కొత్త ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇలా..! | How To Create IRCTC Account in Telugu | Sakshi
Sakshi News home page

కొత్త ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇలా..!

Oct 19 2021 9:09 PM | Updated on Oct 19 2021 9:10 PM

How To Create IRCTC Account in Telugu - Sakshi

కరోనా మహమ్మారి తర్వాత గత కొద్ది కాలం నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. అయితే, పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ కూడా అనేక ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. అయితే చాలా మంది టికెట్ బుక్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) వెబ్ సైట్/యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, వారికి ఖాతా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సొంతంగా ఖాతా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురుంచి ఐఆర్‌సీటీసీ తన ట్విటర్ ద్వారా వీడియో షేర్ చేసింది. 

ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసే విధానం

  • మొదట ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి. 
  • అందులో మీకు కనిపించే రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ యూజర్ నేమ్ నమోదు చేయండి(అది 3 నుంచి 35 పదాల మధ్య ఉండాలి).
  • ఇప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ను రెండు బాక్స్ లలో నమోదు చేసిన తర్వాత మీ భాషను ఎంచుకోండి.
  • అలాగే, భద్రతా ప్రశ్న ఎంచుకొని దాని కింద మీ సమాధానాన్ని ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత మీ పేరు, లింగం, వైవాహిక స్థితి, వృత్తి, పుట్టిన తేదీ వంటి తదితర వివరాలు నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
  • అలాగే, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత పిన్ కోడ్ తో సహా మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి.
  • మీ రిజిస్టర్డ్ నెంబరు/ఈమెయిల్ ఐడీకి పంపిన కోడ్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది.

(చదవండి:  ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?)

Advertisement
 
Advertisement
Advertisement