
‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత చాలామంది చాలారకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న వార్తలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల, ఆ తర్వాత తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల పలువురు మహిళలు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు, దానికి తోడు అసాధారణ రక్తస్రావంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్, కోవిడ్ వ్యాక్సిన్‌ల కారణంగా పలువురు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అధిక రక్తస్రావం సమస్య తలెత్తుతోందని లండన్‌లోని వైద్య నిపుణులు ఇటీవల గుర్తించారు. ఈ సమస్యపై వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ అధ్యయన వివరాలను ‘క్లినికల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురించారు.
‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో దాదాపు 33.8 శాతం మహిళలకు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు ఏర్పడ్డాయి. 26 శాతం మహిళల్లో అస్తవ్యస్తమైన రుతుక్రమంతో పాటు అధిక రక్తస్రావం సమస్య ఏర్పడింది. 19.7 శాతం మహిళల్లో రుతుక్రమంలో అస్తవ్యస్తతలు లేకున్నా, అధిక రక్తస్రావం సమస్య తలెత్తింది.
డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!)