ఆమె... శక్తి | Forbes Worlds Most Powerful Women of 2025 | Sakshi
Sakshi News home page

ఆమె... శక్తి

Dec 31 2025 3:07 AM | Updated on Dec 31 2025 3:08 AM

Forbes Worlds Most Powerful Women of 2025

గీతా గోపీనాథ్, కాకు నఖతే, షెఫాలి గొరాడియా

‘నాలోనే శిల ఉంది. నాలోనే శిల్పి ఉన్నాడు’ అనుకుంటారు కొందరు. వారు తమను తాము తీర్చిదిద్దుకుంటారు. లోక ప్రసిద్ధులవుతారు. ట్రబుల్‌ షూటర్‌ షెఫాలి గొరాడియ నుంచి టాటా టెక్నాలజీస్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సవితా బాలచంద్రన్‌ వరకు... ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ సెల్ఫ్‌–మేడ్‌ ఉమెన్‌–2025 జాబితాలో చోటు సాధించిన మహిళల గురించి...

గ్లోబల్‌ ఫైనాన్స్, మైక్రో ఎకనామిక్స్‌లో తనదైన ముద్ర వేశారు గీతా గోíపీనాథ్‌. వాణిజ్యం, పెట్టుబడి, రుణం. వడ్డీరేట్లకు సంబంధించిన కీలకమైన విధాన నిర్ణయాలలో ఆమె పాత్ర ఉంది. హార్వర్డ్‌ యూనివర్శిటీలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో తన కెరీర్‌ప్రారంభించారు. చికాగో యూనివర్శిటీలోని బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో అసిస్టెంట్‌ప్రోఫెసర్‌గా పనిచేసిన గీత, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలోని సమస్యలు, ఆర్థిక సంక్షోభాలపై ఎన్నో పరిశోధన వ్యాసాలు రాశారు. ‘ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌’గా చరిత్ర సృష్టించారు. కోవిడ్‌ కల్లోల కాలంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి పరిష్కార మార్గాలు ఆలోచించడంలో ఆమె అపార అనుభవం, నైపుణ్యం ఉపయోగపడ్డాయి.

విస్తృత అనుభవం... ఆమె విజయ రహస్యం
ఆర్థికసేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కాకు నఖతే భారత కార్పొరేట్‌ రంగానికి సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలలో కీలక పాత్రపోషించారు. గతంలో జేపీ మోర్గాన్‌లో ఇండియా ఆపరేషన్స్‌ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. పద్దెనిమిది సంవత్సరాలకు పైగా డీఎస్పీ మెర్రిల్‌ లించ్‌లో వరల్డ్‌ మార్కెట్స్, ఈక్విటీలలో పెద్ద పదవులు నిర్వహించారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా భారతీయ సీఈఓగా పనిచేస్తున్నారు.

ట్రబుల్‌ షూటర్‌
సీఏలో గోల్డ్‌మెడలిస్ట్‌ అయిన షెఫాలి గొరాడియా చిన్న, పెద్ద పరిశ్రమలలో పనిచేసి చైర్‌పర్సన్‌ స్థాయికి ఎదిగారు. డెలాయిట్‌ ఇండియా తొలి మహిళగా చైర్‌పర్సన్‌గా గుర్తింపు పొందారు. ‘ట్రబుల్‌ షూటర్‌’గా షెఫాలికి పేరు. ‘సమస్య ఎంత క్లిష్టంగా ఉంటే, నాకు ఆసక్తి అంత ఎక్కువగా ఉంటుంది. ఒక సమస్యను పరిష్కరించినప్పుడు సరికొత్త ఉత్సాహం వస్తుంది. మరిన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ ఉత్సాహం ఉపకరిస్తుంది’ అంటారు షెఫాలి.

ఆ పదవిలో తొలి మహిళ
ప్రసిద్ధ టాటా గ్రూప్‌తో సవితా బాలచంద్రన్‌ ప్రయాణం రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. బిజినెస్, ఫైనాన్స్, స్ట్రాటజీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించి కీలకమైన పదవుల్లో ఉన్నారు. 2000 సంవత్సరంలో టాటా మోటర్స్‌లో ‘ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌’ యంగెస్ట్‌ హెడ్‌గా పలువురి దృష్టిని ఆకర్షించారు. 2020లో టాటా టెక్నాలజీస్‌లో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా నియామకం అయ్యారు. ఈ పదవిలో నియామకం అయిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 2023లోప్రారంభమైన ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీవో) కు హెడ్‌గా పనిచేశారు.

వేల పాటల కోకిలమ్మ
కోకిల గొంతు సునిధి చౌహాన్‌ 1999 నుండి పదికి పైగా భాషలలో రెండు వేల అయిదు వందలకు పైగా పాటలు పాడారు. ‘మెహబూబ్‌ మేరే’ ‘ఛాలియా’ ‘ఆజా నాచ్లే’ ‘దేసి గర్ల్‌’ ‘షీలా కి జవానీ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌లతో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏఆర్‌ రెహమాన్, విశాల్‌–శేఖర్, సలీం సులేమాన్‌లాంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటినా... తొలి రోజులనాటి ఉత్సాహం ఇప్పటికీ ఆమెలో ఉంది. అదే ఆమె విజయ రహస్యం.

అద్భుత ప్రతిభ
భారతదేశంలోని అది పెద్ద మానసిక ఆరోగ్య సంస్థ (మెంటల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో అత్యున్నత పదవిని చేపట్టిన రెండవ మహిళగా, తొలి మహిళా సైకియాట్రిస్ట్‌గా ప్రత్యేకత నిలుపుకున్నారు డాక్టర్‌ ప్రతిమ మూర్తి. కేంద్ర నిధులతో నడిచే ఈ సంస్థకు ప్రపంచం కోవిడ్‌ బారిన పడిన కాలంలో డైరెక్టర్‌ అయ్యారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే రెండవ ఎడిషన్‌ బాధ్యతలు చూస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నెల్సన్‌ మండేలా అవార్డ్‌ అందుకున్నారు.

తానే ఒక బ్రాండ్‌
మీడియా, ఫిల్మ్‌ కంపెనీలలో పెద్ద పదవులలో పనిచేశారు ప్రేరణ సింగ్‌. బిజినెస్‌ మేనేజింగ్, ఫైనాన్స్, బ్రాండింగ్, మార్కెటింగ్‌లలో పేరు తెచ్చుకున్నారు. పా(2009)తో ఆమె చలన చిత్ర యాత్రప్రారంభమైంది. ఆ సమయంలో రిలయన్స్‌ బిగ్‌ పిక్చర్స్‌ మార్కెటింగ్‌ అండ్‌ మీడియాలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు ప్రేరణ. ‘హీరామండీ’ అనే షోకి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు విడుదలైన మొదటి వారంలోనే అత్యధికులు వీక్షించిన భారతీయ సిరీస్‌గా నిలిచింది హీరామండీ.

ఆ రంగంలో మొదటి మహిళ
ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన మోనా ఖండర్‌ సంక్లిష్టమైన అసైన్‌మెంట్‌లపై పనిచేయడంలో ప్రసిద్ధి పొందారు. గుజరాత్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మొదటి మహిళగా ప్రత్యేకత సాధించారు. ఆ రాష్ట్రంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌(జీసిసి) పాలసీ 2025–30, సెమీకండక్టర్‌ పాలసీ 2022–2027 అమలుపై కృషి చేస్తున్నారు.

రేణుక... పెట్టు‘బడి’ టీచర్‌
మూడు దశాబ్దాల అనుభవంతో వివిధ రంగాలలో వ్యాపార సంస్థల వృద్ధిలో కీలక పాత్రపోషించారు రేణుకా రామనాథ్‌. ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘మల్టీపుల్‌ పీఇ’ని స్థాపించి ఆరు కీలక రంగాలలో 30కి పైగా కంపెనీలలో పెట్టుబడి పెట్టారు. రేణుక ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. తన ఇన్వెస్టింగ్‌ జర్నీలో అనూహ్యమైన మార్కెట్‌ పరిస్థితులు, సవాళ్లను అ«ధిగమించి అద్భుత పనితీరు కనబరిచే టీమ్‌లను వెలుగులోకి తీసుకువచ్చారు. ‘మల్టిపుల్స్‌’కు ముందు ఐసీఐసీఐ వెంచర్‌(ప్రైవేట్‌ ఈక్వాటీ ఫండ్స్‌)కు ఎండీ, సీఈఓగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement