91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గానా..! | 91 year old woman proves fitness has no expiration date | Sakshi
Sakshi News home page

91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గానా..!

Feb 15 2026 4:39 PM | Updated on Feb 15 2026 4:58 PM

91 year old woman proves fitness has no expiration date

ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్‌నెస్‌ కోచ్‌లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్‌గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్‌గా ఉండటమే కాదు..ఫోర్స్‌తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్‌ బామ్మ అంటే..

ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల  జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్‌కు వెళ్లే ఐకానిక్‌ ట్రెక్‌కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. 

అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్‌ వంటి సెషన్‌లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్‌లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్‌ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్‌నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్‌ కదూ..!.

 

(చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement