ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు | Study Warns: Even Small Amounts of Alcohol Increase Oral | Sakshi
Sakshi News home page

ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు

Feb 8 2026 12:51 PM | Updated on Feb 8 2026 1:08 PM

Study Warns: Even Small Amounts of Alcohol Increase Oral

ఆల్కహాల్‌ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో  ఆల్కహాల్‌ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్‌ మ్యూకోజల్‌) కేన్సర్‌ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్‌జే గ్లోబల్‌ హెల్త్‌’ జర్నల్‌ ప్రచురించింది. 

ఆ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్‌ తీసుకున్నా నోటి క్యాన్సర్‌ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.

అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...
ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ  1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్‌ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.

ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్‌ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.

(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..)
 

Advertisement
 
Advertisement
Advertisement