వావ్‌!! దేశంలో మరో సూపర్‌ ఫాస్ట్‌ రైలు, ఎక్కడంటే!

Indian Railway Operate Super Fast Train Between Delhi And Hisar - Sakshi

దేశంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే దేశంలో 8 కారిడార్లలలో బుల్లెట్‌ ట్రైన్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఢిల్లీ - హిస్సార్‌ ప్రాంతాల మధ్య సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌ సేవల్ని ప్రారంభించనుంది.  

ఢిల్లీ - హిస్సార్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్ల రైలు మార్గాన్ని నిర్మించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు హర్యానా మంత్రి డాక్టర్ కమల్ గుప్తా తెలిపారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ-హిస్సార్ మధ్య 180 కి.మీ దూరాన్ని సాధారణ రైలులో నాలుగు గంటల్లో పూర్తి చేస్తుండగా..కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయితే ఈ దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో అధిగమించవచ్చు.

ప్రధాన కారణం
ఢిల్లీ-హిస్సార్‌ కొత్త రైలు మార్గాన్ని నిర్మించడానికి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ ఎక్కువే  ప్రధాన కారణం. అక్కడ విమాన ట్రాఫిక్ ఉంటే, కొంత విమాన ట్రాఫిక్‌ను హిసార్ విమానాశ్రయానికి మళ్లించవచ్చు. దీని తరువాత, హిసార్ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయొచ్చని కేంద్రం భావిస్తోంది.ఇందులో భాగంగా సీఎం మనోహర్ లాల్‌తో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చర్చించారు. ఈ సందర్భంగా రోహ్‌తక్‌లోని ఎలివేటెడ్ రైల్వే లైన్ కింద పది కొత్త రైల్వే స్టేషన్లతో పాటు రోడ్డు మార్గాల్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

చదవండి: బెంగళూరు - హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌... రైల్వే శాఖ కీలక నిర్ణయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top