క్రిస్మస్ పండగని పురస్కరించుకుని ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ఓ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రాజే యువరాజే...’ అంటూ సాగే పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రభాస్ క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధీ అగర్వాల్‌తో ప్రేయర్ చేయించుకోవడం వంటివి ఈ ప్రోమోలో చూపించారు.
త్వరలోనే పూర్తి పాటని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే జనవరి 9న విడుదల కానుంది.


