈ సీసీ కెమెరాలన్నీ ఎస్టీక్యూసీ సర్టిఫికేషన్‌తో అత్యాధునిక ఫీచర్లతో ఉంటాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.కెమెరాల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని రైల్వే మంత్రి సూచించినట్లు చెప్పారు. రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా, వెలుతురు సరిగా లేకపోయినా సీసీ కెమెరా ఫుటేజీ అత్యంత స్పష్టంగా ఉండేలా నాణ్యమైన కెమెరాల అమర్చాలని కోరినట్లు వెల్లడించారు. ఇండియా ఏఐ మిషన్ సహకారంతో సీసీ కెమెరాల డేటా సేకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకోవాలని అశ్వినీ వైష్ణవ్ సూచించినట్లు పేర్కొన్నారు. -
‘సూపర్ యాప్’లో అన్ని రైల్వే సేవలు
భారతీయ రైల్వే ‘రైల్ వన్(Railone)’ పేరుతో సూపర్‌యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. గత ఏడాదే వెల్లడించినట్లుగానే ఐఆర్సీటీసీ వినియోగదారులకు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్.. వంటి ఎన్నో సర్వీసులను పొందవచ్చని తెలిపింది. ఈ యాప్‌ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి.. అందులో ఏయే సర్వీసులున్నాయో కింద తెలుసుకుందాం.ఈ యాప్‌లో అందుబాటులోకి వచ్చిన సేవలన్నీ ప్రస్తుతం ఆన్లైన్లో, విభిన్న యాప్‌ల ద్వారా వేర్వేరుగా ఉన్నాయి. తాజాగా వాటన్నింటినీ ఒకే యాప్ పరిధిలోకి తీసుకొచ్చేలా కొత్త యాప్‌ను ప్రారంభించారు. దీన్ని ఐఆర్సీటీసీ ‘సూపర్ యాప్’గా పరిగణిస్తుంది. ఇప్పటికే ఈ యాప్‌ను కొన్ని రోజులుగా వివిధ దశల్లో రైల్వేశాఖ పరీక్షించింది. ఈ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది.ఇన్స్టాల్ చేసుకోండిలా..గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ సూపర్ యాప్ ‘Railone’ను డౌన్లోడ్ చేయాలి.యాప్ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి.యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అనే ఆప్షన్లు వస్తాయి.కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేస్తే రైల్ కనెక్ట్, యూటీఎస్ అని రెండు ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్ కనెక్ట్ యాప్‌లో లాగిన్ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్ కావొచ్చు. లేదంటే కొత్తంగా వివరాలు ఎంటర్ చేసి సైనప్ చేయాల్సి ఉంటుంది.సైనప్ కోసం మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయాల్సి.మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్, యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.ఓటీపీ, ఎంపిన్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్ వెరిఫికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ లేదా డివైజ్ లాగిన్ వివరాలు ఇవ్వాలి.ఇదీ చదవండి: ‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’రైల్‌వన్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. -
తత్కాల్ కొత్త రూల్ తెలుసు కదా.. ఆధార్ లింక్ చేశారా మరి!?
తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూలై 1 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) యాప్, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఏఐ బోట్లు, ఏజెంట్ల బెడదను నివారించేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తత్కాల్ అనేది ఇండియన్ రైల్వే ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దీని ద్వారా అప్పటికప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తక్కువ సమయంలో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.👉ఇది చదవలేదా? వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయంఇండియన్ రైల్వే అమలు చేస్తున్న కొత్త రూల్ ప్రకారం.. ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ అకౌంట్‌కు యూజర్ ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కావాల్సినవి యాక్టివ్ ఐఆర్సీటీసీ అకౌంట్, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్.ఆధార్ లింక్ చేసుకోండిలా..ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ( www.irctc.co.in )లోకి లాగిన్ అవ్వాలి.'మై అకౌంట్'పై క్లిక్ చేసి 'అథెంటికేట్ యూజర్' ఎంచుకోండి.మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.'వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.సమ్మతి బాక్సును టిక్ చేసి 'సబ్మిట్' నొక్కండి.మీ ఆధార్ విజయవంతంగా లింక్ అయిన తర్వాత ధ్రువీకరణ కన్పిస్తుంది. -
వందే భారత్ స్లీపర్ కోచ్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా దూర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైళ్ల స్థానంలో వందే భారత్ స్లీపర్ కోచ్‌లను దశలవారీగా ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మరింత వేగం, సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ ప్రణాళికను రైల్వే శాఖ ఆమోదించింది.రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారుసరికొత్త వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం 1,920 కొత్త కోచ్‌లను భారతీయ రైల్వే నిర్మించనుంది. అందుకోసం రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లను తాజాగా ఖరారు చేసింది. ఈ కాంట్రాక్టును మూడు సంస్థలకు ఇచ్చింది. బీఈఎంఎల్, కినెట్ రైల్వే సొల్యూషన్స్, టిట్లాగఢ్ రైల్వే సిస్టమ్స్ లిమిటెడ్–భారత్ హెవీ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లతో కూడిన కన్సార్షియానికి టెండర్లు ఖరారు చేసింది.ఈ సంస్థలు నిర్మించే అధునాతన స్లీపర్ కోచ్‌లను 2027 నుంచి దశలవారీగా ప్రవేశపెట్టనుంది. కీనెట్ రైల్వే సొల్యూషన్స్ ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్‌లోని కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ కోచ్‌ల నిర్మాణాన్ని మొదలు పెట్టింది. త్వరలోనే అధునాతన వందేభారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. కొత్తగా నిర్మించే 1,920 కోచ్‌లు 2027 నుంచి 2029 నాటికి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మరో 11 వందే భారత్ ఛెయిర్ కార్ రైళ్లు..ఇదిలా ఉండగా.. మరో 11 వందే భారత్ రైళ్లు ఛెయిర్ కార్‌తో కూడినవి తయారు చేయడానికి లక్ష్యం ఉందని ఇంటిగ్రల్ కోచ్ ప్యాక్టరీ(ఐసీఎఫ్) అధికారి ఒకరన్నారు. ఆ తర్వాత ఛెయిర్ కార్ బోగీల ఉత్పత్తులు ఆపేసి స్లీపర్ కోచ్‌లపై దృష్టి సారించనున్నట్టు చెప్పారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్), పెరంబూరులోని ‘ఐసీఎఫ్’లో వందేభారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు తయారు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో ఉత్పత్తి పూర్తయిందని, ప్రొటోటైప్‌తో కూడిన రైలును రైల్వే బోర్డుకు త్వరలో అందించనున్నామని, రైల్వే బోర్డు 97 వందే భారత్ రైళ్ల తయారీకి ఆర్డరు ఇచ్చిందని ఐసీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో 86 రైళ్లు తయారీ పూర్తయి డెలివరీ కూడా చేశామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మిగిలిన 11 ఛెయిర్ కార్ బోగీలను బోర్డుకి అందిస్తామని చెప్పారు. -
కొంకణ్ రైల్వే విలీనం.. ఇప్పుడేం జరగనుంది?
ముంబై: కొంకణ్ రైల్వే(Konkan Railway) భారతీయ రైల్వేలో విలీనం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్)ను భారతీయ రైల్వేలలో విలీనం చేయడానికి అధికారికంగా అంగీకరించింది. గోవా, కర్ణాటక, కేరళలు ఇప్పటికే ఈ విలీనాన్ని ఆమోదించాయి. కొంకణ్ రైల్వే విలీనంపై మహారాష్ట్ర నిర్ణయం తీసుకున్న దరిమిలా కీలకమైన ఈ రైల్వే లైన్ జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది.పశ్చిమ కనుమల మీదుగా రైల్వే లైన్లను నిర్మించే కష్టతరమైన పనిని చేపట్టేందుకు కొంకణ్ రైల్వే (కేఆర్) 1990లో రైల్వే మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగంగా ఏర్పాటయ్యింది. 1998, జనవరిలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్.. మహారాష్ట్ర(Maharashtra)లోని రోహా, గోవా, కర్ణాటకలోని మంగళూరు, తీరప్రాంత కేరళను అనుసంధానించడానికి, కొంకణ్ తీరం వెంబడి సరుకులు, ప్రయాణికుల రాకపోకలకు అనువుగా మారింది. ఈ రైల్వేలైన్ పొడవు 741 కి.మీ. ఈ రైలు మార్గం ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు అనుసంధానమయ్యింది.కేఆర్‌సీఎల్ ఒక జాయింట్ వెంచర్‌గా ఏర్పాటయ్యింది. దీనిలో భారత ప్రభుత్వం 51శాతం వాటాను కలిగి ఉంది, మహారాష్ట్ర 22 శాతం, కర్ణాటక 15శాతం, గోవా, కేరళలుఘ ఆరు శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నాయి. ఈ లైన్ 1990లో ప్రారంభమయ్యింది. కార్యాచరణపరంగా ఈ ప్రాజెక్టు విజయవంతం అయినప్పటికీ, కేఆర్‌సీఎల్ ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తక్కువ ఆదాయం, పెరుగుతున్న మౌలిక సదుపాయాల డిమాండ్లు కేఆర్సీఎల్కు భారంగా మారాయి. ఈ నేపధ్యంలో కేఆర్‌సీఎల్(KRCL) భారత రైల్వేలో విలీనం కావాలని నిశ్చయించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వ ఆమోదాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఒక లేఖ ద్వారా తెలియజేశారు.ఈ విలీనం ఈ మార్గంలో కొత్త ప్రాజెక్టులకు నాంది పలకడంతోపాటు, కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అయితే ఈ విలీనం రెండు షరతులకు లోబడి ఉండాలని ఫడ్నవిస్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు సమాచారం. ఈ మేరకు కొంకణ్ రైల్వే అనే పేరు ఈ మార్గానికి కొనసాగడంతో పాటు, భారతీయ రైల్వే మహారాష్ట్రకు రూ. 394 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించనుంది. సంబంధిత వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ విలీన ప్రక్రియ వాస్తవ రూపం దాల్చడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: సెమికోలన్ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది? -
రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు
టికెట్ లేకుండా ట్రైన్లలో ప్రయాణించేవారి సంఖ్య చాలానే ఉంది. దీనిని నివారించడానికి ఇండియన్ రైల్వే ఓ విన్నూత చర్యకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ సుమారు 24 మిలియన్ల మంది ప్రయానికులకు సేవలందిస్తున్న ముంబై డివిజన్.. ఎఫ్‌సీబీ ఇండియా యాడ్ ఏజన్సీతో జతకట్టి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభించింది.ఇండియన్ రైల్వే.. ప్రారంభించిన ఈ లక్కీ యాత్ర ప్రచారంలో భాగంగా ప్రతి రోజూ ఒక ప్రయాణికునికి రూ. 10వేలు, వారానికి ఒక ప్రయాణికునికి రూ. 50వేలు ఫ్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం ప్రారభించడం జరిగింది. ఇది వచ్చే వారం నుంచి ప్రారంభమై ఎనిమిది వారాలు పాటు అమలులో ఉంటుందని తెలుస్తోంది.టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల.. ఇండియన్ రైల్వే ప్రతి ఏటా కోట్ల రూపాయలను కోల్పోతోంది. అయితే ఇప్పుడు ప్రైజ్ మనీ అనే ప్రచారం ప్రారభించడంతో.. ప్రైజ్ కోసమైనా కొందరు ట్రైన్ టికెట్ కొనుగోలు చేస్తారు. ప్రైజ్ మనీ కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే వారికి మాత్రమే కాకుండా.. సీజన్ పాస్‌లు తీసుకున్నవారికి కూడా లభిస్తుంది.ప్రతిరోజు.. సబర్బన్ స్టేషన్లో టికెట్ ఎగ్జామినర్ ఒక ప్రయాణికుడిని ఎంపిక చేస్తారు. అతడు చెల్లుబాటు అయ్యే రోజువారీ టికెట్ లేదా సీజన్ పాస్‌ను కలిగి ఉన్నట్లయితే.. రూ. 10,000 నగదు బహుమతిని అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వారానికి ఒకరిని ఎంపిక చేసి రూ. 50000 ప్రైజ్ మనీ అందిస్తారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌ల సమయంలో రోజుకు 4,000 నుంచి 5,000 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను తగ్గించడానికి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభమైంది. దీని ద్వారా ఎక్కివమందిని టికెట్స్ కొనేలా చేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం ముంబైలో మాత్రమే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. -
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
భారతీయ రైల్వే (Indian Railways) ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పంజాబ్ అంతటా పర్యటించిన కెకె గార్గ్ (KK Garg) ఎన్నో ప్రాంతాలలో, చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను చూశాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన మురికి వాడల్లో వందలాదిమంది చిన్నారులు పేదరికంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ తరువాత మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు గార్గ్.పంజాబ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక ట్రాక్టర్ ర్యాలీని మొబైల్ స్కూల్‌గా మార్చాడు గార్గ్. పైపింగ్‌తో వాటర్ ప్రూఫ్ ప్ల్యానల్స్ రూపొందించాడు. వేడిని బయటకు పంపడానికి అవసరమైన ఏర్పాటు చేశాడు.లైట్లు, ఫ్యాన్, బ్లాక్‌బోర్డ్ లాంటివి మొబైల్ స్కూల్లో ఉంటాయి.బఠిండాలోని ఎన్జీఒ ‘గుడ్‌విల్ సొసైటీ’ సహకారంతో ‘మొబైల్ స్కూల్’ పట్టాలకెక్కింది.స్కూల్ ట్రాలీలు బఠిండాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి.మురికివాడలు, బడులు అందుబాటులో లేని ప్రాంతాలు, స్కూల్ డ్రాపవుట్ రేటు ఎక్కువగా ఉన్నప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మొబైల్ క్లాస్‌రూమ్‌లో ప్రాథమిక అభ్యాసన సామాగ్రి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్క్లాసులో విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందలాది వలస కుటుంబాలు బఠిండాకు వచ్చి పోతుంటాయి. చాలామంది పిల్లలకు పాఠశాలల్లో చేరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండవు. మొబైల్ స్కూల్ ఈ సమస్యను పరిష్కరించింది. మొబైల్ స్కూల్స్ ద్వారా సుమారు వెయ్యిమంది పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఏడాది చదువు తరువాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో మొబైల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది’ సంతోషంగా అంటున్నాడు గార్గ్.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు -
Indian railways marks 172nd anniversary: భారతీయ రైల్వే @173
153లో ముంబై నుంచి తొలి రైలు పరుగులు..బుధవారంతో 172ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ రైల్వే విజయ వంతంగా 172 సంవత్సరాలు (Indian railways marks 172nd anniversary) పూర్తిచేసుకుని 173వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టరి్మనస్, థానేలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రయాణికుల అసోసియేషన్స్ సభ్యులు కేకులు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎంపీ నరేష్ మస్కే థానే స్టేషన్ మాస్టర్ కేశవ్తావడేతోపాటు రైల్వే అధికారులు, ప్రయాణికుల సంఘటన పదాధికారులను ప్రత్యేకంగా సన్మానించారు. బ్రిటిష్ ఇంజనీర్ జార్జ్ క్లార్క్ ఆలోచనతో... దేశ ఆరి్థక రాజధానిగా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగర అభివృద్ధికి అనేక కారణాలున్నప్పటికీ వాటిలో రైల్వేవ్యవస్థది ప్రధానపాత్ర. 1843లో మొదలై నేటి వరకూ రైల్వే దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా మోనో, మెట్రో రైళ్ల ప్రవేశం రైల్వే విస్తరణలో కీలక ముందడుగు. వీటితో పాటు ఇటీవలే ప్రారంభించిన అత్యాధునిక వందేభారత్ రైలు, త్వరలో ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్రైలు రైల్వే కిరీటంలో కలికితురాళ్లు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ముంబై రవాణా వ్యవస్థలో కీలకమైన లోకల్ రైళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అది 1843వ సంవత్సరం. ఏదో పని నిమిత్తం సైన్–భాండూప్ రోడ్డుపై వెళ్తున్న బ్రిటీష్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్‌కు హఠాత్తుగా ముంబైలోని ద్వీపాలన్నింటిని కలుపుతూ ఒక రైల్వే లైన్‌ను వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మనసులోకి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఉన్నతాధికారులతో చర్చించి పనులు ప్రారంభించారు. కేవలం పదేళ్లలో పనులు పూర్తిచేశారు. పట్టాలెక్కిన తొలి రైలు... 1853 ఏప్రిల్ 16వ తేదీ మొట్టమొదటి రైలు ముంబై నుంచి ఠాణేకి మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవంతంగా బయలుదేరింది. అప్పటినుంచి రైల్వే ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముంబై రవాణాలో బెస్ట్ బస్సులతో పాటు సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇవి ‘ముంబై లైఫ్‌లైన్’లుగా పేరుపొందాయి. ఇక్కడ ప్రజలు నిరంతరం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటారు. వారి జీవన విధానానికి తగ్గట్లుగా లోకల్ రైళ్ల వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి అయిదు నిమిషాల తేడాతో నడిచే ఈ లోకల్ రైళ్లలో ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ప్రతి రోజు సుమారు 65 లక్షలమందికిపైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నాలుగింటికి అదనంగా మరో 2 ట్రాక్‌లు.. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, ట్రాన్స్ హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్‌తోపాటు మోనో, మెట్రో రైల్వే మార్గాలలో రైళ్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో లోకల్ రైల్వేస్టేషన్లను ఆనుకని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఇతర నగరాలలో మామూలుగా ఒకటి వెళ్లేందుకు, మరోటి వచ్చేందుకు ఇలా అప్, డౌన్ మార్గాలు (రైల్వేట్రాకులు) ఉంటాయి. కానీ లోకల్ రైలు సేవల కోసం మాత్రం ప్రత్యేకంగా నాలుగు ట్రాక్‌లు ఉన్నాయి. దీంతో స్లో, ఫాస్ట్ ఇలా రెండు రకాల లోకల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు పెద్ద అంతరాయం లేకుండా పోయింది. అదే విధంగా లోకల్ రైళ్ల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అయిదు, ఆరో ట్రాక్‌లు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. సాధారణంగా లోకల్ రైళ్లన్నీ డైరెక్ట్ కరెంట్ (డిసి)పై నడుస్తాయి. తరువాతి కాలంలోనుంచి ఆల్టర్నేట్ కరెంట్ (ఎసి)కి మార్చారు. ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్చారిత్రక ఘట్టాలు... ప్రారంభంలో ముంబై ప్రజలు రైళ్లను ‘బకరా గాడీ’లని పిలిచేవారు. 1853లో మొదటి రైలు ప్రారంభం తర్వాత 1856లో మొట్టమొదటి రైల్వే టైంటేబుల్ రూపొందించారు. 1886 నుంచి ఫ్లాట్‌ఫారం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. 1874లో సైన్ రైల్వేస్టేషన్ నిర్మాణం, 1880లో ముంబై–కళ్యాణ్ రెండు వైపుల రైల్వే సేవలను ప్రారంభించారు. దేశంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన నాటి విక్టోరియా టరి్మనస్ ‘నేటి ఛత్రపతి శివాజీ టరి్మనస్)ను 1889లో, 1890లో డోంబివలి రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. సరీ్వసులను మరింత వేగవంతం చేసేందుకు 1929లో ముంబై–కళ్యాణ్‌ల మధ్య రైల్వేలైన్లను విద్యుదీకరించారు. చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన -
రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు
రైల్లో ప్రయాణికులకు లిక్విడ్ క్యాష్ అవసరాలు తీర్చేందుకు, బ్యాంకింగ్ సర్వీసులు మరింత చేరువ చేసేందుకు వీలుగా ప్రముఖ బ్యాంకులు కొత్త సేవలు ప్రారంభిస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచించి రైలు ప్రయాణికులకు నేరుగా రైల్లోనే ఏటీఎం సేవలు అందించిందుకు సిద్ధమవుతున్నాయి. నాసిక్‌లోని మన్మాడ్-ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్సెప్రెస్ ఏసీ బోగీలో ఇటీవల దేశంలోని మొదటి ఏటీఎం ట్రయల్‌రన్ నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ సహకారంతో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.రైలు ప్రయాణంలో కొన్నిసార్లు సిగ్నల్ లేకపోవడం సహజం. దాంతో మన్మాడ్-ముంబై మధ్య ఇగత్పురి, కసారా సమీపంలోని కొన్ని సొరంగాల కారణంగా సిగ్నల్‌లో అవాంతరం చోటుచేసుకుందని ట్రయల్‌రన్‌లో గమనించినట్లు అధికారులు తెలిపారు. అది మినహా ట్రెయిల్ పరీక్ష సజావుగా సాగిందని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇదీ చదవండి: పది నిమిషాల్లో ఇంటికే సిమ్ కార్డులుఈ సందర్భంగా భుసావల్ డీఆర్ఎం పాండే మాట్లాడుతూ..‘ప్రజలు ఇప్పుడు కదిలే రైలులో నగదు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం పనితీరును పర్యవేక్షిస్తున్నాం. రైలులోని మొత్తం 22 బోగీలను వెస్టిబుల్స్(రెండు బోగీల మధ్య ప్రయాణించేందుకు వీలైన మార్గం) ద్వారా అనుసంధానం చేశాం. దాంతో ప్రయాణికులు ఏటీఎంను సులభంగా చేరుకోవచ్చు’ అని చెప్పారు. ప్రయాణికుడు సంజయ్ ఝా మాట్లాడుతూ ‘ఈ ఏటీఎం ద్వారా అన్ని సేవలు నిర్వహించుకోవచ్చు. డబ్బును ఉపసంహరించుకోవచ్చు. చెక్ బుక్ లను ఆర్డర్ చేయవచ్చు. స్టేట్మెంట్లను పొందవచ్చు. ప్రయాణ సమయంలో ఈ సర్వీసు చాలా తోడ్పడుతుంది’ అన్నారు. -
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది.. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.తత్కాల్ అనేది ప్రయాణీకులకు.. తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ.. తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.కొత్త టైమింగ్ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి 'సమయం' అనే చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ / స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే.. ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.IRCTC వెబ్సైట్ & మొబైల్ యాప్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్‌గ్రేడ్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించవచ్చు..➤ IRCTC అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి➤ ట్రైన్, క్లాస్ ఎంచుకోండి (ఏసీ/నాన్ ఏసీ)➤ డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోండి➤ ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నెంబర్‌ను ఎంటర్ చేయండి➤ చెల్లింపు పేజీకి వెళ్లి బుకింగ్ పూర్తి చేయండికొత్త మార్పులు➤ సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణీకుల వివరాలను స్వయంచాలకంగా నింపడం.➤ చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.➤ బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేసారు.➤ యాప్ లేదా వెబ్సైట్ రెండింటికీ ఒకేవిధమైన లాగిన్ సిస్టమ్➤ ఒక తత్కాల్ PNR కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.➤ తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు.➤ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.గమనిక: కొన్ని ఆంగ్ల మీడియా కథనాల ఆదరణ ఈ వార్త ప్రచురించడం జరిగింది. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని IRCTC అధికారికంగా వెల్లడించింది. పాఠకులు గమనించగలరు. -
రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?
భారతీయ రైల్వే వివిధ తరగతుల్లోని ప్రయాణీకులకు లగేజీ నిబంధనలను సవరించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రయాణీకులను నియంత్రించడం, భద్రతను మెరుగుపరచడం, రైలులో స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా చూడటం దీని లక్ష్యమని అధికారులు తెలిపారు. మారిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లాలి..ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలో కింద తెలుసుకుందాం.ఎంత లగేజీని తీసుకెళ్లాలి?కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు అదనపు ఛార్జీలు లేకుండా 70 కిలోల లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారు 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత అలవెన్స్‌లో భాగంగా 40 కిలోలను అనుమతిస్తారు.సెకండ్ క్లాస్ నాన్ ఏసీకి ఉచిత లగేజీ పరిమితిని 35 కిలోలుగా నిర్ణయించారు.ప్రయాణికులు రైల్వే అనుమతించిన బరువు కంటే అధికంగా లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. లగేజీ బరువుగా లేదా భారీగా ఉంటే దానిని కంపార్ట్మెంట్లోకి అనుమతించరు. బదులుగా ప్రత్యేక లగేజీ వ్యాన్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిమాణానికి సంబంధించి కూడా రైల్వే స్పష్టమైన వివరాలు వెల్లడించింది.లగేజీ కొలతలు ఇలా..లగేజీకి గరిష్టంగా అనుమతించిన కొలత (పొడవు + వెడల్పు +ఎత్తు) 160 సెం.మీ (62 అంగుళాలు) మించకూడదు. కెమెరాలు, గొడుగులు లేదా బ్రీఫ్‌కేస్ వంటి వ్యక్తిగత వస్తువులకు 185 సెం.మీ (72 అంగుళాలు) వరకు పరిమితి విధించారు. అలా ఉంటేనే లగేజీని సీట్ల కింద లేదా ఓవర్ హెడ్ ర్యాక్‌ల్లో సరిగ్గా స్టోర్ చేయవచ్చని రైల్వే తెలిపింది. రైలు దిగిన తర్వాత కూడా నిర్దిష్ట పరిమాణంలో లగేజీ ఉంటే నడక మార్గాల్లో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశంనిషేధిత వస్తువులురైలు బోగీల్లో తీసుకెళ్లలేని నిషేధిత వస్తువులపై కూడా ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, తుపాకులు, లీకైన ద్రవాలు, ప్రమాదకరమైన లేదా అభ్యంతరకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా లేదా రైలు నుంచి వెంటనే తొలగించవచ్చు. లగేజీ ప్యాకింగ్ చేయడానికి ముందు ప్రయాణికులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని లేదా స్టేషన్ అధికారులను సంప్రదించాలని భారతీయ రైల్వే సూచించింది. -
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్!
సాక్షి, న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించాలనుకునే వారు ఇకపై కన్ఫార్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి వెళ్ల గలుగుతారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, సూరత్, వారణాసి, అయోధ్య, పాట్నా రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు రైల్వే శాఖ ఆదేశాలను పాటించాలని సూచనలు చేశారు.తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలోని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేసి.. కన్ఫార్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతించాలని నిర్ణయించారు. మహా కుంభమేళా సందర్భంగా దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా వెయింటింగ్ రూములు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, సూరత్, పాట్నాల్లో రద్దీని నియంత్రించడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. రైలు విచ్చిన తర్వాతే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించారు. ఇదే పద్ధతిని ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.60 స్టేషన్లలో తాత్కాలికంగా నిర్మించిన వెయిటింగ్ రూములను శాశ్వతంగా ఉపయోగపడేలా మార్చబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో రైళ్ల సామర్థ్యం మేరకే టికెట్లు విక్రయిస్తారు. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఢిల్లీ స్టేషన్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. BIG BREAKING NEWS 🚨 Only confirmed ticket holders will be allowed to enter platforms at 60 railway stations.Big decision by Railway Minister Ashwini Vaishnav to decongest stations.Those without a ticket or with a waiting list ticket will wait in the outside waiting area.… pic.twitter.com/IEmxJok5AE— Times Algebra (@TimesAlgebraIND) March 8, 2025 -
జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?
భారతీయ రైల్వే జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించేవారికి సంబంధించి నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. రైల్వేశాఖ అమలు చేయలని చూస్తున్న ప్రతిపాదిత నిర్ణయం వల్ల కోట్లాది మంది రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడనుంది. కొత్త నిబంధనల వల్ల రైళ్లలో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.ప్రతిపాదిత సవరణలు ఇలా..నిర్దిష్ట సాధారణ టిక్కెట్లు కొనుగోలు చేసినవారు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఏ రైలు అయినా ఎక్కవచ్చు. కానీ ఇకపై ఈ నియమాన్ని మార్చాలని చూస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా టికెట్‌పై రైలు పేరు ప్రింట్ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది ప్రయాణికులు విభిన్న రైళ్లలో మారకుండా పరిమితం చేస్తుంది. నిర్దిష్ట రైళ్లలో రద్దీని నివారించడం, మెరుగైన నిర్వహణ కోసం ఈ మార్పు అవసరమని భావిస్తున్నారు.జనరల్ టికెట్ వాలిడిటీ.. సాధారణ టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని చాలా మంది ప్రయాణికులకు తెలియదు. ఈ గడువులోగా ప్రయాణం చేయకపోతే టికెట్ చెల్లదు. ఈ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.మార్పు ఎందుకు అవసరం?రద్దీని నివారించడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే జనరల్ కంపార్ట్మెంట్లలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ కారణంగా గాయాలపాలవుతున్నారు. సాధారణ టికెట్లపై రైలు పేర్లను కేటాయించడంతో ప్రయాణికులను నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తోపులాటలో గతంలో 18 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నియమాలు సవరించాలని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ట్రంప్‌ను కలిసిన యాపిల్ సీఈఓప్రయాణికులపై ప్రభావం ఇలా..ప్రయాణికులకు వారు ఏ రైలులో ప్రయాణించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కొత్త విధానం ద్వారా వివిధ రైళ్లలో ప్రయాణికుల రద్దీను నియంత్రించవచ్చు. తొక్కిసలాటలు, ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఏ రైలులో అయినా ప్రయాణించవచ్చు. కానీ కొత్తగా మార్పులు చేస్తే వారికి కేటాయించిన రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు తనకు కేటాయించిన రైలు మిస్ అయితే కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సిందే. -
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station Stampede) తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనపై కేంద్రం, భారతీయ రైల్వే శాఖపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోచ్‌లో నిర్ధిష్ట ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ట్రైన్ టికెట్లు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారని మండిపడింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఇవాళ (ఫిబ్రవరి 19) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పైవిధంగా స్పందించింది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం (ఫిబ్రవరి 17,2025) రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పరిమితికి మించి టికెట్లను ఎందుకు అమ్ముతున్నారని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ప్రశ్నించింది.ఈ సందర్భంగా రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం,రైల్వే శాఖకు పలు సూచనలు ఇచ్చింది.రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం, ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టం ప్రకారం పరిమితికి మించి ప్రయాణికుల్ని అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా,అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.ఈ చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని అమలు చేయండి. టిక్కెట్లు అమ్మే ప్రక్రియను కట్టుదిట్టం చేయండి. భవిష్యత్‌లో రైల్వే ప్రమాదాల్ని నివారించవచ్చు. జస్టిస్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో కొంతమేర పరిమితి మించినా, ఆ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఈ అంశంపై నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దుర్ఘటనకు దారి తీస్తుంది’ అని అన్నారు. రైల్వే శాఖ తరుఫున ప్రముఖ అడ్వకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది. -
IRCTC సూపర్ యాప్: అన్నీ సేవలు ఒకేచోట
ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనున్నట్లు గత ఏడాదే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఐఆర్సీటీసీ 'స్వరైల్' (SwaRail) పేరుతో ఓ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్ వంటి అన్నీ సేవలను పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రైల్వే సేవలన్నింటినీ.. ఒకే చోట సులభంగా నావిగేట్ చేయగల ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 31, 2025న "స్వరైల్" సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. దీనిని ఆపిల్ యాప్ స్టోర్ & గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.స్వరైల్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: 2025లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్: రూ.10 వేలకంటే తక్కువే..ఐఆర్సీటీసీ స్వరైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఇప్పుడు రైల్వే సేవల కోసం ఉపయోగిస్తున్న అనేక యాప్స్ కనుమరుగవుతాయి. ఇది మొబైల్ స్టోరేజ్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా.. ఒక్కో సర్వీస్ కోసం ఒక్కో యాప్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. -
రైల్వే అంతటా ‘కవచ్’ అమలు
వచ్చే ఆరేళ్లలో మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ‘కవచ్’ టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను పెంచడానికి, స్టేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి, సురక్షితమైన రైల్వే వ్యవస్థను నిర్ధారించడానికి తోడ్పడుతుందని చెప్పారు. రైల్వే రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయితే మౌలిక సదుపాయాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా కవచ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రైల్వే భద్రత కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థనే కవచ్‌గా పిలుస్తారు. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు రైల్వే బోర్డు గతంలో అనుమతించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024 నాటికి దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే అంతటా 1,548 కిలోమీటర్లకు పైగా కవచ్‌ను విస్తరించారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి అధిక ప్రాధాన్యత గల మార్గాల్లో అదనంగా 3,000 కిలోమీటర్లను కవర్ చేయాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందనప్రయాణికుల భద్రత, స్టేషన్ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైల్వేకు రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అందులో భద్రతకు రూ.1.16 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల వినియోగంలో భాగంగా కవచ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10,000 లోకోమోటివ్ల ఏర్పాటు, ప్రతి స్టేషన్, బ్లాక్ సెక్షన్ వద్ద కవచ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. చాలాచోట్ల వ్యవస్థలో లోపం వల్ల రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు తాత్కాలిక ఉపశమనం కింద ఆర్థిక, వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదనేది వాస్తవం. ప్రమాదాల మూలాలను గమనించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కశ్మీర్‌కు వందేభారత్ రికార్డు పరుగు
శ్రీనగర్: కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్‌లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది. ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్లో పూర్తి చేసింది. వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు. వాక్యూమ్ సిస్టమ్‌కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్‌పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్‌పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ. -
డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..
'బుక్ నౌ.. పే లేటర్' విధానాన్ని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆటో మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్సైట్లు ఈ విధానం అమలు చేస్తున్నాయి. కాగా ఇప్పుడు 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (ఐఆర్సీటీసీ) దీనిని ప్రవేశపెట్టింది. అంటే డబ్బు లేకపోయినా టికెట్ పొందవచ్చు, ఆ తరువాత గడువు లోపల డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన 'ఇప్పుడే బుక్ చేయండి, తర్వాత చెల్లించండి' విధానంలో.. బుకింగ్ ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయాలి. బుక్ చేసుకున్న తరువాత 14 రోజుల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.'బుక్ నౌ.. పే లేటర్'➤ముందుగా IRCTC అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤బుక్ నౌ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. ప్రయాణం చేయాల్సిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.➤ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, భీమ్ (BHIM) యాప్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి.➤పే లేటర్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. 'ఈపేలేటర్' ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.➤ముందుగా ఈపేలేటర్ పేజీలో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్స్ పేజీలో 'పే లేటర్' ఆప్షన్ కనిపిస్తుంది.➤ఇలా పే లేటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బు చెల్లించాలి.➤14 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే.. 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: TRAI: రూ. 20తో.. 120 రోజులు: ఇదే రూల్.. -
ఈ యాప్‌లలో ట్రైన్ టికెట్ బుక్ చేస్తే.. కన్ఫర్మ్ అవ్వాల్సిందే!
మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే.. భారతీయ రైల్వే అత్యంత చౌకైన.. ఉత్తమ మార్గం. రోజూ లక్షలమంది రైలు ద్వారానే ప్రయాణిస్తున్నారు. అయితే మనం కొన్ని సార్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు.. ముందుగానే బుక్ చేసుకుంటే ప్రయాణం సులభంగా ఉంటుంది. గతంలో ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలంటే.. తప్పకుండా రైల్వే స్టేషన్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఇంట్లో కూర్చునే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఉత్తమైన యాప్స్ గురించి తెలుసుకుందాం.ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect)ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్.. అనేది ఇండియన్ రైల్వే అధికారిక యాప్. దీని ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ వంటివి చేసుకోవచ్చు, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కోచ్ వివరాలు, బెర్త్ నెంబర్ వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.ఐఆర్సీటీసీ యూటీఎస్ (IRCTC UTS)ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే.. యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ టికెట్స్, మంత్లీ సీజనల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రైన్లలో ప్రయాణించేవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కన్ఫర్మ్ టికెట్ (Confirmtkt)ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఈ 'కన్ఫర్మ్ టికెట్' యాప్ ఓ మంచి ఎంపిక. ఈ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాదు, చెల్లింపులు కూడా చాలా సులభంగా ఉంటాయి. ఇందులో తత్కాల్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.ఇక్సిగో (Ixigo)ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్స్ మాత్రమే కాకుండా.. విమానాలు, హోటళ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ట్రైన్ ట్రాకింగ్, లైవ్ అప్డేట్స్ వంటివి కూడా తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ట్రైన్ రియల్ స్టేటస్ తీసుకోవడానికి ఈ యాప్ సహకరిస్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిమేక్మైట్రిప్ (Makemytrip)ప్రస్తుతం మేక్మైట్రిప్ అనేది చాలా పాపులర్ యాప్. ఇందులో ట్రిప్ గ్యారెంటీ అనే ఫీచర్ ఉండటం వల్ల.. కన్ఫర్మ్గా టికెట్ బుక్ అవుతుంది. టికెట్ క్యాన్సిల్ అయితే మీ డబ్బుతో పాటు.. ఇతర ఉపయోగకరం కూపన్లు వంటివి కూడా లభిస్తాయి. ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్‌లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ యాప్ అనే చెప్పాలి. -
రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..
రైల్లో ప్రయాణ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రమాదవశాత్తు వస్తువులు కింద పడుతుంటాయి. ఆ సందర్భంలో సాధారణంగా చాలామంది ఎమర్జెన్సీ చైన్ లాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అలా చైన్ లాగితే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించడంతోపాటు, జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో వస్తువులు ఏవైనా కిందపడితే వాటిని తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం.రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు వాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులు కింద పడినప్పుడు వెంటనే చైన్ లాగకుండా, వస్తువులు పడిన పరిధిలోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి. వెంటనే టికెట్ కలెక్టర్(టీసీ)ను సంప్రదించాలి. వస్తువు పడిన ప్రదేశం వెనకాల వెళ్లిన స్టేషన్, తదుపరి స్టేషన్ వివరాలు, పోల్ నంబర్‌ను రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారులకు అందించాలి. పోల్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని రెండు స్టేషన్ల మధ్య పోయిన వస్తువును వెతికేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఏదైనా సహాయం కోసం రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 182 లేదా సాధారణ రైల్వే హెల్ప్‌లైన్ 139కి కూడా కాల్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఇండియన్ రైల్వే యూఎస్, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రైల్వే నెట్వర్క్. రోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఫిబ్రవరి 1, 2023 లెక్కల ప్రకారం మొత్తం ఇండియన్ రైల్వే సర్వీసులో దాదాపు 11,75,925 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..
రైలు వేగంగా వెళ్తోంది.. బోగీలోని ప్రయాణికుల్లో కొందరు ఫోన్ చూస్తున్నారు.. ఇంకొందరు బంధువులతో ముచ్చటిస్తున్నారు.. చిన్న పిల్లలు ఆడుతున్నారు. పెద్దవారు తమ ఆరోగ్య విషయాలను చర్చించుకుంటున్నారు..అంతలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్ని జ్వాలలుగా మారాయి. పెద్దగా శబ్దం చేస్తూ ‘మంటలు.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ ప్రయాణికులు అరుస్తున్నారు. చెయిన్ లాగినా ట్రెయిన్ ఆగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారికి ‘రెడ్ విండో’ గుర్తొచ్చింది. బోగీలోని యువకుల సాయంతో అందరూ అందులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు రైల్వే బోగీల్లో ‘రెడ్ విండో’ అవసరం ఏమిటి.. దాన్ని గుర్తించడం ఎలా.. అనే విషయాలు తెలుసుకుందాం.మనుషులు దూరేందుకు వీలుగా..మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు దాదాపు అన్ని కోచ్‌ల్లో ప్రత్యేకమైన ఎరుపు రంగు విండోను గమనించే ఉంటారు. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణీకుల భద్రతలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రైలు కోచ్‌ల్లో ఈ విండోను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌గా రూపొందించారు. రైల్లో ఇతర కిటీకీల మాదిరిగా దీనికి ఇనుప కడ్డీలుండవు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మనుషులు దూరేందుకు వీలుగా ఉంటుంది. అత్యవసర సమయంలో వెంటనే తెరిచేలా దీన్ని డిజైన్ చేశారు.బోగీ మధ్యలో ఉన్నవారికి అనువుగా..అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, రైలు పట్టాలు తప్పడం వంటి మరేదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రయాణికులు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను వినియోగిస్తారు. బోగీ మెయిన్ డోర్‌కు దగ్గరగా ఉన్నవారు ఎలాగైనా ఆ డోర్లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి మధ్యలో ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి రైల్వే విభాగం బోగీ మధ్యలో ఎమర్జెన్సీ విండోను అందుబాటులో ఉంచింది.ఇదీ చదవండి: షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకోని సందర్భాల్లో రెస్క్యూ టీమ్ ఈ ఎమర్జెన్సీ విండోస్ నుంచి బోగీలోకి ప్రవేశించి ప్రయాణికులను కాపాడేందుకు వీలుంటుంది. రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వారు డోర్ నుంచి దిగిపోయి తమ వస్తువులను ఈ విండో ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న పోర్టర్ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.A tragic incident occurred at Barauni Junction, Bihar, where a railway worker lost his life due to negligence during shunting operations.Meanwhile, the Railway Minister remains occupied with PR and social media.It seems that the railway prioritizes neither passenger safety… pic.twitter.com/teR9r4rzuj— Fight Against Crime & Illegal Activities (@FightAgainstCr) November 9, 2024చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 లక్షల ఖర్చు, 1500 మంది జనం! -
ప్రీమియం రైళ్లలో ప్రత్యేకత ఇదే
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే వీటిని దేశానికి లైఫ్ లైన్ అని అంటారు. భారతీయ రైల్వేలు పేద తరగతికి అతి తక్కువ ఛార్జీలతో జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతుండగా, ధనికుల కోసం వందే భారత్ వంటి ప్రీమియం సెమీ-హై స్పీడ్ రైళ్లను కూడా నడుపుతున్నాయి. వీటిలోని కొన్ని రైళ్లలో ప్రయాణీకులు ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు.సాధారణంగా సుదూర రైళ్లలో మాత్రమే ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు. అయితే దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ఆహారం అందిస్తారు. దీని కోసం విడిగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ తదితర ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి వారు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆహారం కోసం ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఈ రైళ్ల టిక్కెట్లలో ఆహారం ఖర్చు కూడా జతచేరి ఉంటుంది. ఇతర రైళ్లలో మాదిరిగా కాకుండా ఈ రైళ్లలో విడిగా ఆహారానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.ఇతర సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్లతో పాటు ఆహారం కోసం ఎటువంటి ఛార్జీ విధించరు. అటువంటి పరిస్థితిలో ఈ సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఆహారం కోసం విడిగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది తదితర ప్రీమియం రైళ్లలో ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
ఏబీబీ ఇండియా, ఐఆర్‌ఎప్‌సీ ఫలితాలు
ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. జులై–సెప్టెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ.440 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ.362 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ.2,846 కోట్ల నుంచి రూ.3,005 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 11 శాతం అధికంగా రూ.3,342 కోట్ల విలువైన ఆర్డర్లు అందుకుంది. దీంతో మొత్తం ఆర్డర్ల విలువ రూ.9,995 కోట్లకు చేరింది. ఇది 25 శాతం వృద్ధి.ఇదీ చదవండి: ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..ఐఆర్ఎఫ్సీ లాభం ప్లస్ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీ..ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ.1,613 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.1,545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.6,762 కోట్ల నుంచి రూ.6,900 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ.5,218 కోట్ల నుంచి రూ.5,288 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. మినీరత్న కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 సెప్టెంబర్‌కల్లా రూ.4,62,283 కోట్లకు చేరాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 0.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు భారతీయ రైల్వే త్వరలో ఒక సూపర్ యాప్‌ను విడుదల చేయనుంది. ఈ సూపర్ యాప్ డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్, రైలు రాకపోకల సమాచారం, ఆహారం, రైలు రన్నింగ్ స్థితి తదితర వివరాలను అత్యంత సులభంగా తెలుసుకోవచ్చు.త్వరలో అందుబాటులోకి రానున్న భారతీయ రైల్వేల సూపర్ యాప్ ఇప్పటికే ఉన్న ఐఆర్సీటీసీ యాప్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ సూపర్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్, పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. రైల్వే టైమ్‌టేబుల్‌ను కూడా చూడవచ్చు. ఈ యాప్‌ను రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది.ప్రస్తుతం ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా విమాన టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. రైలులో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే భారతీయ రైల్వే మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత చేరువకానుంది.ఇది కూడా చదవండి: సగం సీట్లు ‘ఇతరులకే’..! -
సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్.. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుంటే మరో యాప్, ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక్కో యాప్. ఈ విధానానికి ఐఆర్సీటీసీ మంగళం పడనుంది. ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనుంది.ఐఆర్సీటీసీ ప్రారంభించనున్న ఈ సూపర్ యాప్‌ను.. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు. ఇది 2024 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను తీసుకువస్తున్నారు.ఇండియన్ రైల్వే లాంచ్ చేయనున్న సూపర్ యాప్‌ను సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) అభివృద్ధి చేస్తోంది. దీనికి యాప్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ పాస్‌లు, ఫుడ్ డెలివరీ వంటి వాటిని అనుసంధానిస్తోంది. అంటే ఈ ఒక్క యాప్‌లోనే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ప్లాట్‌ఫామ్ పాస్ వంటివన్నీ కూడా పొందవచ్చు. అంతే కాకుండా ట్రైన్ జర్నీ స్టేటస్ కూడా ఇందులోనే తెలుసుకోవచ్చని సమాచారం.ఇండియన్ రైల్వే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ పార్టీ యాప్‌ల మీద ఆధారపడే అవసరం ఉండదు. ట్రైన్ జర్నీ చేసేవారు ఎక్కువ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం తీరిపోతుంది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా.. వినియోగదారు అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..
పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్‌గా మారింది.అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేశాను. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో రూ.100 కట్ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు.Dear @RailMinIndia @AshwiniVaishnaw I booked a waitlisted ticket from Delhi to Prayagraj, but it didn’t get confirmed after the chart was prepared. Could you explain why 100 rupees were deducted from the refund instead of receiving the full amount#IRCTC #railway pic.twitter.com/L3UzYoq67P— SameerKhan (@SameerK95044261) October 29, 2024ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమంఐఆర్సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.As per Indian Railway rules in case of waitlisted/RAC ticket clerkage charges Rs. 60/- along with GST per passenger shall be levied Please follow the given link: https://t.co/0Mek9yKVW3— IRCTC (@IRCTCofficial) October 29, 2024ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..> టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GSTఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GSTఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GSTస్లీపర్: రూ.120సెకండ్ క్లాస్: రూ.60> ట్రెయిన్ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు. -
ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పు
రైల్వే ప్రయాణం చేయాలంటే చాలామంది ముందుగా టికెట్స్ బుక్ చేస్తారు. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు.ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతే కాకుండా అక్టోబర్ 31 వరకు బుక్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. నవంబర్ 1 నుంచి అడ్వాన్స్ బుక్ చేసుకోవాలనుకునేవారికి మాత్రమే ఈ కొత్త నియమం వర్తిస్తుంది.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుతాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్‌లలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇందులో అడ్వాన్డ్ బుకింగ్ వ్యవధి తక్కువగానే ఉంది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదని ఐఆర్సీటీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
గంటకు 9 కిలోమీటర్లు.. మనదేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే!
Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి. ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు. చదవండి: బాలపిట్టలూ బయటికెగరండిమేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్15) ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లకు బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్‌లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్‌లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్‌పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
ఇండియన్ రైల్వే టార్గెట్.. ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం
టెక్నాలజీ ఎంత పెరిగిన రైలు ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అన్నారు. వచ్చే ఐదేళ్లలో నేషనల్ ట్రాన్స్పోర్టర్ 44,000 కి.మీలను కవచ్ కిందకు తీసుకువస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకీ ఈ కవచ్ సిస్టం అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. అదే ట్రాక్ మీద ఒకవేలా ట్రైన్ వస్తే అలాంటి సమయంలో రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రమాద సంకేతాలకు గుర్తిస్తే వెంటనే ట్రైన్ ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలు గురించినప్పటికీ ట్రైన్ ఆపరేటర్ చర్యలు తీసుకొని సమయంలో ఇదే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది.ప్రస్తుతం కవచ్ సిస్టమ్‌కు ముగ్గురు మాత్రమే తయారీదారులు ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ తయారీదారులు కూడా పెంచాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా మార్గాల్లో కవచ్ ఇన్‌స్టాలేషన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి మరో 6000 కిమీ కవచ్ ఇన్స్టాలేషన్ కోసం టెండర్లను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.ప్రపంచంలోని చాలా ప్రధాన రైల్వే వ్యవస్థలు 1980లలో కవాచ్ మాదిరిగా ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ATP)కి మారాయి. అయితే మనదేశంలో భారతీయ రైల్వే 2016లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TACS) మొదటి వెర్షన్ ఆమోదంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఈ కవచ్ సిస్టం దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు. -
రైల్ టికెట్ ధర తక్కువే.. ఆదాయం రూ.లక్షల కోట్లు.. ఎలా సాధ్యమంటే..
దేశంలో రైల్వే అతిపెద్ద రవాణ వ్యవస్థగా చలామణి అవుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. అందులో ఛార్జీలు తక్కువ ఉండటంతో సామాన్య జనాలు కూడా రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ రైల్వేశాఖ లక్షల కోట్లు ఆర్జిస్తోంది. అయితే దాదాపు 15 లక్షల మంది పనిచేస్తున్న ఈ సంస్థ టికెట్ ఛార్జీలపైనే ఆధారపడి ఇంతపెద్ద నెట్‌వర్క్‌ను ఎలా నిర్వహిస్తుంది..? అంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి తగినంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం రాకమానదు.. కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా చాలా మార్గాల్లో రైల్వేశాఖ డబ్బు సమకూర్చుకుంటోంది. అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ట్రెయిన్లో ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నప్పుడు రిజర్వేషన్ లభిస్తుందో లేదోనని ముందుగానే ఐఆర్సీటీసీలో లేదా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలో టికెట్లను బుక్ చేస్తుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం దాదాపు అందరూ ఆన్లైన్ ద్వారానే బుక్ చేస్తున్నారు. వేసవి సెలవులు, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, పండుగ సీజన్లలో రైలు టికెట్లు దొరకడం చాలా కష్టం. అందుకే అడ్వాన్స్‌గా రిజర్వేషన్ చేస్తుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఏవైనా మార్పులు ఉంటే రైల్ టికెట్లను రద్దు చేస్తుంటారు. ఒకసారి టికెట్ క్యాన్సిల్ చేస్తే మనం మందుగా చెల్లించిన మొత్తం తిరిగిరాదు. అందులో క్యాన్సలేషన్ ఛార్జీలు, ఇతరత్రా ఛార్జీల పేరిట రైల్వేశాఖ అదనపు భారాన్ని విధిస్తోంది. దాంతోపాటు బుక్ చేసుకున్న సమయంలో టికెట్ బుక్ కాకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి, చివరి సమయం వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఛార్జీలు విధిస్తుంటారు. అలా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా రైల్వేశాఖకు 2021-24(జనవరి వరకు) మధ్యకాలంలో ఏకంగా రూ.1,229.85 కోట్లు సమకూరినట్లు తెలిసింది. ఖజానాలో ఇలా తేరగా వచ్చిచేరే ఆదాయంతోపాటు రైల్వే వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తోంది. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. అద్దెలు: రైల్వేశాఖ కొన్ని ప్రముఖ నగరాల్లో వాణిజ్యభవనాలు నిర్మించి, వాటిని ఇతర ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అద్దెకు ఇస్తుంది. దాంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. టోల్లు: క్లిష్టమైన మార్గాల్లో బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడం వంటి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ అక్కడి ప్రయాణికుల ద్వారా టోల్ ఆదాయాన్ని పొందుతుంది. కేటరింగ్ సేవలు: ఇందులో రెండు మార్గాల ద్వారా రైల్వేకు ఆదాయం సమకూరుతుంది. ఒకటి ఆన్లైన్ కేటరింగ్, రెండోది ఆఫ్‌లైన్ కేటరింగ్. ఆన్లైన్ కేటరింగ్ జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరి సంస్థలతో జతకూడి రైళ్లలోని ప్రయాణికులకు సేవలిందిస్తూ ఆదాయం సమకూర్చుకుంటుంది. ఒకవేళ ప్రయాణికులు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే పర్సంటేజ్ ప్రకారం ఫుడ్ డెలివరీ సంస్థకు కొంత, రైల్వేశాఖకు కొంతమేర ఛార్జీల రూపంలో డబ్బు వెళ్తుంది. ఇక ఆఫ్‌లైన్‌లో.. నిత్యం రైల్ కాంపార్ట్‌మెంట్‌లో నేరుగా ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, స్నాక్స్, ఫుడ్.. అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. క్లెయిమ్ చేయని వస్తువుల అమ్మకం: కొన్నిసార్లు గూడ్స్ రైళ్లలో రవాణా అయిన వస్తువులు స్టోర్‌రూమ్‌ల్లో చాలాఏళ్లపాటు అలాగే ఉండిపోతాయి. వాటికి సంబంధించిన న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుని వేలం వేయడమో లేదా ఇతర మార్గాల ద్వారా వాటిని విక్రయించి సొమ్ముచేసుకుంటారు. తుక్కుగా మార్చి ఆదాయం: రైల్వే విభాగంలో నిత్యం వినియోగిస్తున్న వస్తువులు, కాలం చెల్లిన ఇనుప వస్తువులను తుక్కుగా మార్చి ఇతర కంపెనీలకు బిడ్డింగ్ ద్వారా కట్టబెట్టి ఆదాయం ఆర్జిస్తారు. పెట్టుబడులు: స్టాక్మార్కెట్లో ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సీ వంటి ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో డివిడెండ్ల రూపంలో ఆదాయం సంపాదిస్తోంది. రాయితీ మాఫీ: కరోనా వైరస్ విజృంభించడంతో వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. ఇలా వయోవృద్ధులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది. ప్రకటనలు: ఇతర కంపెనీలు రైల్వేప్లాట్ఫామ్లు, బోర్డింగ్‌లో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. దానికోసం రైల్వేకు డబ్బు చెల్లిస్తారు. ప్లాట్‌ఫామ్ రెంట్‌కు ఇస్తూ..: కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ప్లాట్‌ఫామ్ స్థలాన్ని రెంట్ ఇచ్చి ఆదాయం సమకూరుస్తుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో సినిమా షూటింగ్‌లు వంటివాటికి కూడా ప్లాట్‌ఫామ్‌ను కిరాయికి ఇస్తారు. పైన తెలిపిన ఆదాయ మార్గాలతోపాటు ప్రధానంగా ప్రయాణ టికెట్లు, సరకు రవాణాతో సాధారణంగా రైల్వే ఖజానా నిండుతోంది. ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా నవంబరు 2023లో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఆ నెలలో ప్రయాణికుల నుంచి రూ.469.40 కోట్లు, 11.57 మిలియన్ టన్నుల వస్తు రవాణా ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోల్చుకుంటే 2022-23లో ఆదాయం రూ.49 వేల కోట్లు ఎక్కువ. దీనిలో భారతీయ రైల్వే గరిష్టంగా 1.62 లక్షల కోట్ల రూపాయలను సరుకు రవాణా ద్వారా ఆర్జించింది. టిక్కెట్ల ద్వారా రూ.63,300 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలింది ఇతర ఆదాయం రూపంలో వచ్చింది. ఇదీ చదవండి: జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి.. భారతీయ రైల్వే చరిత్ర దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు ప్రయాణించింది. హైదరాబాద్ రాష్ట్రంలో 1873 నాటికి నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ కొలువు తీరింది. మొదటి రైల్వే లైను 1874, జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్‌కు ప్రారంభమైంది. 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1951లో భారతీయ రైల్వేలను ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రపంచంలో పొడవైన రైలు ప్లాట్‌ఫాం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. దీని పొడవు 1.3 కి.మీ. ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా (2,28,218 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ.), రష్యా (87,157కి.మీ.), భారత్ (65,408 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్లు 21 వేలు. ఇవి ప్రతి రోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి. అత్యధిక దూరం ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్సెప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఇది 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణం చేస్తుంది. -
IRCTC: ట్రైన్ జర్నీలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో నచ్చిన ఆహారాన్ని.. ఉన్న చోటుకే తెప్పించుకుని తినేస్తున్నాం. ఈ డెలివరీ సర్వీసులు దాదాపు నగరాలకే పరిమితమయినప్పటికీ, స్విగ్గీ మాత్రం 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుని మరో అడుగు ముందు వేసింది. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ అండ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇకపైన రైళ్లలో ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి స్విగ్గీ సన్నద్ధమైంది. ఈ సర్వీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో స్విగ్గీ ఈ సర్వీసును బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో 59 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసును విస్తరించనున్నట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణించే సమయంలో నచ్చిన ఫుడ్‌ను ప్రీ-ఆర్డర్ చేయడానికి ముందుగా ఐఆర్సీటీసీ యాప్‌లో పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాము ఏ స్టేషన్లో అయితే ఆహారాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఆ రైల్వే స్టేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలా చేసుకున్న తరువాత మీకు మీరు ఎంచుకున్న ఫుడ్‌ను స్విగ్గీ డెలివరీ బాయ్స్ తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. స్విగ్గీతో ఏర్పడ్డ ఈ భాగస్వామ్యం ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని, వారు కోరుకునే ఆహరం ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో లభిస్తుందని, ఇది వారి ప్రయాణాన్ని మరింత సంతోషంగా మార్చడంలో ఉపయోగపడుతుందని IRCTC ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. -
రైళ్లలో ఫుడ్.. ఐఆర్సీటీసీ లేటెస్ట్ అప్డేట్
IRCTC Update : రైళ్లలో ఫుడ్ సప్లయికి సంబంధించి భారతీయ రైల్వే నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రీ-ఆర్డర్ చేసిన భోజనాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ప్రసిద్ధ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ ఫుడ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా డెలివరీ చేస్తారు. తొలిదశలో భాగంగా బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం త్వరలో ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. “సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్, 2015 రెగ్యులేషన్ 30 ప్రకారం.. ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసిన భోజనం సరఫరా & డెలివరీ కోసం PoC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్సీటీసీ టైఅప్ అయిందని తెలియజేస్తున్నాం. మొదటి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో అంటే బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంలో బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ- క్యాటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు” అని బీఎస్ఈ ఫైలింగ్‌లో ఐఆర్టీసీ పేర్కొంది. -
ట్రైన్ టికెట్ ధరలపై రాయితీ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ : దేశంలో రైల్వే ఛార్జీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులపై అశ్విని వైష్ణవ్ రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలువురు జర్నలిస్ట్‌లు రైల్వే ఛార్జీలపై పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే ఇస్తుంది కదా సీనియర్ సిటిజన్ల కోసం ప్రీ-కోవిడ్‌కు ముందు ఉన్న ఛార్జీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు ఆయన స్పందించారు.. ‘‘ ఇండియన్ రైల్వే ఇప్పటికే ప్రతి ప్రయాణికుడి ట్రైన్ టికెట్‌పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు అయ్యే ట్రైన్ టికెట్ ధర రూ. 100 అయితే, రైల్వే కేవలం రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది రూ. 55 రాయితీ ఇస్తోంది.’’ అని అన్నారు. రాయితీలపై అదే మాట కోవిడ్-19 లాక్ డౌన్ ముందు అంటే మార్చి 2020లో రైల్వే శాఖ టికెట్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు, అక్రేడియేటెడ్ జర్నలిస్ట్‌లకు 50 శాతం రాయితీ కల్పించింది. లాక్డౌన్ సమయంలో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే జూన్ 2022లో పూర్తి స్థాయి పునఃప్రారంభమైనప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రాయితీలను పునరుద్ధరించలేదు. అప్పటి నుండి ఈ సమస్య పార్లమెంటులో పలు మార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయాల్లో వైష్ణవ్ పై విధంగా స్పందించారు. ఆర్టీఐలో ఏముందంటే? అంతకుముందు, మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై స్పందిస్తూ భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుండి సుమారు రూ. 2,242 కోట్లు ఆర్జించిందని తెలిపింది. -
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైలు టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదు చేయడం... ఇలా అన్ని సేవలను ఒకే చోట ప్రయాణికులకు అందించేందుకు భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రైల్వే విభాగం అందించే అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. ఇన్నాళ్ల మాదిరిగా ప్రయాణికులు వేర్వేరు యాప్‌లపై అధారపడనవసరం లేదు. ఈ యాప్ ప్రాజెక్టును రైల్వే ఐటి వింగ్, సీర్ఐఎస్ పర్యవేక్షిస్తున్నదని రైల్వే విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. రైల్ మదద్, యూటీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, పోర్ట్రెయిట్, విజిలెంట్ తనిఖీ కార్యకలాపాల టీఎంఎస్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్, ఐఆర్సీటీసీ ఎయిర్ మొదలైన సేవలన్నీ కొత్త సూపర్ యాప్‌లో విలీనం కానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కోట్లాది మంది రైల్వే వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. రైల్వేకు సంబంధించిన అనేక పనులు ఇక వినియోగదారులకు సులభతరం కానున్నాయి. రైల్వే విభాగానికి ఈ సూపర్ యాప్ తయారీకి దాదాపు రూ. 90 కోట్ల ఖర్చు కానుంది. మూడు సంవత్సరాలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు అందుకున్న మొత్తం బుకింగ్‌లలో దాదాపు 5,60,000 బుకింగ్‌లు (సగానికి పైగా) ఐఆర్సీటీసీ యాప్ ద్వారా అందాయి. -
2023.. భారతీయ రైల్వేలో అద్భుతాలివే..
2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్.. ప్రపంచంలో భారీ నెట్వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా భారత్‌లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన స్టేషన్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మూడువేల కొత్త రైళ్లు.. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు. లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం! -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్
పండగ రద్దీ భారతీయ రైల్వేకు నిత్యం పెద్ద సవాలుగా మారుతోంది. పండగ నేపథ్యంలో లక్షలాది మంది స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణిస్తుంటారు. రైల్వేశాఖ అందుకు అనుగుణంగా సాధారణ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కానీ ఎప్పటిలాగే పండగ రోజుల్లో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చలేకపోతోంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దీపావళి నేపథ్యంలో అదే తంతు కొనసాగింది. కొంతమంది ప్రయాణికులు అందుకు సంబంధించిన వీడియోలు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. Bihar govt should now run special trains for their native migrant labors . There are people who paid for AC 2 n 3 tickets but couldn't board cause these chalu ticket climbed overcrowded the train n shut the door. and as usual Indian Railway management was clueless https://t.co/hLuRWQyz3d — Romeo Sierra (@sierraromeo98) November 11, 2023 PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 Why should I pay extra reservation charges if this is how I have to travel after paying extra charge for reservation. I m not demanding Tejas Coach Services, i demand my reserved seat #IndianRailways #resign https://t.co/sOjTgPdo9v — yogita chulet (@YogitaChulet) November 9, 2023 -
వందే భారత్‌లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
ఇండియన్ రైల్వే దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మరింత వేగవంతమైన ప్రయాణం కోసం గత కొంత కాలంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పుట్టుకొస్తున్నాయి. నేడు చాలామంది దూరప్రయాణాలు చేసేవారు కూడా వందే భారత్‌లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా కొంతమంది ప్యాసింజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రైల్వే శాఖ ఇప్పుడు కొన్ని మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వందే భారత్ ట్రైన్లలో లంచ్ లేదా డిన్నర్ ఆర్డర్ చేసే ప్రయాణికులకు మెనూలో లేని పదార్థాలు కూడా విక్రయిస్తున్నారని, ఫుడ్ ఐటమ్ కవర్లన్నీ కొందరు కోచ్‌లోనే పడేయడం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతోందని, ఇది ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగిస్తుందని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్ వంటి వాటిని ఆరు నెలలు పాటు నిషేదించింది. ఫుడ్ కవర్లు కోచ్‌లో ఉండటం వల్ల.. కొన్ని సార్లు ఆటోమాటిక్ డోర్లు ఓపెన్ అవుతున్నాయి. అంతే కాకుండా వ్యర్దాల వల్ల కోచ్‌లో దుర్వాసన కూడా వ్యాపిస్తోంది. ఈ కారణాల వల్ల రైల్వేశాఖ ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విషయం మీద కూడా కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇకపై బుక్ చేసేటప్పుడు బుకింగ్ సమయంలోనే ప్రయాణానికి ముందు రీకన్ఫర్మేషన్ క్యాటరింగ్ సర్వీస్ వివరాలు ప్రయాణికులకు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇది ప్రయాణికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఆ ఒక్క నిర్ణయంతో రూ.2800 కోట్ల ఆదాయం - కేవలం ఏడేళ్లలో..
ఇండియన్ రైల్వే దినదినాభివృది చెందుతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే కొత్త ట్రైన్లు ప్రారంభించడమే కాకుండా కొత్త కొత్త సర్వీసులను కూడా అందిస్తోంది. అయితే ఇటీవల రైల్వే ఆదాయానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వే గత ఏడు సంవత్సరాలలో పిల్లల టికెట్లు (చైల్డ్ ట్రావెలర్స్) విక్రయించి ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందినట్లు తెలుస్తోంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 560 కోట్లు ఆర్జించినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) వెల్లడించింది. ట్రైన్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్త్‌లు లేదా రిజర్వ్ కోచ్‌లో సీట్లు ఎంచుకోవచ్చు. అలాంటి వారు సాధారణ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం 2016 ఏప్రిల్ 21 నుంచి అమలులోకి వచ్చింది. అంతకు ముందు రైల్వేలో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్తులు అందించే వారు. ఆ సమయంలో సగం చార్జీలే వసూలు చేసేవారు. ఈ నియమాలు సవరించిన తరువాత రైల్వే మరింత లాభాలను ఆర్జించడం మొదలుపెట్టింది. ఇదీ చదవండి: బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే? 2016 - 17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 - 23 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 3.6 కోట్లమంది పిల్లలు రిజర్వ్డ్ సీటు లేదా కోచ్ ఎంచుకోకుండా సగం చార్జీల మీద ప్రయాణిస్తే.. 10 కోట్లమంది పిల్లలు ప్రత్యేక బెర్త్/సీటును ఎంచుకుని పూర్తి చార్జీలు చెల్లించినట్లు తెలిసింది. మొత్తం మీద సుమారు 70 శాతం మంది పూర్తి చార్జీలు చెల్లించి బెర్త్ పొందటానికి ఇష్టపడుతున్నట్లు చంద్ర శేఖర్ గౌర్ తెలిపారు. -
ఇదే జరిగితే ట్రైన్ జర్నీ మరింత సేఫ్!
AI Technology: గత కొన్ని రోజులకు ముందు ట్రైన్ ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అలాంటి ప్రమాదాలను తగ్గించడానికి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (Northeast Frontier Railway) ఒక కొత్త ప్రయోగానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్రైన్ ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలలో ఒకటి కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు నిద్రపోవడం కూడా. కావున అలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి రైల్వే 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI)ను ఉపయోగిస్తోంది. ఇది అమలులోకి వస్తే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నా లేదా కంటిరెప్పలు వాల్చుతున్నా.. డివైజ్ ముందే గుర్తిస్తుంది. అవసరమైతే ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేస్తుంది. కంటిరెప్పలు వాల్చుతున్న పరిస్థిని బట్టి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి కొత్త టెక్నాలజీ కావాలని రైల్వే బోర్డు ఇప్పటికే 'ఎన్ఎఫ్ఆర్'ను కోరింది. ఈ కొత్త విధానానికి రైల్వే డ్రైవర్ అసిస్ట్ సిస్టం (RDAS) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా రానున్న రోజుల్లో ఇది అమలులోకి రానున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీపై 'ది ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్‌మెన్ ఆర్గనైజేషన్' (IRLRO) సుముఖత చూపకపోవడం గమనార్హం. ఇలాంటి టెక్నాలజీ అవసరం లేదని, ఇప్పటికే వేగంగా ప్రయాణించే రైళ్లలో డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి కావలసిన వ్యవస్థలు ఉన్నాయని వెల్లడించింది. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రతి హై-స్పీడ్ రైలు ఇంజన్ 60 సెకన్లకు ఒకసారి డ్రైవర్ కొట్టాల్సిన ఫుట్-ఆపరేటెడ్ లివర్ (పెడల్)తో వస్తుంది. ఒకవేళ డ్రైవర్ అలా చేయకాపోతే ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేక్‌లు పడతాయి, తద్వారా ట్రైన్ ఆగిపోతుంది. ఈ వ్యవస్థ సరిపోతుందని ఐఆర్ఎల్ఆర్ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ 'సంజయ్ పాంధి' (Sanjay Pandhi) అన్నారు. -
రైల్వే సంస్థ జాక్‌పాట్! రికార్డ్ స్థాయిలో పెరిగిన షేర్ల ధర
భారతీయ రైల్వే ఆధీనంలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) జాక్‌పాట్ కొట్టింది. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు గురువారం (ఆగస్ట్ 3) నాడు 12 శాతం పెరిగి 52 వారాల కొత్త గరిష్ట స్థాయి రూ.44.65కి చేరుకున్నాయి. ఐఆర్ఎఫ్సీ షేర్ల ధర భారీగా పెరగడానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియనప్పటికీ, రూ.5.25 లక్షల కోట్ల పెట్టుబడికి రైల్వే శాఖ ప్లాన్ చేసిందని, దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నిస్తున్నట్లు వారం రోజుల కిందట కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 2024 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ పెట్టుబడి ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఇన్‌క్రెడ్ ఈక్విటిస్ గౌరవ్ బిస్సా ఈ స్టాక్‌పై రూ.45 ధర లక్ష్యంతో కొనుగోలు కాల్ జారీ చేయడంతో స్టాక్ కూడా ఊపందుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. క్యాపిటల్ మార్కెట్లు, ఇతర రుణాల ద్వారా ఆర్థిక వనరులను సేకరిస్తుంది. దీనిపై రైల్వే శాఖ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విలాసవంతమైన వందే భారత్ ట్రైన్లు ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. తక్కువ టికెట్ ధరతో నాన్ ఏసీ ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్‌గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లతో వందే సాధారణ్ పేరుతో కొత్త ట్రైన్లను తయారు చేయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వందే సాధారణ్ ట్రైన్లపై భారత రైల్వే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకే వేళ ఇదే నిజమైతే మెరుగైన ప్రయాణం చేసే సౌలభ్యం కలగనుంది. ఇక బడ్జెట్ ధరలో ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయనున్న వందే సాధారణ్ ట్రైన్ ఫీచర్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఉండనున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా కాకుండా లేటెస్ట్ రైలు లోకో లాగింగ్ ఉంటుంది. అన్నీ రైళ్లు ఒక లోకోమోటివ్ (ఇంజిన్)తో ప్రయాణికులకు సేవల్ని అందిస్తుండగా..దీనికి రెండు వైపులా లోకోమోటివ్ ఉంటాయి. ప్రతి చివరలో లోకోమోటివ్‌తో పాటు, ట్రైన్ వేగం కోసం పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ట్రైన్లు చివరి గమ్య స్థానానికి చేరుకున్న వెంటనే ..స్టేషన్ వద్ద లోకోమోటివ్ సదరు ట్రైన్ నుంచి విడిపోనుంది. తద్వారా టర్న్ రౌండ్ సమయం తగ్గుతుంది. ఈ కొత్త ట్రైన్ల కోసం లోకోమోటివ్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ)లో, కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో తయారు చేస్తారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త రైలు ఎలా ఉండబోతుంది. అందులోని సౌకర్యాలు ఎలా ఉండనున్నాయని రైల్వే బోర్డ్ నిర్ధేశించిన అక్టోబర్ నాటికి వెలుగులోకి రానున్నాయి. లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్ అనేది ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఒక ప్యాసింజర్ కోచ్. ఇందులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ అండ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ కోచ్‌లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్, 3 టైర్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అన్ని బోగీలు నాన్ ఏసీగా ఉంటాయి. చదవండి👉 నైట్ షిఫ్ట్‌లు నిషేధం.. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంత పనిచేసిందంటే -
షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!
సాక్షి,ఖలీల్‌వాడి(హైదరాబాద్): నవీపేట్ శివారులో సాయినగర్ షిర్డీలో రైలులో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ సంఘటనలో నిందితులను రైల్వే పోలీసులు వదిలేసినట్లుగా సమాచారం. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రైలు నవీపేట వద్ద క్రాసింగ్ ఉందని ఆపగా అక్కడ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు ఎక్కి ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన విషయం విదితమే.. రైలులో బ్యాగ్‌లు చోరీ జరిగినట్లు తెలుసుకున్న ప్రయాణికులు బాసర వద్ద రైలును చైన్ లాగి ఆపిన విషయం తెలిసిందే. అయితే రైలు ఆగగానే పారిపోతున్న యువతుల్లో కొందరిని రైలు ప్రయాణికులే పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. బాధితులు సైతం తమ పూర్తి వివరాలతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాగుల్లో ల్యాప్‌టాప్‌తో డబ్బులు, ల్యాప్‌టాప్, ఓ మహిళ మెడలో నుంచి చైన్ ఎత్తుకెళినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు గుంటరు, విజయవాడ, నెల్లరు, వైజాగ్, కడపకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. మర్మమేమిటో..! బాసర రైల్వే పోలీసులు, ఆర్ఫీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తొమ్మిది మంది యువతులను విచారించి వదిలి వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యువతులు మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందినట్లు వారుగా గుర్తించారు. సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదనే విమర్శులున్నాయి. ప్రయాణికులు బాసర వద్ద చైన్ లాగిన తర్వాత అక్కడి సీసీ ఫుటేజీలు, అలాగే యువతులు నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద ఎక్కిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే చోరీ విషయమై స్పష్టత వస్తుందనిప్రయాణికులు పేర్కొంటున్నారు. బాసర వద్ద ఉన్న సీసీపుటేజీల్లో యువతులు బ్యాగులు తీసుకుని స్లీపర్ కోచ్ నుంచి జనరల్ బోగీల్లోకి వెళ్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. రైల్వే ట్రాక్ పక్కన పడ్డ బ్యాగులు రైల్వే పోలీసుల వద్ద ఉన్నట్లు తెలిసింది. ఈ బ్యాగులు రైల్వేట్రాక్ పక్కకు ఎలా వచ్చాయనే విషయపై రైల్వేపోలీసులు సరైన విచారణ చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైలులో చోరీపై ఎస్పీ, ఎస్బీ ఆరా..! సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై రైల్వే ఎస్పీ, రైల్వే స్పెషల్ బ్రాంచ్ అధికారులు రైల్వే అధికారుల నుంచి వివరాలను సేకరింనట్లు సమాచారం. ఈ చోరీలో ప్రయాణికులు పట్టింన నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడ్డ యువతులను ఆర్పీఎఫ్ పోలీసులు రైలు లో నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉద యం తీసుకొచ్చినట్లు తెలిసింది. వారిని రైల్వే పోలీ సులకు అప్పజెప్పినట్లు సమాచారం. చదవండి: Dundigal 83 Police SI's Transfers: ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు -
రైల్వే ప్లాట్‌ఫాంపై యువకుడి స్టంట్స్.. వాళ్ల రాకతో సీన్ రివర్స్!
పాట్నా: ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది. ఇక నెట్టింట తమ టాలెంట్‌ను ప్రదర్శించి కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిన ఘటనలు బోలెడు ఉన్నాయి. కరోనా లాక్డౌన్ నుంచి ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. దీంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని చిరాకు తెప్పించేలా ఉంటున్నాయి. ఇంకొంత మంది మరో అడుగు మందుకేసి ప్రమాదకరమైనవి కూడా ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. ఎందుకీ స్టంట్స్... తాజాగా ఓ యువకుడు రైల్వేస్టేషన్లో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ప్రదర్శించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే,ఆ యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు అతనికి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటన బిహార్‌లోని మాన్పుర్ జంక్షన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై రైలు ఆగి ఉంది. అంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేయడం చేయడం ప్రారంభించాడు. ఈ తరహా ఘటనలో ఇటీవల ఎక్కవ కావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్పీఎఫ్.. అతడిని అరెస్టు చేసింది. అనంతరం అతని వీడియో షేర్ చేసి.. ఈ మేరకు ట్వీట్ చేసింది..‘మాన్పుర్ జంక్షన్లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించడంతోపాటు గందరగోళం సృష్టించే యత్నం చేశాడన్న ఆరోపణలపై అతడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం తెగించేవారికి ఇదొక గుణపాఠంగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అతడి ప్రవర్తనను వ్యతిరేకించినప్పటికీ.. యువకుడి అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆర్పీఎఫ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని కామెంట్లు పెడుతున్నారు. A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested by #RPF for creating nuisance and unauthorized entry. We hope this will serve as a lesson for others who put their lives at risk for likes and shares in social media. #SafetyFirst pic.twitter.com/qDCj9H9mFK — RPF INDIA (@RPF_INDIA) July 10, 2023 చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు -
ఈ ఐదు రైళ్లు ఎక్కితే మర్నాడు లేదా ఆ మర్నాడు దిగాల్సిందే..!
భారతీయ రైల్వే ప్రతీరోజూ సుమారు 8 వేల రైల్వే స్టేషన్ల మీదుగా రైళ్లను నడుపుతుంది. వాటిలో కొన్ని రైళ్లు సుదీర్ఘ ప్రయాణం సాగిస్తాయి. ఇప్పుడు మనం దేశంలో అత్యంత దూరం ప్రయాణించే ఐదు రైళ్ల గురించి తెలుసుకుందాం. వివేక్ ఎక్స్‌ప్రెస్(డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి): ఇది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రత్యేక సిరీస్ కలిగినది. ఇది 4 వేర్వేరు రూట్లలో ప్రయాణం సాగిస్తుంది. ఈ రైలు డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ ఏకంగా 4,273 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు పూర్తి ప్రయాణం 80 గంటల 15 నిముషాలు ఉంటుంది.9 రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగించే రైలుకు మొత్తం 55 స్టాపులు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్- సిల్చర్ ఎక్స్‌ప్రెస్: ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరువనంతపురం సెంట్రల్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది గువాహటి వరకూ ప్రయాణం సాగిస్తుంది. దీనిని 2017 నవంబరు 21న సిల్చర్ వరకూ పొడిగించారు. ఇది భారతదేశంలో అత్యంత దూర ప్రయాణం సాగించే రెండవ రైలు. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్(జమ్ము తావి నుంచి కన్యాకుమారి): ఇది వారాంతపు ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడులోని కన్యాకుమారి నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కొలువైన జమ్ము వరకూ ప్రయాణిస్తుంది. దేశంలో సుదీర్ఘ ప్రయాణం సాగించే రైళ్లలో ఇది మూడవది. 12 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైలుకు 73 స్టాపులు ఉన్నాయి. టెన్ జమ్ము ఎక్స్‌ప్రెస్(తిరునెల్వేలి జమ్ము): తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సుమారు 3,631 కిలోమీటర్ల దూరం వరకూ ఈ రైలు ప్రయాణం సాగించి జమ్ముకశ్మీర్‌లోని కట్రాకు చేరుకుంటుంది. మొత్తం 523 స్టేషన్లు కలిగిన ఈ మార్గంలో 62 స్టేషనల్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.ఈ రైలు 71 గంటల 20 నిముషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. నవయుగ్ ఎక్స్‌ప్రెస్(మంగళూరు నుంచి జమ్ము) ఇది వారాంతపు రైలు. జమ్ము తావి నుంచి మంగళూరు సెంట్రల్ వరకూ నడుస్తుంది. ఈ రైలు 3607 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 61 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలు 68 గంటల పాటు తన ప్రయాణాన్ని సాగించి, గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది కూడా చదవండి: ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే.. -
కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్సీటీసీ ఏమందంటే?
ఆన్లైన్ ట్రైన్ బుకింగ్ సంస్థ ట్రైన్‌మ్యాన్ (స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రై.లిమిటెడ్)ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ఈ స్టార్టప్‌ను దక్కించున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న ట్రైన్ మ్యాన్ పోటీగా రానుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌లపై ఐఆర్సీటీసీ స్పందించింది. यह भ्रामक कथन है। Trainman IRCTC के 32 अधिकृत बी2सी (बिजनेस टू कस्टमर) भागीदारों में से एक है। हिस्सेदारी बदलने से इसमे कोई अंतर नहीं आयेगा। सभी एकीकरण और संचालन IRCTC के माध्यम से किए जाते रहेंगे। यह केवल IRCTC का पूरक होगा और IRCTC के लिए कोई खतरा या चुनौती नहीं है। https://t.co/7ERSbMj6JR — IRCTC (@IRCTCofficial) June 18, 2023 ఐఆర్సీటీసీ గుర్తింపు పొందిన బిజినెస్ టూ కస్టమర్ సర్వీసులు (బీ2సీ) అందించే 32 సంస్థల్లో ట్రైన్ మ్యాన్ ఒకటి. 0.13 శాతం మాత్రమే ప్రయాణికులకు ట్రైన్ టికెట్ల రిజర్వేషన్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తుంది. కానీ, ఇండియన్ రైల్వేస్‌లో రోజుకు 14.5లక్షల రిజర్వేషన్ టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. వాటిలో 81శాతం ఇ-టికెట్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. Will Adani compete with IRCTC? No. IRCTC is a 100% monopoly in railway ticketing. Whether you book tickets from IRCTC or from aggregators like Paytm, MakeMyTrip or now Adani acquired Trainman, IRCTC makes money. It earned Rs 70 crore via Paytm in FY 2022, @ Rs 12 per ticket. 1/ pic.twitter.com/pwOOzxQ6Ud — ICICIdirect (@ICICI_Direct) June 19, 2023 ప్రస్తుతం, ఐఆర్సీటీసీకి ట్రైన్ మ్యాన్ పోటీ అంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అదానీ గ్రూప్.. ట్రైన్ మ్యాన్‌ను కొనుగోలు చేయడం వల్ల కార్యకలాపాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఐఆర్సీటీసీ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి. ఐఆర్సీటీసీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. కాగా, అదానీ గ్రూప్ మొదట ఐఆర్సీటీసీతో పోటీ పడుతుందని, తరువాత స్వాధీనం చేసుకుంటుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణల్ని సైతం ఐఆర్సీటీసీ కొట్టిపారేసింది. చదవండి👉 స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’! -
అలర్ట్: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని ఖరగ్‌పూర్–భాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్–హైదరాబాద్ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (22855), గౌహతి–సికింద్రాబాద్ (02605), హౌరా–పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్– సత్రగచ్చి (22808), మైసూర్–హౌరా (22818) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రీషెడ్యూల్ విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. చదవండి: అగ్నివీరులొచ్చేశారు.. -
అది ‘లైఫ్‌లైన్’.. పేదల పాలిట ‘హెల్ప్‌లైన్’
ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరి హృదయాలను కలచివేసింది. ఇటువంటి సందర్భాలలో క్షతగాత్రులను రక్షించేందుకు రైల్వేశాఖ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటే బాగుండునని చాలామంది భావించారు. దీనికి సమాధానం రైల్వేశాఖ వద్ద ఏనాడో ఉంది. ప్రపంచంలోనే తొలి హాస్పిటల్ ట్రైన్ భారత్ ఖాతాలో ఉంది. ఇది ఒక స్పెషల్ ట్రైన్. దీనిని భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక సందర్భాలలో వినియోగిస్తుంటుంది. ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అందుబాటులో ఆధునిక వైద్య పరికరాలు భారతీయ రైల్వే ఈ ట్రైన్‌కు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ అనిపేరు పెట్టింది. దీని ద్వారా భారతీయ రైల్వే దేశంలోని సుదూర ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేస్తుంది. ఆసుపత్రులు లేని ప్రాంతాలకు, ఔషధాలు, వైద్యులు అందుబాటులో లేని ప్రాంతాలకు ఈ రైలు చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. ఈ రైలును ఆసుపత్రి మాదిరిగా డిజైన్ చేశారు. దీనిలో బాధితుల కోసం బెడ్లు ఉంటాయి. ఆధునిక వైద్య పరికరాలు కూడా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, మెడికల్ స్టాప్ ఉంటారు. 12 లక్షలమందికి వైద్య సేవలు ఈ లైఫ్‌లైన్ ట్రైన్‌లోని ప్రతీ కోచ్‌లో పవర్ జనరేటర్, మెడికల్ వార్డు, ప్యాంట్రీకార్ మొదలైన ఏర్పాట్లు ఉంటాయి. ఈ రైలును భారతీయ రైల్వే 1991లో ప్రారంభించింది. ఈ రైలులోని అన్ని బోగీలలో ఏసీ సదుపాయం ఉంది. సులభంగా ఆసుపత్రులకు చేరుకోలేనివారిని దృష్టిలో ఉంచుకుని, వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ రైలులో అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం సహాయం పొందలేనివారికి కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆసుపత్రి రైలు ఇప్పటివరకూ 12 లక్షలమంది బాధితులకు వైద్య సేవలు అందించింది. ఇది కూడా చదవండి: భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
మరో ప్రమాదం తప్పిందా? ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. రైల్వే శాఖ క్లారిటీ!
ఒడిశా రైలు దుర్ఘటన మరవకముందే మరో రైలు ప్రమాదం తప్పిందంటూ నెట్టింట ఓ వీడియో దర్శనమిస్తోంది. దీంతో రైలు ప్రయాణంపై ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు అనుకోకుండా ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన రైళ్లలోని లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొన్ని అడుగుల దూరంలో ఆ రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్‌మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టం చేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది. ఇలా ఒకే ట్రాక్‌లో వచ్చిన ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైళ్లు కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాలను నమ్మవద్దని కోరింది. కాగా గత వారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో, 275 మంది మరణించడంతో పాటు వేలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్థ కాలంలో ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటిగా చెప్పచ్చు. Train accident averted once again in Raipur Chhattisgarh @RailMinIndia@AshwiniVaishnaw #RailwaySafety #Chhattisgarh pic.twitter.com/UKRe4Ox26w — Amit Tiwari (@AmitTiwari_95) June 11, 2023 -
Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..
బాలాసోర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో ఎన్నో కన్నీటి కథలు మనసుని పట్టి కుదిపేస్తున్నాయి. ఎప్పటికైనా తనకి తలకొరివి పెడతాడని అనుకున్న కొడుకు శవాన్నే చేతులతో మోయాల్సి రావడం ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. బీహార్‌లో మధువనికి చెందిన లాల్జీ సాగై చెన్నైలో గార్డుగా పని చేస్తున్నాడు. తన ఇద్దరు కుమారులు సుందర్, ఇందర్లను కూడా చెన్నైకి తీసుకువెళితే కుటుంబం హాయిగా బతికేయవచ్చునని అనుకున్న ఆ తండ్రి వారిని తీసుకువెళ్లడానికి సొంతూరుకి వచ్చాడు. అక్కడ్నుంచి కోల్‌కతాకి వచ్చి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు ప్రమాదంలో తండ్రి లాల్జీ , చిన్న కుమారుడు ఇందర్ ప్రాణాలతో మిగిలితే కొడుకు సుందర్, బావమరిది దిలీప్ మృత్యు ఒడికి చేరుకున్నారు. ‘‘కళ్ల ముందే నా కొడుకు గాయాలతో పడిపోయాడు. నా చేతుల్తో మోసుకుంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తెచ్చాను. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు. విధి మా కుటుంబం మీద పగ పట్టింది’’ అంటూ పుత్ర శోకంతో కన్నీరుమున్నరవుతున్నాడు. మొబైల్ ఫ్లాష్ వెలుగులోనే.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కలున్న స్థానికులు అందరికంటే ముందుగా ప్రమాద స్థలికి చేరుకున్నారు. చిమ్మ చీకట్లో బోగిల్లోకి వెళ్లడానికి వారు తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లలోనే సహాయ కార్యక్రమాలు సాగించారు. తమ చేతులతోనే బోగీ అద్దాలు పగులగొట్టి లోపలకి వెళ్లి క్షతగాత్రుల్ని బయటకి తీసినట్టు పూర్ణ చంద్ర మాలిక్ అనే రైతు చెప్పాడు. ‘‘బాధితుల రోదనలు వింటూ ఉంటే మనసు కదిలిపోయింది. వారిని కాపాడడం కోసం నా చేతుల్తో బోగీ అద్దాలు పగుల గొట్టా. లోపల భయంకరమైన దృశ్యం కనిపించింది. కొంతమందికి కాళ్లు, చేతులు తెగిపడి ఉన్నాయి. మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. కాసేపు అందరం షాక్‌కి లోనయ్యాం. వెంటనే తేరుకొని మాకు చేతనైన సాయం చేశాం. 30 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం’’ పూర్ణ చంద్ర మాలిక్ వివరించారు. రైలు స్పీడ్‌ను వీడియో తీస్తుండగా.. కోల్‌కతా నుంచి కటక్ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన మాణికల్ తివారీ అనే ఒక వ్యాపారి రైల్లో వీడియో తీస్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైలు ఎంత స్పీడ్‌గా వెళుతోందో తన కుటుంబ సభ్యులకు చూపించాలన్న ఉత్సాహంతో అతను కిటికీ దగ్గర కూర్చొని వీడియో తియ్యడం మొదలు పెట్టాడు. హఠాత్తుగా బోగి చిమ్మచీకటిగా మారిపోయి పొగతో నిండిపోయింది. ఆయన చేతులు రక్తమోడడం మొదలైంది. ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు. బోగి అంతా పొగతో నిండిపోవడంతో అతను ఎలాగో బయటకి వెళ్లాడు. పట్టాలపై శవాల్ని చూసిన తర్వాత కానీ అతనికి ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అర్థం కాలేదు. ‘‘అంతా సెకండ్లలో జరిగిపోయింది. అదృష్టం బాగుండి నేను బతికి బయటపడ్డాను. నా ఎదురుగా యువజంటలో భర్త మరణించాడు. భార్య మిగిలి ఉంది. ఈ రోజు ఒక బ్లాక్ ఫ్రైడే’’ అని తివారీ చెప్పారు. మందుల కోసం డబ్బులు పంపిస్తానని తిరిగిరాని లోకాలకు.. అనారోగ్యంతో ఉన్న తండ్రికి మందుల ఖర్చులకి డబ్బులు పంపిస్తానని చెప్పి బయల్దేరిన ఆ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బీహార్‌కు చెందిన రాజా పటేల్ (26) అనే యువకుడు ఇతర వలస కూలీలతో కలిసి కేరళ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రైలు ప్రమాదంలో కొడుకు మరణించాడని తెలిసిన తండ్రి భోలన్ కుప్పకూలిపోయాడు. ఆ కుటుంబానికి పటేల్ సంపాదనే జీవవనాధారం. వెన్నుముకకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న తండ్రి భోలన్ ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో నెల తిరిగేసరికల్లా కొడుకు పంపే డబ్బుల కోసమే వారు ఎదురు చూస్తుంటారని పొరుగింట్లో ఉన్న అవినాశ్ పాండే చెప్పాడు. నిద్రలోనే మృత్యుఒడిలోకి.. బాలాసోర్: పెను ప్రమాదం పలు సెకన్లలోనే ముగిసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 మధ్యకాలంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అంటే కొద్దిసేపట్లోనే అంతా ముగిసిందని, ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు నిద్ర మత్తులో ఉంటడంతో అసలేం జరుగుతుందో తెల్సుకునేలోపే అంతా జరిగిపోయిందని, తప్పించుకునే అవధికూడా లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పట్టాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు విపత్తు స్పందన దళ సభ్యులు శతథా శ్రమిస్తున్నారు. వీరికి స్థానికులు అండగా నిలిచి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే మానవత్వంతో ఎంతో మంది స్థానికులు వయోబేధంతో సంబంధం లేకుండా ఆస్పత్రులకు తరలివచ్చి రక్తదానానికి సిద్ధపడ్డారు. వీరికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వేగంపై తప్ప భద్రతపై దృష్టి లేదు ‘రైల్వే వ్యవస్థ విస్తరించే కొద్దీ అవసరమైన సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగాలి. కానీ ప్రస్తుతం రైల్వేలో దాదాపు రెండున్నర లక్షల ఖాళీలున్నాయి. రైళ్లను వేగంగా నడిపేలా విదేశాలతో పోటీ పడుతున్న రైల్వే, అక్కడి వ్యవస్థ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు పరుగెత్తాలన్నప్పుడు దిగువ సిమెంటు కాంక్రీట్ ట్రాక్ ఉండాలి, కానీ మన వద్ద నేరుగా నేలపైనే కంకర పరిచి ఏర్పాటు చేస్తున్నారు. అంత వేగాన్ని ఇది తట్టుకోలేదు. వేగం కంటే భద్రత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి’ – శంకరరావు, సీనియర్ రైల్వే కార్మిక నేత ఊహాగానాలొద్దు.. ‘‘రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అవి ఎలా జరిగాయనే ఊహాగానాల జోలికి వెళ్లొద్దు. ప్రమాదానికి అసలు కారణాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ తేలుస్తారు. అందుకు తగ్గ అర్హతలున్న వారే ఆ పోస్టులో ఉంటారు. ప్రమాదాలకు అసలు కారణాలు తేలాకగాని కారణాలను విశ్లేషించలేం. ఆ ప్రమాదం నేపథ్యంలో ఆ అధికారి బృందం కొన్ని సిఫారసులు చేస్తుంది. వాటికి తగ్గ చర్యలు తీసుకోవాలి’’ - స్టాన్లీబాబు, మాజీ జీఎం. ఇది కూడా చదవండి: అదే జరిగితే ప్రమాదం తప్పేదా? -
‘కవచ్’ పరిశోధనలకే పదేళ్లు.. అలా జరిగితే ప్రమాదం తప్పేదా?
సాక్షి, హైదరాబాద్: అత్యంత వేగంగా వందే భారత్ రైళ్లను తయారు చేసి, సర్వీసులను పట్టాలెక్కిస్తున్న భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రతలో అత్యంత తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తోంది. పరస్పరం రైళ్లు ఢీకొనకుండా కాపాడే వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యంతో అమాయక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రైళ్లపై భరోసాతో వాటిలో ప్రయాణిస్తున్నవారు ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు వదులుతున్నారు. పదేళ్ల జాప్యం.. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా వ్యవస్థను రూపొందించడానికి ప్రయోగాల పేరుతో ఏకంగా పదేళ్ల విలువైన కాలాన్ని రైల్వే అధికారులు హరించారు. కానీ ఇప్పటివరకు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేలేకపోయారు. ప్రయోగాలకు వేదికైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంత ఏర్పాటు చేసి మిగతా చోట్ల చేతులెత్తేశారు. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన హౌరా–చెన్నై మార్గం దేశంలోనే కీలక రైల్వే లైన్. ఆ మార్గంలో కూడా రైల్వే కవచ్ ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకీ దుస్థితి.. రైల్వే నెట్వర్క్ తక్కువగా ఉండి, ఎక్కువ సంఖ్యలో రైళ్లు తిప్పే మన దేశంలో.. ఎదురెదురుగా వచ్చి రైళ్లు ఢీకొనే పరిస్థితి తరచూ ఉండేది. సిగ్నలింగ్ వైఫల్యమో, మానవ తప్పిదమో.. తరచూ ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా రైళ్లు వచ్చేవి. ప్రమాదాలు నివారించేందుకు విదేశాల నుంచి పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలనుకున్నా, ఖరీదు ఎక్కువ కావటంతో సొంతంగానే రూపొదించాలని రైల్వే నిర్ణయించింది. అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)కు బాధ్యతను అప్పగించింది. అది కొంతకాలం ప్రయోగాలు చేసి 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్‌డెన్స్ సిస్టం(టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్‌నగర్ సెక్షన్లను ఎంపిక చేశారు. 260 కి.మీటర్లలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించారు. కవచ్‌గా మార్చి.. ఐదేళ్ల క్రితం దానిని ‘కవచ్’గా మార్చి పరిజ్ఞానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేశారు. 2022 ఫిబ్రవరి నాటికి జోన్ పరిధిలో 615 కి.మీ. మేర ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగాలు విజయవంతమయ్యాయని, వ్యవస్థను అంబాటులోకి తెస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు అనుమతించినా.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. గతేడాది చివరలో ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా రైలు లోకో ఇంజిన్‌లో కూర్చుని ప్రయోగాలను పరిశీలించారు. ప్రతి సంవత్సరం 5 వేల కి.మీ. మేర దాన్ని ఏర్పాటు చేసి, దేశమంతటా విస్తరిస్తామని పేర్కొన్నారు. గత సంవత్సరమే ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా మార్గాల్లోని 2 వేల కి.మీ.నిడివిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిలోమీటర్‌కు రూ.50 లక్షలు.. కవచ్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే కిలోమీటరుకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. ఇది రైల్వేకు పెద్ద భారంగా మారింది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే బడ్జెట్ నిధుల్లో సింహభాగం దానికే ఖర్చు చేయాలి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1450 కి.మీ.మేర ఏర్పాటు చేయటం మినహా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఏమిటీ కవచ్? కవచ్ పరిజ్ఞానం రైలు ఇంజిన్లతోపాటు ట్రాక్ వెంట కొనసాగుతుంది. మధ్యమధ్య ఫ్రీక్వెన్సీ టవర్లు ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక కవచ్ యంత్రాలను అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజెస్లతో అనుసంధానిస్తారు. ఎలా పనిచేస్తుంది? - రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. - దేశంలో రైలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న సిగ్నల్ జంప్‌ను ఇది అప్రమత్తం చేస్తుంది. నిర్ణీత పరిధిలోపు అదే లైన్లో ఇంకొక రైలు ఉందని గుర్తిస్తే ఆటోమేటిక్‌గా రైలును ఆపేస్తుంది. - సిగ్నల్ దాటేసి వెళ్లడం, వేగంగా ప్రయాణించడం వంటి సందర్భాల్లోనేకాదు దట్టంగా మంచు కమ్ముకున్న అననుకూల వాతావరణంలోనూ పలుమార్లు లైన్–సైడ్ సిగ్నల్స్‌ను ఇస్తూ పైలట్‌కు సాయపడుతుంది. - లెవల్–క్రాసింగ్ వద్ద తనంతట తానుగా విజిల్స్ వేస్తుంది. రైలు నియంత్రణ కోల్పోయిన సందర్భాల్లో ప్రమాదం ఉందంటూ సంబంధిత వ్యవస్థకు తక్షణం హెచ్చరికల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది. - రైలు బ్రేకు ఫెయిలైనప్పుడు కూడా ఈ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసి రైలును నిలిపివేయగలదు. హారన్ కొట్టాల్సిన చోట కొట్టకున్నా.. ఈ వ్యవస్థ తనంతట తానుగా ఆ పని చేస్తుంది. కొసమెరుపు: దేశీయంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేక చేతులెత్తేస్తున్న రైల్వే శాఖ, ఆ పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించేందుకు మాత్రం సిద్ధమని ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. -
కేరళలో మొట్టమొదటి వందే భారత్ ప్రారంభం
-
చెప్పు పోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!
సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్పూర్ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు. -
రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే!
దేశంలో రైళ్లు.. కోట్లాది మందికి అనువైన ప్రయాణ సాధనాలు. ఇతర సాధనాలతో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటంతో అనేక మంది రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే సౌకర్యాలు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా టాయిలెట్ల విషయం చెప్పనక్కర్లేదు. ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కారణంగా వీటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఇలాంటి ఇబ్బందులకు భారత రైల్వే శాఖ చెక్ పెడుతూ సరికొత్త సౌకర్యాలను తీసుకొస్తోంది. రైళ్లలో ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో మెరుగైన సౌకర్యాలతో రూపొందించిన బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి కొత్తగా రూపొందించిన బయో టాయిలెట్లతో కూడిన ఏసీ కోచ్‌ను రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని తర్వాత మిగతా రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ముక్కు మూసుకోవాల్సిన పని లేదు! రైల్వే శాఖ రూపొందించిన ఈ బయో టాయిలెట్లు ఆటోమేటిక్ హైజీన్, వాసన నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అలాగే నీటి కొళాయిలు, సోప్ డిస్పెన్సర్లు కూడా టచ్ ఫ్రీ అంటే సెన్సార్ ఆధారితంగా ఉంటాయి. అయితే వీటిని దొంగిలించకుండా కూడా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు తలుపులు, గ్యాంగ్‌వేలను మెరుగు పరిచింది రైల్వే శాఖ. అసౌకర్యమైన టాయిలెట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది. -
టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్!
దేశ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా రైలు ప్రయాణానికే ఓటు వేస్తారు. అంతేనా ప్యాసింజర్లకు సరికొత్త సేవలను కూడా తీసుకోస్తోంది రైల్వే శాఖ. ప్రతి రోజూ వేలాది మంది ప్యాసింజర్లు రైలు ప్రయాణం మీద ఆధారపడుతున్నారు కనుకే ఏ మాత్రం చిన్న తప్పులు జరిగినా దాని ప్రభావం అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా తత్కాల్ బుకింగ్ వెబ్సైట్ మొరాయించడంతో యూజర్లు నెట్టింట తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ డౌన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్! ట్రైన్లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ బుకింగ్‌ల వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్న విషయం తెలిసిందే. ఈ తత్కాల్ సేవల కోసం ఆన్లైన్లో ఉదయం 10:00 గంటల నుంచి ACతరగతి, ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ తరగతికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే శనివారం, ఎప్పటిలానే ప్యాసింజర్లు తత్కాల్ బుకింగ్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఐఆర్సీటీసీ సర్వర్ మొరాయించింది. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టికెట్ బుకింగ్ కోసం యూజర్లు లాగిన్ చేస్తున్న సమయం నుంచి పేమంట్ వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తత్కాల్ బుకింగ్ కోసం అమౌంట్ చెల్లించి, కస్టమర్ల ఖాతా నుంచి డిడెక్ట్ అయినప్పటికీ రైలు టికెట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదట. ఈ మేరకు కొందరు యూజర్లు వాపోతున్నారు. అలాగే మరికొందరు యూజర్లు టికెట్ బుకింగ్ సమయంలో వచ్చిన ఎర్రర్ మెస్సేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై ట్వీట్స్, మీమ్స్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐఆర్సీటీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. @IRCTCofficial Still trying to Book ticket through #irctc website. Is it going to work today ? It's been an half an hour now for tatkal ticket slot booking, but still website is not working. pic.twitter.com/fYFuXCaHrj — Prashant waghmare (@Prashan95320710) March 4, 2023 #irctc Becoming worse day by day pic.twitter.com/mruQJX4mbv — 🅽🅰🆁🅴🆂🅷 🅼🅰🆃🆃🅷🅴🆆7 (@nareshmatthew17) March 4, 2023 When someone says Bhai #Tatkal_tickets kaat de Me : pic.twitter.com/g96AuufaM5 — Sumit Kr Shaurya (@TweetTo_Shaurya) March 4, 2023 -
ట్రైన్లో తోటి ప్రయాణికులపై దాడి చేస్తే మూడేళ్లు జైలు
కొరుక్కుపేట(చెన్నై): రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తోటి వారిపై దాడికి పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష, జరిమానా తప్పదని రైల్వే ఏడీజీపీ వనిత హెచ్చరించారు. ఈనెల 16న కదులుతున్న రైలులో ఉత్తరాదికి చెందిన వ్యక్తిపై కొందరు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు సహకారంతో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీజీపీ వనిత మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఉత్తరాది వారి వల్ల తమిళనాడు ప్రజలకు ఉదోగావకాశాలు రావడం లేదని, దీనికి ప్రధాని మోదీయే కారణమంటూ కొందరు దాడులకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ, వ్యక్తిగత ద్వేషపూరిత మాటలతో పలువురిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఇక కొందరు కుల మత భావాలను రెచ్చగొట్టి అశాంతికి కారణం అవుతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితులు ఫిర్యాదుల కోసం 1512 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు. చదవండి చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా! -
కూ.. చుక్ చుక్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎందుకీ రైలు ప్రత్యేకమో తెలుసా!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై స్పీడ్ రైలు. ఇది 18 నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నైలో దీన్ని నిర్మించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంజిన్‌లెస్, స్వీయ చోదక రైలుగా ప్రత్యేకత గుర్తింపు సంపాదించుకుంది. ఇది 200-210 KMPH గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ట్రయల్స్ సమయంలో ఇది గరిష్టంగా 180 KMPH స్పీడ్‌తో ప్రయాణించింది. అయితే, భారతీయ రైల్వే ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ దాని ఆపరేషనల్ స్పీడ్‌ను 130KMPHకి పరిమితం చేసింది. ఇందులోని వసతులు గురించి చెప్పాలంటే.. ఈ రైళ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక ఇంటీరియర్‌తో నిర్మితమైంది. ప్రయాణీకుల కోసం ప్రతి కోచ్‌లో గ్లాస్-బాటమ్ లగేజ్ ర్యాక్‌ను అందుబాటులో ఉంచారు. రైలులో 'ఎగ్జిక్యూటివ్ క్లాస్', 'చైర్ కార్' ఉన్నాయి. ఈ కోచ్‌లు ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తాయి. మధ్యలో గల రెండు కోచ్‌లు మొదటి తరగతి కోచ్‌లు, ఇవి 52 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన కోచ్‌ల్లో మాత్రం విమానం మాదిరిగా 78 రిక్లైనింగ్ సీట్లు ఉంటాయి. ఈ కోచ్‌ల పొడవు 23 మీటర్లు, మొత్తం రైలు ఫ్రేమ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించబడింది. ఈ రైలు బయట నుంచి చూడడానికి విమానాన్ని పోలి ఉంటుంది. మిగిలిన రైలు కోచ్‌ల కంటే ఇవి తేలికైనవి. మొత్తం 16 కోచ్‌లు, 1128 సీటింగ్ సామర్ధ్యం, మొత్తం శీతల కోచ్‌లు. 360 డిగ్రీలు తిరిగే సౌకర్యవంతమైన సీట్లు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, వ్యక్తిగత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లు, వ్యక్తిగత మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌లు, అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌లు, చైన్ పుల్లింగ్ సిస్టమ్ లేదు వీటితో మరెన్నో ఉన్నాయి. చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి! -
రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!
రాత్రిపూట రైళ్లలో నిద్రించే వారికి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవలు ఈ సమయంలో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఐఆర్టీసీ (IRCTC) కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చిన్న మార్పులను నిబంధనలను పాటించకపోతే ప్యాసింజర్లు ఇబ్బందుల్లో పడినట్లే. అవేంటో ఓ సారి తెలుసుకుందాం! కొత్త నిబంధనలు ఇవే మీ కంపార్ట్మెంట్ లేదా కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, తోటి ప్యాసింజర్లు ఫోన్ కాల్లో గట్టిగా మాట్లాడటం, లేదా పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, లేదా బిగ్గరగా అరవడం లాంటివి చేస్తుంటారు. గతంలో మన రైల్వే ప్రయాణంలో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం కూడా. అయితే ప్యాసింజర్లు ఎదర్కుంటున్న ఈ సమస్యకు రైల్వే శాఖ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. రైలులో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి నిద్రకు భంగం కలగకుండా, ప్రయాణంలో ప్రశాంతంగా నిద్రించేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఇకపై రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. వాటి ప్రకారం ఆ ప్రయాణంలో ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడడం, పెద్దగా సంగీతం వినడం, అరవడం లాంటివి కూడా చేయకూడదు. మొత్తానికి తోటి ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకూడదు. ఒక వేళ ఎవరైన ఈ రూల్స్‌ని పాటించకపోతే ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దీని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బందిపైనే ఉంటుంది. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
మీ రైల్వే స్టేషన్లో గమనిస్తే ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం పొడవైన క్యూలలో నిల్చుని ఉండడం చూసే ఉంటారు. కొన్నిసార్లు, టికెట్ కౌంటర్ వద్ద ఆలస్యం అయ్యి మీ ప్రయాణం రద్దు కావడమో లేదా టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసి టికెట్ కలెక్టర్‌కు జరిమానా కట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవ.. కేవలం సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది భారతీయ రైల్వే. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చింది. యూటీఎస్ యాప్ ఇన్స్టలేషన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. సబర్బన్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు తమ పరిధిలోని రైల్వే స్టేషన్‌కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే.. ఆ దూరాన్ని పెంచనుంది రైల్వేశాఖ. యూటీఎస్ మొబైల్ యాప్‌లను ఉపయోగించే వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి. ►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్లను ప్రింట్ చేయలేరు. వారికి పేపర్ టిక్కెట్ కావాలంటే, టిక్కెట్ బుకింగ్ సమయంలో వారు ఈ ఎంపికను ఎంచుకోవాలి. ►అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ యాప్‌తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ►ప్లాట్ఫారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. ►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్ లెస్ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు. ►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్ టిక్కెట్‌ను బుక్ చేయలేరు. ►ఎక్స్‌ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్! -
ఐఆర్సీటీసీలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: రైల్వే రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్సీటీసీలో ప్రభుత్వం 5 శాతంవరకూ వాటాను విక్రయించనుంది. ఇందుకు షేరుకి రూ. 680 ఫ్లోర్ ధరను ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2.5 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇన్వెస్టర్ల నుంచి అధిక స్పందన లభిస్తే మరో 2.5 శాతం వాటాను సైతం ఆఫర్ చేయనుంది. వెరసి 4 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు సమకూరే వీలుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 735తో పోలిస్తే ఇది 7.5 శాతం డిస్కౌంట్. నేడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం రిటైలర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులోకి రానుంది. వాటా విక్రయ నిధులు ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్‌కింద జమకానున్నాయి. -
... అదృష్టం.. బోగీలెత్తుకెళ్లలేదు కాబట్టి తిరిగొచ్చా... సంతోషించు!
... అదృష్టం.. బోగీలెత్తుకెళ్లలేదు కాబట్టి తిరిగొచ్చా... సంతోషించు! -
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. దీని ద్వారా దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు రూ.2500-4000 వరకు జీతాలు పెరుగుతాయని చెప్పారు. ఈ నిర్ణయంతో రైల్వే శాఖపై అదనపు భారమేమీ పడదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా రైల్వే శాఖ ఖర్చులు ఆదా చేస్తున్నట్లు వివరించారు. ఈ వేతనాల పెంపుతో ఉద్యోగ స్తబ్ధత ఎదుర్కొంటున్న వేల మంది రైల్వే సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమానంగా వేతనాలు పొందుతారని త్రిపాఠి వివరించారు. 80వేల మంది సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులు హై పే గ్రేడ్‌కు అర్హులు అవుతారని చెప్పారు. సూపర్వైజరీ క్యాడర్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన డిమాండ్ 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని త్రిపాఠి వెల్లడించారు. తాజాగా నిర్ణయంతో 50 శాతం మంది లెవెల్7 ఉద్యోగులు లెవెల్ 8కు చేరుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. వేతనాల పెంపుతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వంటి 40వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని త్రిపాఠి వివరించారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
రైల్వే ప్యాసింజర్లకు ఇది తెలుసా.. రిజర్వేషన్ టికెట్ లేకపోయిన ప్రయాణించవచ్చు!
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తు రైల్వే శాఖ ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో అందిస్తూ ప్రయాణికులకు పెద్ద పీట వేస్తూ దూసుకోపోతోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న కొందరు అకస్మాత్తుగా ప్రయాణించవలసి రిజర్వేషన్ టికెట్ దొరకకపోవచ్చు. అటువంటి సమయంలో వారికి రిజర్వేషన్ టికెట్ దొరకపోవచ్చు. అయినా ఏం ఫర్వాలేదు రిజర్వేషన్ టికెట్ లేకున్నా ప్యాసింజర్లు వారి గమ్యస్థానానికి ఇలా ప్రయాణించవచ్చు. ఎలా అంటారా? ప్లాట్‌ఫాం టికెట్‌తో ప్రయాణం ఎలా.. ప్యాసింజర్ తన వద్ద రిజర్వేషన్ టికెట్ లేదని కంగారుపడాల్సిన పనిలేదు. అటువంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించవచ్చు. అయితే మీరు వెంటనే టికెట్ కలెక్టర్ (TTE) సంప్రదించాల్సి ఉంటుంది. ఆపై మీ గమ్యస్థానాన్ని అతనికి చెప్పి అందుకు తగ్గ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు టిక్కెట్ తీసుకుని ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ రూల్స్ కూడా తెలుసుకోండి.. రిజర్వేషన్ లేకుండా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. రైలులో ఒక్కోసారి రద్దీ కారణంగా బెర్త్ మాత్రమే కాదు సీటు ఖాళీగా లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి సమయంలో టీటీఈ ప్రయాణికుడికి రిజర్వ్ సీటు ఇవ్వలేకపోవచ్చు. కానీ, ప్యాసింజర్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు. అటువంటి సమయంలో మీరు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ లేకుండా రిజరేషన్ బోగీలో ప్రయాణించాలనుకుంటే .. రూ. 250 అపరాధ రుసుముతో (ఫైన్) పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఛార్జీని చెల్లించాలి. ఆపై టీటీఈ నుంచి సంబంధిత టికెట్ తీసుకోవాలి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుందన్నారు.. కానీ
‘ఆడవాళ్లు ఈ పని చేయలేరు’ అని సమాజంలో కొందరు ఎర్ర జెండా చూప ప్రయత్నిస్తారు. పట్టాలకు అడ్డం పడుకుంటారు. ఆడవాళ్ల ఆత్మస్థయిర్యపు రైలు ముందుకు సాగకుండా విశ్వ ప్రయత్నం చేస్తారు. కాని కొందరు ధీరలు ‘చేయగలం’ అంటారు. తమ జీవితానికి తామే పచ్చజెండా ఊపుకోగలుగుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సల్మా చేసిన పని అదే. భారతదేశపు తొలి రైలుగేట్ ఉమన్‌గా ఆమె నియమితమైనప్పుడు గేటు వేయలేక తీయలేక నాల్రోజుల్లో పారిపోతుందన్నారు. ఇవాళ్టికి పదేళ్లు గడిచాయి. రైళ్లు ఆమె చెప్పినట్టుగా వింటున్నాయి. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన సల్మాను చూసి ఆ గేటు మీదుగా వెళ్లే రైళ్లన్నీ శాల్యూట్ చేస్తున్నాయి. ‘బంధువులు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. తల్లిదండ్రులు గట్టిగా నిలబడాలి. నా తల్లిదండ్రులు నిలబడ్డారు. అందుకే ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డాను’ అంటుంది సల్మా. ఆమె పూర్తి పేరు మిర్జా సల్మా బేగ్. వయసు 29. భారతదేశపు తొలి మహిళా గేట్ ఉమన్‌గా రైల్వే శాఖలో 2013లో చేరింది సల్మా. ఆమె పని చేసే రైల్వే క్రాసింగ్ లక్నోకు ఆనుకుని ఉన్న మల్హార్ స్టేషన్. ఇప్పుడు ఆ దారిన పోయే రైళ్ల డ్రైవర్లకు, గార్డులకు ఆమె సుపరిచితం అయ్యింది గాని కొత్తగా ఎవరైనా ఆ రైల్వే క్రాస్ గుండా వెళుతుంటే మాత్రం ఆగి సల్మాను మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే రైల్వే గేట్ దగ్గర ఒక స్త్రీ, అందునా హిజాబ్ ధరించిన స్త్రీ, పని చేయడం నేటికీ అరుదు కనుక. ‘మా నాన్న సలీం బేగ్ రైల్వే గేట్ మేన్‌గా పని చేసేవాడు. ఆయన అనారోగ్యం వల్ల చెవుడు వచ్చింది. రైలు గంట వినకపోతే గేట్‌మేన్‌గా పని చేయడం కష్టం. ఆయన వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని నన్ను ఉద్యోగంలో పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు. అమ్మకు పక్షవాతం. నాన్న సంపాదించే స్థితిలో లేడు. గేట్ మేన్ ఉద్యోగం పురుషులకు మాత్రమే అని రైల్వే శాఖ ఎప్పుడూ చెప్పలేదు. కాని ఆడవాళ్లు ఆ ఉద్యోగం కోసం అప్లై చేయరు. కష్టమైన పని. పైగా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం. అయితే ఆ పని నాక్కూడా కష్టమే అని నాకు తెలుసు. కాని రైల్వేలో వేరే ఉద్యోగం ఇమ్మని అడిగితే ఆ ఉద్యోగం నాకు అందడానికి చాలా రోజులే పట్టవచ్చు. అదే మా నాన్న పనే నేను చేస్తానంటే వెంటనే ఇస్తామన్నారు. అలా ఈ ఉద్యోగంలో చేరాను’ అంది సల్మా. ఆమె చేరినప్పుడు ఆమెతో పాటు లక్నోలో 11 మంది పురుష గేట్ మేన్లు ఉండేవారు. వారంతా ‘ఈ అమ్మాయి ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుంది’ అన్నారు. సల్మా పని చేస్తుంటే హేళన చేసేవారు. బంధువులైతే ఇంటికి వచ్చి మరీ సూటి పోటి మాటలు అనేవారు. అమ్మాయి జీవితం నాశనం చేశారని తల్లిదండ్రులను మాటలనేవారు. కాని నాలుగు నెలలు గడిచినా సల్మా బెణకలేదు. బెసకలేదు. తండ్రి సాయంతో అధికారుల సపోర్ట్‌తో పని క్షుణ్ణంగా నేర్చుకుంది. రైలు వచ్చే ముందు గేటు వేసి వెళ్లాక గేటు తీయడానికి లివర్ ఉన్న ఇనుప చక్రం తిప్పాలి. నేర్చుకుంది. సమర్థంగా చేసింది. గత పదేళ్లుగా రోజుకు 12 గంటల డ్యూటీ చేసి విజేతగా నిలిచింది. ఆమె ఉద్యోగంలో చేరినప్పుడు పత్రికలు తొలి గేట్ ఉమన్‌గా వర్ణిస్తూ పేపర్లలో రాయడంతో బంధువులు చల్లబడి ‘మా అమ్మాయే’ అనడం మొదలెట్టారు. ‘ఆడవాళ్లు చేయలేని పనంటూ ఈ ప్రపంచంలో లేదు. ప్రయత్నించాలి అంతే. నా ఉద్యోగంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇటీవలే మా అమ్మ చనిపోయింది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా నేను మర్చిపోలేను’ అంటుంది సల్మా. గొప్ప గొప్ప విజయాలు ఒక సంకోచంతో నిండిన అడుగు నుంచే మొదలవుతాయి. సంకోచాన్ని ధైర్యంతో దాటాలి. ధైర్యంతోపాటు సంకల్పం తోడు రావాలి. ప్రయత్నం జత పడాలి. ఆ తర్వాత చచ్చినట్టు ‘విజయం’ అనే స్టేషన్ వచ్చి తీరుతుంది. మీరూ ప్రయత్నించండి. (క్లిక్ చేయండి: మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది) -
మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం..
భారతీయ రైల్వే.. ప్రతీ రోజు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణమే గాకా వివిధ సేవలను ప్యాసింజర్లకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం మహిళల కోసం రైల్వేశాఖ పెద్ద ప్రకటనే చేసింది. మహిళలు ఇకపై రైలులో సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం.. భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్‌లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్త్‌లు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లోని మహిళలకు ఆరు బెర్త్‌లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు. రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), జీఆర్పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
అయ్యో.. రైలు టిక్కెట్ ఉన్నా ఫైన్ కట్టారు!
కొరుక్కుపేట(చెన్నై): రైలు ప్రయాణికులు టిక్కెట్లు తీసుకుని ముందుగానే ప్లాట్ఫారానికి వెళ్లి వేచి ఉండటం సర్వసాధారణం. అయితే రైలు టిక్కెట్ ఉన్నా ప్లాట్ ఫామ్ మారడంతో రైల్వే అధికారులు జరిమానా విధించిన ఘటన చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం జరిగింది. దీంతో ప్రయాణికులు కంగుతిన్నారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5 గంటలకు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు ఆరుగురితో కూడిన ఒక కుటుంబం రైలు ఎక్కాల్సిన ఫ్లాట్ ఫామ్ బదులుగా వేరే ప్లాట్ ఫారానికి వెళ్లారు. అక్కడ టిక్కెట్ ఇన్స్పెక్టర్లు, ఎగ్జామినర్లు జరిమానా విధించారు. దీంతో ప్రయాణికులు ఎంత వేడుకున్నా టిక్కెట్ ఇన్‌స్పెక్లర్లు వదల్లేదు. మహిళా ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అరగంట పాటు హడావుడి నెలకొంది. జరిమానా కచ్చితంగా కట్టాలని చెప్పటంతో చివరికి రూ.1040 జరిమానా చెల్లించి ట్రైన్ ఎక్కారు. చదవండి: వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే! -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది!
చెన్నై: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్కువ చార్జీలతో ఏసీ బోగీలతో కూడిన రైళ్లను ప్రవేశపెట్టేందుకు దక్షిణరైల్వే ఏర్పాట్లు చేసింది. ‘పేదల రథం’ పేరుతో ఆధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పోల్చుకుంటే చార్జీలు స్వల్పం, సౌకర్యాలు అధికం కావడం వల్ల ప్రయాణికులు రైలు ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ కారణంగా రిజర్వేషన్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతో టిక్కెట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో రెండు లేదా మూడు ఏసీ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిని టూ టైర్, త్రీ టైర్ బోగీలుగా విభజించి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిల్లో కుర్చీల సంఖ్య కూడా పరిమితంగా ఉన్నందున ఏసీ బోగీల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని నివారించి ఏసీ బోగీలను కింది, మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైళ్లకు “పేదల రథం’ అని పేరుపెట్టారు. అత్యాధునిక వసతులతో తయారవుతున్న ఒక్కో బోగీలో 83 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో పడుకుని కూడా ప్రయాణించవచ్చు. సీసీ టీవీ, కెమెరాలు అమరుస్తారు. 110–130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. చెన్నై పెరంబూరులోని ఇంటెగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ రైలు బోగీల్లో ప్రయాణం మరో ఏడాదికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చెన్నైకి ఆధునిక సిటీ బస్సులు కాలం చెల్లిన సిటీ బస్సుల స్థానంలో అత్యాధునిక బస్సులను తీసుకురానున్నారు. తొలిదశలో 242 బస్సులు చెన్నై రోడ్లలో సందడి చేయనున్నాయి. గ్రేటర్ చెన్నై ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలో 3,454 సిటీ బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 30 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 10.5 శాతం మంది మహిళలు ఉచిత పథకం కింద ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ రోడ్డెక్కే 3,300 బస్సుల్లో వెయ్యి బస్సులు పాతబడిపోయి మూలపడేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. సిటీ బస్సులను 9 ఏళ్లకు మించి వినియోగించరాదనే నిబంధనను దాటి ప్రయాణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జర్మన్ నిధుల సహకారంతో ప్రభుత్వం చెన్నైకి 242, మధురై, కోయంబత్తూరుకు చెరో 100 లెక్కన మొత్తం 644 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా 242 బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. అత్యంత ఆధునికమైన బస్సుల్లో పూర్తిస్థాయి రక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్లు, అత్యవసర ద్వారాలు, రానున్న బస్‌స్టేషన్, చేరుకోబోతున్న ప్రాంతాలను తెలిపే డిజిటల్ బోర్డులను అమరుస్తారు. చదవండి: Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం! -
‘చిన్నారుల టికెట్ల బుకింగ్‌లో మార్పుల్లేవ్’.. రైల్వే శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: చిన్నారులకు రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు సైతం పెద్దలకు అయ్యే చార్జీనే వసూలు చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ రైల్వే శాఖ 2020 మార్చి 6న ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే, వారికి ప్రత్యేకంగా బెర్త్ గానీ, సీటు గానీ కేటాయించరు. ఒకవేళ బెర్త్ లేదా సీటు కావాలనుకుంటే పెద్దలకు అయ్యే రుసుమును చెల్లించి, టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆక్షేపించింది. బెర్త్ లేదా సీటు అవసరం లేదనుకుంటే ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలియజేసింది. ఇదీ చదవండి: జార్ఖండ్ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్ -
రూ.20 కోసం 22 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం!
మనలో చాలామంది ఏ చిన్న సమస్య వచ్చిన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడం. మనకు ఏదైనా పని అవ్వడమే ముఖ్యం. జేబు చమురు వదిలించుకుని మరీ పని జరిపించుకుంటాం గానీ. ఎందుకు డబ్బులివ్వాలి అనడగం. పోతే పోనీలే అని సర్దుకుపోతాం. ఇక్కడో వ్యక్తి అలా కాదు. టిక్కెట్ ధర కంటే అదనంగా రూ.20 ఎక్కువ తీసుకున్నాడంటూ కోర్టు మెట్లెక్కాడు. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మరీ గెలిచాడు. ఏం జరిగిందంటే....మధురకు చెందిన ఉత్తర ప్రదేశ్ వ్యక్తి తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్ ధర రూ.70 కాగా టిక్కెట్ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. చతుర్వేది గమస్తాకి రూ.100 ఇస్తే తనకు రూ.30లు తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. తీరా చూస్తే రూ. 10 చేతిలో పెట్టి అంతే వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటన డిసెంబర్ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్ మాస్టర్ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వేకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడూ ఏం చేయాలో అతనికి తెలుసు. పైగా అతను లాయరు, న్యాయ పరిజ్ఞానం మీద అవగాహన కలిగిన వ్యక్తి కావడం చేత ఈ విషయమై కోర్టులో కేసు వేశారు. ఆయన ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది. చెల్లించాల్సిన మొత్తం పై 15 శాతం వడ్డీని అదనంగా చెల్లించమని భారత రైల్వేకి స్పష్టం చేసింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కేసు వదిలేయమని చెప్పారని అన్నారు. ఒకానొక దశలో ఈ కేసును కొట్టేయడానికి చాలామంది అధికారులు ప్రయత్నించారు. ఈ కేసులో వందకు పైగా విచారణలు జరిగిన తర్వాత న్యాయం గెలిచిందని తెలిపారు. అయితే ఈ పోరాటంలో తాను కోల్పోయిన సమయం, శక్తికి వెలకట్ట లేనివని అవేదనగా చెప్పారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
రైళ్ళలో రాయితీలను పునరుద్ధరించాలి
కోవిడ్ మహమ్మారి దేశంపై విరుచుకుపడేంతవరకూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రైళ్ళలో రాయితీ అమలులో ఉంది. కోవిడ్ బూచి చూపించి రైళ్లను రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించిన తర్వాత... అనేక వర్గాలకు టిక్కెట్ ధరలను పూర్వ విధానంలోనే ఉంచి, 53 కేటగిరీలుగా ఉన్న రాయితీలను 11 కేటగిరీలకు మాత్రమే పరిమితం చేశారు. రోగులకు, దివ్యాంగులకు, మరికొందరికి మాత్రమే పునరుద్ధరిం చారు. అవకాశం దొరికిందని వృద్ధులకిచ్చే రాయితీ సైతం రద్దుచేశారు. దీంతో వృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఒక కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని అందులో తేల్చి చెప్పారు. వృద్ధులకు, సౌకర్యాలు, గౌరవం కల్పించడం భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణం. అటువంటిది కేంద్రం వృద్ధులకిచ్చే రైల్వే టికెట్ రాయితీని రద్దు చేయడం ద్వారా మన సాంస్కృతిక విలువలను తుంగలో తొక్కు తోంది. పెద్దవాళ్లు చేసే తీర్థయాత్రలు, తప్పనిసరి ప్రయాణాలను ప్రభుత్వ నిర్ణయం భారంగా మార్చింది. (క్లిక్: ఎంత ఖర్చుకు ఎంత ప్రయోజనం?) దేశ వ్యాప్తంగా వెల్లడవుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 70 ఏళ్లు పైబడినవారికి రాయితీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. కానీ ఈ కంటి తుడుపు చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కరోనా మహమ్మారికి ముందు ఉన్నట్లే 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు రాయితీ వర్తింప జేయాలి. (క్లిక్: వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?) – డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు -
రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం!
దేశంలో తక్కువ ఖర్చుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాలంటే అది భారతీయ రైల్వేతోనే సాధ్యం. ఇండియన్ రైల్వే ప్రపంచలోనే నాలుగో అతి పెద్ద సంస్థగా పేరు పొందింది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానానికి చేర్చడంతో పాటు కోట్ల రూపాయల సరుకులు కూడా రవాణ చేస్తుంది మన చుకు చుకు బండి. అంతేనా మిడిల్ క్లాస్ నేల విమానంగా పేరు కూడా ఉంది. ఇటీవల ప్యాసింజర్లకు కొన్ని ఉచిత సేవలని కూడా ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. చాలామంది ప్రయాణికులకు ఇలాంటి సౌకర్యాలు ఉచితంగా భారతీయ రైల్వే అందిస్తున్న విషయం కూడా తెలియదు. అవేంటో ఓ లుక్కేద్దాం.. ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్.. అదనపు చార్జ్ ఉండదు టిక్కెట్ల బుకింగ్ సమయంలో, రైల్వే ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తుంది ఇండియన్ రైల్వే. అంటే, స్లీపర్‌లోని ప్రయాణీకుడు థర్డ్ ఏసీని పొందవచ్చు, అది కూడా స్లీపర్ క్లాస్ టికెట్‌తోనే. దీనికి ఎటువంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఈ తరహాలోనే థర్డ్ ఏసీ ప్యాసింజర్ సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ ప్యాసింజర్ వన్ టైర్ ఏసీ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి, ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో ఆటో అప్‌గ్రేడ్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత, అందుబాటులో ఉన్న సీట్లను బట్టి, ప్రయాణికుల రైల్వే టిక్కెట్‌ను వారు ఎంచుకున్న ఆఫ్షన్ ప్రకారం అప్‌గ్రేడ్ చేస్తారు. అయితే, ప్రతిసారీ టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. వికల్ప్ సర్వీస్ ఎంచుకుంటే బెటర్ తమ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్యాసింజర్లు వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి అవసరం లేకుండా రైల్వే శాఖ ‘వికల్ప్ సర్వీసు’ను ప్రారంభించింది. ఇది మరొక మనం బుక్ చేసుకున్న ట్రెన్‌లో సీటు లేకపోతే మన గమ్య స్థానానికి వెళ్లే మరొక రైలులో సీట్ల లభ్యత ఆధారంగా మనకి సీటుని కేటాయిస్తారు. ఇందుకోసం టికెట్ బుకింగ్ సమయంలోనే వికల్ప్ సర్వీస్ ‘ఆప్షన్’ ఎంచుకోవాలి. ఆ తర్వాత రైల్వే ఈ సౌకర్యాన్ని ఉచితంగానే కల్పిస్తుంది. టిక్కెట్ల ట్రాన్స్ఫర్ రైల్వే టిక్కెట్లను బదిలీ (ట్రాన్స్ఫర్) చేయచ్చు. ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయలేకపోతే, అతను తన కుటుంబంలోని ఎవరికైనా తన టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. అయితే, ప్రయాణ రోజు నుంచి 24 గంటల ముందు టికెట్ బదిలీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం, టిక్కెట్ ప్రింట్ తీసుకొని, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు తన ఐడీ (గుర్తింపు కార్డు) స్టేషన్లో చూపించి ఆ టిక్కెట్‌ని బదిలీ చేయవచ్చు. అయితే, టిక్కెట్లను ఒక్కసారి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. బోర్డింగ్ స్టేషన్ మార్చవచ్చు టికెట్ బదిలీ మాదిరిగానే, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌకర్యం కూడా 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటుంది. అంటే, ఒక ప్రయాణీకుడు హైదరాబాద్ నుంచి టిక్కెట్‌ను బుక్ చేసి, ఆ రైలు మార్గంలో మరేదైనా స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటే, అతను తన స్టేషన్‌ను మార్చవచ్చు. బోర్డింగ్ స్టేషన్లో మార్పు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇందుకు ఐఆర్టీసీ(IRCTC) వెబ్సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత, బుక్ చేసిన టికెట్ హిస్టరీకి వెళ్లడం ద్వారా మీరు బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవాలి. అయితే, మార్చుకునే సదుపాయం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది చదవండి: అదానీ దూకుడు: మూడు లక్షల కోట్లు దాటేసిన నాలుగో కంపెనీ -
ప్రయాణికులకు భారీ షాకిచ్చిన భారతీయ రైల్వే!
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, డుర్యాంటో ఎక్స్‌ప్రెస్‌లతో సహా భారతీయ ప్రీమియం రైళ్లకు ఈ క్యాటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. భారతీయ రైల్వే బోర్డు జూలై 15న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొత్త ధరలు ఉంటాయని పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం. ఇకపై ప్రీమియం రైళ్లలో.. అల్పాహారం రూ.105 ఉండగా, రూ. 155 చేరింది. భోజనం రూ. 185 ఉండగా, రూ. 235, స్నాక్స్ రూ. 90 ఉండగా, రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో టీ లేదా కాఫీ ముందుగా బుక్ చేసుకుంటే రూ. 20, బుక్ చేసుకోకుంటే రూ. 70 వసూలు చేసేవాళ్లు. ప్రస్తుతం బుక్ చేసినా, చేయకపోయినా వాటి ధరను రూ. 20గా నిర్ణయించారు. చదవండి: Google Play Store: యాప్ డెవలపర్లకు గూగుల్ కొత్త రూల్స్.. యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అలా చేయాల్సిందే! -
ఇండియన్ రైల్వేకు వరల్డ్ బ్యాంక్ రుణం!
న్యూఢిల్లీ: రైలు సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు తెలిపింది. ఇందుకుగాను 245 మిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.78 చొప్పున రూ.1,911 కోట్లు రుణాన్ని ఆమోదించినట్లు బహుళజాతి ఆర్థిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ) విభాగం నుంచి ఈ రుణ మంజూరీలకు ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అమోదం లభించింది. ఏడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్సహా 22 సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ప్రపంచ బ్యాంక్ ప్రకటన ప్రకారం, భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి దేశంలో మరింత ట్రాఫిక్‌ను రోడ్డు నుండి రైలుకు మార్చడానికి సహాయపడుతుంది. అలాగే సరుకు రవాణా, ప్రయాణీకులను సురక్షితంగా, వేగంగా గమ్య స్థానాలకు చేర్చడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను (జీహెచ్‌సీ) తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రైల్వే రంగంలో మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుందని వరల్డ్ బ్యాంక్ (ఇండియా) ఆపరేషన్స్ మేనేజర్, యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ హిడేకి మోరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ♦ ఇండియన్ రైల్వే మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 1.2 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, ప్రపంచంలో నాల్గవ–అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది. అయినప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని సరుకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గం ద్వారా, 17 శాతం మాత్రమే రైలు ద్వారా జరుగుతుండడం గమనార్హం. ♦ భారతీయ రైల్వేల సామర్థ్య పరిమితులు ఈ విభాగం పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. సరకు రవాణా వేగం, విశ్వసనీయతలకు కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా, సంవత్సరాలుగా రోడ్డు రవాణా ట్రక్కులకు రైల్వే తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. రవాణాలో రైల్వే మార్కెట్ షేర్ దశాబ్దం కిత్రం 52 శాతం అయితే, 2017–18లో 32 శాతానికి తగ్గింది. ♦రోడ్డు రవాణా కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉంది. సరుకు రవాణా రంగం దాదాపు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను కలిగి ఉంది. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 12.3 శాతం ట్రక్కులకు సంబంధించినవే. రోడ్డు రవాణా సంబంధిత మరణాలలో 15.8 శాతం వాటా కూడా ట్రక్కులదే. ట్రక్కుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కేవలం ఐదవ వంతును మాత్రమే రైల్వే రంగం విడుదల చేస్తుంది, ♦ భారతీయ రైల్వేలు 2030 నాటికి పూర్తి కాలుష్య రహిత వాతావరణంలో పనిచేయాలని యోచించడం హర్షణీయం. ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువులను తొలగించగల సామర్థ్యాన్ని రైల్వే రంగం కలిగి ఉంది. ♦ భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ కాలుష్యాన్ని తగ్గించడానికే కాకుండా, కోట్లాది మంది రైలు ప్రయాణీకులకు ఊరట కలిగించే అంశం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అధికంగా ఉన్న రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇక భారత్ సంస్థల పోటీ తత్వాన్ని సైతం పెంచే అంశం ఇది. -
అలాంటిదేమీ లేదు...దంచుడు దంచుడే!
సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే శాఖ అందించే రాయితీలను తిరిగి ప్రారంభించనున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జూలై 1 నుండి సీనియర్ సిటిజన్స్ రాయితీలు తిరిగి పొందవచ్చు అనేవార్త వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్ అంటూ ఈ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ దివ్యాంగులు, రోగులతోపాటు, కొంతమంది విద్యార్థులకు మాత్రమే రాయితీలు ఇస్తోందని పునరుద్ఘాటించింది. అలాగే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ“ఫ్యాక్ట్ చెక్” హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో ఇక నైనా తమకు చార్జీల భారంనుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వయో వృద్ధులకు తీరని నిరాశే మిగిలింది. త్వరలోనే రాయితీ తిరిగి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనాకి ముందు రైల్వేలో ప్రత్యేక రాయితీల ద్వారా 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ ప్యాసెంజర్లకు 40 శాతం రాయితీ అమలయ్యేది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో రూ.3464 కోట్ల రూపాయలు, ఇందులో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేదని ఇటీవలి ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది. అలాగే కరోనా కారణంగా 2020 మార్చిలో వయోవృద్ధుల రాయితీలను తొలగించిన మంత్రిత్వ శాఖకు వాటిని పునరుద్ధరించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు తెలియజేశారు. A #Fake media report is claiming that the Indian Railways will resume concessions for senior citizens from July 1, 2022 ▶️ No such announcement has been made by @RailMinIndia ▶️ Indian Railways is currently providing concessions to divyangjans, patients & students only pic.twitter.com/ePoctCRu3A — PIB Fact Check (@PIBFactCheck) June 16, 2022 -
రైలు ప్రయాణంలో ఎక్కువ లగేజీ తీసుకురావొద్దు!
రైల్వేశాఖ తాజాగా జారీ చేసిన ఓ ప్రకటన ప్రయాణికులను ఆయోమయానికి గురి చేసింది. అంతేకాదు అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ప్రకటన రైల్వేపై విమర్శలకు తావిచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ నష్టనివారణ చర్యలకు దిగింది. ఎక్కువ లగేజీ వద్దు ఇటీవల రైల్వేశాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినూత్న ప్రచారానికి తెర లేపింది. రైలు ప్రయాణంలో అవసరానికి మించి లగేజీ తెచ్చుకోవద్దంటూ సూచించింది. లగేజీ ఎక్కువైతే ప్రయాణంలో ఆనందం ఆవిరవుతుందంటూ వివరించింది. లగేజీ పరిమిత స్థాయికి మించి ఉంటే రైల్వే పార్శిల్ సర్వీసును ఉపయోగించుకోవాలంటూ కోరింది. अगर सामान होगा ज्यादा, तो सफर का आनंद होगा आधा! अधिक सामान ले कर रेल यात्रा ना करें। सामान अधिक होने पर पार्सल कार्यालय जा कर लगेज बुक कराएं। pic.twitter.com/gUuishbqr5 — Ministry of Railways (@RailMinIndia) May 29, 2022 లగేజీకి ఛార్జ్? కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరణ బాట పట్టడం. రైల్వేలో కూడా ప్రైవేటీకరణ మొదలవడంతో తాజా ప్రచారం అనేక సందేహాలకు తావిచ్చింది. దీనికి తోడు కోవిడ్ సమయంలో రద్దు చేసిన పలు రాయితీలు, ప్యాసింజర్ రైళ్లను ఇప్పటికీ రైల్వేశాఖ పునరుద్ధరించ లేదు. దీంతో విమాన సర్వీసుల తరహాలో లగేజీ ఎక్కువగా ఉంటే అదనపు ఛార్జ్ చేస్తారనే అపోహలు ప్రజల్లో ఏర్పాడ్డాయి. రైల్వే ప్రకటనపై పలు మీడియా సంస్థలు కూడా ఇదే తరహాలో వార్తలు ప్రచురించాయి. పాత పద్దతే రైలు ప్రయాణంలో లగేజీకి కూడా ఛార్జ్ వసూలు చేయాలనే ఆలోచన బాగాలేదంటూ రైల్వేపై విమర్శలు పెరిగాయి. దీంతో తమ ప్రచార యత్నం పట్టాలు తప్పిందని రైల్వేశాఖ గ్రహించింది. వెంటనే తామేమీ కొత్త విధానాలను అమలు చేయడం లేదని. గత పదేళ్ల నుంచి అమల్లోఉన్న పద్దతులనే ప్రజలకు తెలియజేశామంటూ మరో వివరణ ఇచ్చింది. News item covered on some social media/digital news platforms that the luggage policy of railways has recently been changed, is incorrect. It is hereby clarified that no change has been made in the recent past and the existing luggage policy is enforced for more than 10 years. — Ministry of Railways (@RailMinIndia) June 6, 2022 చదవండి: ఎవ్వరినీ వదలం.. రాయితీలు ఇవ్వం.. లాభాలే ముఖ్యం -
రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దేశంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఆయా మార్గాలలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ► విశాఖపట్నంలో ఈ నెల 29, వచ్చేనెల 5, 12, 19 తేదీలలో బయల్దేరే విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్(22847) వయా రాయగడ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. ► లోకమాన్యతిలక్ టెర్మినస్‌లో ఈ నెల 31, వచ్చేనెల 7, 14, 21 తేదీలలో బయల్దేరే లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(22848) ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో రద్దయిన రైళ్లు.. ► సంబల్పూర్లో బయల్దేరాల్సిన సంబల్పూర్–రాయగడ(18301) ఎక్స్‌ప్రెస్ ► రాయగడలో బయల్దేరాల్సిన రాయగడ–సంబల్పూర్(18302) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–భువనేశ్వర్(22820) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► భువనేశ్వర్‌లో బయల్దేరాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం (22819) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–పలాస(18532) ఎక్స్‌ప్రెస్ ► పలాసలో బయల్దేరవలసిన పలాస– విశాఖపట్నం(18531) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరవలసిన విశాఖపట్నం–కోరాపుట్(08546) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► కోరాపుట్‌లో బయల్దేరవలసిన కోరాపుట్–విశాఖపట్నం(08545) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► పూరీలో బయల్దేరాల్సిన పూరి–గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్ ► గుణుపూర్‌లో బయల్దేరాల్సిన గుణుపూర్–పూరి (18418) ఎక్స్‌ప్రెస్. -
తల్లిబిడ్డల కోసం రైళ్లలో సరికొత్త సౌకర్యం!
చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైలులో ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది. నార్తర్న్ రైల్వే డివిజన్ అధికారులు చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్ బెర్త్‌లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను రూపొందించారు. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఫలితాలు బాగుంటే క్రమంగా ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించే అవకాశం ఉంది. భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తున్నారను. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిబిడ్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కరం చూపలేకపోయారు. అయితే తొలిసారిగి నార్నర్ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. Happy Mother's Day. A baby berth has been introduced in Coach no 194129/ B4, berth no 12 & 60 in Lucknow Mail, to facilitate mothers traveling with their baby. Fitted baby seat is foldable about hinge and is secured with a stopper. @AshwiniVaishnaw @RailMinIndia @GM_NRly pic.twitter.com/w5xZFJYoy1 — DRM Lucknow NR (@drm_lko) May 8, 2022 చదవండి: అప్పడు వర్క్ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా... -
విశాఖపట్నం నుంచి తొలిసారిగా కొరాపుట్‌కు రైలు.. షాకిచ్చిన ప్రయాణికులు
కొరాపుట్(భువనేశ్వర్): ఎద్దు ఈనిందంటే.. తీసుకొచ్చి వాకిట్లో కట్టేయమన్న చందంగా ఉంది ఈస్టుకోస్టు రైల్వే అధికారుల తీరు. ప్రజలు డిమాండ్ చేశారు. అధికారులు మంజూరు చేశారు. కానీ రైలు ఏ మార్గంలో నడపాలో పట్టించుకోక పోవడంతో డొల్లతనం బయటపడింది. విశాఖపట్నంలో ఉదయం 6.35 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి, రాయగడ మీదుగా తొలిసారిగా కొరాపుట్ చేరుకున్న విస్టాడోం కోచ్‌లో ఒక్కరు కూడా ప్రయాణించ లేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో రైల్వేశాఖ సిబ్బందే సమాధానం చెప్పాల్సి ఉంది. వాస్తవానికి విశాఖపట్నం నుంచి అరకు ప్రయాణించే కిరండూల్ రైలు(18551) కొరాపుట్ మీదుగా జగదల్పూర్ వెళ్తుంది. తూర్పు కనుమల్లో ఉన్న ఈ మార్గమంతా ప్రకృతి అందాలతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రైల్వేశాఖ కిరండూల్ రైలుకు విస్టాడోం కోచ్‌ను గతంలోనే అనుసంధానించారు. దీనిని కొరాపుట్ వరకు నడపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపాదనకు ఆమోదించిన ఈస్టుకోస్టు రైల్వే అధికారులు.. కోచ్‌ను మాత్రం రాయగడ మీదుగా కొరాపుట్ వెళ్లే రైలుకు అనుసంధానించి, చేతులు దులుపుకొన్నారు. మరోవైపు విశాఖపట్నం నుంచి కొరాపుట్‌కు నిడిపే ప్రత్యేక రైలు(08545)లో సాధారణ టిక్కెట్ ధర కేవలం రూ.140లు ఉండగా.. విస్టాడోం కోచ్‌లో రూ.1,300లుగా ఉంది. అరుకు మీదుగా కొరాపుట్ చేరు కిరండూల్ రైలులో సాధారణ టిక్కెట్ రూ.85 మాత్రమే. ఈ లెక్కను అరకు అందాలు చూడకుండా రాయగడ మీదుగా విస్టాడోంలో ప్రయాణించేందుకు అదనంగా రూ.1,160లు చెల్లించేందుకు ప్రయాణికులు ఆసక్తిగా ఉండరని రైల్వేశాఖ గమనించలేదు. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు అరకు వెళ్లదని తెలిసి, పర్యాటకుల్లో అసంతృప్తి నెలకొంది. చదవండి: పెళ్లిలో ‘షేర్వాణీ’ రగడ -
రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!
భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే, ఇప్పుడు మరిన్ని సేవలను అందించేందుకు సిద్దం అయ్యింది. రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక కొత్త సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రైల్ వైర్ సాథి కియోస్క్ పేరుతో ఈ కొత్త సేవలను అందించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పుడు దేశం మెుత్తం ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ సదుపాయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇంటర్నెట్ సదుపాయ లేని మారుమూల ప్రాంత ప్రజలు ఆధార్, పాన్ కార్డు సేవలను పొందడం మరింత సులభం కానుంది. దేశవ్యాప్తంగా 200 స్టేషన్లలో ఈ ప్రత్యేక సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. (చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!) -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త!!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న డిజిటల్ టికెటింగ్ సర్వీస్‌లో రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు తీరిపోనున్నాయి. ఐఆర్సీటీసీ ఇకపై రైల్వే స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్(ఏటీవీఎం)లలో యూపీఐ పేమెంట్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యూపీఐ పేమెంట్స్ కోసం ఐఆర్సీటీసీతో జతకట్టినట్లు పేటీఎం ప్రకటించింది. దీంతో దేశంలోని అన్నీ రైల్వే స్టేషన్లలో క్యాష్‌లెస్ ట్రైన్ టికెట్ తీసుకునే వీలు కలగనుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రైల్వే ఏటీవీఎంలలో రైల్వే ప్రయాణికులు యూపీఐ పేమెంట్ ద్వారా టిక్కెట్ తీసుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఏటీవీఎంలు టచ్ స్క్రీన్ ఆధారిత టికెటింగ్ కియోస్క్‌లు. ఈ కియోస్క్‌లో రైల్వే ప్రయాణికులు క్యాష్ లేకుండా డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సదుపాయం దేశంలోని అన్నీ రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు స్క్రీన్లపై రూపొందించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా స్మార్ట్ కార్డ్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు అన్‌రిజర్వ్ ట్రైన్ టికెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను కొనుగోలు చేయోచ్చు. వారి సీజనల్ టిక్కెట్లను పునరుద్ధరించుకోవచ్చు. ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ..అన్నీ రైల్వే స్టేషన్లలో యూపీఏ పేమెంట్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. చదవండి: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! -
రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..!
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ కబురు అందించింది. అత్యవసర సమయాల్లో రైళ్లలో ప్రయాణించడానికి టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, తత్కాల్లో టిక్కెట్ దొరకడం అంత తేలికైన విషయం కాదు. ఒకే సమయంలో ఎంతో మంది ప్రజలు తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉండటం వల్ల అందరికీ టికెట్ లభించదు. కానీ, రైలు ప్రయాణికుల వెసులుబాటు కోసం ఇప్పుడు ఐఆర్సీటీసీ ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే కన్ఫర్మ్ టికెట్ మొబైల్ యాప్. దీని ద్వారా అత్యవసర ప్రయాణాల సమయంలో ప్రయాణికులు సులువుగా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు వివిధ రైళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అలాగే, మీరు ప్రయాణించే మార్గంలో అందుబాటులో ఉన్న అన్ని తత్కాల్ టిక్కెట్ల వివరాలను కూడా చూపిస్తుంది. ఈ యాప్‌లో రైళ్ల వివరాలను పొందడం కోసం ప్రయాణీకులు ఇకపై రైలు నెంబర్లను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ యూజర్ల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, "కన్ఫర్మ్ టికెట్" వెబ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. యూజర్లు వినియోగదారులు తమ బుకింగ్‌ను నిర్ధారించే ముందు వారి ప్రయాణ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తుది బుకింగ్‌ను ఎంచుకున్నప్పుడు వివరాలు సేవ్ చేయడం వల్ల సులువుగా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రో.. ఊపిరి పీల్చుకో..) -
కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే గొడుగు కిందకు రైల్వే సేవలు..!
ప్రపంచంలోనే అతి పెద్ధ రైల్వే వ్యవస్థ మన ఇండియాలో ఉంది అనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ఇంత పెద్ధ రైల్వేశాఖలో ప్రస్తుతం ఎన్నో విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అన్ని రైల్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కింద ప్రతిపాదనలు చేసింది. అయితే, అప్పటి ప్రతిపాదనలు ఇప్పుడు అమలు చేసేందుకు సిద్ద పడుతుంది. ప్రస్తుతం అన్ని రైల్వే డిపార్ట్మెంట్స్ను కలిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం కేంద్రం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సెర్వీస్(ఐఆర్ఎంఎస్)ను గ్రూప్ 'ఏ' సెంట్రల్ సెర్వీసెస్ కిందకు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యల వల్ల కొత్త అధికారుల నియమించుకోవాల్సి ఉంటుంది. 2019లో రైల్వే అధికారులకు ఒకే కేడర్ ఉండాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అనేక డిపార్ట్మెంట్స్ వీడి విడిగా ఉండటం వల్ల అధికారులు మధ్య బేదాభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో, అతి పెద్ద రైల్వే వ్యవస్థలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం కలుగుతుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తు అవసరాలను తీర్చగల స్థాయికి చేరడానికి అన్నీ రైల్వే విభాగాలను కాలపాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది. ఈ రైల్వే విభాగాల విలీనం రైల్వే బ్యూరోక్రసీలో అతిపెద్ద సంస్కరణగా అధికారులు పరిగణిస్తున్నారు. ఇంత పెద్ద రైల్వే శాఖలో సంస్కరణలను తీసుకురావడానికి, వేగంగా ఆధునికీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మొదట కేంద్రం 150 మంది అధికారులను నియమించుకోవడం ద్వారా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కొంత మంది అధికారులు తెలిపారు. నియామకాలు చేపట్టడంలో ఆలస్యం చేయడంలేదని, రిటైర్ అవుతున్న సీనియర్లను పరిశీలించి కొత్తగా ఆఫీసర్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ రిక్రూర్‌మెంట్‌కు సంబంధించి కొత్త నియమ నిబంధనలు బయటకు రావాల్సి ఉంది. (చదవండి: క్రిప్టోకరెన్సీలపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!) -
వాట్ ఆన్ ఐడియా అశ్విన్జీ !
ఆదాయం పెంచుకునే పనిలో భాగంగా రైల్వేశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రద్ధీగా ఉండే స్టేషన్లు, రైల్వే స్థలాల్లో సరికొత్త రెస్టారెంట్లు ప్రారంభించనుంది. దీని కోసం పాత రైలు పెట్టెలను ఉపయోగించాలని నిర్ణయించింది. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వందల ఏళ్లుగా రైల్వేశాఖ దేశంలో సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త రైలు బోగీలు తయారుచేస్తోంది. ఇదే సమయంలో పాత బోగీలు ప్రయాణానికి పనికిరాకుండా పోతున్నాయి. గత కొంత కాలంగా రైల్వేలో ఫిట్నెస్ లేని కోచ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. యాభై ఏళ్లు పైబడిన రైలు పెట్టెల్లో చాలా వరకు ఫిట్నెస్తో ఉండటం లేదు. ఇలాంటి పాత పెట్టెలను మేనేజ్ చేయడం సైతం రైల్వేకు భారంగా మారుతోంది. #Repost @RailMinIndia Coach to Restaurant!! Indian Railways is refurbishing its old railway coaches, which are not fit for use in trains, by turning them into beautiful concept restaurants making them an attraction for travellers. pic.twitter.com/q0lnTVOQwM — Ministry of Tourism (@tourismgoi) February 7, 2022 నిరుపయోగంగా మారుతున్న రైలు పెట్టెలతో సరికొత్త వ్యాపారానికి నాంది పలుకుతోంది. ఓల్డ్ రైల్వే కాంపార్ట్మెంట్లను రెస్టారెంట్లుగా మార్చుతోంది. ఫిట్నెస్ లేని రైలు పెట్టెలకు రైల్వే ఆధీనంలోని వర్క్‌షాప్‌లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇలా మార్చిన రైలు పెట్టెలను రద్ధీగా ఉండే రైల్వే స్టేషన్లలో రెస్టారెంట్లుగా మార్చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రారంభించిన రెస్టారెంట్లకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భోపాల్, జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఈ తరహా రెస్టారెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అన్ని ప్రముఖ స్టేషన్లలో అవకాశం ఉన్న చోట ఈ తరహా రెస్టారెంట్ ప్రారంభించే దిశగా రైల్వే కసరత్తు చేస్తోంది. చదవండి: ఐఆర్సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్.. -
మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోండి ఇలా..?
రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ సరికొత్తగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రైల్వే ప్రయాణికులు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే, ఇప్పుడు మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ మీ మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది. రైలు లైవ్ స్టేటస్ కి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన మ్యాప్స్‌లో అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..? మొదట మీ మొబైల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ మ్యాప్స్‌లో క్లిక్ చేయండి. మ్యాప్స్‌లో మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ క్లిక్ చేయగానే మీకు చాలా రైళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీరు ప్రయాణించే రైలు మీద క్లిక్ చేయగానే ఆ రైలు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనేది మీకు చూపిస్తుంది. (చదవండి: ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..) -
వావ్!! దేశంలో మరో సూపర్ ఫాస్ట్ రైలు, ఎక్కడంటే!
దేశంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశంలో 8 కారిడార్లలలో బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఢిల్లీ - హిస్సార్ ప్రాంతాల మధ్య సూపర్ ఫాస్ట్ ట్రైన్ సేవల్ని ప్రారంభించనుంది. ఢిల్లీ - హిస్సార్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్ల రైలు మార్గాన్ని నిర్మించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు హర్యానా మంత్రి డాక్టర్ కమల్ గుప్తా తెలిపారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ-హిస్సార్ మధ్య 180 కి.మీ దూరాన్ని సాధారణ రైలులో నాలుగు గంటల్లో పూర్తి చేస్తుండగా..కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయితే ఈ దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో అధిగమించవచ్చు. ప్రధాన కారణం ఢిల్లీ-హిస్సార్ కొత్త రైలు మార్గాన్ని నిర్మించడానికి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువే ప్రధాన కారణం. అక్కడ విమాన ట్రాఫిక్ ఉంటే, కొంత విమాన ట్రాఫిక్‌ను హిసార్ విమానాశ్రయానికి మళ్లించవచ్చు. దీని తరువాత, హిసార్ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయొచ్చని కేంద్రం భావిస్తోంది.ఇందులో భాగంగా సీఎం మనోహర్ లాల్‌తో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చర్చించారు. ఈ సందర్భంగా రోహ్తక్లోని ఎలివేటెడ్ రైల్వే లైన్ కింద పది కొత్త రైల్వే స్టేషన్లతో పాటు రోడ్డు మార్గాల్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: బెంగళూరు - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్... రైల్వే శాఖ కీలక నిర్ణయం -
రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు!
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు భారీగా షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్దం అవుతుంది. ఇక నుంచి కొన్ని రైల్వే స్టేషన్లలో ఎక్కిన, దిగిన మోత తప్పదు. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో ఎక్కువ దూరం ప్రయాణించే రైల్వే ప్రయాణికుల మీద ప్రయాణ తరగతిని బట్టి ₹10 నుండి ₹50 వరకు స్టేషన్ అభివృద్ధి రుసుము విధించాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో ఎక్కిన, దిగిన ఈ స్టేషన్ అభివృద్ధి రుసుమును వసూలు చేయనున్నారు. బుకింగ్ సమయంలోనే రైలు టిక్కెట్లకు రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేయలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. పునర్అభివృద్ధి చేసిన స్టేషన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫీజు విధించనున్నారు. ఈ యూజర్ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. అన్ని ఏసీ క్లాసులకు ₹50, స్లీపర్ క్లాసులకు ₹25, అన్ రిజర్వ్డ్ క్లాసులకు ₹10 వసూలు చేయనున్నరు. రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సబర్బన్ రైలు ప్రయాణాలకు ఈ స్టేషన్ అభివృద్ధి రుసుము వసూలు చేయరు. ఈ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ల ధరలు కూడా ₹10 పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. "స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(ఎస్డిఎఫ్) ప్రయాణీకుల నుంచి సేకరించనున్నారు. అభివృద్ధి చెందిన/పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో క్లాస్ వారీగా ఎస్డిఎఫ్ కింద ఛార్జ్ చేస్తారు. ఈ స్టేషన్లలో ప్రయాణీకులు దిగినట్లయితే ఎస్డిఎఫ్ సూచించిన రేట్లలో 50 శాతం రుసుము ఫీజు ఉంటుంది. ఒకవేళ ఎక్కి, దిగే స్టేషన్స్ రెండు పునర్అభివృద్ధి చెందిన స్టేషన్స్ అయితే ఎస్డిఎఫ్ వర్తించే రేటుకు రుసుము 1.5 రెట్లు" అని సర్క్యులర్ లో పేర్కొంది. ఎస్డిఎఫ్ రుసుము విధించడం వల్ల రైల్వేలకు ఆదాయం పెరుగుతుంది. ఈ చర్య ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడానికి సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పశ్చిమ మధ్య రైల్వేకు చెందిన రాణి కమలాపతి స్టేషన్, పశ్చిమ రైల్వేలోని గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రారంభించారు. (చదవండి: Jan Dhan Yojana: జన్ ధన్ యోజన ఖాతాలో భారీగా నగదు జమ..!) -
భారతీయ రైల్వేకు కనక వర్షం కురిపిస్తున్న తత్కాల్ టికెట్లు..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న 2020-21 ఏడాదిలోనూ.. రైల్వేకు వెయ్యికోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి మొత్తం 1033కోట్లు రైల్వే వసూలు చేసింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా 403 కోట్లు రాగా, ప్రీమియం తత్కాల్ కింద 119 కోట్లు, డైనమిక్ ఛార్జీలకు 511 కోట్లు వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరంలో చాలా వరకు రైళ్లను నిలిపివేశారు. అయిన, ఈ మేరకు ఆదాయం రావడం గమనార్హం. రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే తత్కాల్ టికెట్ల ద్వారా 353 కోట్లు, ప్రీమియం తత్కాల్ కింద 89 కోట్లు, డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.240 కోట్లు వచ్చినట్లు రైల్వే వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు భారతీయ రైల్వే సంస్థ డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.1,313 కోట్లు, తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.1,669, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.603 కోట్లు సంపాదించింది. ఈ తత్కాల్ టిక్కెట్లపై విధించే ఛార్జీలు "కొంచెం అన్యాయమైనవి" అని రైల్వేలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యానించిన ఒక నెల తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి డేటా బయటకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా ప్రజలు భాదపడుతున్న సమయంలో ప్రయాణీకులపై భారాన్ని మోపడం తగదు అని కమిటీ పేర్కొంది. (చదవండి: వాహనదారులకు భారీషాక్ , 43 లక్షల వాహనాల లైసెన్స్ రద్దు!) -
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీని తగ్గించి వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య పలు పూజా స్పెషల్ రైళ్లు నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే నిర్ణయించినట్లు, వాల్తేర డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠీ తెలిపారు. చదవండి: దేత్తడి హారిక ఇల్లు ఎంత బాగుందో చూడండి! విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(08579/18580) పూజా స్పెషల్: విశాఖపట్నం–సికింద్రాబాద్(08579 పూజా స్పెషల్ రైలు ప్రతి బుధవారం రాత్రి 7గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబర్ 1 నుండి 29వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08580)సికింద్రాబాద్‌లో త్రపి గురువారం రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగుడ, సత్తెనపల్లె స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ రైళ్లు 3–థర్డ్ ఏసీ, 8–స్లీపర్‌క్లాస్, 6–సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తాయి. విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(08585/08586) స్పెషల్ విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) వీక్లీ పూజా స్పెషల్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంట లకు విశాఖపట్నంలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబరు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08586) సికిందాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 9.05గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబరు 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, సామర్ల కోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూ రు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఎసి, 3–థర్డ్ ఎసి, 10–స్లీపర్‌క్లాస్, 6–జనరల్ సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్ కం లగేజీ/డిజేబుల్డ్ కోచ్‌లతో నడుస్తాయి. -
కొత్త ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇలా..!
కరోనా మహమ్మారి తర్వాత గత కొద్ది కాలం నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. అయితే, పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ కూడా అనేక ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. అయితే చాలా మంది టికెట్ బుక్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) వెబ్ సైట్/యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, వారికి ఖాతా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సొంతంగా ఖాతా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురుంచి ఐఆర్సీటీసీ తన ట్విటర్ ద్వారా వీడియో షేర్ చేసింది. ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసే విధానం మొదట ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి. అందులో మీకు కనిపించే రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యూజర్ నేమ్ నమోదు చేయండి(అది 3 నుంచి 35 పదాల మధ్య ఉండాలి). ఇప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ను రెండు బాక్స్ లలో నమోదు చేసిన తర్వాత మీ భాషను ఎంచుకోండి. అలాగే, భద్రతా ప్రశ్న ఎంచుకొని దాని కింద మీ సమాధానాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ పేరు, లింగం, వైవాహిక స్థితి, వృత్తి, పుట్టిన తేదీ వంటి తదితర వివరాలు నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అలాగే, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి. ఆ తర్వాత పిన్ కోడ్ తో సహా మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ నెంబరు/ఈమెయిల్ ఐడీకి పంపిన కోడ్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది. (చదవండి: ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?) Want to book train tickets but do not have an #IRCTC account yet. Create your #IRCTC ticketing account in these simple steps and book your train tickets now.#userregistration #irctcticketing #irctcaccount #trainbooking — IRCTC (@IRCTCofficial) October 18, 2021 -
రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ బోనస్!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాలకు సమానమైన బోనస్ అందించేందుకు కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద ₹1,984.73 కోట్లు ఆర్ధిక భారం పడనుంది. సుమారు 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. "అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ(ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పిఎల్‌బి)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు బోనస్ కింద 78 రోజులకు చెల్లించాల్సిన మొత్తం ₹17,951 అని కేంద్రం పేర్కొంది. అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పిఎల్‌బి చెల్లించడానికి సూచించిన వేతన లెక్కింపు పరిమితి ₹7,000/నెలకు అని తెలిపింది. (చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!) "అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు పిఎల్‌బి చెల్లింపు చేయబడుతుంది. ఈ ఏడాది కూడా సెలవులకు ముందే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు" కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలి. కానీ ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!) Union Cabinet approves Productivity Linked Bonus equivalent to 78 days' wage to eligible non-gazetted Railway employees (excluding RPF/RPSF personnel) for FY20-21. About 11.56 lakh non-gazetted Railway employees are likely to benefit from the decision:Union Minister Anurag Thakur pic.twitter.com/cv7IDkulZb — ANI (@ANI) October 6, 2021 -
రేపటి నుంచి కాకినాడ పోర్ట్-విశాఖ మధ్య మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, విశాఖపట్నం: రేపటి( జూలై 19) నుంచి కాకినాడ పోర్ట్-విశాఖ మధ్య మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి మెము ఎక్స్‌ప్రెస్ కాకినాడలో ఉ.4.25కి బయల్దేరి రాత్రి 9.40కి విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి సా.5.05కి బయల్దేరి రాత్రి 22.10కి కాకినాడ చేరుకోనుంది.


