‘స్వీట్’‌ కపుల్‌ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు | Laddu Box Engineer Couple Quit Jobs to Sell No-Sugar Healthy sweets | Sakshi
Sakshi News home page

‘స్వీట్’‌ కపుల్‌ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు

Aug 8 2025 11:32 AM | Updated on Aug 8 2025 1:20 PM

Laddu Box Engineer Couple Quit Jobs to Sell No-Sugar Healthy sweets

అనుకున్నది సాధించాలంటే సాహసం చేయక తప్పదు. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం వంగి సలాం చేస్తుంది.  విదేశాల్లో కార్పొరేట్‌ ఉద్యోగాలకు గుడ్‌ బై చెప్పి మరీ తమకిష్టమైన వ్యాపారంలోకి అడుగుపెట్టిన దంపతులు సక్సెస్‌ సాధించారు. పదండి వారి  సక్సెస్‌  గురించి తెలుసుకుందాం.

సందీప్ జోగిపర్తి (Saandeep Jogiparti), కవిత గోపు (kavitha gopu) దంపతులు ఐదేళ్లపాటు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం కానీ వారికి అది సంతృప్తినివ్వలేదు. స్వంతంగా ఏదైనా  బిజినెస్‌ ప్రారంభించాలనే కలను సాకారం చేసుకునేందుకు 2019లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏం చేయాలి? ఎలా చేయాలి?  అన్వేషణ మొదలైంది. సందీప్ ఆరు నుండి ఎనిమిది నెలలు భారతదేశం అంతటా ప్రయాణించారు.ఆ సమయంలో ఆహారం, ఫిట్‌నెస్ పరిశ్రమ వారి దృష్టిని ఆకర్షించింది. సందీప్‌కు స్వీట్‌లంటే చాలా ఇష్టం. పైగా  భోజనం తర్వాత  ఏదైనా తీపి తినడం  ఇంకా (చాలామందికి) అలవాటు. మార్కెట్‌ నిండా ఎనర్జీ బార్‌లు,స్నాక్స్ , స్వీట్లు, కృత్రిమ  స్వీట్లతో నిండి తీపిపదార్థాలతో నిండి పోయాయి. అందుకే దీనికి భిన్నంగా  ఆరోగ్యం, పోషకాలతో నిండిన స్వీట్లను తయారు చేయాలని భావించారు. అలా 2020లో పుట్టింది హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ లడ్డుబాక్స్.  తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మిల్లెట్స్, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బెల్లం నెయ్యి వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి 11 రకాల లడ్డూలు విక్రయిస్తారు. ప్రతి ఒక్కటి 21 రోజుల షెల్ఫ్-లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా ఖాక్రాస్, చిక్కీలు,  నట్స్‌ అండ్‌ స్వీట్స్‌ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కూడా విక్రయిస్తారు.చక్కెర, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు లేకుండా అధిక పోషకాల లడ్డూలను విక్రయించడమే వీరి లక్ష్యం.

చదవండి: Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలు

కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన లడ్డూ బాక్స్‌ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్‌ను సాధించింది. కేవలం 4 రకాల లడ్డూల నుండి, ఇప్పుడు 15 రకాలను అందిస్తుంది.  2020 మేలో COVID-19 సమయం వారికి అనుకూలంగా పనిచేసింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో లడ్డూబాక్స్‌కు అద్భుత మైన స్పందన వచ్చింది.భారతదేశం అంతటా డెలివరీ చేస్తారు. పెద్ద B2B ఆర్డర్స్‌ తీసుకుంటారు. హైదరాబాద్‌లో వారి స్వంత స్టోర్‌ ఉంది. 2025 చివరికి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ NCR అంతటా 100  స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదీ చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌.. ఐఏఎస్‌ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement