ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోన్‌లేని ప్రపంచాన్నే ఊహించలేం. అదీగాక చేతిలో ఫోన్ లేకపోతే ఏ పని సాగదు, కాలు కూడా కదపలేం. అంతలా టెక్నాలజీపై ఆధారపడిపోయాం లేదా బానిసలమైపోయాం అనొచ్చేమో..!. ఏ చిన్న సందేహమైనా..ఏదైనా.. తెలియని ప్రాంతానికి వెళ్లాలన్నా.. చేతిలో ఫోన్ ఉంటే చిటికెలో పనైపోతుంది. అంతలా మనకు అన్నింటిని అరచేతిలోకి వచ్చేసేలా అమర్చి పెట్టేసింది. అలాంటి స్మార్ట్ పోన్‌ని స్వచ్ఛంధంగా వాడకూడదని నిషేధం విధించుకుంది ఓ గ్రామం. అలా ఎందుకు చేసిందో తెలిస్తే..కచ్చితంగా సెల్యూట్ చేస్తారంతా. అయితే ఇది మరోకంగా విమర్శలకు దారితీసింది. ఆ నిషేధం కూడా సమంజసంగా ఉంటే..ఇతర గ్రామాలకు ఆదర్శంగానూ, అభినందనీయంగానూ ఉండేది. ఇంతకీ ఎందుకోసం స్మార్ట్ ఫోన్‌ని సీరియస్‌గా బ్యాన్ చేశారంటే..
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలోని 15 గ్రామాలు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాయట. యావత్తు ప్రపంచం 6జీ వైపు దూసుకుపోతే అక్కడ మాత్రం మహిళలను కీప్యాడ్ పోన్‌ల యుగానికి వెళ్లిపోదాం అంటోంది. చౌదరి కమ్యూనిటీకి చెందిన సుంధమాతా పట్టి పంచాయితీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా అక్కడ మహిళలు, బాలికలు వినయోగించకూడదు.
అత్యవసరం అనకుంటే కీప్యాడ్ ఫోన్‌లే ఉపయాగించాలి అక్కడి మహిళలు. ఇదంతా ఎందుకంటే..మైబైల్ ఫోన్ ఒక వ్యసనంగా మారి పక్కదారి పట్టిస్తోందని, ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందనే ఆయా గ్రామాలు స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించకూడదని నిషేధం విధించాయట. అంతేగాదు చదువుకునే పిల్లలు సైతం తమ ఇంట్లో ఫోన్ ఉపయోగించుకోవచ్చు గానీ బయటకు తీసుకురావడానికి వీల్లేదట.
మహిళలే ఎందుకంటే..
కచ్చితం అమ్మతోపాటు పిల్లలు ఉంటారు. దాంతో తరుచుగా చిన్నారులు వాటిని వినియోగించే అవకాశం ఉన్నందున మహిళలు కీప్యాడ్ ఫోన్‌లే ఉపయోగించాలని నిర్ణయించిందట పంచాయతీ. కాగా, ఆదివారం ఘాజీపూర్ గ్రామంలో జరిగిన పంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. 14 పట్టి సమాజం అధ్యక్షుడైన సుజనారామ్ చౌదరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
అక్కడి పంచాయతీ ప్రకారం..దేవరామ్ కర్నోల్ వర్గం ముందుకు తెచ్చిన ప్రతిపాదనను పంచ్ హిమ్మతారామ్ చదివి వినిపించారు. చర్చల అనంతరం, సమావేశానికి హాజరైన పంచ్ సభ్యులందరూ ఈ నిబంధనను అమలు చేసేందుకు మొగ్గుచూపారు. ఈ తీర్మానం జనవరి 26 నుంచి అమలవుతుందట.
ఏయే గ్రామాల్లో ఇది అమలు అంటే..
ఈ నిర్ణయం భిన్‌మల్ ప్రాంతంలోని పలు గ్రామాలలో అమలు చేయబడుతుంది. వీటిలో ఘాజీపూర్, పావలి, కల్డా, మనోజియావాస్, రాజికావాస్, దట్లావాస్, రాజ్‌పురా, కోడి, సిద్రోడి, ఆల్డి, రోప్సి, ఖానాదేవల్, సావిధర్, హత్మీ కి ధాని, ఖాన్‌పూర్ గ్రామాలు ఉన్నాయి.
నిజానికి పంచాయితీ చర్య సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల సంస్థల నుంచి తారాస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం మహిళా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఏ నిషేధం అయినా లింగ సమానత్వానికి పెద్ద పీటవేసేలా ఉండాలి గానీ, మహిళలే లక్ష్యంగా నిషేధం అంటే సహించదగినది కాదంటున్నారు సామాజికకార్యకర్తలు, మహిళా సంఘాలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాదు హాట్‌టాపిక్‌గా మారింది కూడా.
(చదవండి: Sobhita Dhulipala: ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..! నాటి రాణుల వైభవాన్ని తలపించిలా..)


