క్రిస్మస్‌ కాంతులు | Christmas festival celebrating the birth of Jesus | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ కాంతులు

Dec 25 2025 7:28 AM | Updated on Dec 25 2025 7:30 AM

Christmas festival celebrating the birth of Jesus

కరుణగల రక్షకుడు క్రీస్తు సర్వేశ్వరుని తనయుడుగా జన్మించిన రోజు

అవి బెత్లహేము పొలాలు. చిమ్మ చీకటి రాత్రి కాపరులు గొర్రెలను కాస్తున్నారు. అడవి మృగాలు వాటికి హాని చేయకుండా కొందరు కావలిగా ఉండి, మరికొందరు నిద్రిస్తుండగా ఆకస్మికంగా పొలాలపై దేదీప్యమైన వెలుగు కనిపించి, మధురమైన గానాలు ఆకాశం నుండి వినిపించగా, గొర్రెల కాపరులు తత్తరిల్లారు. కాపరులు భయంతో ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక గొప్ప శుభవార్త పరలోకము నుండి వచ్చిన దేవదూతలు సమూహముగా ఆకాశవాణి వలే వినిపింపచేశారు.‘‘భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు.’’ (లూకా 2:10,11) మెస్సయ్య కొరకు ఎదురుచూస్తున్న యూదులకు ఆ సమాచారము సమాధానం, సంతోషం కలిగించింది. ఇట్లు ఏసుప్రభు జన్మించిన రాత్రి దూతల శుభ సమాచారం ద్వారా క్రిస్మస్‌ప్రారంభమైంది.

దేవుని వాక్యం స్థితిగతులను సవాలు చేయు శక్తి గలదన్న విషయంలో ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాము. ఒకటి దేవుని వాక్యం, రెండు స్థితిగతులను సవాలు చేయగల శక్తి గలదన్న విషయం ఈ రెండు వాక్యాలుగా గమనార్హం. దేవుని వాక్యం అనేది చాలాప్రాముఖ్యంగా శక్తిగలదన్న విషయాన్ని పరిశీలించాలి. బైబుల్‌ గ్రంధంలో వాక్యం రెండు రకాలు గలదిగా ఒకటి దేవుని వాక్యాన్ని చూస్తాం. వాక్యము (వర్డ్‌) సజనాత్మకమైన దేవుని వాక్యము, మనతో మాట్లాడే దేవుని వాక్యం (వర్డ్‌ దట్‌ స్పీక్స్‌), ఈ రెండు విషయాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. బైబుల్‌ గ్రంధం ΄ాతనిబంధన పరిశీలించినట్లయితే ఆదియందు దేవుడు భూమ్యాకాశములు సృజించబడ్డాయని  స్పష్టీకరించింది. 

ఆది: 1:1). ఆదికాండం ఒకటి, రెండు అధ్యాయాలలో సృష్టి ఏ విధంగా సృజించబడిందో స్పష్టీకరించబడింది. అయితే ప్రత్యేకంగా యోహాను సువార్తీకుడు స్పష్టంగా చె΄్పాడు. అదేమనగా ఆదియందు వాక్యముండెనని వాక్యం దేవుని వద్ద ఉన్నదని, ఆ వాక్యం దేవుడై ఉన్నదని ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నారని తెలియజేయబడింది. (పరి. యోహాను 1:1) ఇందులో మూడు విషయాలు గ్రహించగలిగితే యేసుక్రీస్తు ఎవరు? ఈ భూలోకంలో ఎలా జన్మించాడో అన్న విషయం తెలుసు కుంటాము. ఆ విషయం తెలుసుకున్నట్లయితే ‘‘క్రిస్టమస్‌‘ పండుగ గూర్చి స్పష్టంగా అర్థం చేసుకోగలం.

క్రిస్టమస్‌ పండుగ గురించి, దైవజనుడైన ఆర్‌.ఆర్‌.కె. మూర్తి గురించి తెలియని ప్రజలుండరు. ఎందుకంటే రవి అస్తమించిన చోటను కూడా బ్రిటిష్‌ సామ్రాజ్యం విస్తరించబడినట్లు గతకాలంలో ఆయన చేసిన సువార్త క్రైస్తవులు వెళ్ళలేని క్రైస్తవేతరుల గృహాల్లో ఆయన ప్రసంగాలు ‘విశ్వవాణి’ అనే సువార్త మాధ్యమం ద్వారా (రేడియో) ప్రతి రాత్రి 7 గంటలకు ప్రసారం కాబడింది. ఆ విధంగా ప్రసారాలు ఆయన వాక్యం ద్వారా ఆంధ్ర ప్రజలు, అటు భారతదేశం అంతటా ప్రసారాలు వీక్షించారని గుర్తించబడిన దైవ సేవకుడు. అంతేకాదు సువార్తలో ‘‘మతం వద్దు, యేసు వాక్యం ముద్దు’’ అని చె΄్పారు. కొందరు మారు మనస్సు కూడా పొదారన్న విషయం తెలిసినదే.
క్రిస్‌ అనగా క్రీస్తు, మాస్‌ అనగా ఆరాధన. ఆ లాగున క్రిస్మస్‌ అనే దైవారాధన దినోత్సవంగా జరుపుబడు పండుగే క్రిస్టమస్‌.

మహా దేవదూతలు సైన్యాలకు అధిపతియైన యెహోవా ‘‘పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు’’ అని నిత్యం కొలువబడు దేవుడు అనగా ‘ఎలోహీం’ అనే హెబ్రూ పదం. దీనిని ఇశ్రాయేలీయులు ఉచ్చరించరు. ఎందుకంటే అది పవిత్రనామం. దాని అర్థం సర్వశక్తిగల దేవుడని అర్థం. ఆ పదానికి బదులు ‘ఎదోనాయ్‌’ అని సంబోధిస్తారు. అట్టి దేవుడైన సర్వేశ్వరుడి తనయుడు శరీరధారిగా జన్మించిన రోజు క్రిస్మస్‌. శరీరధారిగా జన్మించాడు కాబట్టి అత్యధిక సంవత్సరాలు అనగా 969 సంవత్సరాలు జీవించిన మెతూషలా చనిపోయాడు. (ఆది: 5:27. అంతేకాదు మరణం జయించి బతుకు నరుడెవ్వరు లేరు. అందుచేత నరావతారిగా ఆయన జన్మించినందుననే మరణించాడు, నీ, నా ΄ాపమనే దోష నిమిత్తం దోషరహితుడు చనిపోయాడు.

వాక్‌ అనే వాక్య రూపకమైన శబ్దం వివిధ భాషలలో అనగా హెబ్రూ భాషలో ‘దాబార్‌’ అని, గ్రీకులో ‘లాగాస్‌’ అని, ఇంగ్లీషులో ‘వర్డ్‌‘ అని, సంస్కృతంలో ‘వాక్‌’ అని, తెలుగు లో వాక్యమని అంటారు. భారతీయతత్వంలో ‘ప్రణవనాదం’ అంటారు. ఆ శబ్దమనే ప్రణవనాదం యేసునాథుడుగా జన్మించాడు.

ఈ రక్షకుడు జన్మించిన రోజైన క్రిస్మస్‌ పండుగను భక్తిశ్రద్ధలతో క్రై స్తవులు చర్చీలలో బాలయేసు భజన చేయుచు భక్తులు నూతన వస్త్రధారణతోనూ, సంగీతసునాదములతోను జరుపుకొంటారు. (మత్తయి: 1:21). సర్వేశ్వరుని తనయుడైన యేసుక్రీస్తు కృప మనందరికి తోడైయుండును గాక. ఆమెన్‌! 
– కోట బిపిన్‌ చంద్ర΄ాల్‌

ఏటేటా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ జరుపుకొనుచున్నారు. పోప్‌ జూలియస్‌ వన్, క్రీస్తుశకం 353 డిసెంబర్‌ 25 నాడు క్రిస్మస్‌పే అధికారికంగా ప్రకటించారు. తేదీ ఏమైనా ప్రభువు జన్మ చరిత్రాత్మకం యేసును పశువుల శాలయందు తొట్టిలో మొదట ఆ రాత్రి కాపర్లు చూచి ఆయన జన్మ వార్తను మొదట మిషనరీలవలే ప్రకటించారు. దేవుడు సామాన్యులను తన పనిముట్లుగా ఎన్నుకుంటే అసమానంగా ఖ్యాతి లోనికి తెస్తారు. తదుపరి కాన్స్టంటైన్‌ చక్రవర్తి తల్లి హెలీన 328/30 బి.సి. యేసు జన్మస్థానాన్ని కొత్తగా నిర్మించి లాటిన్‌ భాషలో ‘ఇచ్చట కన్య మరియ కుమారుడు పుట్టాడు,’ అని వ్రాయించాడు. నేటికిని ఏసుప్రభు జన్మస్థానం బెత్లెహేములో ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు దర్శించి ధన్యలగుచున్నారు .

‘‘ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్ధము.’’ (యెషయా 7:14) (మత్తయి 1:22) పరిశుద్ధాత్మ శక్తి వలన మరియ క్రీస్తుకు జన్మనిచ్చుటచే ఆయనకు జన్మ ΄ాపము లేదు. ప్రభువు చెప్పినట్లు నాలో ΄ాపమున్నదని ఎవరు స్థాపించుదురు అన్నట్లు ఆయన జన్మ, కర్మ ΄ాపము లేని నరావతారుడు గనుక తన ప్రజలను వారి ΄ాపముల నుండి రక్షించును అని అర్థమిచ్చు విధంగా యేసు అను పేరు పెట్టబడింది. ΄ాపప్రాయశ్చిత్తం చేయగలిగిన దేవుని గొర్రెపిల్ల క్రిస్మస్‌ నాడు జన్మించిన యేసే. 

క్రిస్మస్‌ అనగా క్రీస్తు ఆరాధన క్రైసట్‌ మాస్‌. ప్రభువు ముప్పదిమూడున్నర సంవత్సరాల భూలోక యాత్రలో ఆయన దైవ కుమారునిగా సామర్థ్యము, సార్ధక నామము యెషయా ప్రవక్త 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించెను. ‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.’’ (యెషయా 9:6)మానవులను మారుమనసు ద్వారా చనిపోయిన తర్వాత పరలోకానికి చేర్చుటకే భూలోకానికి యేసు క్రీస్తు క్రిస్మస్‌ నాడు అవతరించెను. సువార్తలలో యేసు చేసిన గొప్ప కార్యములు, సేవ ఫలితం చదివినప్పుడు ఇది ముమ్మాటికి నిజమని తెలియజేయుచున్నది.

క్రిస్మస్‌ లో మానవాళి ఎడల దేవుని ప్రేమ మిళితమై ఉన్నది. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొదునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16)దేవుని కుమారుడు, మానవ కుమారులను దైవసుతులుగా చేయుటక జన్మించెనని పరిశుద్ధ అగస్టిన్‌ తెలిపెను. ప్రేమ లేనిచోట ప్రేమ విత్తటానికి, సమాధానం లేనిచోట సమాధానం ఇవ్వటానికి, దేవదూతలు వారి గాన ప్రతిగానములలో ΄ాడారు. ‘‘సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమను కలుగును గాక.’’(లుకా 2:14) హదయములో, కుటుంబములో, సమాజంలో, భూమిపై యుద్ధములు కలహములు లేక నెమ్మదిగా వర్ధిల్లుటయే క్రిస్మస్‌ యొక్క సంకల్పము.

మదర్‌ థెరిస్సా కు ఒక విలేకరి ప్రపంచ శాంతికి సూత్రం అడిగాడు. అప్పుడు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించమని చె΄్పారట. యేసు సమాధానకర్త. ఆమె ఐదు రూ΄ాయలతో మానవసేవప్రారంభించింది. ప్రపంచ శాంతి బహుమతికి ఆమె యోగ్యురాలే. ΄ాపం, శాపం సాతాను వల్ల స్వార్థం, ఒత్తిడి, ధనాశ వల్ల అసమాధానం పొగుచున్న ఈ అల్పకాల జీవితంలో వెంట తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. మనము శూన్యమని గ్రహిస్తే శాంతికామకులము ప్రధాతలు అవుతాము. సమాధాన కుమారుడు లేకుండా దేవుడు కుమారుడు కాడని రిచర్డ్‌ బ్యాక్సా్టర్‌ అన్నారు.క్రిస్మస్‌ వేళ ఎక్కడ చూసినా నక్షత్రాలు చూస్తాము. దానికి కారణము బైబిల్‌ లో  బిలాము ప్రవక్త ప్రవచించిన ప్రకారము ‘‘నక్షత్రం యాకోబులో ఉదయించును రాజ దండము ఇశ్రాయేలులో నుండి లేచును’’ (సంఖ్య 24:17). 

తూర్పున ఆకాశమందు ఆనాడు వెలసిన నక్షత్రము (మత్తయి 2:2) నందు  నెరవేరినది. ఆ నక్షత్రం చూచి జ్ఞానులైన రాజులు బెత్లెహేములో యేసును దర్శించి వారు బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా అర్పించి, సమర్పించి హేరోదు రాజు యేసుని చంపగోరుచుండగా వారు  వేరొక మార్గమున స్వదేశమునకు వెళ్లి క్రిస్మస్‌ చరిత్రలో నిలిచిపోయారు. బంగారం దైవత్వానికి, సాంబ్రాణి యాజకత్వమునకు, బోళము ఆయన మరణమునకు సాదశ్యంగా ఉన్నది అని గ్రహించి దూరము నుండి వచ్చిరి.

‘‘సత్యమైనది దూర ంగానూ బహులోతుగాను ఉన్నది’’ (ప్రసంగి7:24) అని గ్రహించారు. విలువైనవి రక్షణ, దైవ ఆరాధన ఉచితమే గాని మానవుని ఇష్టం, కొంత ప్రయాస అవసరము అని జ్ఞానుల వృత్తాంతము నందు బైబిల్లో తెలియజేస్తుంది. లోకంలో ఉన్న పలు విధాల నక్షత్రాలు ఉన్నను తోటి వారికి పరలోకం చూపగలిగితేనే చరిత్ర, నిజ నక్షత్రాలు. ‘‘బుద్ధిమంతులు అయితే ఆకాశమండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు.’’(దానియేలు 12:3). జీవించినప్పుడే కాక లోకానికి దారి చూపు ప్రకాశం కలిగియుండువారే నిజ నక్షత్రాలు. తత్కాల వుల్కల వల్ల ప్రయోజనం లేదు.

 ‘‘యోహాను ప్రజ్వలించు ప్రకాశించు దీపము (యోహాను 5:13). ఒకసారి ఒక పంది ఒక ఆవు, నేను సమాజానికి సేవ చేస్తున్నామని పోటీ పడినయట. అయితే ఆవు నేను బ్రతికుండగానే ΄ాలు ఇచ్చి లోకానికి మేలు చేస్తున్నాను, ఓ పంది నీవు చనిపోయిన తర్వాత మాత్రమే నీ యొక్క మాంసాన్ని ప్రజలకు ఇవ్వగలవు అని చెప్పిందట. నిజమే బ్రతికున్నప్పుడు చేయకుండా చనిపోయిన తర్వాత ఏదో చేస్తామనుకోవటం అది మిద్యమాత్రమే.

క్రిస్మస్‌ అనగా మహా సంతోషం, మన అందరిలో మహా సంతోషం సమాదనం కలిగివుండుట. సాతాను క్రియలు విసర్జించుటవలన సమాధానకర్త ఏలును. నోవహు అనగా నెమ్మది. ఆయన కాలంలో జల ప్రళయం వచ్చినను తప్పించబడెను. గిద్యోను బైబిల్‌ లో సమాధాన కర్త. క్రిస్మస్‌ అనగా పంచుట, ఇచ్చుట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. క్రిస్మస్‌ లో, దేవాది దేవుడు మానవుడిగా తగ్గించుకున్నారు. (మత్త 11:28); (ఫిలిప్పి 2:5–8). దీనులదే పరలోకం. అందం, ఆస్తి, ఆధికారం మొదలైన అతిశయాలు అనర్థాలవుతాయి. 

యేసు పశువుల తొట్టిలో పరున్నను నేడు పరలోకములో తండ్రి కుడి ΄ార్శ్వమున నుండి ఎలుచున్నాడు. క్రిస్మస్‌ అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చుట. కన్నులు పైకెత్తి చూచి పరలోక అశ్వర్యము పొదుట.చైనాలో మిషనరీ గా వెళ్ళిన హడ్సన్‌ టైలర్‌ ఇలా అన్నాడు – వెయ్యిపండ్లు వున్న చైనాకే. వెయ్యి జీవితాలున్న ఉన్న చైనాకే సమర్పిస్తాను. ఈనాడు అభాగ్యులు, నిరాశపరులు, వ్యాధి బాధ కరువు కాటకములలో వున్నవారి స్వరం మనం వినగలిగితే మన పరిధిలో త్యాగం, ప్రేమ, చూపగలిగితే అదే నిజమైన క్రిస్మస్‌. ఆ విధంగా భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ఈ సువార్త వల్ల మేలు చేయుటయే నిజ క్రిస్మస్‌.
అందరికీ క్రిస్మస్‌ శుభములు.
– తంటిపూడి ప్రభాకరరావు 


‘‘ఆది’’ అనే వాక్యం గూర్చి ఆలోచన చేస్తే ‘‘ఆది’’ అనగా ఆది లేని ఆది (బిగినింగ్‌ లెస్‌ బిగినింగ్‌)గా చూస్తాం. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే త్రిత్వంలోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ దైవత్వంలోని రెండవ (కుమారుడైన) వ్యక్తే యేసు క్రీస్తుగా గమనించగలం. యెహెూవా వాక్కు చేత భూమి, ఆకాశం సృజించబడ్డాయని, ఆయన (దేవుడు) వాక్కును పంపి వారిని స్వస్థపరచాడనిస్పష్టీకరించబడింది. ఆయన (దేవుడు)వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. (కీర్తన 33:6, 107:20) వచనాలలో చూస్తాం. ఆ వాక్యమే సర్వేశ్వరుని తనయుడైన యేసుక్రీస్తుగా నరావతారిగా శరీరధారిగా దివి నుండి భువికి దిగివచ్చి అనేకులను స్వస్థపరచాడు. పడిన గోతిలో నుండి అనగా ΄ాపమనే దుష్కార్యాలను, ఉపమానాల ద్వారా ప్రబోధించి, తండ్రి ఆనుమతి ప్రకారం ఈ లోకంలో మన మధ్య నివసించిన కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తుగా జన్మించాడు. నేటికి 2025 సంవత్సరంలో ఆయన జయంతిని భారతదేశం, ΄ాశ్చాత్య దేశాల వారు జరుపుకొనే పండుగే క్రిస్మస్‌.

యేసు అందరికీ రక్షకుడు గనుక అన్ని దేశముల వారికి, అన్ని తెగల, జాతుల, సకల మానవాళి కొరకై సిలువపై పాపప్రాయశ్చిత్తంగా, తన నిర్దోషరక్తము చిందించుట కొరకు వచ్చుటచే, క్రిస్మస్‌ లో యేసును ఆరాధించుట భావ్యమే.  క్రిస్మస్‌ లో దేవదేవుని ప్రణాళిక ‘‘నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను. (లూకా 19:10) ఈనాడు, ఈ యుగంలో సమాజం పాలకు, వ్యసనాలకు బానిసయై, వ్యాధి బాధలకు లోనగుచు నశించుచున్నారు. అందుకే రక్షకుని అవసరత ఉన్నది. ఆయన పాపులను రక్షించుటకే పుట్టెను. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement